Harshvardhan
-
వీధికెక్కిన సినీ జంట
యశవంతపుర: తన భార్య వేధిస్తోందంటూ కన్నడ నటి శశికళపై భర్త, సినీ దర్శకుడు టీజీ హర్షవర్ధన్ బెంగళూరు విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. 2021లో ఓ సినిమా షూటింగ్లో శశికళ, హర్షవర్దన్‌కు పరిచయమైంది. తరువాత ఇద్దరూ ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించారు. కొన్నిరోజుల తరువాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి, తమ ఫోన్ సంభాషణలను రికార్డ్ చేసి బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదని నాగరభావిలోని ఆఫీసుకు వచ్చి కారంపొడి చల్లి దాడి చేసింది. 2022లో ఆమె ఫిర్యాదు చేయగా అన్నపూర్ణేశ్వరినగర పోలీసులు తనను అరెస్టు చేశారన్నారు. సినిమా రంగంలో లేకుండా చేస్తానని బెదిరించిందన్నారు. చివరకు 2022 మార్చిలో శశికళను వివాహం చేసుకున్నాను. కొద్ది రోజులకు కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు మా ఇంటికి వచ్చేవారు. అదేమని ప్రశ్నించినందుకు నన్ను బయటకు పంపి, రెండు గంటల తరువాత మళ్లీ ఇంటిలోకి రానిచ్చేది. ఇలా అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తోందని, ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని ఫిర్యాదులో తెలిపాడు. పోలీసులు శశికళతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
హిట్ అండ్ రన్ కేసులో సినీహీరో హర్షవర్ధన్ అరెస్ట్
బంజారాహిల్స్: హిట్ అండ్ రన్ కేసులో సినీ హీరో సాధుల హర్షవర్ధన్‌తో పాటు అతడి స్నేహితుడు మాడే సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజను బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సమీపంలో శనివారం తెల్లవారుజామున అతి వేగంగా వచి్చన కారు ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడ నిద్రిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..నిజామాబాద్ అర్బన్‌కు చెందిన హర్షవర్దన్ సినిమా హీరోగా నటిస్తూ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–13లోని ఓ అపార్ట్మెంట్లో తన స్నేహితులు మాడే సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ, వంశీ, రాకేష్‌తో కలిసి ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగిన రాకేష్ తనను పికప్ చేసుకోవాలని ఫోన్ చేయడంతో హర్షవర్ధన్‌కు చెందిన కారులో బయలుదేరిన తేజ, కార్తీక్ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 మీదుగా వేగంగా దూసుకెళ్తూ హిట్ అండ్ రన్‌కు పాల్పడ్డారు. తేజ కారు నడుపుతుండగా, కార్తీక్ పక్కన కూర్చున్నాడు. ఈ ఘటనతో భయాందోళనకు లోనైన తేజ, కార్తీక్‌తో పాటు గదిలో ఉన్న హర్షవర్ధన్, వంశీ తదితరులు కూడా పరారయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా మిస్టరీ వీడింది. కారు హర్షవర్దన్ది కాగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తేజ కారు నడిపి ఈ ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ నేపథ్యంలో కారు ఇచి్చన హర్షవర్ధన్‌తో పాటు నడిపిన తేజపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కేఎం రాఘవేంద్ర కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేబీసీ తొలి విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?
బాలివుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి (Kaun Banega Crorepati)లో హర్షవర్ధన్ నవాతే తొలి కోటీశ్వరుడిగా చరిత్ర సృష్టించి 25 ఏళ్లు అయింది. 2000లో తన విజయం ఆయన జీవితాన్ని మార్చడమే కాకుండా దేశం వ్యాప్తంగా అనేక మందికి కేబీసీ వేదిక అయ్యేందుకు తోడ్పడింది. ప్రస్తుతం హర్షవర్ధన్ కార్పొరేట్ ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ప్రభావవంతమైన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆధ్వర్యంలోని జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌కు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.కెరీర్ ప్రయాణం ఇలా..కేబీసీలో అద్భుత విజయం తర్వాత హర్షవర్ధన్ జీవితం నాటకీయ మలుపు తిరిగింది. మొదట్లో ఐఏఎస్(IAS) కావాలనుకున్న ఆయన కేబీసీలో విజేతగా నిలిచిన తర్వాత తన దృష్టిని కార్పొరేట్ రంగం వైపు మళ్లించారు. మహీంద్రా గ్రూప్‌తో సహా ప్రఖ్యాత సంస్థల్లో కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్‌బిలిటీ హెడ్‌గా పలు కీలక పదవులు నిర్వహించారు. అంకితభావం, వ్యూహాత్మక దార్శనికత ఆయనకు పరిశ్రమలో గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌కు సీఈఓగా..డిసెంబర్ 2024లో హర్షవర్ధన్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సామాజిక అభివృద్ధి విభాగమైన జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ విభాగంలోని ఇతర కమ్యూనిటీలకు సాధికారత కల్పించేందుకు, దేశం అంతటా సుస్థిర అభివృద్ధిని పెంపొందించడానికి సంస్థ విధానాలను పాటిస్తానని హామీ ఇచ్చారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial)ఇదీ చదవండి: నెలలో 8.2 లక్షల క్రెడిట్ కార్డులు జారీవ్యక్తిగత జీవితంహర్షవర్ధన్ భార్య సారిక, ఇద్దరు కుమారులతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. బిజీ ప్రొఫెషనల్ లైఫ్ ఉన్నప్పటికీ తాను సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ అప్పటి కేబీసీ విజయంపై తన ఆలోచనలను పంచుకున్నారు. ‘ఆ విజయం నా జీవితంలో మరవలేనిది. నేనీ స్థానంలో ఉన్నానంటే ఆ కార్యక్రమం వల్లే’అని చెప్పారు. ఇన్నేళ్లుగా ప్రజల నుంచి తనకు లభిస్తున్న గుర్తింపు, ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. క్విజ్ షో కంటెస్టెంట్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా హర్షవర్ధన్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంది. -
ఈ సినిమాను మనసు, మైండు పెట్టి తీశాను: హర్షవర్ధన్
-
పెళ్లి పేరుతో నటికి దగ్గరై మోసం చేసిన నిర్మాత!
