Good governance day
-
ఆరోగ్య రంగంలో ‘ఏఐ’ విప్లవాత్మక పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య ఆరోగ్య రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)– ఢిల్లీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. పెరుగుతున్న దేశ జనాభా దృష్ట్యా ముందస్తు రోగ నిర్ధారణ, వేగవంతమైన చికిత్సల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మహమ్మారి వ్యాధుల నిర్ధారణ, తీవ్రత అంచనా, వ్యాధి విశ్లేషణలకు ఏఐ పరిపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. ఎయిమ్స్–ఢిల్లీలోని చాలా విభాగాలు ఇప్పటికే రోగనిర్ధారణ, రోగి–కేంద్రీకృత సేవల్లో ఏఐని వినియోగిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగంలో ఎయిమ్స్ ఢిల్లీని అత్యుత్తమ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించిందని, ప్రాథమిక స్థాయిలోనే ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో గత మూడేళ్లుగా డెర్మటాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ వంటి విభాగాల్లో పరిష్కారాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, అమలు చేయడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి ఎయిమ్స్ అవిశ్రాంతంగా పని చేస్తోందన్నారు. ఏఐ ఆధారిత సీసీటీవీ కెమరాలతో అధీకృత సిబ్బంది డేటాబేస్‌తో ముఖాలను పోల్చడానికి, ముఖాలను గుర్తించడానికి ఉపయోగిస్తున్నామని, అంతేగాక వీటితో అనధికార ఎంట్రీలను నిరోధించడం ద్వారా భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురష్కరించుకొని ఎయిమ్స్‌లో నిర్వహించిన సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎయిమ్స్ పరిధిలో పాలనా పరంగా తీసుకొచి్చన సంస్కరణలు, రోగులకు అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను ఆయన వివరించారు. ఇటీవలే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగం కోసం ఎయిమ్స్ ఢిల్లీని ప్రధాన సంస్థగా నియమించారని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 20 సంస్థల కన్సారి్టయంకు ఎయిమ్స్ ఢిల్లీ నాయకత్వం వహిస్తోందని తెలిపారు. మిగతా వివరాలు ఆయన మాటల్లోనే.. 4 వేలకు చేరువలో బెడ్లు..: ప్రస్తుతం ఎయిమ్స్‌కి ప్రతి రోజూ సగటున 15వేలకు పైగా రోగులు ఓపీడీ సేవలకై వస్తున్నారు. కోవిడ్ తర్వాత ఓపీడీ కేసుల సంఖ్య 20–30 శాతం పెరిగింది. వీరికి కనీసంగా 15వేల మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఇక రోగులకై కోవిడ్ వరకు 2,600 వరకు బెడ్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 3,600లకు పెంచాం. ఇందులో మాతా, శిశు బ్లాక్‌లోనే ఏకంగా 425 బెడ్లను పెంచగా, సర్జికల్ బ్లాక్‌లో 200ల బెడ్లు అదనంగా ఏర్పాటు చేశారు. రోగులకు మందుల అందుబాటులో ఉంచేందుకు ఇటీవలి కాలంలో 4 అమృత్ ఫార్మసీలను అందుబాటులోకి తెచ్చాం. ఇక ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా 30 వేల మంది రోగులకు చికిత్స అందించాం. దేశం నలుమూలల నుంచి వివిధ వ్యాధులతో వచ్చి వారిని ఒక్కరినీ తిరిగి పంపడం లేదని, ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లోని ఎయిమ్స్ ఆస్పత్రుల్లోని రోగులకు సైతం రిఫరెన్స్‌ల ఆధారంగా టెలీకన్సల్టేషన్ విధానంలో ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రోగుల సహాయకులకు 1,516 బెడ్లు.. ఇక రోగులకు సహాయకులుగా వచ్చే వారికి ఎలాంటి ఇక్కట్లు లేకుండా 5 విశ్రాంతి సదన్లను ఏర్పాటు చేయగా, అందులో 1516 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటే ఓపీడీ సహా ప్రతి కేంద్రం వద్ద వెయిటింగ్ ఏరియాలను ఏర్పాటు చేశాము. ఆస్పత్రి పరిధిలో పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఎల క్ట్రిక్ షటిల్బస్ సరీ్వసులు నడుపుతున్నాం. రోగు ల నుంచి ఎలాంటి ఫిర్యాదులైనా స్వీకరించి వాటి ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సంతుష్ట్ పోర్టల్‌ను ఏర్పాటు చేశాం, దీనిద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలను అందించే వీలు కలుగుతోంది. ఆస్పత్రిలో రోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సీఎస్ఆర్ నిధులను సమకూర్చుకున్నాం. ఇప్పటికే 15కి పైగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు రూ.150 కోట్లకు పైగా నిధులను సమకూర్చాయి. ఇందులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఏకంగా రూ.108 కోట్లు అందించింది. డిజిటల్ పాలన.. ఎయిమ్స్‌లో పారదర్శకతను పెంచేందుకు వీలుగా పూర్తిగా డిజిటల్ పాలనను అందుబాటులోకి తెచ్చాం. పేపర్‌లెస్‌గా మార్చాలని నిర్ణయించి, ఇప్పటికే ఈ–హాస్పిటల్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నాం. 100 శాతం ఈ–ఆఫీస్ ప్రక్రియతో నడుస్తున్న దేశంలోని మొదటి ఆస్పత్రి ఎయిమ్స్ ఒక్కటే. ఎయిమ్స్‌లో ప్రస్తుతం ఫిజికల్ ఫైల్స్ వినియోగం లేదు. 6 నెలల్లో 17,000 ఈ–ఫైళ్లు, 1.11 లక్షల రసీదులు జారీ చేశాం. డిజిటల్ ప్రొక్యూర్మెంట్ రీఫారŠమ్స్‌లో భాగంగా స్టోర్లలో ఆటోమేషన్, డిజిటల్ ప్రొక్యూర్మెంట్ లైబ్రరీ ఉన్నాయి. ఈ కొనుగోలు విధానంతో సగటు కొనుగోలు ధర 10 శాతం నుంచి 200 శాతం తగ్గింది. దీంతో వార్షిక పొదుపు రూ. 100 కోట్లుగా ఉంది. ఇక నియామకాల్లోనూ పూర్తిగా ఆన్‌లైన విధానమే కొనసాగుతోంది. నోటిఫికేషన్ మొదలు పరీక్ష, నియామకపత్రాల జారీ, అపాయింట్మెంట్ ఆర్డర్ల వరకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో పూర్తి పారదర్శకతను తెచ్చాం. -
Good Governance Day 2022: కలుపుకొని పోవడమే సుపరిపాలన
ఈ రోజు క్రిస్మస్ – యేసు క్రీస్తు పుట్టిన రోజు. ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వం అనే ఆయన బోధనలు మాన వాళికి జీవనాడి లాంటివి. ఈ సందర్భంగా దేశ ప్రజలంద రికీ... ముఖ్యంగా క్రైస్తవ పౌరు లకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు. మన మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా 1924లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇదే రోజున జన్మించడం యాదృచ్ఛికం! ఆయన శాంతి, సహ జీవనం, కరుణ, అందరికీ గౌరవం, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడి ఉన్నారు. కవి, రచయిత, పాత్రికేయుడు, రాజ నీతిజ్ఞుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, దార్శనికుడుగా ప్రసిద్ధులు. వాజ్‌పేయి 1932లో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో ప్రచారక్ అయ్యారు. 1951లో భారతీయ జనసంఘ్‌లో సభ్యత్వం పొందడం ద్వారా అధికారి కంగా రాజకీయాల్లో చేరారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనల ద్వారా ఆయన ఎంతో స్ఫూర్తి పొందారు. 1957లో తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉత్తరప్రదేశ్‌లోని బల్రాంపూర్ నుంచి ఎన్నికై... ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా పార్ల మెంట్లో ఆయన చేసిన చర్చోపచర్చలకు ముగ్ధులై వాజ్‌పేయి తన స్థానాన్ని ‘ఒక రోజు’ ఆక్రమిస్తారని అంచనా వేశారు. 1980లో ఆయన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడయ్యారు.1977లో జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, వివిధ ముఖ్యమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల అధిపతిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి తన అత్యుత్తమ సేవలను అందించారు. ఆయన ‘నేషన్ ఫస్ట్’ అనే విశ్వాసానికి ముగ్ధుడై, అప్పటి ప్రధాని పీవీ నర సింహారావు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయిని ఐక్య రాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించవలసిందిగా కోరారు. దౌత్య విషయాలపై ఆయన సాధికారత అద్భుతమైనది. 1996లో ఆయన బీజేపీ మొదటి ప్రధానమంత్రి అయ్యారు. అతి కొద్దిరోజులే ఆయన ప్రభుత్వం ఉంది. తరువాత 1998లో మళ్లీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పోఖ్రాన్ వద్ద భారత్ రెండో దఫా అణుపరీక్షలను నిర్వహించింది. ఒకవైపు దేశ భద్రతకు కావలసిన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఆయన చూశారు. లాహోర్ బస్సు యాత్ర చేపట్టడం, ఆగ్రా శిఖరాగ్ర సమావేశానికి పర్వేజ్ ముషారఫ్‌ను భారత్‌కు ఆహ్వానించడం వంటివి ఆయన సాహసోపేత విధానంలో కొన్ని మెరుపులు. తర్వాత కార్గిల్ యుద్ధంలో ఆయన నాయకత్వంలో పాక్‌పై విజయం సాధించడం ముదావహం. ప్రధానమంత్రిగా వాజ్‌పేయి మౌలిక వసతులను ఉన్నతీకరించడానికి కృషి చేశారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సరళీకరణ స్ఫూర్తిని ముందుకు తీసుకు పోయి, మరిన్ని భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించడానికి ఏకంగా ప్రత్యేక ‘పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ’ను సృష్టించారు. 6–14 ఏళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందించడానికి ‘సర్వశిక్షా అభియాన్’ను ప్రారంభిం చడం చారిత్రక నిర్ణయం. దేశంలో నదులను అను సంధానించాలనేది ఆయన చిరకాల వాంఛ. ‘స్వర్ణ చతుర్భుజి’ ప్రాజెక్ట్, ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన’ ద్వారా రహదారుల నిర్మాణానికి గొప్ప ఊపునిచ్చారు. అనేక దశాబ్దాలుగా పార్టీలో, పార్లమెంట్లో, అలాగే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సహాధ్యాయిగా ఉన్న నాకు... ఆయన ఒక నిష్ణాతుడైన రాజకీయ నాయకుడిగా, నిస్వార్థ, అంకితభావం ఉన్న నాయకు డిగా తెలుసు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంత రాయం కలిగించే ప్రయత్నానికి ఎప్పుడూ ఆయన మద్దతు ఇవ్వలేదు. లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేస్తూ బిహార్‌లో అరెస్టు అయినప్పుడు నేను పార్ల మెంటు సభ్యుడిగా ఉన్నాను. ఆ సంద ర్భంగా వారం రోజులకు పైగా పార్లమెంట్ కార్య కలాపాలకు అంతరాయం ఏర్ప డింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమా వేశంలో వాజ్‌పేయి మాట్లాడుతూ... ‘పార్ల మెంటు చర్చోప చర్చలకు వేదిక. మనం చర్చకు అనుమతించాలి. మన రాజకీయ పోరాటం పార్లమెంటు వెలుపల జర గాలి...’ అన్నారు. వాజ్‌పేయి దార్శనికతను అందిపుచ్చు కుని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరూ వెనుకబడి ఉండకూడదు అన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ కల త్వరగా సాకారం అవ్వ డానికి సుపరిపాలన అందిస్తున్నారు. జన్‌ధన్–ఆధార్– మొబైల్ అనేవి ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తెచ్చాయి. వాజ్‌పేయి జయంతిని ‘జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా, ప్రజలు, నాయకులు, అధికారులు... దేశం పట్ల భక్తినీ, సమాజం పట్ల గౌరవాన్నీ కలిగి ఉండాలి. బలమైన, ఆరోగ్యకర మైన, అందరినీ కలుపుకొని పోయే దేశ నిర్మాణమే వాజ్‌పేయికి నిజమైన నివాళి. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పరిపాలనతో మాత్రమే భారత్‌ను విశ్వ గురువుగా తీర్చిదిద్ద గలుగుతాం! బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా గవర్నర్ (నేడు జాతీయ సుపరిపాలనా దినోత్సవం) -
10 అడుగుల గోతిలో పాతేస్తా: సీఎం వార్నింగ్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా మాఫియా గ్యాంగ్‌లు, గుండాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన మూడ్ అసలే బాగోలేదని, రాష్ట్రంలో మాఫియాగాళ్లు తట్టా బుట్టా సర్దుకుని వెళ్లాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు ఆపకుంటే పది అడుగుల గోతిలో పాతిపెడతానని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ‘మామా ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లకపోతే.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా 10 అడుగుల గోతిలో పాతి పెడతా’అని ట్విటర్ వేదికగా సీఎం చౌహన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు సమస్యలు లేకుండా ఉన్నప్పుడే అది గుడ్ గవర్నెన్స్ అవుతుందని, అలాంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మారుస్తామని ఆయన పేర్కొన్నారు. చట్టాలను గౌరవించే పౌరుల పట్ల రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పువ్వు మాదిరిగా సున్నితంగా వ్యవహరిస్తుందని, రాక్షసంగా ప్రవర్తించేవారి పట్ల పిడుగులు వర్షం కురిపిస్తుందని అన్నారు. డ్రగ్స్ పెడ్లర్, భూ దందా, చిట్ ఫండ్ మాఫియా, గూండాలు ఇలాంటివారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో పాతుకుని ఉన్న డ్రగ్స్ మాఫియాను మట్టుబెట్టడానికి కేంద్ర సంస్థలతో మంతనాలు జరుపుతున్నామని తెలిపారు. ఇక నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సూచనల మేరకు డ్రగ్స్ మాఫియాపై చర్యల కోసం డిసెంబర్ 15 నుంచి 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు సీఎం చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోందని ఎన్సీబీ తెలిపింది. ముఖ్యంగా మాల్వా, మహాకోషల్ ప్రాంతాల్లో డ్రగ్స్ దందా అధికంగా సాగుతోందని వెల్లడించింది. -
వాజ్‌పేయి ఆలోచనలకు మోదీ పాలనలో పట్టం
పాలకులకు మహత్తర శక్తిని చ్చేది ప్రజాభిప్రాయం. తిరుగు లేని ప్రజాభిప్రాయమే ప్రజా స్వామ్యానికి శ్రీరామరక్ష. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వ మైనా తాను చేసిన మంచి పనుల ఆధారంగా ప్రజల మనసు గెలిచి తిరిగి అధికారంలోకి రావాల నుకోవడం పరిణత ప్రజా స్వామిక లక్షణం. మనదేశంలో 1990ల మధ్యవరకూ కాంగ్రెస్ ప్రభు త్వాలు పలుమార్లు ఏర్పాటయ్యాయి. ఇవి తమ పనితీరు ఆధారంగా కాక, స్వాతంత్య్ర పోరాటానికి తామే నాయకత్వం వహించామని ప్రచారం చేసుకుని సాను భూతి పొందడంతోపాటు, ప్రతిపక్షాల బలహీనతను ఆసరాగా చేసుకుని ఎన్నికవుతూ వచ్చాయి. 1975–77 మధ్యకాలంలో ప్రపంచం నివ్వెరపోయేలా ప్రజా స్వామ్యం పీక నులిమి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యయిక పరిస్థితి ప్రజల మనోభావాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయింది. 1990లో ఆర్థిక సరళీకరణ, రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సాంకేతికత కారణంగా వివిధ సమాచార వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వార్తల్లోని వాస్తవాలను గుర్తించడం మొదలు పెట్టారు. దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న పార్టీలకు తాము అనుకున్నట్టే అంతా జరగాలన్న పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇలాంటి దశలోనే సుపరిపాలనకు మార్గదర్శనం చేసిన భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కేంద్రంలో పగ్గాలు చేపట్టింది. ప్రభుత్వం తాను చేసింది ప్రజలకు చెప్పుకోవడంతోపాటు ప్రజలు కూడా ప్రభుత్వాలు ప్రకటించిన మార్పులు జరిగాయో లేదో తెలుసుకునేందుకు అవకాశం కల్పించ డమే వాజ్‌పేయి సుపరిపాలనకు నిదర్శనం. వ్యూహాత్మక దృష్టి, పారదర్శకతను పెంపొందించడం, ప్రభుత్వాన్ని జవాబు దారీగా నిలబెట్టడం అనే మూడు విస్తృతమైన అంశాలు సుపరిపాలనకు ఆధారం. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా మనం సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాజ్‌పేయి వ్యూహాత్మక దృష్టి కారణంగా మౌలిక వసతుల కల్పన జోరందుకుంది. రహదారుల రంగ చరిత్రగతిని మారుస్తూ, స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా గ్రామాలకు అనుసంధానత పెరిగి ఉపాధి అవకాశాలు ముమ్మరమయ్యాయి. బాల్యదశ నుంచే మానవ వనరుల అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్న ఆలోచనతో సర్వశిక్షా అభియాన్ తెచ్చారు. దీనిద్వారా పాఠశాల విద్యను నిర్ణీతకాల వ్యవధిలో సార్వత్రికంగా మార్చేందుకు ముందడుగు పడింది. పోఖ్రాన్లో అణుపరీక్షలను నిర్వ హించాలన్న భారతదేశ నిర్ణయం, ఆ తర్వాత అణ్వా యుధ వ్యాప్తి నిరోధక కూటమిలో చేరడం వంటివి వాజ్‌పేయి దూరదృష్టి, వ్యూహాత్మక దృష్టికి నిదర్శనాలు. పాలకులు తమ ప్రవర్తన విషయంలో ఎంత బాధ్యతతో వ్యవహరించాలో దశాబ్దాల క్రితమే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాథ్యూ తెలియ జెప్పారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరూ, వారి ప్రవర్తన విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి; తమ పాలకులు చేసే ప్రతి చట్టం గురించి తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంటుందని స్పష్టం చేశారు. 