చెన్నై: తమిళనాడు గవర్నర్ కొనిజేటి రోశయ్య(83) కు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఒక లేఖను రాశారు. పూల బొకేను రాజ్ భవన్ కు పంపారు. రోశయ్యకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన జయ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాక్షించారు.
రోశయ్య కుమారుడు నారాయణ మూర్తి ఆగస్టు 14 న జరిగే తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా సతీసమేతంగా కలిసి జయను ఆహ్వానించారు. రోశయ్య 1933 జులై 4 న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. 2011 నుంచి ఆయన తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్నారు.