
సోనియా దసరా శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి దసరా పండుగ జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఢిల్లీలో తన నివాసానికి వచ్చిన పార్టీ ఎంపీ వి.హనుమంతరావుతో ఆమె మాట్లాడారు. వీహెచ్ తీసుకెళ్లిన బతుకమ్మను ఎత్తుకుని ఫొటోలు దిగారు. తెలంగాణ ప్రజలందరికీ సోనియా దసరా శుభాకాంక్షలు చెప్పినట్టు అనంతరం వీహెచ్ మీడియాకు వివరించారు. బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటా రు, ఎన్ని రోజులు చేస్తారు అని ఆసక్తిగా అడిగినట్టు చెప్పారు. బతుకమ్మ పండుగ చేసే విధానంతోపాటు దసరా విశిష్టతను సోనియాకి వివరించినట్టు వీహెచ్ తెలిపారు.