Rosaiah
-
చంద్రబాబుకి బుద్ధి చెప్తాం..జగన్ ని గెలిపించుకుంటాం
-
గ్రావెల్ మీద ధూళిపాళ్ల దొంగ ఏడుపు ఏడుస్తున్నారు
-
ప్రపంచ దశ దిశ మార్చే పెద్ద మనిషి... చంద్రబాబుపై రోశయ్య అదిరిపోయే సెటైర్లు
-
చంద్రబాబు, రామోజీలకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సవాల్
-
చర్చకు రెడీ.. చంద్రబాబుకు ఎమ్మెల్యే కిలారి రోశయ్య సవాల్
సాక్షి, గుంటూరు: పొన్నూరు అభివృద్ధిపై చంద్రబాబు చర్చకు రావాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సవాల్ విసిరారు. బాబు సవాల్ స్వీకరిస్తున్నానని, ఐలాండ్ సెంటర్లో చర్చకు రెడీ అని రోశయ్య స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను మోసం చేసిన చంద్రబాబు.. ఏ ముహం పెట్టుకుని పొన్నూరుకు వచ్చారని నిలదీశారు. మూడున్నరేళ్లలో పొన్నూరులో రూ.1200 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. చదవండి: ప్రభుత్వంపై బురదజల్లడమే పచ్చపత్రికల పని -
లెక్కలన్నీ చెప్పినా రాద్ధాంతమేల?
సాక్షి,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య మండిపడ్డారు. ప్రభుత్వ బిల్లులకు సంబంధించి కాగ్ అడిగిన ఒక చిన్న వివరణను పట్టుకుని ఆర్థిక శాఖలో ఏదో జరిగిపోతోందంటూ టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. రూ.41 వేల కోట్లకు సంబంధించి లెక్కలు, బిల్లులు లేవంటూ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, టీడీపీ నేతలు ప్రచారం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీఏసీ చైర్మన్ కోరినట్లుగా రూ.41 వేల కోట్లకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పూర్తి లెక్కలు చెప్పినా ఇంకా స్పష్టత కావాలంటూ పయ్యావుల కేశవ్ అవే అబద్ధాలను వల్లిస్తున్నారని విమర్శించారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎస్డీసీ)కు సంబంధించిన రూ.25 వేల కోట్లకు బ్యాంకు గ్యారెంటీ నేటివరకు ఇవ్వలేదని స్పష్టంగా చెప్పినా ఎందుకు రభస చేస్తున్నారని ప్రశ్నించారు. కాగ్ అడిగిన క్లారిఫికేషన్‌ను పట్టుకుని ప్రభుత్వంపై నిందలు మోపడానికి సిగ్గులేదా? అని దుయ్యబట్టారు. టీడీపీ ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలంగాణ వాటా అప్పులు మనం తీసుకోవడం అసలు సాధ్యమేనా? నిధులు ఇచ్చే సంస్థలు అంత గుడ్డిగా ఉంటాయా? అని నిలదీశారు. మసాలా బాండ్ల పేరుతో రూ.2 వేల కోట్లు ఏమయ్యాయి? టీడీపీ హయాంలోనే రూ.300 కోట్లు ఖర్చు చేసి సీఎఫ్ఎంఎస్ విధానం తెచ్చారని, ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించి సాఫ్ట్వేర్, టెక్నాలజీ పేరుతో దోపిడీ చేశారని ఎమ్మెల్యే రోశయ్య పేర్కొన్నారు. టీడీపీ హయాంలో మసాలా బాండ్ల పేరిట రూ.2 వేల కోట్లు వసూలు చేశారని, అది ఎవరికైనా చెప్పారా? అని ప్రశ్నించారు. ఈ అవినీతి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా ఏపీ ఫైబర్ నెట్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లలో బయటపడుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. రూ.41 వేల కోట్ల సంగతి అయిపోయాక ఇప్పుడు రూ.17 వేల కోట్ల గురించి మాట్లాడుతున్నారని, అందులో రూ.16,818 కోట్లు ఎక్సెస్‌గా వాడింది టీడీపీ హయాంలోనేనన్నారు. ఈ ప్రభుత్వం వాడింది కేవలం రూ.300 కోట్లేనని తెలిపారు. నిధుల్లో కేంద్రం కోత విధించిందంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే.. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండటాన్ని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిలారి దుయ్యబట్టారు. నిజమైన అభివృద్ధి అంటే ప్రజల జీవన విధానంలో మార్పు తేవడమని, అది సీఎం జగన్ ప్రభుత్వంలో జరుగుతోందన్నారు. చంద్రబాబు మాదిరిగా నాలుగు బిల్డింగులు చూపి ప్రజలను కడుపు నింపుకోమంటే ఎలాగని ప్రశ్నించారు. భ్రమరావతిని చూపి ప్రజలను మోసం చేయడం లేదని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. -
‘ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించాలని టీడీపీ కుట్ర’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మండిపడ్డారు. ఆయన బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించాలని టీడీపీ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకుల వైఖరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. 41వేల కోట్ల పద్దుల గురించి ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారని, మళ్లీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మొదటికి వచ్చారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు వారి నాయకుడు చంద్రబాబుకు నిజాలు మాట్లాడే అలవాటే లేదన్నారు. టీడీపీ వాళ్లు చెప్పిన పద్దుల్లో ఏజీ ఆఫీస్‌కి వివరణ ఇచ్చామని తెలిపారు. ఇదంతా చంద్రబాబు పెట్టిన సీఎఫ్ఎంఎస్ వల్లే సమస్య వచ్చిందన్నారు. చంద్రబాబు ఇలాంటి టెక్నాలజీ పేరుతో అనేక అక్రమాలు చేశారని మండిపడ్డారు. అవి ఫైబర్‌నెట్, స్కిల్ డెవలప్మెంట్లో బయట పడుతున్నాయని చెప్పారు. అసలు సీఎఫ్ఎంఎస్ను ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పజెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. -
రాష్ట్ర ప్రభుత్వం పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం
-
రైతుల లాభాలన్నీ ధూళిపాళ్ల జేబులోకే..
సాక్షి, అమరావతి: రైతుల కష్టార్జితమైన సంగం డెయిరీని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర తన సొంత ఆస్తిగా మలుచుకున్నాడని, రైతులకు దక్కాల్సిన లాభాలను తన జేబుల్లో నింపుకొన్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య ధ్వజమెత్తారు. దోపిడీదారుడిని అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ అర్హులైన రైతులు అందరికీ ఈ నెల్లో మరోసారి రైతు భరోసా జమ చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 18 వేల కోట్లు రైతు శ్రేయస్సుకు వెచ్చించిందని, రైతు భరోసా కేంద్రాలు, ఇన్పుట్ సబ్సిడీలు.. అన్నీ సమకూర్చడం వంటివి రైతులపై వైఎస్ జగన్ ప్రేమకు నిదర్శనమన్నారు. ఆయన ఇంకేమన్నారంటే.. ధూళిపాళ్ల మోసం చెప్పరేం? సంగం డెయిరీని అమూల్‌కు కట్టబెడుతున్నారని ఆరోపించే టీడీపీ నేతలు.. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన మోసమేంటో ప్రజలకు చెప్పకపోవడం దారుణం. 1977లో రైతుల కృషితో రూపుదిద్దుకున్న ఈ డెయిరీని ధూళిపాళ్ల దొడ్డిదారిన హస్తగతం చేసుకున్నారు. సహకార చట్టం ప్రకారం రెండేళ్లు డెయిరీకి పాలుపోస్తేనే డైరెక్టర్‌గా ఎన్నికయ్యే అర్హత ఉంటుంది. ఇవేవీ లేకుండా నరేంద్ర చైర్మన్ అయ్యారు. సహకార డెయిరీని సొంత వ్యాపార సంస్థగా మార్చారు. అసలు సహకార డెయిరీలను నిర్వీర్యం చేసింది టీడీపీ కాదా? చిత్తూరు డెయిరీని మూసేసి హెరిటేజ్‌ను లాభాల్లోకి తెచ్చుకున్నారు. దీనివల్ల చంద్రబాబు రూ. వేల కోట్లు సంపాదించారు. డీవీసీ ట్రస్టు పేరుతో అక్రమాలు రైతులకు చెందాల్సిన సంగం డెయిరీ లాభాలను ధూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) ట్రస్టుకి నరేంద్ర మళ్లిస్తున్నారు. లాభాలు ప్రకటించే ముందే సొసైటీల దగ్గర్నుంచి ఖాళీ చెక్కులు తీసుకున్నారు. బోనస్‌ను రైతు ఖాతాల్లో వేసి, తర్వాత డీవీసీ ట్రస్టుకు మళ్లించారు. సంవత్సరానికి రూ. 50 వేలు లాభాలుండని సొసైటీలు డీవీసీ ట్రస్టుకు రూ. లక్షల్లో చందాగా ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే రైతుల లాభాలు ధూళిపాళ్ల కాజేస్తున్నట్టా? కాదా? అసలు సంగం డెయిరీకి, డీవీసీ ట్రస్టుకు సంబంధమేంటి? డెయిరీ నుంచి వచ్చే లాభాల్లో 3 నుంచి 5 శాతం ట్రస్టుకు ఇవ్వొచ్చని తీర్మానం చేశారు. ఆ ప్రాంత ప్రజా ప్రతినిధిగా అక్కడి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అవినీతి నిరోధక సంస్థకు తెలియజేయడం నా బాధ్యత. టీడీపీ హయాంలో మూతపడ్డ సహకార డెయిరీలను అమూల్ సంస్థ ద్వారా మళ్లీ దారికి తెస్తుంటే తప్పుబట్టడం శోచనీయం. సంగం డెయిరీని కూడా సహకార సంఘం కిందకు తీసుకొచ్చేలా, రైతులకు ఉపయోగపడేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. -
‘దోపిడీ సొమ్ములో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలి’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ హయాంలో డెయిరీలను నిర్వీర్యం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. కోపరేటివ్ డెయిరీలను టీడీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కిలారి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల గురించి చంద్రబాబు, లోకేష్‌కు మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. ప్రైవేట్ డెయిరీలను టీడీపీ నేతలు సొంత ఆస్తుల్లా భావించారని, సంగం డెయిరీలో మోసాలకు పాల్పడి అరెస్టైన వ్యక్తికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సంగం డెయిరీలో దొంగ సర్టిపికెట్లతో 70 ఎకరాలకు పైగా భూమి దోచుకున్నారు. సంగం డెయిరీ పేరిట దొంగ సర్టిఫికెట్లు సృష్టించి దోపిడీ చేశారు. దోపిడీ చేసిన సొమ్ములో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలి. ప్రభుత్వ ఆస్తులన్నీ యథేచ్ఛగా దోపిడీ చేశారు. టీడీపీ హయాంలో రైతులను నిలువునా మోసం చేశారు. టీడీపీ నాయకులు పాల రైతులను మోసం చేసి సంపాదించారు. రైతులు పూర్తిగా లాభపడాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. రైతులు వారికి రావాల్సిన లాభాలు వారు స్వేచ్ఛగా పొందాలి’’ అని ఎమ్మెల్యే రోశయ్య అన్నారు. -
కార్మికుల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ ధ్యేయం
-
మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు: రోశయ్య
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో మహిళలను ముందుపెట్టి తేదేపా గుండాలు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేయడాన్ని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కిలారి రోశయ్య తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఉనికిని కాపాడుకోవటానికే ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయనడానికి దీనిని నిదర్శనంగా భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, భూముల విలువలు తగ్గిపోతాయన్న బాధతోనే.. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు వసూళ్లు చేసి మరీ రాజధాని పేరుతో దీక్షలు చేస్తున్నారు. మీరు చేస్తున్న ఉద్యమం ఒక కృత్రిమ ఉద్యమం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా రోజుకోరకంగా తప్పుడు ప్రచారం చేస్తూ కుయుక్తులు పన్నుతున్నారు. మీరెన్ని కుయుక్తులు పన్నినా మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడుదల రజిని, నందిగం సురేష్‌లపై దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా భావిస్తున్నామంటూ ఎల్లో గ్యాంగ్‌పై నిప్పులు చెరిగారు. (చదవండి: వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు?: ఎంపీ సురేష్) ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి -
పవన్‌కు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలన పేరుతో ఆర్భాటాలకు పోయి వందలకోట్లు వృధా చేశారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్కొన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనతో రాజన్న రాజ్యం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతాంగం సంతోషంగా ఉందని తెలిపారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోశయ్య స్పందిస్తూ.. చంద్రబాబుకు పవన్ రహస్య స్నేహితుడిగా వ్యవహరిస్తూ, ఆయన తయారు చేసిన స్క్రిప్టునే చదవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అక్రమాలను ఎన్నడూ ప్రశ్నించని పవన్ ఇప్పుడు పనిగట్టుకొని జగన్‌ను విమర్శించడం వెనుక ఓర్వలేనితనం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 19 చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి పవన్‌కు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించిన సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మాట తప్పితే, అదే ఉద్దానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 200 పడకల ఆసుపత్రిని కట్టిస్తున్నారన్న విషయం పవన్ మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రూ. 1.50 వేల కోట్లు అప్పుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, వంద రోజుల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం పవన్‌కు గుర్తులేదా అని మండిపడ్డారు. ఉగాది రోజున 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తామన్న సీఎం మాటలు పవన్ కళ్యాణ్‌కు కనిపించడం లేదా అని మండిపడ్డారు. రాజధానిని మార్చుతామని సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పుడైనా మీకు చెప్పారా అంటూ పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. రైతులను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు కాదా అని, ధైర్యం ఉంటే నిజాయితీగా మాట్లాడాలని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అది పవన్‌కు మాత్రమే చెల్లుతుంది : అమరావతిలో భూసేకరణకు మొదట ఒప్పుకోని పవన్ ఆ తర్వాత మాట మార్చడం ఆయనకు మాత్రమే చెల్లుతుందని ఎమ్మెల్యే కిలారి రోశయ్య వ్యాఖ్యానించారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే డీజీపీ ఇచ్చిన స్టేట్మెంట్ పవన్‌కు కనిపించడం లేదన్నారు. లింగమనేని ఎస్టేట్స్ అధినేత.. చంద్రబాబుకు, పవన్‌లకు కామన్ ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనని, ఆయన ఇచ్చిన ఇళ్లలో ఉంటూ జగన్‌పై విమర్శలు చేస్తూ జనసేన ఎప్పటికీ టీడీపీ తోక పార్టీ అని నిరూపించిందన్నారు. ఇప్పటికైనా పవన్ చెప్పుడు మాటలు వినకుండా తన సొంత ఎజెండాతో వస్తే బాగుంటుందని హితవు పలికారు. 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం పేరుతో చంద్రబాబు నవ్వులపాలయ్యారని తెలిపారు. కాగా, వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ వేగవంతంగా జరుగుతోందని పేర్కొన్నారు. -
