లింగంపేట : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సీజ్ చేసి ఉంచిన పట్టాదారు పాస్ పుస్తకాలు మాయమయ్యా యి. గతేడాది అక్టోబర్‌లో అప్పటి జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ సుమారు 2 వందలకుపైగా పాస్ పుస్తకా లు, మరికొన్ని డాక్యుమెంట్లను అప్పటి లింగంపేట వీ ఆర్వో కిష్టారెడ్డి రూంలో నుంచి స్వాధీనం చేసుకుని సీ జ్ చేశారు. అనంతరం వాటిని తహసీల్ కార్యాలయం లో భద్రపరిచారు.
కాగా గురువారం పలువురి సమక్షం లో తహశీల్దార్ సీజ్ చేసిన పాస్ పుస్తకాల మూటలను విప్పగా అందులో కేవలం 24 పట్టాదారు పాసు పుస్తకాలు మాత్రమే ఉండడంతో అధికారులు, ఆయా గ్రా మాల రైతులు విస్తుపోయారు. కాగా తహశీల్ కార్యాల యం నుంచి వందల సంఖ్యలో పట్టాపాస్ పుస్తకాలు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులకు కక్కుర్తి పడి ఒకరిద్దరు రెవెన్యూ సి బ్బంది కార్యాలయం నుంచి మాయం చేశారనే విమర్శ లు వినిపిస్తున్నాయి.
నకిలీ పాసు పుస్తకాల వ్యవహారం లో అప్పటి తహశీల్దార్ టీఆర్.ఉమ, వీఆర్వో కిష్టారెడ్డి ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అందుకు బాధ్యులైన మరికొందరిపై కోర్టులో కేసు నడుస్తోంది. కాగా సీజ్ చే సిన వాటిలో నుంచి నకిలీ పాస్ పుస్తకాలు లేకుండా చే సి తప్పిదానికి పాల్పడ్డ అధికారులకు ఆసరా అందించ డం కోసం పాస్ పుస్తకాలను మాయం చేశారా!లేక డ బ్బులకు ఆశపడి అమ్ముకున్నారా!అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాగా పాస్ పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లు మాయం కావడంపై తహశీల్దార్ సాలన్‌బీ యాహ్యాను ‘సాక్షి’ ప్రశ్నించగా జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్‌కు , కామారెడ్డి ఆర్డీఓకు వివరిస్తామన్నారు. తాను కొత్తగా వచ్చానని తనకేమీ తెలియదన్నారు.
ఏడు పాస్ పుస్తకాలు స్వాధీనం
లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామంలో బొ ల్లి సాయికుమార్ అనే వ్యక్తి ఇంటి నుంచి గురువారం ఏడు పట్టాదారు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వీఆర్వో రవికుమార్ తెలిపారు. సాయికుమార్ ఇంట్లో పాస్ పుస్తకాలు ఉన్నట్లు సమాచారం అందడం తో వెళ్లి పరిశీలించగా లభించాయన్నారు. ఇందులో మాల కమ్మరి చిన్న కాశయ్య(ముస్తాపూర్), ముత్తిరాజ య్య(శెట్పల్లి), పూజల రుక్మాబాయి, లంబాడి లక్ష్మి, ఇసాల్‌గారి సాయిలు(లింగంపేట), మన్నె ఆగమయ్య, బిక్కల సాయవ్వ(ఐలాపూర్)కు చెందిన పాస్ పుస్తకా లు లభించాయి.
వీటిని తహశీల్దార్‌కు అందిస్తానని వీ ఆర్వో చెప్పారు. నాలుగు గ్రామాలకు చెందిన రైతుల పాస్‌పుస్త కాలు దొరకడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయికుమార్ గతంలో స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో పైరవీలు చేసి పలువురు రై తులకు రుణాలు ఇప్పించేవాడని, అందుకే అతడి దగ్గ ర పాస్ బుక్కులు దొరికి ఉంటాయని స్థానికులు చెప్పారు.
పాస్ పుస్తకాలు మాయం
Published Fri, Aug 29 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement