
సాక్షి,అమరావతి: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని ఆయన అన్నారు.
The preachings of Lord Christ resonate in the hearts of countless people in the world, leading them on the path of righteousness. His life is a message of compassion, harmony and forgiveness.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 25, 2021
On this blessed day, wishing a joyous and Merry Christmas to one and all!
దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా బాటలు వేశారని తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం, ఇవీ జీసస్ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని ఆయన పేర్కొన్నారు.
చదవండి: (AP: బిర్లాతో ఉపాధికి ఊతం)
Comments
Please login to add a commentAdd a comment