సాక్షి, బనశంకరి (కర్ణాటక): వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ కన్నడ నటిని మోసం చేసిన కేసులో నిర్మాత హర్షవర్దన్‌ను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్న ఓ మహిళతో హర్షవర్దన్ ప్రేమ వ్యవహారం నడిపించి పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. బాధితురాలు వివాహం చేసుకోవాలని డిమాండ్ చేయడంతో బెదిరింపులకు దిగాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. -
‘భారత్‌లో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్’
న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భారత్‌లో వచ్చే ఏడాది జనవరిలో కరోనా వైరస్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చేపడతామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది జనవవరిలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టనున్నాం. జనవరి నెల ఏ వారంలో అయిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావొచ్చు. ఇందుకు సంబంధించి రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్ లేవల్స్ వారిగా టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 206 జిల్లాల నుంచి దాదాపు 20 వేల మందికి శిక్షణ ఇచ్చాం. అయితే వీటన్నింటి కంటే ముందు వ్యాక్సిన్ భద్రతకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న పలు అనుమానాలను దూరం చేయడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. అయితే ప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వడం మా బాధ్యత. కానీ ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే.. వారిని బలవంతం చేయం’ అని తెలిపారు. (చదవండి: 6 నెలల్లో 30 కోట్ల మందికి టీకా) ఇక మహమ్మారి అత్యంత చెత్త దశ ముగిసింది అని భావిస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు హర్షవర్ధన్ సమాధానమిస్తూ.. ‘ముగిసిందనే అనుకుంటున్నాను. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు లక్షల యాక్టీవ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఇవి 10 లక్షలుగా ఉండేవి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు కోటి దాటితే.. 95 లక్షల మంది కోలుకున్నారు. ప్రపంచంలో మన దగ్గరే అత్యధిక రికవరీ రేటు నమోదయ్యింది’ అన్నారు. అయినప్పటికి జనాలు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను పాటించడం మరవకూడదు. ఈ విషయంలో మనం ఎలాంటి సడలింపులు ఇవ్వదల్చుకోలేదు అన్నారు హర్షవర్ధన్. -
‘మెడికల్’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య విద్యకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తున్న ఈ బిల్లులో.. అవినీతికి ఆలవాలంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పొందుపర్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ బిల్లును ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956’కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. ‘నకిలీ వైద్యులకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ఉంది. తప్పుడు వైద్య విధానాలకు పాల్పడేవారికి సంవత్సరం జైలుశిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన బిల్లులో ఉంది. ఇప్పటివరకు అలాంటివారికి ఎంసీఐ నామమాత్రపు జరిమానా మాత్రమే విధించేది’ అని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన మూడేళ్లలో నెక్ట్స్(నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)ను నిర్వహించడం ప్రారంభిస్తామన్నారు. ఎన్ఎంసీలో రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్న ఎంపీల విమర్శలపై స్పందిస్తూ.. మొత్తం 25 మంది సభ్యుల్లో 11 మంది రాష్ట్రాల ప్రతినిధులేనన్నారు. నెక్ట్స్గ్ పరీక్షను మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షగా, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తామన్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ల(సీహెచ్‌పీ) వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ వ్యవస్థను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా ఆ దిశగా వెళ్తోందని చెప్పారు. ఎన్‌ఎంసీలోని 25 మంది సభ్యుల్లో 21 మంది వైద్యులేనని, వారు సీహెచ్పీల అర్హతలను నిర్ణయిస్తారని హర్షవర్ధన్ వివరించారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. వైద్య విద్య అభ్యసించని 3.5 లక్షలమంది నాన్ మెడికల్ సిబ్బందికి ఆధునిక వైద్యం అందించే వైద్యులుగా లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ వ్యతిరేకించారు. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికిపైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది. ► కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ► కొత్త కమిషన్‌లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫా ర్మా, హెచ్ఆర్డీ శాఖలే సిఫారసు చేస్తాయి. ► ఎంసీఐ సమావేశం కావాలంటే వందమందికిపైగా ఉన్న సభ్యుల్లో 15 మంది హాజరైతే సరిపోయేది. వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి. జాతీయ వైద్య కమిషన్‌కు సంబంధించి 25 మందిలో 13 మంది హాజరైతేనే కీలక నిర్ణయాలు తీసుకోగలరు. ► ఎన్ఎంసీ సభ్యులందరూ విధిగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాలి. ► ఎంసీఐ కాలపరిమితి అయిదేళ్లయితే ఎన్ఎంసీ కాలపరిమితి నాలుగేళ్లు. తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు. ► కమిషన్ చైర్మన్‌ను, అందులో సభ్యుల్ని తొలగించే అధికారం పూర్తిగా కేంద్రానిదే. ► ఎంబీబీఎస్, మెడికల్ పీజీకి సంబంధించి అన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది. ► వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు. దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో నిర్వహిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌కి హాజరుకావాలి. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వైద్యవిద్యనభ్యసించాలంటే ఇకపై నీట్‌తో పాటు గా నెక్ట్స్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. ► దేశంలోని హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు కూడా ఒక బ్రిడ్జ్ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యాన్ని చేయవచ్చు. -