ఈ తెలుగు – ఆ తమిళం
తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రొఫెసర్... డాక్టర్ ప్రభు కుమారి వనమా. తెలంగాణ సంస్కృతి మీద ఆమె అధ్యయనం చేశారు.తమిళ జానపద నృత్యాలు,తెలంగాణ సాంస్కృతిక కళల మధ్య భావసారూప్యతలపై విస్తృతమైన పరిశీలన జరిపారు.తమిళ మహిళ ‘తమిళిసై’ తెలుగు రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చిన సందర్భంలో... ఈ రెండు ప్రాంతాల సాంప్రదాయిక బాంధవ్యం గురించి సాక్షితో ముచ్చటించారు. డాక్టర్ ప్రభుకుమారి పుట్టింది విజయవాడలో, బాల్యం హైదరాబాద్‌లో గడిచింది. తర్వాత తమిళనాడు బాట పట్టింది వాళ్ల కుటుంబం. సంగీతం, నాట్యం ఆమెకు రెండు కళ్లు. తనకు ఇష్టమైన కళలను కొనసాగించడం కోసమే ఆమె చరిత్ర, పర్యాటక రంగాల్లో అధ్యాపక వృత్తిని ఎన్నుకున్నారు. సరిగమల గురువు అమ్మ ‘‘మా అమ్మ జ్ఞాన ప్రసూన గాయని, కర్ణాటక, హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతురాలు. సినిమాల్లో నేపథ్య గాయని. నాన్న పుల్లారావు ఫార్మాసుటికల్ కంపెనీ నిర్వహించేవారు. నన్ను కళారంగంలో అత్యున్నత స్థాయిలో చూడాలనేది మా అమ్మ కోరిక. అందుకోసమే మా కుటుంబం చెన్నైకి మారింది. అమ్మ స్వయంగా నాకు కర్నాటక, హిందూస్తానీ సంగీతంలో సరిగమలు నేర్పించారు. హైదరాబాద్‌లో ఉన్న కాలంలో భరతనాట్యం, కూచిపూడి కథక్‌తోపాటు జానపద నృత్యాలు నేర్చుకున్నాను. జానపద నృత్యంలో... నేను సంగీతానికి అనుగుణంగా అడుగులు వేయడం వరకే పరిమితమైపోయి ఉంటే నా ప్రయాణం ఒక ‘కళాకారిణి’ అనే మైలురాయి దగ్గరే ఆగిపోయేది. జానపద నృత్యాలకు ఆధారమైన సాహిత్యం మీద నాకు కలిగిన మమకారమే నన్ను అధ్యయనకారిణి చేసింది. వీటితోపాటు తబలా, హార్మోనియం, తంబూరా, మృదంగం నేర్చుకోవడం మీద ఆసక్తి కలిగింది. నేను ఎప్పుడు దేని మీద ఇష్టాన్ని కనబరిస్తే వెంటనే అందులో శిక్షణ ఇప్పించేది మా అమ్మ. ప్రతి రంగంలో మేటి అయిన గురువుల దగ్గర శిక్షణ ఇప్పించింది. కూచిపూడి, భరతనాట్యం సుమతీ కౌశల్ గారి దగ్గర నేర్చుకున్నాను. అంజుబాబు గారి శిక్షణలో కథక్, ఫోక్ డాన్సులు నేర్చుకున్నాను. ఆ తర్వాత బెనాసర్లో విజయశంకర్ గారి దగ్గర కథక్‌లో ప్రావీణ్యం సాధించగలిగాను. ప్రతి కళనూ దాని మూలాల వరకు వెళ్లి అధ్యయనం చేయాలనే కోరిక... ఈ రోజు నన్ను ప్రపంచదేశాలకు పరిచయం చేసింది. జనాన్ని కలిపేది జానపదాలే జానపద గేయాలు సాధారణంగా బృందగానాలే అయి ఉంటాయి. జానపద నృత్యాలను కూడా సామూహికంగానే చేస్తారు. జన సామాన్యాన్ని ఒక త్రాటి మీదకు తీసుకువచ్చే మాధ్యమాలివి. ముఖ్యంగా తమిళనాడు – తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం చాలా బలమైనదనే చెప్పాలి. భావసారూప్యాల విశ్లేషణ చేస్తే... రెండు సంప్రదాయాలు కూడా ప్రకృతి మీద ఆధారపడి మనిషి జీవికను నిర్మించుకున్నవే అని తెలుస్తుంది. తెలంగాణలో బోనాలు అని చేస్తారు. ఈ వేడుకలో భక్తులు అమ్మవారికి పసుపు నీటిని చల్లుతూ భోజనాన్ని సమర్పిస్తారు. తమిళనాడులో చేసే ‘కరగాట్టం’ వేడుకలో కూడా కుండ తల మీద పెట్టుకుని నృత్యం చేస్తూ దేవుడికి ఆహారం, నీటిని సమర్పిస్తారు. రెండు వేడుకల్లోనూ ఘటాన్ని తల మీద పెట్టుకుని లయబద్ధంగా డాన్స్ చేయడమే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ కోలాటం– అక్కడ కోలాఠం తెలుగు రాష్ట్రాల్లో కోలాటం బాగా ప్రసిద్ధి. ఇదే ఆట తమిళనాడులోనూ ఉంది. అయితే అక్కడ ‘కోలాఠం’ అని ఠని ఒత్తి పలుకుతారు. ఆటంతా దాదాపుగా ఒకటే. ప్రత్యేకంగా ఆడపిల్లలకు నేర్పిస్తారు. తమిళనాడులో కోలాఠం ఆడడానికి ప్రత్యేకంగా పండుగలేవీ అక్కర్లేదు. ఆడవాళ్లు పనులు లేని సమయంలో ఆటవిడుపుగా కోలాఠం ఆడుకుంటారు. ఇక తెలంగాణలో మహిళలు ప్రధానంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలాంటిదే తమిళనాడులో ‘కుమ్మి’. ఆంధ్రప్రదేశ్‌లో గొబ్బెమ్మ ఆడినట్లన్న మాట. బతుకమ్మ అమరికలో పూలే ప్రధానంగా ఉంటాయి. గొబ్బెమ్మ ఆటలో, కుమ్మి ఆటలో ముగ్గు వేసి మధ్యలో పూలను అమర్చి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. బతుకమ్మ అయినా, గొబ్బెమ్మ అయినా, కుమ్మి అయినా... అలంకరించే పూలలోనే ఉంది అసలు రహస్యం. బతుకమ్మను అలంకరించే పూలు కానీ, కుమ్మి ఆట కోసం ముగ్గు మధ్య అమర్చే పూలు... ఆడవాళ్లు జడలో పెట్టుకోని పూలే. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. మనదేశంలో పూచే ప్రతి పువ్వూ ఔషధగుచ్ఛమే. ఈ వేడుకలు జడలో పెట్టుకోని పూలలో ఉన్న ఔషధగుణాలను దగ్గర చేస్తాయి. గొప్ప బంధం సాంస్కృతికంగా తమిళనాడుకి తెలుగు రాష్ట్రాలకు విశ్వాసాల పరంగా కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. మహాభారతం, రామాయణం వంటి పౌరాణిక ఇతిహాసాల ఇతివృత్తాలతో మనం వీధి భాగవతాలు చెప్పుకుంటాం. వాటిని తమిళనాడులో తేరుకూట్ అంటారు. తమిళనాడు, తెలంగాణలు కల్చర్‌ను చాలా బాగా కాపాడుకుంటున్నాయి. ఏపీలో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పోవడం, ఆధునికత వైపు పరుగుల మధ్య సంస్కృతి పరిరక్షణ కుంటుపడుతోంది. సంప్రదాయం– సాధికారత మనదేశం గత కొన్ని దశాబ్దాలుగా మహిళ సాధికారత కోసం ఎన్నో ఉపాధి మార్గాలను చూపిస్తోంది, శిక్షణనిస్తోంది. అన్నింటికంటే పెద్ద ఉపాధి మార్గం మన సంప్రదాయ జానపద నృత్యంలోనే ఉంది. కల్చరల్ టూరిజం ద్వారా ప్రధానంగా మూడు అంశాలు అభివృద్ధి చెందుతాయి. స్థానిక సంప్రదాయాన్ని అంతరించి పోకుండా కాపాడుకోగలగడం సాధ్యమవుతుంది. కళారీతులను మెరుగుపరుచుకోవడంలో సృజనాత్మకత మెరుగుపడుతుంది. మూడవది టూరిజానికి నిరంతరతను సాధించడం. టూరిజానికి నిరంతరత అని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఎంత గొప్ప టూరిస్ట్ స్పాట్ అయినా సరే... ఒక ప్రదేశానికి ఒకసారి వెళ్లిన వాళ్లు సాధారణంగా మళ్లీ వెళ్లరు. కల్చరల్ టూరిజమ్ అలా కాదు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు జరుగుతుంటాయి. ఒక్కో వేడుకలో ఒక్కో రకమైన సాంస్కృతిక కళల ప్రదర్శన జరుగుతుంటుంది. దాంతో ఒక టూరిస్టు... ఒక ప్రదేశానికి మళ్లీ మళ్లీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఒక టూరిస్ట్ రావడం వల్ల ఆదాయం వచ్చేది ఆ కళా ప్రదర్శనకు మాత్రమే కాదు. ఆ టూరిస్ట్ బస, భోజనాల కోసం హోటల్, రెస్టారెంట్ వ్యాపారాలు పెరుగుతాయి. అక్కడి ప్రత్యేకమైన వస్తువులను కొంటారు కాబట్టి హస్తకళాకృతుల అమ్మకాలు పెరుగుతాయి. అందుకే మహిళల ఆర్థిక స్వావలంబనకు మన సంప్రదాయ కళలను మించిన మార్గాలు మరేవీ ఉండవనే చెప్తాను. మన ఆట, పాట, హస్తకళ... ప్రతిదీ మనకు అన్నం పెట్టే వనరే. ఆర్థిక స్వావలంబనకు పెద్ద ఆలంబన మన ఫోక్ ఆర్ట్స్. వృత్తి– ప్రవృత్తి నేను చదివిన కోర్సు ఎంపిక నా అభిరుచికి అనుగుణంగా జరిగింది. అందుకే వృత్తి ప్రవృత్తి ఒకటిమిళితమై పోయాయి. ఒక తబలా వాదన, ఒక కథక్ ప్రదర్శన, శాస్త్రీయ– జానపద సంప్రదాయ కళలను పాఠంగా చెప్పడం... ప్రతిదీ సంతోషాన్నిచ్చే అంశాలే అయ్యాయి. ఇవన్నీ నన్ను విదేశాల్లో మన సాంస్కృతిక ప్రదర్శనల వైపు, పుస్తక రచన వైపు నడిపించాయి. ఇక నేను ఎడిటర్‌గా మరో అవతారం ఎత్తడానికి కారణం కూడా భారతీయ సంప్రదాయం, సంస్కృతి, సాంస్కృతి కళల ప్రచురణ కోసమే. మెడికల్, హోటల్, సినిమా ఇండస్ట్రీ తమ రంగాల కోసం జర్నల్స్ నడుపుతున్నాయి. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయం, పర్యాటకం కోసం ఒక పత్రిక రూపకల్పన చేశాను. మనదేశం గురించి తెలుసుకోవాలనుకునే విదేశీయులకు ఇది బాగా ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు ప్రభుకుమారి. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు అమ్మానాన్నలతో కలిసి సాంస్కృతిక పత్రిక కాపీని అందచేస్తున్న ప్రభుకుమారి సమాజమే పెద్ద పాఠశాల ప్రభుకుమారి వనమా చెన్నైలోని భారతి ఉమెన్స్ కాలేజ్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆమె ఎంఏ, ఎమ్టిటిఎమ్, ఎమ్‌ఫిల్, డబుల్ పీహెచ్డీ. తమిళ్ లిటరేచర్‌లో డిప్లమో, సిటిజెన్స్ లీగల్ రైట్స్‌లో డిప్లమో, డీలిట్ చేశారు. ప్రస్తుతం జానపద కళల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ కోసం చెన్నైలో ‘వనమా ఆర్ట్, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్’ను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, చరిత్ర పరిశోధనాంశాల మీద రీసెర్చ్ చేసే పరిశోధక