
కుట్టి పద్మిని దక్షిణాది ఇండస్ట్రీలో సీనియర్ నటీమణుల్లో ఒకరు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా కనిపించింది. తన మూడవ ఏటనే 1959లో తొలిసారిగా తమిళంలో బాల నటిగా నటన జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్‌తో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ బిజినెస్‌లో బిజీ ఆయిపోయారు. ఇటీవల ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
(ఇది చదవండి: రూమ్‌లో అడ్జస్ట్ అవుతారా అని అడిగారు: సీనియర్ నటి)
పద్మిని మాట్లాడుతూ.. 'కమల్ హాసన్.. శ్రీవిద్య, రేఖ, జయసుధ, వాణీ గణపతితో సహా మరో ఇద్దరు నటీమణులతో కలిపి ఒకేసారి ఆరుగురితో ప్రేమ వ్యవహారం నడిపించారు. కానీ చివరికి వాణీ గణపతిని కమల్ హాసన్ పెళ్లాడారు. వీరి పెళ్లి వార్త శ్రీదేవి, శ్రీవిద్యలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే శ్రీవిద్య కమల్‌హాసన్‌ను ఎంతో ఇష్టపడింది. ఆయనకు పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అతనికి పెళ్లి కావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. నేను కమల్‌తో తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన వాణితో ప్రేమలో పడ్డారు. ఎయిర్‌పోర్టులో ఆమెకు బహుమతి కూడా కొన్నాడు. ఆ తర్వాత మద్రాస్‌కు చెందిన నటి రేఖతో ప్రేమాయణం కొనసాగించారు. ఈ విషయాన్ని నేను నేరుగా వెళ్లి శ్రీవిద్యకు చెప్పా. కానీ ఆమె నమ్మలేదు. కమల్‌కు 'సకలకళా వల్లభుడు' అన్న బిరుదు రావడానికి ఇదే కారణం.' ఆమె పేర్కొంది.
(ఇది చదవండి: విడాకుల ఫోటోషూట్.. ఇదేం ట్రెండ్ రా బాబు!)
అయితే కమల్ వాణిని పెళ్లి చేసుకున్న తర్వాత.. శ్రీవిద్య చాలా రోజులు ఈ వాస్తవాన్ని భరించలేక తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు పద్మిని తెలిపింది. కానీ కొన్నేళ్ల తర్వాత జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది రోజులకే విడాకాలు తీసుకుంది. సినిమాల నుంచి తప్పుకున్న శ్రీవిద్య తిరువనంతపురంలో స్థిరపడింది. తన ఆస్తి మొత్తాన్ని ఓ ట్రస్ట్‌కు రాసిచ్చింది. ఆ తర్వాత ఆమెకు క్యాన్సర్ రావడంతో 2006లో మరణించింది. తెలుగులో చివరగా విజయ్ ఐపీఎస్ అనే సినిమాలో శ్రీవిద్య నటించారు.ఈ సినిమాలో హీరోగా సుమంత్ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment