
‘సార్... నా పేరు షణ్ముఖ్ రెడ్డి. మేం వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. మా కేసు గురించి మోహన్‌రావుగారితో మాట్లాడాలి, మీరు శుక్రవారం సాయంత్రం వచ్చేయండి... ఎలాగూ శాటర్‌డే, సండే కోర్టు హాలిడేస్ కాబట్టి సార్ మీతో డీటైల్డ్‌గా మాట్లాడతారు. అయితే మేం శుక్రవారం వచ్చి ఫోన్ చేస్తాం సార్’ అనే సంభాషణలు ‘కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమా ట్రైలర్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ వీడియోలో ఉన్నాయి.
ఈ విజువల్స్‌తో పాటు ‘సత్యమేవ జయతే’ అని కూడా కనపడుతుంది. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. నాని సమర్పణలో రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 7న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, ట్రైలర్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.