విద్యార్థుల కోసం ‘బై యాన్యువల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్, కల్చర్, హెరిటేజ్ అండ్ టూరిజమ్’ (జెఐఏసిహెచ్టి) పేరుతో జర్నల్ను నడుపుతున్నారు. పరిశోధనలు, జానపద కళల కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నుంచి ‘బాల సహ్యోగ్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పురస్కారం అందుకున్నారు. చంఢీఘర్‌లో హిస్టరీ అండ్ టూరిజమ్ నిర్వహించిన సదస్సులో బెస్ట్ అకడమీషియన్ అవార్డు అందుకున్నారు. ‘ఉమెన్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్’ అంశం మీద ఆమె ప్రసంగించారు. ఆమె సూచించిన అనేక అంశాలను ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ‘‘మనం అక్షరాలు నేర్చుకుని, పుస్తకాలతో చదవడం ద్వారా విజ్ఞానాన్ని సొంతం చేసుకోగలుగుతున్నాం... అని అనుకుంటాం. కానీ అక్షరాలు, పుస్తకాలు కేవలం మనకు విజ్ఞానాన్ని అందించే మాధ్యమాలు మాత్రమే. మనం నిజంగా నేర్చుకునేది సమాజం నుంచే’’ అంటారు ప్రభుకుమారి. ‘‘ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన నేపథ్యంలో జ్ఞానం... ఏదో ఒక మారుమూల అలా ఉండిపోవడం లేదు. ఒక మూల నుంచి మరో మూలకు సులువుగా చేరుతోంది. ఒకరి కల్చర్ మీద మరొకరికి ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో మన కల్చర్ మనకు అన్నం పెట్టే మాధ్యమం అవుతోందని మాత్రం మర్చిపోవద్దు’’ అన్నారు ప్రభుకుమారి.– వాకా మంజులారెడ్డి -
ఎన్టీఆర్ గొప్ప నటుడు
హైదరాబాద్ : నందమూరి తారకరామారావు గొప్ప నటుడని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ విజ్ఞాన్ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అస్సామీ రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ నగేన్ సాకియాకు ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం–2019 ప్రదానం చేశారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ, రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికి నటుడిగా ఎన్టీఆర్‌ను ఎంతో అభిమానించానని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, రాజకీయం విడదీస్తుందని.. సాహిత్యం మాత్రం అందరినీ కలుపుకుపోతుందని అన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట సేవచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నృత్య గురువు ఇందిరా ముస్నూరి శిష్యబృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయ్‌బాబు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ అనంతలక్ష్మి, చింత కిరణ్‌కుమార్, యువ కళావాహిని అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పొన్నూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి రోశ్యయ్య ప్రచారం
-
పొన్నూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి రోశ్యయ్య ప్రచారం
-
వైఎస్ జగన్‌కు ప్రముఖుల పరామర్శ
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం పలువురు ప్రముఖులు ఫోన్లో పరామర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య ఫోన్ చేసి, హత్యాయత్నం ఘటన గురించి జగన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి ఫోన్‌చేసి జగన్ యోగక్షేమాలను తెలుసుకున్నారు. సంఘటన జరిగిన తీరును ఆరా తీశారు. జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శుక్రవారం జగన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగారు. -
‘రోశయ్యను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన మాజీ సీఎం రోశయ్యను విమర్శించే స్థాయి, వయసు మంత్రి కేటీఆర్‌కు లేదని, తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిరంజన్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రోశయ్యను అవమానించడం ముమ్మాటికీ ఆర్యవైశ్య సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సందర్భంగా రోశయ్యకు అవార్డు ఇవ్వడాన్ని కేటీఆర్ అవమానించడం విచారకరమన్నారు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 2 సార్లు మత కల్లోలాలు జరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను నిరంజన్ ఖండించారు. -
అలాంటి వ్యక్తి మోదీ దృష్టిలో వీరుడా!
