ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్?
Published Sun, Jun 11 2017 12:09 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
డోన్ టౌన్: ఇద్దరు రిమాండ్ ఖైదీలు పారిపోయేందుకు కారణంగా పేర్కొంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ రామ్మోహన్, కానిస్టేబుల్ యాగంటయ్యను జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ విధుల నుంచి తొలగిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. డోన్ పట్టణంలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడి గతంలో బెయిల్‌పై విడుదలైన నారాయణస్వామి, కొండలరెడ్డి అనే ఇరువురూ ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలి సబ్ జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి ముద్దాయిలను డోన్ కోర్టులో ఈ నెల 7న హాజరు పరిచారు. వీరిని తిరిగి తెనాలి సబ్‌జైలుకు రైలులో తరలిస్తుండగా ప్రకాశం జిల్లా ఖమ్మం రైల్వేష్టేషన్‌లో పోలీసుల కన్నుగప్పి పారిపోయారు. విచారణ జరిపిన అనంతరం జిల్లా ఎస్పీ రవికృష్ణ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, కానిస్టేబుల్ యాగంటయ్యను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై డోన్ ఎస్సై శ్రీనివాసులును వివరణ కోరగా కానిస్టేబుళ్ల సస్పెన్షన్ ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదన్నారు.
Advertisement
Advertisement