ఎన్ఐఏ విచారణ.. పత్తా లేకుండా పోయిన హర్షవర్ధన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నాయకుడు, విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఎన్ఐఏ విచారణకు గైర్హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా విశాఖలోని కైలాసగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఎన్ఐఏ అధికారులు 3 రోజులుగా సాక్షులను విచారిస్తున్నారు. హత్యాయత్నం జరిగిన గతేడాది అక్టోబర్ 25న ఘటనాస్థలంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ నోటీసులు పంపగా.. వైఎస్సార్సీపీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్ 2 రోజులక్రితం హాజరయ్యారు. నోటీసులందుకున్న మిగతా వైఎస్సార్సీపీ నేతలు సైతం 2 రోజుల్లో విచారణకు హాజరవుతామని సమాచారమిచ్చారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నేత, ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి మాత్రం పత్తా లేకుండా పోయారు. ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరుకావాలంటూ ఎన్ఐఏ అధికారులు ఆయన ఇంటికి నోటీసులు పంపినట్టు సమాచారం. గురువారం ఆయన హాజరుకావొచ్చని భావించారు. నిజానికి ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందని, హర్షవర్ధన్ చౌదరికి తెలియకుండా శ్రీనివాసరావు.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసేంతటి ఘాతుకానికి తెగబడడన్న వాదనలు బలంగా వినిపించినా.. పోలీసులు, సిట్ అధికారులు హర్షవర్ధన్ జోలికే పోలేదు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏవిచారణకు హర్షవర్ధన్ చౌదరి హాజరైతే కీలక సమాచారం రాబట్టవచ్చన్న వాదనలు వినిపించాయి. దీంతో గురువారమే హర్షవర్ధన్ విచారణకు హాజరు కావొచ్చన్న ప్రచారంతో పెద్దఎత్తున మీడియా ఎన్ఐఏ తాత్కాలిక కార్యాలయం వద్ద గుమిగూడింది. అయితే హర్షవర్ధన్ సహా రెస్టారెంట్లో పనిచేసే సిబ్బంది ఎవ్వరూ హాజరుకాలేదు. పైగా హర్షవర్ధన్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతోపాటు కొద్దిరోజులుగా పత్తా లేకుండా పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి యనమల నగరానికి వచ్చినప్పుడు హల్చల్ చేశాడని, ఆ తర్వాత నుంచి కానరావట్లేదని టీడీపీ నేతలే చెప్పుకొస్తుండడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల అండతోనే హర్షవర్ధన్ పత్తా లేకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఎన్ఐఏ వర్గాలు మాట్లాడుతూ.. ఒకటి, రెండు రోజులు చూసి అప్పటికీ హర్షవర్ధన్ విచారణకు రాకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పాయి. -
‘హర్షవర్ధన్‌కు ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఒత్తిడి’
-
‘హర్షవర్ధన్‌కు ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు ఒత్తిడి’
సాక్షి, చిత్తూరు : ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు తనపై తీవ్రస్తాయిలో ఒత్తిడి తెచ్చారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్కే పురుషోత్తం తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్షవర్ధన్‌కు కొన్నేళ్లుగా టీడీపీతో సంబంధముందన్నారు. హర్షవర్ధన్‌కు గాజువాక అసెంబ్లీ సీటు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని, అది కుదరకపోవడంతో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని భావించారని పేర్కొన్నారు. ( వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే! ) ఇదే అంశంపై సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజమౌళి అనేకసార్లు తనకు ఫోన్ చేశారన్నారు. హర్షవర్ధన్‌కు అర్హత లేకపోయినా.. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష బాధతలు అప్పగించాలని సీఎం ప్రయత్నించారని తెలిపారు. అసోసియేషన్‌తో సంబంధం లేకపోయినా సీఎంతో కలిసి ఒలింపిక్ అసోసియేషన్ కార్యక్రమాల్లో హర్షవర్ధన్ చాలా సార్లు పాల్గొన్నారని పేర్కొన్నారు. (చదవండి: శ్రీనివాస్ ఫ్లాట్‌లోని వేరే గదిలో ఇద్దరమ్మాయిలు! ) -
జ్ఞానాన్ని సంపదగా మార్చాలి
లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: జ్ఞానాన్ని సంపదగా మార్చడం దేశానికి అత్యవసరమైన విషయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ మార్పు నకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. సోమవారం లక్నోలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2018 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో రైతులను ఇంధన వనరుల ఉత్పత్తి వైపు మళ్లిస్తే అటు దేశానికి చమురు దిగుమతుల భారం తగ్గడం మాత్రమే కాకుండా, రైతులకు మంచి ఆదాయం కూడా లభిస్తుందన్నారు. రానున్న ఐదేళ్లలో బయో ఇథనాల్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయల వరకూ ఉంటుందన్నారు. వెదురు, ఇతర ఆహారేతర వనరుల నుంచి ఇథనాల్ ఉత్పత్తి ద్వారా రైతులు లబ్ధి పొందాలని సూచించారు. తగిన సాంకేతికత అందుబాటులో ఉంటే సాధించలేనిది ఏదీ లేదని స్పష్టం చేశారు. రవాణా రంగంలో కేంద్రమంత్రిగా తాను తీసుకున్న చర్యల వల్ల దేశానికి వందల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నడిచే ‘సైన్స్ ఇండియా’ వెబ్‌సైట్‌ను గడ్కరీ ఆవిష్కరించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి ‘జై విజ్ఞాన్’ జోడిస్తే.. ఇప్పుడు దీనికి ‘జై అనుసంధాన్’ కూడా చేర్చాలని సూచిం చారు. పాఠశాలలు, విద్యార్థులు నేరుగా ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో తమ ఆలోచనలను పంచుకునేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, విజ్ఞాన భారతి అధ్యక్షుడు డాక్టర్ విజయ్ భాస్కర్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన సైన్స్ కుంభమేళా.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల ఫలాలను దేశం నలుమూలలకు చేర్చే లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ ఎఫ్) సంబరాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా ఈ నెల 5న మొదలైన ఈ ఉత్సవాలకు సుమారు 13 వేల మంది హాజరైనట్టు అంచనా. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 2,300 కాగా, మిగతావారిలో ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామి కవేత్తలు ఉన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, వాయు కాలుష్యం, శాస్త్ర ప్రపంచంలో మహిళల పరిస్థితి వంటి 23 అంశాలపై చర్చలు జరిగాయి. సీఎస్ఐఆర్, డీఆర్డీవో, వేర్వేరు ప్రభుత్వ సంస్థలు ఆయా రంగా ల్లో సాధించిన విజయాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఐఐఎస్ఎఫ్ ఉత్సవాలను వచ్చే ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
కార్డియో వాస్కులర్‌కు సూదిమందు
మన శాస్త్రవేత్తలు కనుగొన్నారన్న కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్థన్ బ్యాక్టీరియాను తట్టుకునే వరి వంగడాన్ని సీసీఎంబీ తయారు చేసినట్లు వెల్లడి సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తల కృషితో డీజిల్‌తో నడిచే చిన్న ట్రాక్టర్ తయారీ రాష్ట్రాల పాత్రికేయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రెస్‌మీట్ సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కార్డియో వాస్కులర్ వ్యాధులకు సూదిమందు రూపంలో ప్రొటీన్ అందించి ప్రాణాలు కాపాడే ఔషధాన్ని మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి డాక్టర్ హర్షవర్థన్ వెల్లడించారు. సీఎస్ఐఆర్కు చెందిన శాస్త్రవేత్తలు గుండె నాళాల్లోని రక్తపు గడ్డలను తొలగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి(క్లాట్లను తొలగించే స్ట్రెప్టోకినేస్) రూపకల్పన చేశారని తెలిపారు. క్లాట్ల ఆధారిత త్రాండోలిటిక్ ఔషధానికి ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిందని, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. క్లాట్లను కరిగించే కొత్త తరానికి చెందిన ఔషధాలనూ తయారుచేశారన్నారు. దేశీయం గా తయారైన ఈ స్ట్రెప్టోకినేస్ అందరికీ అందుబాటు ధరలో ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాత్రికేయులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఢిల్లీ నుంచి మాట్లాడారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తన మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను హర్షవర్థన్ వెల్లడించారు. మధుమేహ చికిత్స కోసం వనమూలికలతో తయారైన బీజీఆర్-34 ఫార్ములేషన్‌కు ఆయుష్ శాఖ అనుమతి లభించిందని, దీన్ని వాణిజ్యపరంగా తయారుచేసేందుకు ఢిల్లీకి చెందిన ఒక కంపెనీకి లెసైన్స్ ఇచ్చామన్నారు. ఒక్కోటి రూ.5 ఉండే ఈ మూలికా ఔషధంతో తయారైన మాత్రలను ఇప్పటికే ఉత్తర భారతంలో కొన్నిచోట్ల విడుదల చేశామన్నారు. అతిసారను నిరోధించి పిల్లల జీవితాలను కాపాడే మరో కీలక ఔషధం రోటావైరస్ వ్యాక్సిన్ దేశీయంగానే తయారైందన్నారు. దీనివల్ల ఏటా ఐదు లక్షల మంది పిల్లల ప్రాణాలు అతిసారానికి బలికాకుండా కాపాడవ చ్చన్నారు. బ్యాక్టీరియాను తట్టుకునే సాంబమసూరి.. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ), వరి పరిశోధన డెరైక్టరేట్(డీఆర్ఆర్) శాస్త్రవేత్తలు ఉమ్మడిగా బ్యాక్టీరియాను తట్టుకునే వరి వంగడం ‘సాంబమసూరి’ని అభివృద్ధి చేశారని హర్షవర్థన్ తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడుల్లో 90 వేల హెక్టార్లలో పండిస్తున్నారన్నారు. వివేక్ 9 పేరిట అధిక ప్రొటీన్, అధిక ప్రో విటమిన్ ఏ ఉన్న హైబ్రీడ్ మొక్కజొన్న వంగడాన్ని విడుదల చేశామన్నారు. రూ.2 లక్షల ధరలోనే అందుబాటులో ఉండే 11.2 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన చిన్న డీజిల్ ట్రాక్టర్‌ను సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారన్నారు. వచ్చే మూడేళ్ల కాలాన్ని జనవిజ్ఞాన్ యుగంగా మంత్రి అభివర్ణించారు. ప్రధాని నాయకత్వంలో పలు ప్రాజెక్టులను రూపొందించామన్నారు. దేశంలో 15 వ్యవసాయ వాతావరణ జోన్లలో దశలవారీగా ‘బయోటెక్-కిసాన్’ అమలు చేయబోతున్నామన్నారు. చిన్నసన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక అంశాలను అనుసంధానం చేస్తూ చేపడుతోన్న ప్రాజెక్టు ఇదన్నారు. 2015 మార్చిలో రూ.4,500 కోట్లతో కేంద్రం సూపర్ కంప్యూటింగ్ మిషన్‌కు అనుమతిచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 70 అత్యున్నత సామర్థ్యం కలిగిన కంప్యూటింగ్ వసతులు ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత కంప్యూటింగ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయడం దీని లక్ష్యమన్నారు. రెండేళ్లుగా వాతావరణం, తుపాన్ల గుర్తింపు నైపుణ్యాల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఇచ్చిన ప్రమాద హెచ్చరికల వల్ల వర్షపాతం సాంద్రత, తుఫాన్ తీరాన్ని తాకే సమయాన్ని చక్కగా గుర్తించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రజల ప్రాణాలు కాపాడగలిగారని హర్షవర్థన్ పేర్కొన్నారు. -
బాధితులకు వెంకయ్య కుమారుడు చేయూత
-
'వాళ్లు నిండుగా బతకాలి'
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్, బీజేపీ నేత డాక్టర్ హర్షవర్దన్ నిండు జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం వారి జన్మదినం సందర్భంగా మోదీ వారికి జన్మదిన శుభాకాంక్షలను ట్విట్టర్లో తెలిపారు. ఈ సందర్బంగా వారిద్దరి వ్యక్తిత్వాలను మోదీ కొనియాడారు. 'వారి స్వభావమేకాదు పరిపాలన తీరు కూడా చాలా హుందాగా ఉంటుంది. కష్టపడుతూ ఇష్టంగా పనిచేస్తారు. వారు సుదీర్ఘంగా బతకాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని తెలిపారు. -
విద్యార్థి గల్లంతు
గంగ కాలువలో మునిగిపోయిన బాలుడు సత్యవేడు: తెలుగుగంగ కాలువలో పడి గురుకుల పాఠశాల విద్యార్థి గల్లంతైన సంఘటన సత్యవేడులో ఆదివారం చోటుచేసుకుంది. సత్యవేడులోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో సదుం మండలం పొలికిమాకులపల్లికి చెందిన ఎస్.ధరణీశ్వర్ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆదివారం ఉదయం ఆరు గంటలకు వ్యాయామం అనంతరం కాలకృత్యాలు తీర్చుకునేందుకు స్నేహితులైన హర్షవర్ధన్ (6వతరగతి), జగదీష్(5)తో కలిసి పాఠశాల వెనుకవైపునున్న తెలుగుగంగ కాలువ వద్దకు వెళ్లారు. నీరు తెచ్చుకోకపోవడంతో కాలకృత్యాల అనంతరం ధరణీశ్వర్ గంగ కాలువలో దిగాడు. కాలుజారి కాలువలో పడిపోయాడు. కాలువలోని చిన్నపాటి చెట్టును పట్టుకుని కేకలు వేశాడు. ఈ విషయాన్ని గమనించిన మిగిలిన ఇద్దరు పిల్లలు అరచినా అక్కడ ఎవరూ లేకపోవడంతో లాభం లేకపోయింది. కొద్దిసేపటికే పట్టువీడి ధరణీశ్వర్ నీటిలో మునిపోయాడు. ఆ ఇద్దరు పిల్లలు హాస్టల్‌కు చేరుకుని విషయం చెప్పారు. డ్రిల్ మాస్టర్, ఉపాధ్యాయులు పరుగున అక్కడికి చేరుకున్నారు. బాలుడి జాడ లేకపోవడంతో పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉందని, వెతకడం కష్టమని చెప్పి వెళ్లిపోయారు. ఎంపీపీ చొరవ తీసుకుని స్థానికంగా ఉన్న ఈతగాళ్లను పిలిపించి సాయంత్రం ఆరు గంటల వరకు వెతికించినా విద్యార్థి ఆచూకీ కనిపించలేదు. విద్యార్థి గల్లంతుపై సీఎం ఆరా చిత్తూరు(సెంట్రల్): సత్యవేడులో గురుకుల పాఠశాల విద్యార్థి తెలుగుగంగ కాలువలో పడి గల్లంతైన విషయమై సీఎం చంద్రబాబునాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవీంద్ర ఆరా తీశారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను ఆదేశించారు. ఘటనపై విచారణకు, విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించేందుకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ తెలిపారు. -
