greets
-
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: మహాశివరాత్రి : "శివ శివ" అంటూ తలచుకుంటే..! -
ముస్లింలకు సీఎం జగన్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్ దీవెనలు మన రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్లిం సోదరసోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్ దీవెనలు మన రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్లిం సోదరసోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2023 -
అల్లు అర్జున్ ఇంటివద్ద భారీగా అభిమానులు.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు(శనివారం)41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా స్టైలిష్ స్టార్‌గా తనకు తాను ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు బన్నీ. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బన్నీ మొన్నటి పుష్ప సినిమా వరకు తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. పుష్పరాజ్‌గా పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక తన ఫ్యాన్స్‌ను ఆర్మీ అని ముద్దుగా పిలిచుకుంటారు బన్నీ. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ను కలిసేందుకు పలువురు అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఫ్యాన్స్‌ను ఆప్యాయంగా పలకరించారు బన్నీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి,అమరావతి: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని ఆయన అన్నారు. The preachings of Lord Christ resonate in the hearts of countless people in the world, leading them on the path of righteousness. His life is a message of compassion, harmony and forgiveness. On this blessed day, wishing a joyous and Merry Christmas to one and all! — YS Jagan Mohan Reddy (@ysjagan) December 25, 2021 దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా బాటలు వేశారని తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం, ఇవీ జీసస్ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని ఆయన పేర్కొన్నారు. చదవండి: (AP: బిర్లాతో ఉపాధికి ఊతం) -
తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
-
రోశయ్యకు శుభాకాంక్షలు తెలిపిన జయ
చెన్నై: తమిళనాడు గవర్నర్ కొనిజేటి రోశయ్య(83) కు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఒక లేఖను రాశారు. పూల బొకేను రాజ్ భవన్ కు పంపారు. రోశయ్యకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన జయ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాక్షించారు. రోశయ్య కుమారుడు నారాయణ మూర్తి ఆగస్టు 14 న జరిగే తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా సతీసమేతంగా కలిసి జయను ఆహ్వానించారు. రోశయ్య 1933 జులై 4 న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. 2011 నుంచి ఆయన తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్నారు. -
అద్వానీ ఇంటికి మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ నివాసానికి వెళ్లారు. నేడు అద్వానీ పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసానికి వచ్చిన మోదీకి అద్వానీ సాదర స్వగతం పలికారు. నేడు అద్వానీ 88వ పడిలోకి ప్రవేశించారు. అద్వానీ నివాసానికి వెళ్లకముందే ఆయనకు ట్విట్టర్ ద్వారానూ బర్త్ డే విషెస్ తెలిపారు మోదీ. అద్వానీ అత్యంత గౌరవనీయులని, మార్గదర్శిగా, ఉత్తేజాన్నిచ్చిన స్పూర్తి ప్రధాతగా నిలుస్తారని పేర్కొన్న మోదీ.. పెద్దాయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాననన్నారు. అపారమైన జ్ఞానసంపత్తి, రుజువర్తన అద్వానీ సొంతమని కొనియాడారు. వ్యక్తిగతంగా అద్వానీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తన జీవితంలో అత్యుత్తమ గురువు ఆయనేనని చెప్పుకొచ్చారు. మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్.కె. అద్వానీ 1927, నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించారు. విభజన అనంతరం భారత్ కు వచ్చేశారు. -
హ్యాపీ బర్త్ డే అద్వానీజీ...
న్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఉదయం అద్వానీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు ఇచ్చి బర్త్ డే విషెష్ తెలియచేశారు. సుమారు 20 నిమిషాల పాటు ఆయనతో అమిత్ షా ముచ్చటించారు. మరోవైపు అద్వానీకి ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'బెస్ట్ టీచర్ అద్వానీజీ' అంటూ మోదీ ట్విట్ చేశారు. అద్వానీ నుంచి తాను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నానని ఆయన తెలిపారు. అలాగే పలువురు ప్రముఖులు ..అద్వానీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. కాగా బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ నేడు 88వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. -
జయకు మోదీ అభినందనలు
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ ఫోన్ ద్వారా జయలలితను అభినందించినట్లు అన్నాడీఎంకే సోమవారం ఓ ప్రకటన చేసింది. జయను అభినందనలు తెలిపినవారిలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు. అలాగే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, నజ్మా హెప్తుల్లా కూడా పురచ్చితలైవికి అభినందనలు తెలిపారు. ఇక ఎన్సీపీ నేత శరద్ పవార్, టీఎంసీ నేత జీ.కె.వాసన్, పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు తమిళ చలనచిత్ర ప్రముఖులు కూడా జయను గ్రీట్ చేశారు. -
వాజ్‌పేయికి మోదీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ గురువారం ఉదయం వాజ్‌పేయి 90వ జన్మదినం సందర్భంగా మోదీ గురువారం ఉదయం ఆయన నివాసాని వెళ్లారు. అలాగే వాజ్‌పేయికి బీజేపీ అగ్రనేతలతో పాటు పలువురు రాజకీయ నాయకుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు వాజ్‌పేయి జన్మదినోత్సవం సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డే జరపాలని ఎన్డీయే సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించమని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో నేడు పర్యటించనున్నారు. అస్సీ ఘాట్‌లో మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు ఆచరణలోకి వచ్చినప్పుడే సామాజిక సంక్షోభాలు సమసిపోతాయని పేర్కొన్నారు. శాంతి, ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు బోధనలు అనుసరణీయమని వైఎస్ జగన్ అన్నారు. -
సోనియా దసరా శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి దసరా పండుగ జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఢిల్లీలో తన నివాసానికి వచ్చిన పార్టీ ఎంపీ వి.హనుమంతరావుతో ఆమె మాట్లాడారు. వీహెచ్ తీసుకెళ్లిన బతుకమ్మను ఎత్తుకుని ఫొటోలు దిగారు. తెలంగాణ ప్రజలందరికీ సోనియా దసరా శుభాకాంక్షలు చెప్పినట్టు అనంతరం వీహెచ్ మీడియాకు వివరించారు. బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటా రు, ఎన్ని రోజులు చేస్తారు అని ఆసక్తిగా అడిగినట్టు చెప్పారు. బతుకమ్మ పండుగ చేసే విధానంతోపాటు దసరా విశిష్టతను సోనియాకి వివరించినట్టు వీహెచ్ తెలిపారు. -
రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులబాటు
హైదరాబాద్: రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు పనిదినాన్ని కుదించింది. ఈ నెలంతా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.