2002 తర్వాతే వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం పారదర్శక పాలనకు మూలస్తంభంలాంటి, సమాచార హక్కు చట్టానికి పూర్వ రంగంలాంటి ద ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 తెచ్చింది. ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారిత్వం దిశగా వాజ్‌పేయి ఎంతో ముందుచూపుతో తీసుకున్న పలు నిర్ణయాలు పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలు కాపా డాయి. ప్రజాధనాన్ని కాపాడటం, దాన్ని సద్వినియోగం చేయడం పాలకుల బాధ్యత. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్, ప్రజాధనం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదనీ, ఉన్నదల్లా పన్ను చెల్లింపుదారుల ధనమేననీ అంటారు. అందువల్ల పన్ను చెల్లింపుదారుల ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన బాధ్యతకు పెద్దపీటవేస్తూ, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టాన్ని తేవడం ద్వారా, వ్యవస్థాగతంగా ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడానికీ, తద్వారా ఆర్థిక లోటును క్రమంగా తగ్గించడానికీ ప్రయత్నం జరిగింది. వాజ్‌పేయి సుపరిపాలనా విధానాల ప్రభావం, నరేంద్ర మోదీ మొదటి, రెండవ విడత ప్రభుత్వాలపై స్పష్టంగా కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ ఒప్పందాన్ని చట్ట రూపంలో తేవడం, ఆర్టికల్ 370ని విజయవంతంగా రద్దు చేయడం, మహిళలకు, షెడ్యూలు కులాలకు, గిరిజనులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను పక్కనపెట్టడం ఇందుకు నిదర్శనం. అందరికీ సమాన అవకాశాలు, ఒకేరకమైన చట్టాలు వర్తించే అంశాలపై ప్రధానమంత్రి దృష్టిపెట్టడం వాజ్‌పేయి సుపరిపాలనా విధానంలోని మరో కోణాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంగా చెప్పుకోవచ్చు. జన్‌ధన్ యోజన వంటి విప్లవాత్మక చర్యలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 2.57 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని 70 కోట్లకుపైగా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ అయ్యేట్టు చూడటం జరిగింది. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా పేదలకు ప్రభుత్వం నేరుగా సహాయం చేయగలిగింది. ప్రజలకు జవాబుదారీగా ఉండటం, పారదర్శక పాలన, మెరుగైన శాసన విధానాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారాయి. కాలం చెల్లిన చట్టాలు ఎన్నింటినో మోదీ సర్కారు రద్దుచేసింది. మోదీ పిలుపునిచ్చిన సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదం సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం. జి.కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నేడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి; సుపరిపాలన దినోత్సవం -
కేంద్ర ప్రభుత్వ కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నూతన సంవత్సర క్యాలెండర్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘నా దేశం మారుతోంది. మరింతగా పురోగమిస్తోంది’ అనే థీమ్‌తో ఈ కొత్త క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ క్యాలెండర్‌కు సంబంధించిన యాప్‌ను సైతం ప్రారంభించారు. క్యాలెండర్లో ఒక్కో పేజీని ఒక్కో థీమ్‌లో డిజైన్ చేశారు. సెప్టెంబర్ నెల పేజీని ‘నగదురహిత లావాదేవీలు’ థీమ్‌తో రూపొందించారు. డిసెంబర్ 25న ‘గుడ్ గవర్నెన్స్ డే’ను పురస్కరించుకుని ఆ రోజున 100 రోజుల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతామని వెంకయ్య ప్రకటించారు. ఆ రోజు కేంద్రమంత్రులు, ఎంపీలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సందర్శించి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తారు. -
దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
