కమలహాసన్(ఫైల్)
చెన్నై: తన గురువు కె. బాలచందర్ ను కడసారి దర్శించుకునే అవకాశాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ కోల్పోయారు. అమెరికా నుంచి ఆయన ఈ రాత్రికి చెన్నై చేరుకునే అవకాశముంది. బాలచందర్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం ముగియనున్నాయి. తన తాజా చిత్రం 'ఉత్తమ్ విలన్' పోస్టు ప్రొడక్షన్ పనుల కోసం కమలహాసన్... లాస్ ఏంజెలెస్ కు వెళ్లారు.
బాలచందర్ మరణవార్త తెలియగానే ఈ తెల్లవారుజామున కాలిఫోర్నియా నుంచి ఆయన బయలుదేరారని, ఈ రాత్రికి చెన్నై చేరుకుంటారని కమలహాసన్ మేనేజర్ తెలిపారు. బాలచందర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తారని చెప్పారు. బాలచందర్ తో కలిసి 40పైగా సినిమాలకు కమలహాసన్ పనిచేశారు.