సావర్కర్ వీరుడా? హిందూ జాతీయవాది సావర్కర్ ఫొటోను ప్రధాని పార్లమెంటులో ఏర్పాటు చేయడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. సావర్కర్ చరిత్ర ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీతోపాటు మిగతా కాంగ్రెస్ నేతలు జైల్లోనే ఉండగా సావర్కర్ మాత్రం తనను జైలు నుంచి విడుదల చేయాలని బ్రిటిషర్లకు లేఖ రాశారని గుర్తుచేశారు. జైలు నుంచి వదిలేయాలని బ్రిటిష్ వాళ్లను సావర్కర్ వేడుకున్నారని, కాళ్లు పట్టుకుంటా, మీరు చెప్పినట్టు చేస్తానని సావర్కర్ ప్రాధేయపడ్డాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తి మోదీ దృష్టిలో వీరుడా అంటూ రాహుల్ నిలదీశారు. ఇదేం దేశభక్తి అంటూ ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు నోట్ల రద్దు అంశంలోనూ బీజేపీకి టీఆర్ఎస్ అండగా నిలిచిందని, ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చెంచాలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మద్దతిస్తున్న టీఆర్ఎస్కు ఐంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలన్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జాతి, మతం, కులం పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ‘దేశ సమైక్యత, సమగ్రత కోసం గాంధీ, నెహ్రూ, పటేల్ ఎంతో పాటుపడ్డారు. కానీ నేడు జాతి, మతం, కులం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. దేశ ప్రజలకు శాంతి, ప్రేమ, సోదరభావంతో జీవించే హక్కు ఉంది. కానీ ప్రధాని దేశాన్ని విభజించి పాలించాలని చూస్తున్నారు’అని రాహుల్ ఆరోపించారు. మోదీ విధానాలతో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు మహిళలు జంకుతున్నారన్నారు. విచ్ఛిన్న ధోరణుల వల్లే దళితుడైన రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇలాంటి ప్రధానికి టీఆర్ఎస్, ఎంఐఎం కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒకే ఆలోచనా విధానంతో ముందుకెళ్తున్నాయని ఆరోపించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ సద్భావన యాత్ర సభలో రాహుల్ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు రాజీవ్ సద్భావన అవార్డును రాహుల్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాన్ని మోదీ విభజిస్తుంటే ఎంఐఎం ఎందుకు పరోక్షంగా మద్దతిస్తోందని ప్రశ్నించారు. మహారాష్ట్ర, బిహార్, యూపీ ఎన్నికల్లో ఎంఐఎం హిందూ, ముస్లింల ఓట్లను చీల్చి బీజేపీకి పరోక్షంగా మద్దతిచ్చిందన్నారు. ఎంఐఎం ఆలోచన సైతం దేశాన్ని విచ్ఛిన్నం చేయడమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నియంత పాలన... తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదని, ఐదేళ్లలో తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం ఒక్కటేనని ఆయన విమర్శించారు. పాతబస్తీకి మెట్రో రైలు రాలేదని, మెట్రో వస్తే తమ రాత మారుతుందని చిన్న వ్యాపారులు ఆశించినా అలా జరగలేదన్నారు. నోట్ల రద్దుకు సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని, అలాంటి కేసీఆర్‌కు ఎంఐఎం అండగా నిలిచిందన్నారు. నోట్ల రద్దు తర్వాత క్యూలలో మాల్యా, నీరవ్ మోదీ, అనిల్ అంబానీ నిలబడ్డారా? అని రాహుల్ ప్రశ్నించారు. నోట్ల రద్దుతో దోపిడీదారులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. -
ఆర్యవైశ్యులు అన్ని విధాలా ఎదగాలి: రోశయ్య
హైదరాబాద్: ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. ఆదివారం నాగోలులో నిర్వహించిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర శాఖ, మహిళా విభాగం, యూత్ విభాగాల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్యవైశ్యులు క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. ఉమ్మడి ఏపీలో ఉన్న సంఘం తెలంగాణలో కూడా శాఖను ఏర్పాటు చేసి సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలు కూడా ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈబీసీ వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యవర్గం ఇదే..: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పాండుగుప్త, ప్రధాన కార్యదర్శిగా విశ్వేశ్వరయ్యగుప్త, కోశాధికారిగా నాగభూషణం, ఉపాధ్యక్షుడిగా కృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా స్వరూపరాణి, ప్రధాన కార్యదర్శిగా రోజారమణి, కోశాధికారిగా శాంతి, హైదరాబాద్ అధ్యక్షురాలిగా యాద మంజుల, యూత్ వింగ్ అధ్యక్షుడిగా సంపత్, సెక్రెటరీగా సందీప్, కోశాధికారిగా ఆకాశ్ తదితరులను ఎన్నుకున్నారు. -
పార్టీ మారేటప్పుడు పదవులు త్యజించాలి
-
పార్టీ మారేటప్పుడు పదవులు త్యజించాలి
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు పదవులు త్యజించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, పార్టీలు మారటం మంచిది కాదని సూచించారు. ప్రస్తుతం ఉన్న పార్టీ మారాలనుకున్నప్పుడు, ఆ పార్టీ ద్వారా వచ్చిన, పొందిన పదవిని వదులుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం రాగ సప్తస్వరం ఆధ్వర్యంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు వెంకయ్యనాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడు, భాషా కోవిదుడు, అజాత శత్రువు రోశయ్యకు సన్మానం చేయడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులందరూ ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. జవాబుదారీతనం, పారదర్శకత, క్రమశిక్షణ వంటి లక్షణాలు