
'వాళ్లు నిండుగా బతకాలి'
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్, బీజేపీ నేత డాక్టర్ హర్షవర్దన్ నిండు జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం వారి జన్మదినం సందర్భంగా మోదీ వారికి జన్మదిన శుభాకాంక్షలను ట్విట్టర్లో తెలిపారు.
ఈ సందర్బంగా వారిద్దరి వ్యక్తిత్వాలను మోదీ కొనియాడారు. 'వారి స్వభావమేకాదు పరిపాలన తీరు కూడా చాలా హుందాగా ఉంటుంది. కష్టపడుతూ ఇష్టంగా పనిచేస్తారు. వారు సుదీర్ఘంగా బతకాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని తెలిపారు.