మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ గురువారం ఉదయం వాజ్పేయి 90వ జన్మదినం సందర్భంగా మోదీ గురువారం ఉదయం ఆయన నివాసాని వెళ్లారు. అలాగే వాజ్‌పేయికి బీజేపీ అగ్రనేతలతో పాటు పలువురు రాజకీయ నాయకుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు వాజ్పేయి జన్మదినోత్సవం సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డే జరపాలని ఎన్డీయే సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించమని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో నేడు పర్యటించనున్నారు. అస్సీ ఘాట్లో మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.