అలవర్చుకొని తద్వారా దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరారు. నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ, చట్టసభలు జరిగే తీరు చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. పదవులన్నీ యాదృచ్ఛికమే: రోశయ్య రోశయ్య మాట్లాడుతూ శాసనమండలి, పార్లమెంట్, శాసనసభల్లో వివిధ హోదాల్లో దాదాపు 35 ఏళ్లు పని చేశానని చెప్పారు. ఏ హోదాలో పని చేసినా అప్పగించిన బాధ్యతలకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేయాలన్న ధ్యేయంతోనే పనిచేశానని తెలిపారు. పదవులన్నీ యాదృచ్ఛికంగా వచ్చినవే తప్ప వెంపర్లాడి తెచ్చుకున్నవి కావని స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు, టి. సుబ్బరామిరెడ్డి తదితర పెద్దల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరగడం జీవితంలో మర్చిపోలేని సంఘటనగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయుడు ఎన్టీఆర్: రోశయ్య
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ చిరస్మరణీయుడని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. గురువారం రవీంద్రభారతిలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ లలితకళా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సినీరంగంలో ఎన్టీఆర్‌ను మించినవారు లేరన్నారు. కొన్ని పాత్రలకైతే ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. తెనాలిలో తన స్నేహితుడి సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి ఆనాడు ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తే వచ్చారని గుర్తుచేసుకున్నారు. తర్వాతి కాలంలో రాజకీయంగా విభేదించుకోవటం లాంటి విషయాలు జరిగి పోయాయని తెలిపారు. తెలుగు మహాసభల్లో ప్రస్తావనేదీ? తెలంగాణ గడ్డపై ఎంతోమంది దళితులను చేరదీసి, వారికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహామనిషి ఎన్టీఆర్ అని సమాచార హక్కు పూర్వ కమిషనర్ విజయబాబు అన్నారు. కానీ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నవారు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడం విషాదకరమన్నారు. అనంత రం ఎన్టీఆర్ లలితకళా పురస్కారాలను సినీనటుడు టి.చలపతిరావు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసా ప్రభావతి, ప్రవాసాంధ్రుడు సిడ్నీ బుజ్జికి రోశయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి, మెమెంటో, నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్టీఆర్ చలనచిత్ర సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో ప్రముఖ సినీనటి అన్నపూర్ణ, కార్యక్రమ నిర్వాహకుడు వైకే నాగేశ్వరరావు, సినీ దర్శకుడు గీతాకృష్ణ, సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. పోరాట స్ఫూర్తి ఎన్టీఆర్ ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘నా జీవితం ఎన్టీఆర్ మలచిన శిల్పం. ఎన్టీఆర్‌తో గడిపిన ప్రతిక్షణం మరచిపోలేను. జనవరి 17 నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోతుంది. కన్నీళ్లు వస్తే బయటకు ఏడ్వవద్దు అనేవారు. మన కన్నీళ్లు మనమే తుడుచుకొని పోరాటం చేయాలని నాలో స్ఫూర్తిని నింపేవారు. ఎన్టీఆర్ భార్య అన్న గొప్ప పదవి ఇచ్చి వెళ్లారు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేను. ఆయనకు జరిగిన అన్యాయంపై ఎన్నో విధాలుగా పోరాటం చేశాను. జీవితంలో తుదిశ్వాస వరకు ఆయన ఆశయ సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. ఆయన లేరని నేననుకోవడం లేదు. రాజకీయం నా భర్త ఎన్టీఆర్‌కు శాపం అయింది’ అని వాపోయారు. -
రోశయ్యను వదలని ‘అమీర్‌పేట భూవివాదం’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను అమీర్‌పేట భూ కేటాయింపుల వివాదం వదిలేలా లేదు. కాంగ్రెస్ సీనియర్ నేతగా గవర్నర్‌గా ఎన్నో హోదాల్లో పని చేసిన ఆయనను ఈ కేసు నీడలా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ భూ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి రోశయ్యపై వచ్చిన ఆరోపణలను ఆరు నెలల్లోగా తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో అమీర్‌పేటలో ఉన్న హెచ్ఎండీఏ భూమిని డీనోటిఫై చేసి 9.14 ఎకరాలను కొందరికి కేటాయించారు. దీనిపై అప్పట్లోనే వివాదం తలెత్తింది. 2009-10 మధ్యలో రోశయ్యమీద భూవివాదం కేసు నమోదు అయ్యింది. ఏసీబీ కోర్టు సమన్లు కూడా ఇచ్చింది. అనంతరం ఆయనకు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాతి కాలంలో రోశయ్య గవర్నర్ కావడం, సమన్లను హైకోర్టులో సవాలు చేయడంతో న్యాయస్థానం వాటిపై స్టే ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ రోశయ్యకు ఊరట కలిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మార్చి 2016లో మోహన్‌లాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పలు వాయిదాల తర్వాత విచారణకు వచ్చిన ఈ కేసులో సుప్రీంకోర్టు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్టు తెలిపింది. ఆరు నెలల్లోగా ఈ కేసును విచారణ జరుపుతామని జస్టిస్ రంజన్ గగోయ్ ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ఎంతో విలువైన భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలను ప్రాథమికంగా పరిశీలించిన కోర్టు.. ఈ కేసు తీవ్రమైందని వ్యాఖ్యానించింది. మరింత లోతుగా విచారించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆరు నెలల్లో కేసు ముగించాలని కూడా తెలిపింది.