తెలుగు ప్రజల మనసులపై తన బొమ్మలతో, సినిమాలతో చెరగని సంతకం చేసిన ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు నివాసం శోకసంద్రంగా మారింది.
చెన్నై : తెలుగు ప్రజల మనసులపై తన బొమ్మలతో, సినిమాలతో చెరగని సంతకం చేసిన ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు నివాసం శోకసంద్రంగా మారింది. చివరిచూపు చూసుకునేందుకు పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య....బాపు మృతికి సంతాపం తెలిపారు. మరోవైపు సీనియర్ నటుడు శరత్ బాబు ఈరోజు ఉదయం బాపు భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.
కాగా బాపూ అంత్యక్రియలు మంగళవారం బీసెంట్ నగర్ స్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు ఆయన చిన్న కుమారుడు వెంకట రమణ తెలిపారు. అలాగే విదేశాల్లో ఉన్న బాపూ పెద్ద కుమారుడు వేణు గోపాల్ ఈరోజు రాత్రికి చెన్నై చేరుకుంటారు.