
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు ఆచరణలోకి వచ్చినప్పుడే సామాజిక సంక్షోభాలు సమసిపోతాయని పేర్కొన్నారు. శాంతి, ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు బోధనలు అనుసరణీయమని వైఎస్ జగన్ అన్నారు.