రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు పనిదినాన్ని కుదించింది.
ఈ నెలంతా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.