న్యూఢిల్లీ: తుపాను, సునామీ లాంటి వాతావరణ ఉపద్రవాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఎస్సెమ్మెస్‌ల ద్వారా హెచ్చరించే కొత్త విధానాన్ని కేంద్రం గురువారం ప్రారంభించింది. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దీనిని ఢిల్లీలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎస్సెమ్మెస్ ద్వారా కేవలం సమాచారమివ్వడమే కాకుండా ఉపద్రవాల సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై సూచనలు కూడా ఇస్తారని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి ఒక ఏడాది సమయం పడుతుందన్నారు. ఎస్సెమ్మెస్ హెచ్చరికలు కావాలనుకునే వారు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన తెలిపారు.
తుపానుకు ముందు... ఎస్సెమ్మెస్
Published Fri, Dec 26 2014 1:09 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM
Advertisement