కేంద్ర ప్రభుత్వ కొత్త క్యాలెండర్‌ ఆవిష్కరణ | The invention of the central government's new calendar | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ కొత్త క్యాలెండర్‌ ఆవిష్కరణ

Published Fri, Dec 23 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

కేంద్ర ప్రభుత్వ కొత్త క్యాలెండర్‌ ఆవిష్కరణ

కేంద్ర ప్రభుత్వ కొత్త క్యాలెండర్‌ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నూతన సంవత్సర క్యాలెండర్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘నా దేశం మారుతోంది. మరింతగా పురోగమిస్తోంది’ అనే థీమ్‌తో ఈ కొత్త క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ క్యాలెండర్‌కు సంబంధించిన యాప్‌ను సైతం ప్రారంభించారు. క్యాలెండర్‌లో ఒక్కో పేజీని ఒక్కో థీమ్‌లో డిజైన్ చేశారు. సెప్టెంబర్‌ నెల పేజీని ‘నగదురహిత లావాదేవీలు’ థీమ్‌తో రూపొందించారు. డిసెంబర్‌ 25న ‘గుడ్‌ గవర్నెన్స్  డే’ను పురస్కరించుకుని ఆ రోజున 100 రోజుల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతామని వెంకయ్య ప్రకటించారు. ఆ రోజు కేంద్రమంత్రులు, ఎంపీలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సందర్శించి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement