రముఖ సినీ దర్శకుడు బాలచందర్ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. చెన్నైలోని ఆళ్వార్పేటలోని ...
చెన్నై : ప్రముఖ సినీ దర్శకుడు బాలచందర్ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. చెన్నైలోని ఆళ్వార్పేటలోని ఆయన నివాసానికి బుధవారం ఉదయం సినీ, రాజకీయ నేతలతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. బాలచందర్ను కడసారి దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఎంఎస్ విశ్వనాథన్, ఏఆర్ రెహ్మాన్, నెపోలియన్, కాంచన, వాణీజయరాం, కె.ఎస్.రవికుమార్, అర్చన, కుష్బూ తదితరులు బాలచందర్ పార్థివ దేహాన్ని సందర్శించి, అంజలి ఘటించారు.
మరోవైపు షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న నటుడు కమల్ హాసన్ ...బాలచందర్ మరణవార్త వినగానే హుటాహుటీన చెన్నై బయల్దేరారు. మరికొద్దిసేపట్లో ఆయన చెన్నై చేరుకోనున్నారు. కాగా బాలచందర్ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం జరగనున్నట్లు సమాచారం.