పనాజీ: సుపరిపాలన దినోత్సవంపై ఇంకా తాము ఏ నిర్ణయం తీసుకోలేదని గోవా ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 25 క్రిస్టమస్ డే కాగా, అదే రోజును దేశ వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల పలువురు క్రైస్తవులు, క్రైస్తవ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, క్రైస్తవులు అధికంగా ఉండే గోవాలో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అక్కడి ప్రతిపక్షాలు దీన్నే ప్రధాన అంశంగా తీసుకొని బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించగా దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ బదులిచ్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తాము ఇంకా ఏం నిర్ణయించుకోలేదని తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ పుట్టిన రోజును సుపరిపాలన దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. -
తుపానుకు ముందు... ఎస్సెమ్మెస్
న్యూఢిల్లీ: తుపాను, సునామీ లాంటి వాతావరణ ఉపద్రవాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఎస్సెమ్మెస్‌ల ద్వారా హెచ్చరించే కొత్త విధానాన్ని కేంద్రం గురువారం ప్రారంభించింది. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దీనిని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎస్సెమ్మెస్ ద్వారా కేవలం సమాచారమివ్వడమే కాకుండా ఉపద్రవాల సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై సూచనలు కూడా ఇస్తారని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి ఒక ఏడాది సమయం పడుతుందన్నారు. ఎస్సెమ్మెస్ హెచ్చరికలు కావాలనుకునే వారు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన తెలిపారు. -
'మంచి నిర్ణయానికి జాప్యం తగదు'
విశాఖపట్నం: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. సుపరి పాలన దినోత్సవంలో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఉండకూడదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. స్మార్ట్ సిటీ అంశంపై త్వరలో విశాఖలో సదస్సు నిర్వహిస్తామన్నారు, విశాఖను నౌకాయాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అమెరికా సాంకేతిక సహకారంతో వైజాగ్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. -
వాజ్‌పేయికి మోదీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ గురువారం ఉదయం వాజ్‌పేయి 90వ జన్మదినం సందర్భంగా మోదీ గురువారం ఉదయం ఆయన నివాసాని వెళ్లారు. అలాగే వాజ్‌పేయికి బీజేపీ అగ్రనేతలతో పాటు పలువురు రాజకీయ నాయకుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు వాజ్‌పేయి జన్మదినోత్సవం సందర్భంగా గుడ్ గవర్నెన్స్ డే జరపాలని ఎన్డీయే సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించమని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో నేడు పర్యటించనున్నారు. అస్సీ ఘాట్‌లో మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. -
'క్రిస్టియన్ మనోభావాలను దెబ్బతీయడమే'
హైదరాబాద్: క్రిస్మస్ రోజన కేంద్రం గుడ్ గవర్నెన్స్ డే జరపడం సముచితం కాదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ చర్య క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, వారికి అభద్రతను కల్పిచడమే అని ఆయన బుధవారమిక్కడ అన్నారు. వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వటం సంతోషమేనన్నారు. అయితే బీజేపీ రాజ్యాంగ సెక్యులరిజంకు కట్టుబడకుండా ...లౌకిక తత్వానికి భంగం కల్పించేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని రఘువీరా వ్యాఖ్యానించారు. అటువంటి మతవాద ధోరణులపై టీడీపీ ప్రశ్నించటం లేదని ఆయన మండిపడ్డారు. లౌకిక తత్వానికి భంగం కలుగుతున్నా మౌనంగా ఉండటం ప్రమాదకరమేనని రఘువీరా అన్నారు. -
‘గుడ్ గవర్నెన్స్ డే’పై దుమారం
* క్రిస్మస్ రోజు స్కూళ్లు తెరిచి ఉంచాలని సర్క్యులర్ జారీ * పార్లమెంట్లో ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు * సీబీఎస్ఈ సర్క్యులర్ ఏదీ జారీ చేయలేదని ప్రభుత్వం వివరణ.. * క్రిస్మస్ రోజు పాఠశాలలకు సెలవేనని స్పష్టీకరణ న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ రోజైన డిసెంబర్ 25ని గుడ్ గవర్నెన్స్ డేగా జరపాలని, ఆ రోజున స్కూళ్లను తెరిచి ఉంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) శాఖకు అనుబంధంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్) జారీ చేసిన సర్క్యులర్ దుమారం రేపింది. సోమవారం పార్లమెంట్లో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. వివాదానికి తెరదించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడింది. డిసెంబర్ 10న జారీ చేసిన సర్క్యులర్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టినరోజు, మదన్మోహన్ మాలవ్య జయంతి సందర్భంగా డిసెంబర్ 25న విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించేలా క్విజ్, ఉపన్యాస పోటీలు, గుడ్ గవర్నెన్స్‌కు సంబంధించిన డాక్యుమెంటరీల ప్రదర్శన నిర్వహించాలని ఎన్వీఎస్ తన అధీనంలోని పాఠశాలలను ఆదేశించింది. తమ పరిధిలోని అన్ని జేఎన్‌వీల్లో గుడ్ గవర్నెన్స్ డే జరపాలని ఎన్వీఎస్ కమిషనర్ జీఎస్ బోత్యల్ అన్ని జేఎన్వీలకు సర్క్యులర్ జారీ చేశారు.ఈ సర్క్యూలర్‌పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, అన్నా డీఎంకే, వామపక్ష సభ్యులు ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రిస్మస్ రోజు స్కూళ్లు తెరిచి ఉంచాలని చెప్పడం ప్రమాదకరమని, ఇది సమర్థనీయం కాదని, దీనిని ఉపసంహరించుకోవాలని అన్నాయి. ఇది క్రైస్తవుల మతపరమైన హక్కులపై దాడి చేయడం లాంటిదని సీపీఎం అభివర్ణించింది. లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. డిసెంబర్ 25న జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ)తో పాటు అన్ని స్కూళ్లు మూసే ఉంటాయని, దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని అన్నారు. ‘డిసెంబర్ 25న స్కూళ్లు తెరిచి ఉంచాలని సీబీఎస్ఈ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అన్ని స్కూళ్లకు షెడ్యూల్ ప్రకారమే క్రిస్మస్ సెలవులు ఉంటాయని సీబీఎస్ఈ వివరణ ఇచ్చింది’’ అని హెచ్చార్డీశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చిన్నారులు, విద్యార్థులను సెలవులకు దూరం చేసేలా లేదా వారి మతానికి చెందిన వేడుకల్లో పాల్గొనకుండా చేసే ఉద్దేశం తమకు లేదంది. గుడ్ గవర్నెన్స్ డే కోసం మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని ఆ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. పోటీలను జేఎన్వీలు స్వచ్ఛందంగా చేపట్టాయన్నారు. మతమార్పిడిలపై అట్టుడికిన రాజ్యసభ.. మతమార్పిడి అంశంపై సోమవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోయాయి. చర్చ జరపాలని, ప్రధాని సమాధానమివ్వాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే చర్చకు అంగీకరించిన ప్రభుత్వం.. హోంమంత్రి రాజనాథ్ సింగ్ చర్చకు సమాధానమిస్తారని ప్రకటించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. చర్చిలకు అదనపు భద్రత అలీగఢ్: డిసెంబర్ 25న అలీగఢ్‌కు చెందిన ఓ సంస్థ భారీ స్థాయిలో మతమార్పిడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు చర్చిలకు భద్రత కల్పించాలని అలీగఢ్‌లోని క్రైస్తవ సంఘాలు పోలీసులను కోరాయి. కాగా, శారదా చిట్ స్కామ్‌లో పశ్చిమబెంగాల్ మంత్రి మదన్ మిత్రా అరెస్టుకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ భవనం ఎదుట నిరసనకు దిగారు. రాయ్‌బరేలీలో మతమార్పిడి చేస్తాం: వీహెచ్‌పీ లక్నో: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో మైనారిటీలను హిందూ మతంలోకి తీసుకొస్తామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రకటించింది. 60 ముస్లిం, క్రైస్తవ కుటుంబాలను జనవరిలో మతం మార్పించబోతున్నట్లు వీహెచ్‌పీ రాయ్‌బరేలీ జిల్లా చీఫ్ హరీష్చంద్రశర్మ వెల్లడించారు. తిరిగి సొంత ఇంటికి(హిందూ మతం) రావడానికి వారు సిద్ధంగా ఉన్నారన్నారు.