తుపానుకు ముందు... ఎస్సెమ్మెస్
న్యూఢిల్లీ: తుపాను, సునామీ లాంటి వాతావరణ ఉపద్రవాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఎస్సెమ్మెస్‌ల ద్వారా హెచ్చరించే కొత్త విధానాన్ని కేంద్రం గురువారం ప్రారంభించింది. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దీనిని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎస్సెమ్మెస్ ద్వారా కేవలం సమాచారమివ్వడమే కాకుండా ఉపద్రవాల సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై సూచనలు కూడా ఇస్తారని పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి ఒక ఏడాది సమయం పడుతుందన్నారు. ఎస్సెమ్మెస్ హెచ్చరికలు కావాలనుకునే వారు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన తెలిపారు. -
ఇక సులభంగా మెడికల్ కాలేజీల ఏర్పాటు
న్యూఢిల్లీ: వైద్యవిద్యా కోర్సుల్లో సీట్ల కొరత భారీగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రమాణాల విషయంలో రాజీపడకుండానే మెడికల్ కాలేజీలకు అనుమతుల ప్రక్రియను సడలించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మరిన్ని సీట్ల అవసరం ఉన్నందున కొత్త కాలేజీల ఏర్పాటుకు వీలుగా నిబంధనలను సడలించాలని భావిస్తున్నట్లు బుధవారం ఆరోగ్యశాఖ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ తొలి సమావేశంలో మంత్రి ఈ మేరకు తెలిపారు. జాతీయ అర్హతా ప్రవేశ పరీక్ష(నీట్)ను సుప్రీంకోర్టు రద్దుచేసినా, దాని అమలుపై సానుకూలంగా ఉన్నామని, అందుకే రివ్యూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. పీడీపీ ఎంపీ మహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ఔషధ బ్యాంకులను ఏర్పాటుచేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా కల్పిస్తామన్నారు. -
6 భాషల్లో ఆర్తి అగర్వాల్ చిత్రం
-
టీవీ యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్
-
యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్
డెంటల్ కళాశాల నుంచి రూ.5 కోట్లు డిమాండ్ వలపన్ని పట్టుకున్న పోలీసులు ఏలూరు: ‘క్రైమ్ వాచ్’ పేరిట టీవీలో కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు పొందిన ఓ యాంకర్ నేరస్తుడిగా మారాడు. హర్షవర్దన్ పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెరుుంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ పి.బాల నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. యండ్రపాటి హర్షవర్ధన్ స్వగ్రామం జిల్లాలోని భీమడోలు మండలం తండ్రగుంట. అతను హైదరాబాద్‌లో స్థిరపడినా జిల్లాతో అనుబంధం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెరుుంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్మెయిల్ చేయాలని పథకం వేశాడు. నల్లజర్లకు చెందిన ఫాదర్ లూక్బాబును మధ్యవర్తిగా ఉపయోగించుకున్నాడు. అతని ద్వారా ఫాదర్ బాలకు ఫోన్‌చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే కళాశాలకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తామని బెదిరించారు. బాధితుడు ఎస్పీ రఘురామిరెడ్డిని ఆశ్రయించారు. ఎస్పీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ముందుగా ఫాదర్ లూక్బాబును అదుపులోకి తీసుకున్నారు. హర్షవర్ధన్ విజయవాడలో ఉన్నట్టు పసిగట్టి శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. -
టీవీ యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్
విజయవాడ: టీవీ యాంకర్ హర్షవర్ధన్‌ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్సాండెంట్ ఫాదర్ పి.బాలను హర్షవర్ధన్ బ్లాక్ మెయిల్ చేశాడు. 5 కోట్ల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే ఒక ప్రముఖ టీవీ చానెల్లో కాలేజీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తానంటూ వారిని బెదిరించాడు. దాంతో బాల ఎస్పి రఘురామి రెడ్డిని ఆశ్రయించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హర్షవర్ధన్‌కు సహకరించిన నల్లజర్లకు చెందిన ఫాదర్ ల్యూక్‌బాబును తొలుత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యూక్‌బాబు ఇచ్చిన సమాచారంతో హర్షవర్ధన్‌ను విజయవాడలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అతనిని విజయవాడలోనే అరెస్టు చేశారు. హర్షవర్ధన్‌ను ఏలూరు పోలీసులకు అప్పగించనున్నారు. 'క్రైమ్ వాచ్' పేరిట ఓ టీవిలో నిర్వహించే కార్యక్రమం ద్వారా హర్షవర్ధన్ గుర్తింపు పొందాడు. నేరవార్తలు అందిస్తూ నేరస్తుడుగా మారాడు. భీమడోలు మండలం తండ్రగుంటకు చెందిన యండ్రపాటి హర్షవర్ధన్ హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. జిల్లాతో అనుబంధం కొనసాగిస్తూ ఈ చర్యకు పాల్పడ్డాడు. -
పాస్ పుస్తకాలు మాయం
లింగంపేట : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సీజ్ చేసి ఉంచిన పట్టాదారు పాస్ పుస్తకాలు మాయమయ్యా యి. గతేడాది అక్టోబర్‌లో అప్పటి జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ సుమారు 2 వందలకుపైగా పాస్ పుస్తకా లు, మరికొన్ని డాక్యుమెంట్లను అప్పటి లింగంపేట వీ ఆర్వో కిష్టారెడ్డి రూంలో నుంచి స్వాధీనం చేసుకుని సీ జ్ చేశారు. అనంతరం వాటిని తహసీల్ కార్యాలయం లో భద్రపరిచారు. కాగా గురువారం పలువురి సమక్షం లో తహశీల్దార్ సీజ్ చేసిన పాస్ పుస్తకాల మూటలను విప్పగా అందులో కేవలం 24 పట్టాదారు పాసు పుస్తకాలు మాత్రమే ఉండడంతో అధికారులు, ఆయా గ్రా మాల రైతులు విస్తుపోయారు. కాగా తహశీల్ కార్యాల యం నుంచి వందల సంఖ్యలో పట్టాపాస్ పుస్తకాలు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులకు కక్కుర్తి పడి ఒకరిద్దరు రెవెన్యూ సి బ్బంది కార్యాలయం నుంచి మాయం చేశారనే విమర్శ లు వినిపిస్తున్నాయి. నకిలీ పాసు పుస్తకాల వ్యవహారం లో అప్పటి తహశీల్దార్ టీఆర్.ఉమ, వీఆర్వో కిష్టారెడ్డి ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అందుకు బాధ్యులైన మరికొందరిపై కోర్టులో కేసు నడుస్తోంది. కాగా సీజ్ చే సిన వాటిలో నుంచి నకిలీ పాస్ పుస్తకాలు లేకుండా చే సి తప్పిదానికి పాల్పడ్డ అధికారులకు ఆసరా అందించ డం కోసం పాస్ పుస్తకాలను మాయం చేశారా!లేక డ బ్బులకు ఆశపడి అమ్ముకున్నారా!అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాగా పాస్ పుస్తకాలు, టైటిల్డీడ్లు మాయం కావడంపై తహశీల్దార్ సాలన్బీ యాహ్యాను ‘సాక్షి’ ప్రశ్నించగా జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్‌కు , కామారెడ్డి ఆర్డీఓకు వివరిస్తామన్నారు. తాను కొత్తగా వచ్చానని తనకేమీ తెలియదన్నారు. ఏడు పాస్ పుస్తకాలు స్వాధీనం లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామంలో బొ ల్లి సాయికుమార్ అనే వ్యక్తి ఇంటి నుంచి గురువారం ఏడు పట్టాదారు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వీఆర్వో రవికుమార్ తెలిపారు. సాయికుమార్ ఇంట్లో పాస్ పుస్తకాలు ఉన్నట్లు సమాచారం అందడం తో వెళ్లి పరిశీలించగా లభించాయన్నారు. ఇందులో మాల కమ్మరి చిన్న కాశయ్య(ముస్తాపూర్), ముత్తిరాజ య్య(శెట్పల్లి), పూజల రుక్మాబాయి, లంబాడి లక్ష్మి, ఇసాల్గారి సాయిలు(లింగంపేట), మన్నె ఆగమయ్య, బిక్కల సాయవ్వ(ఐలాపూర్)కు చెందిన పాస్ పుస్తకా లు లభించాయి. వీటిని తహశీల్దార్‌కు అందిస్తానని వీ ఆర్వో చెప్పారు. నాలుగు గ్రామాలకు చెందిన రైతుల పాస్పుస్త కాలు దొరకడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయికుమార్ గతంలో స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో పైరవీలు చేసి పలువురు రై తులకు రుణాలు ఇప్పించేవాడని, అందుకే అతడి దగ్గ ర పాస్ బుక్కులు దొరికి ఉంటాయని స్థానికులు చెప్పారు. -
వివాదాల వలలో హర్షవర్ధన్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ ప్రచారంలో కండోమ్స్ వినియోగంపై కంటే భార్యాభర్తలు నిబద్ధతతో కూడిన లైంగిక సంబంధాలకు ప్రాధాన్యమివ్వాలంటూ ఆయన ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యైలపె రేగిన వివాదం సద్దుమణగకముందే పాఠశాలలో లైంగిక విద్యను నిషేధించాలని ఆయన వెబ్సైట్ లోవెల్లడించిన అభిప్రాయం సరికొత్త వివాదాన్ని సృష్టించింది. ఢిల్లీ పాఠశాలలకు ఉద్దేశించిన ఎడ్యుకేషన్ విజ న్ డాక్యుమెంట్లో ఆయన తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరిస్తూ స్కూళ్లలో ప్రస్తుతం బోధిస్తున్న సెక్స్ ఎడ్యుకేషన్‌ను నిషేధిస్తామని, యోగాను తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. విలువలకు ప్రాధాన్యమిచ్చే విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలని, భారతీయ సంస్కృతిని గురించి విద్యార్థులకు తెలియజెప్పాలని ఆయన పేర్కొన్నారు. హర్షవర్ధన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మహిళా సంస్థ లు, సామాజిక కార్యకర్తలు దీనిని వ్యతిరేకించారు. అయితే హర్షవర్ధన్ తాను సెక్స్ ఎడ్యుకేషన్ నిషేధించాలని అనలేదంటూ వివరణ ఇచ్చారు. అంత కు ముందు ఆయన న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్ఐవి ఎయిడ్స్‌పై నియంత్రణ కోసం కండోమ్స్ వాడకాని కన్నా భార్యాభర్తల మధ్య నిబద్ధతతో కూడిన శారీరక సంబంధాలను ప్రోత్సహించాలనేది తన అభిప్రాయమని, ఇది భారతీయ సంస్కృతి మాత్రమే కాకుండా శాస్త్రీయమైన నివారణ మార్గమని పేర్కొన్నారు. కండోం లతో సురక్షితమైన సెక్స్ జరుపుతున్నామన్న నమ్మ కం కలిగిస్తాయని, అన్నిటికంటే సురక్షితమైన సెక్స్ భార్యాభర్తల మధ్య నిబద్ధదత తో కూడిన లైంగిక సంబంధం అవసరమని ఆయన పేర్కొన్నారు. హర్షవర్ధన్ వెలిబుచ్చిన అభిప్రాయంపై పలు ఎన్జీఓలు, ఆరోగ్య కారకర్తలు గగ్గోలు పెట్టారు. ‘హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ ప్రచార ఉద్యమం కండోమ్స్పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించకూడదు. కండోమ్ వాడుతున్నంతవరకు ఎటువంటి అక్రమ లైంగిక సంబంధం కలిగిఉన్నా ఫర్వాలేదనే తప్పుడు సందేశాన్ని ఇది అందిస్తుంది. లైంగిక సంబంధాలలో భార్యభర్తలు ఒకరికి కట్టుబడి ఉండాలి’ అనే తన వ్యాఖ్యైలపె హర్షవర్ధన్ వివరణ ఇస్తూ కండోమ్స్ పగిలిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల లైంగిక సంబంధాల్లో నిజాయితీ ముఖ్యమని పేర్కొన్నారు. -
ఆ తప్పు మళ్లీ చేయరు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు ఓటువేసి 2004లో ప్రజలు చారిత్రాత్మకమైన తప్పు చేశారని, ఆ తప్పు మళ్లీ చేయరని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి, ద్రవ్యోల్బణం, మత రాజకీయాలు, తప్పుడు విధానాల అమలు బాగా పెరిగిపోయాయని ఆరోపించారు. కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తుందని, వాటిని పరిష్కరిస్తుందన్నారు. చాందినీచౌక్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన హర్షవర్ధన్ సోమవారం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దేశమంతా మోడీ గాలి వీస్తోందని, ఆ గాలికి గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం, తప్పుడు విధానాలు కూకటి వేళ్లతోసహా కదిలిపోతాయన్నారు. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వానికి ఓటు వేయకుండా వామపక్ష పార్టీల మద్దతున్న కాంగ్రెస్‌కు ఓటువేసిన భారతీయులు చారిత్రాత్మక తప్పు చేశారని, ఫలితంగా పదేళ్లపాటు శిక్ష అనుభవించారన్నారు. ఈ పదేళ్లలో ప్రజలు ఎంతో జాగృతమయ్యారని, వారిలో ఎంతో మార్పు వచ్చిందని, గతంలో చేసిన తప్పును ఈసారి ఎంతమాత్రం చేయరన్నారు. గతంలో చేసిన తప్పును బ్రిటిష్‌వారు 1945లో విన్స్టన్ చర్చిల్‌కు ఓటువేయడం ద్వారా సరిదిద్దుకున్నారని, ఆ తర్వాత చర్చిల్ రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్ను గెలిపించాడన్నారు. 2000 సంవత్సరంలో అమెరికన్లు బుష్‌ను గెలిపించి, అల్ గోరేను ఓడించడం ద్వారా తప్పు చేశారని, అందుకు ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారంటూ మరో ఉదాహరణనిచ్చారు. భారత ప్రధానుల్లో వాజపేయి ఎంతో గొప్పవాడని, అటువంటి వ్యక్తిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నామన్నారు. అయినా ప్రజల తీర్పును గౌరవించి పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నామని, సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేశామన్నా రు. కాంగ్రెస్, ఆప్‌లు తమ విజయాన్ని అడ్డుకునేం దుకు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయన్నారు. పక్కా ప్రణాళికతో ప్రచారం.. దేశవ్యాప్తంగా బీజేపీ పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తోందని, ప్రచారాంశాలను నాలుగు భాగాలుగా విభజించామని వర్ధన్ చెప్పారు. సుపరిపాలన అందిస్తామని, ఆర్థిక వృద్ధిని సాధిస్తామనేది తమ మొదటి హామీ అని, అందుకు గుజరాత్, మధ్యప్రదేశ్‌లను ఉదాహరణగా చూపుతున్నామన్నారు. ఇక ఈ గవర్ననెన్స్ ద్వారా పారదర్శక పాలనను అందిస్తామనేది మరో కీలక ప్రచారాంశంగా వర్ధన్ చెప్పారు. పాకిస్థాన్, చైనా నుంచి పొంచిఉన్న ముప్పును తిప్పికొట్టి, దేశప్రజల్లో భద్రతపై భరోసా కల్పించేది బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారని, అందుకే ప్రచారాంశాల్లో దానిని కూడా చేర్చామని చెప్పారు. -
తమ్ముడి సినీ ఆరంగేట్రంపై సోనమ్ ఆందోళన
తన తమ్ముడు హర్షవర్ధన్ బాలీవుడ్లో ఆరంగేట్రం చేయడంపై సినీ నటి సోనమ్ కపూర్ ఆందోళన వ్యక్తం చేసింది. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తీయనున్న ‘మీర్జా సాహిబా’ సినిమాలో అనిల్ కపూర్ చిన్న కుమారుడైన హర్షవర్ధన్ నటించనున్నాడు. బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి హర్షవర్ధన్ రావడం సంతోషంగా ఉందని అంటూనే, చిన్న వయస్సులోనే సినిమాల్లో నటించడం ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయాన్ని సోనమ్ కపూర్ వ్యక్తం చేసింది. అయితే సినీ కెరీర్లో బాగా రాణించాలని కోరుకుంటున్నానని ఆమె ఆదివారం మీడియాకు తెలిపింది. చారిత్రక నేపథ్యమున్న ప్రేమకథతో తెరకెక్కిస్తున్న మీర్జా సాహిబా సినిమాలో హర్షవర్ధన్ మీర్జా పాత్రను పోషిస్తున్నాడని వివరించింది. అమెరికాలో స్క్రీన్‌ప్లే, నటనలో విద్యాభ్యాసం చేసిన హర్షవర్ధన్ ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చాడని తెలిపింది. త్వరలో విడుదల కానున్న రణబీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా నటించిన బాంబే వెల్వెట్ సినిమా దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవముందని తెలిపింది. బాలీవుడ్లో మరో సోదరుడు అర్జున్ కపూర్ మెరుగ్గా రాణిస్తున్నాడని ఆనందం వ్యక్తం చేసింది. అర్జున్ రోజురోజుకు పరిణితితో కూడిన నటన చేస్తున్నాడని వివరించింది. అందంగా కనిపించే అర్జున్ మంచి వ్యక్తి అని, మంచి వ్యక్తులకే జీవితంలో అంతే మంచి జరుగుతుందని తెలిపింది. అర్జున్ మంచి స్నేహితుడని, ఏవైనా సమస్యలున్నా తనతో చర్చిస్తాడని చెప్పింది. నా స్నేహితుడిగా ఉండాలని అర్జున్ కోరుకుంటాడని, అయితే అతను నిదానపు మనిషి కాదని వెల్లడించింది. -
విశ్వాసతీర్మానంపై ఎవరేమన్నారు...
ఢిల్లీ ప్రజలు తమకు నైతిక విజయాన్ని ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన బీజేపీ నిరాకరించిన తర్వాత తాము నైతిక బాధ్యతతో ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అయితే తమకు సర్కార్ నడపడానికి కావలసిన పూర్తి మెజారిటీ లేదు. ప్రజాహితం కోసం కొన్ని అంశాలపై పనిచేయాలనుకుంటున్నాం. అందుకు విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. నగరాభివృద్ధి విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గం. రాజధాని వాసులకు స్వచ్ఛమైన నీరు, చౌక విద్యుత్‌ను అందేలా చూస్తాం. వీఐపీ సంస్కృతిని అంతమొందించడం, పటిష్టమైన లోక్‌పాల్ తేవడం, ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, స్కూళ్లు, ఆసుపత్రులను మెరుగుపరుస్తాం. రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐని వ్యతిరేకిస్తాం. కాంగ్రెస్‌తో చెలిమి కరెక్ట్ కాదు: డాక్టర్ హర్షవర్దన్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం. అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్న కేజ్రీవాల్ పై ఢిల్లీవాసులు, దేశవాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మద్దతు ఇవ్వబోం, తీసుకోబోం అన్న ఆయన మాటలు విని ఆదర్శభావాలకు ప్రజలు పొంగిపోయారు. అయితే ఆయన అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని జైలుకు పంపిస్తానని అన్న కేజ్రీవాల్ ఇప్పుడు సాక్ష్యాలను కోరుతున్నారు. రామ్‌లీలా మైదాన్‌కు ప్రమాణస్వీకారానికి మెట్రోలో వెళ్లి ప్రజా భద్రతను పణంగా పెట్టారు. సబ్సిడీపై విద్యుత్తు రేట్లను తగ్గించి ప్రజల నుంచి డబ్బులు తీసుకుని వారికే ఇస్తున్నారు. అభివృద్ధికి ఖర్చు చేయవలసిన సొమ్మును విద్యుత్ కంపెనీలకు సబ్సిడీ పేరిట ఇచ్చేస్తున్నారు. ప్రజలను అడిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామన్న మనీశ్ సిసోడియా మాటలను తప్పుబట్టారు. మొహల్లాలో వంద, యాభై మందిని పిలిచి అడిగితే అంతా చేతులు ఎత్తుతారని అంటున్నారు. కాానీ నిజమైన ప్రజాభీష్టం ఓట్ల ద్వారానే వ్యక్తమవుతుంది. అది తమకు లభించింది. ఢిల్లీ వాసుల మేలు కోసమే మద్దతు: లవ్లీ విశ్వాస తీర్మానానికి మద్దతునిస్తున్నాం. ఎన్నికల హామీలను నెరవేర్చడం కోసమే తాము ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. . ఢిల్లీ ప్రజల మేలు కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం పనిచేసినంతకాలం తమ మద్దతు కొనసాగుతుంది. అవసరమైతే ఐదేళ్ల పాటు ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం. తొందరపాటు నిర్ణయాలు ఆప్ తీసుకోవద్దు. ప్రతిపక్ష నేత హర్షవర్ధన్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతికి పాల్పడిన బీజేపీ నీతివ్యాఖ్యలు మాట్లాడటం సబబు కాదు. బీజేపీ ఎన్నాళ్లయినా ప్రతిపక్ష బెంచీలలోనే ఉంటుంది. మోహన్‌చంద్ శర్మ సతీమణికి మా ప్రభుత్వమే ఉద్యోగమిచ్చింది. -
హర్షవర్ధన్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపు
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చకు... ఢిల్లీలో త్రిశంకు ఫలితాల నేపథ్యంలో సర్కారు ఏర్పాటులో నెలకొన్న స్తబ్దతను తొలగించే దిశగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బుధవారం రాత్రి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్‌తో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చల కోసం గురువారం రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా, బీజేపీకి 31, దాని మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌కు ఒక స్థానం లభించిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) 28 స్థానాలు లభించగా, కాంగ్రెస్‌కు ఎనిమిది, జేడీయూకు ఒకటి, మరొక స్థానం ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కాయి. బీజేపీ, ఆప్ బుధవారం ఉదయం తిరిగి ఎన్నికలకే సిద్ధపడతామని ప్రకటించాయి. మెజారిటీ సంఖ్యాబలం లేనందున సర్కారు ఏర్పాటు అవకాశం కల్పించాల్సిందిగా గవర్నర్‌ను కోరబోమని హర్షవర్ధన్ తొలుత ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యల గురించి లెఫ్టినెంట్ గవర్నర్‌తో బుధవారం మాట్లాడారు. -
అవకాశం ఇవ్వండి..అన్నీ పరిష్కరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనే ళ్ల కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ఢిల్లీవాసులకు డిసెంబర్ 4 తర్వాత విముక్తి కల్పిస్తామని, వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఢిల్లీవాసులను ఆకట్టుకునేలా రూపొందించిన పార్టీ మేనిఫెస్టోను మంగళవారం బీజేపీ ఢిల్లీప్రదే శ్ కార్యాలయంలో విడుదల చేశారు. లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీతోపాటు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్, సీఎం అభ్యర్థి హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జ్ నితిన్‌గడ్కారీ, విజయేంద్రగుప్తా, విజయ్ జోలీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే స్థానిక సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ పేర్కొన్నారు. గతంలో పేర్కొన్నట్టుగానే విద్యుత్ చార్జీల 30 శాతం తగ్గింపును బీజేపీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మహిళల భద్రత, ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్రహోదా, ఆరోగ్యం, అదనపు గ్యాస్ సిలిండర్ల పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీవాసుల నుంచి సేకరించిన అభిప్రాయాలను కలబోతగా తయారు చేసి, ఎన్నికలకు సరిగ్గా వారం ముందు విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో ఢిల్లీవాసులను ఆకట్టుకుంటుందని బీజేపీ విశ్వసిస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసిన ఐదురోజుల అనంతరం బీజేపీ మేనిఫెస్టో రావడం గమనార్హం. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోని విశేషాలు అంశాల వారీగా: ఢిల్లీకి పూర్తి రాష్ట్రహోదా: బీజేపీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కోసం కృషి. ఎన్ సీఆర్ ప్రాంతంలోని ఫరీదాబాద్, గుర్గావ్, సోనిపట్, రోహ్తక్, ఇంద్రపురం, ఘజియాబాద్, నోయిడాలను కలిపేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచేందుకు ఈ-గవర్నెన్స్ అమలు. లోకాయుక్తకు అదనపు అధికారాల క ల్పన సత్వర న్యాయం: బాధితులందరికీ సత్వరన్యాయం అందేలా ‘స్పీడీ జస్టిస్ కమిషన్’ ఏర్పాటు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల కేసుల విచారణకు ‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టు’ల ఏర్పాటు. వయోధికులు వేసే కేసుల విచారణకు స్పెషల్ కోర్టుల ఏర్పాటు. 1984 అల్లర్ల బాధితుకుల న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు. సబ్సిడీపై అదనపు సిలిండర్లు: ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్న తొమ్మిది గ్యాస్ సిలిండర్లకు అదనంగా మూడు కలిపి మొత్తం 12 సిలిండర్లను పంపిణీ చేయడం. విద్యుత్, మంచినీరు: విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించేలా డిస్కమ్‌ల మధ్య పోటీ పెంచడం. వాటి పనితీరును ఆర్టీఐ, కాగ్ పరిధిలోకి తేవడం. ప్రతి ఇంటినీ విద్యుత్ ఉత్పాదక కేంద్రంగా మార్చేలా ఇళ్లపై సోలార్ విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు. సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమయ్యే వస్తువుల తయారీపై పదేళ్ల వరకు పన్నులు రద్దు చేయడం. ఢిల్లీవాసులకు సురక్షిత మంచినీటి సరఫరా డీజేబీ పనితీరు మెరుగుపర్చేందుకు చర్యలు రవాణా వ్యవస్థ: మెట్రోరైలు, డీటీసీ బస్సులు, మెట్రోఫీడర్ బస్సుల సంఖ్య పెంచడం. మెట్రోరైలు,మెట్రోఫీడర్ బస్సులు,డీటీసీ బస్సులకు వర్తించేలా కామన్ స్మార్ట్‌కార్డులను అందుబాటులోకి తేవడం. విద్యార్థులకు రాయితీలపై స్మార్ట్‌కార్డుల పంపిణీ. మోనోరైలు సేవలు అందుబాటులోకి తేవడంతోపాటు మెట్రోరైలు వ్యవస్థను ఢిల్లీలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడం. పార్కింగ్ సమస్య పరిష్కారానికి మాస్టర్‌ప్లాన్ అమలు. ఢిల్లీలోని విభిన్న ప్రాంతాల్లో భూగ ర్భ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు. రోగ్య సేవలు: యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలులోకి తేవడం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ‘ఎసెన్షియల్ డ్రగ్ పాలసీ’ని అమలులోకి తేవడం. దీని ద్వారా ప్రతి డీల్లీవాసికి 25 రకాల అత్యవసర మందులను ఉచితంగా పంపిణీ చేయడం. అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలో శిశుమరణాల రేటు 28 నుంచి 15కి తగ్గించడం. అన్ని జిల్లాల్లో ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు. మహిళల భద్రతకు: ఢిల్లీలో మహిళల భద్రత అంశాలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 24 గంటల కాల్‌సెంటర్ల ఏర్పాటు. పనిచేసే మహిళల కోసం మరిన్ని వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ప్రారంభించడం. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా పోలీసు వ్యవస్థను పటిష్టపర్చడం. మహిళల సాధికారికతకు ప్రభుత్వం తరఫున ఆర్థిక ప్రోత్సాహం అందజేయడం. పట్టణాభివృద్ధికి: అన్ని అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించడం. మౌలిక వసతుల కల్పన ‘అటల్ బీహారీ వాజ్‌పేయి జన్పునరావాస యోజన పథకం’ కింద జుగ్గీజోపిడీల్లోని పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం. యువత వ్యవసాయంలోకి వచ్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం. న్యూస్ పేపర్ హాకర్లకు ఉచితంగా సైకిళ్లు ఎంసీడీల పరిధిలోకి బ్యాటరీ రిక్షాలను పర్యావరణ పరిరక్షణకు: ఢిల్లీలో వాయు, ధ్వని కాలుష్యాలను అరికట్టేందుకు చర్యలు. యమునా శుద్ధికి ప్రత్యేకంగా ఢిల్లీ యమునా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం. యమునా నదికి ఇరువైపులా ఉన్న ప్రాం తాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం. -
షీలాకు ఉల్లి గండమే: సుష్మా
న్యూఢిల్లీ: ఆకాశన్నంటుతున్న ఉల్లి గడ్డ ధరల ప్రభావం వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తుందని బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. ఇది దీక్షిత్ ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తుందని ఆమె జోస్యం చెప్పారు. 15 ఏళ్ల క్రితం ఎన్నికలకు ముందు కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో అధికారంలో ఉన్న కాషాయకూటమికి ఎదురైన పరాభవాన్ని ఆమె గుర్తు చేశారు. అప్పుడు షీలాదీక్షిత్ ఉల్లిగడ్డ దండలు ధరించి పెద్ద సమస్య చేసి సృష్టించారన్నారు. ఇప్పుడు అదే ఉల్లి కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేం దుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ రాసిన ‘ఏ టేల్ ఆఫ్ టూ డ్రాప్స్’ రివైజ్డ్ ఎడిషన్‌ను పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విడుదల చేశారు. దేశ రాజధానిని కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి కలిగిచేందుకు ఢిల్లీ బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగే అనేక బహిరంగ సభల్లో ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దింపే అభ్యర్థుల జాబితాను బీజేపీ గురువారం ప్రకటించే అవకాశముందన్నారు.