pass books
-
స్మార్ట్‌గా పాస్ పుస్తకం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భూ రికార్డుల ప్రక్షాళనలో సరికొత్త ఆవిష్కరణలకు తెరలేచింది. భూ వివాదాలకు తావివ్వకుండా రాష్ట్ర సర్కారు డిజిటల్ పాస్‌పుస్తకాలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవల రెవెన్యూ రికార్డుల నవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన యంత్రాంగం.. మార్చి 11న కొత్త పాస్‌పుస్తకాల జారీకి రంగం సిద్ధం చేసింది. ఇందులోభాగంగా ఇప్పటి వరకు అమలులో ఉన్న పాస్బుక్ల స్థానే ‘స్మార్ట్’ కార్డులను ప్రవేశపెడుతోంది. ఇందులో సమగ్ర భూ వివరాలను నిక్షిప్తం చేయనుంది. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ప్రభుత్వం.. ఈ సమాచారాన్ని తారుమారు చేయకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తోంది. ప్రస్తుతం పాస్‌పోర్టుల జారీలో అవలంభిస్తున్న విధానం మాదిరి ఈ కార్డులకు రూపకల్పన చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని నేషనల్ హై సెక్యూరిటీ ముద్రణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 18 సెక్యూరిటీ ఫీచర్లతో చూడముచ్చటగా.. ఈ డిజిటల్ పాస్‌పుస్తకాల్లో 18 ఫీచర్లు ఉండనున్నాయి. భూ కేటగిరీ, పట్టాదారు, సాగు విస్తీర్ణం, బ్యాంకు ఖాతా, ఫోన్, ఆధార్ నంబర్ సహా ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేసేందుకు అనువుగా సాంకేతికతకు జోడించినట్లు తెలిసింది. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సరికొత్త ’స్మార్ట్’ పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. దానికి అనుగుణంగా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గత మూడు రోజులుగా తహసీల్దార్లకు శిక్షణా తరగతులను నిర్వహించింది. అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్ వ్యవహారాలను కూడా తహసీల్దార్లే చూడనున్నందున దానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తోంది. మరోవైపు హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు ముద్రణ బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం.. తహసీల్దార్ల డిజిటల్ సంతకాల సేకరణలో నిమగ్నమైంది. అవసరమైతే, బల్క్‌గా డిజిటల్ సంతకాల చేసే వెసులుబాటు కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పెట్టుబడి సాయంలో కీలకం! తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్టుబడి సాయంలో ఈ కార్డులు కీలకం కానున్నాయి.గతంలో నకిలీ పాస్‌పుస్తకాల బెడద కారణంగా పంటనష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ, బ్యాంకు రుణాలతో ప్రభుత్వానికి టోకరా వేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రవేశపెడుతున్న స్మార్ట్ కార్డులతో అక్రమాలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా ప్రతి ఏడాది ఎకరాకు రూ.8వేలను పెట్టుబడి ప్రోత్సాహకంగా రైతన్నకు అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్‌లో రూ.4వేల చొప్పున రైతులకు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. -
ప్రభుత్వ తీరు.. అన్నదాత బేజారు..
కడప అగ్రికల్చర్ : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో అన్నదాత బేజారు చెందుతున్నాడు. దిక్కుతోచకని స్థితిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పలు రకాల షరతులు విధించి జీఓ జారీ చేసింది. అయితే బంగారు రుణాలకు మాత్రం బంగారు తాకట్టుతో సంబంధం లేకుండా రుణం తీసుకున్న ఏడాదిలో జిల్లా కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటసాగు కోసం తీసుకునే రుణానికి మాత్రమే మాఫీ వర్తిస్తుందని జీఓ నంబరు 164 లోని 14 నుంచి 16 వరకు ఉన్న అంశాల ప్రకారం రుణమాఫీ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట రుణాలకు మాత్రం పట్టాదారు పాసుపుస్తకం బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలను రైతులు తీసుకున్నారు. అది కూడా 2013 మార్చి1 నుంచి, 2013 డిసెంబరు నెల 31వ తేదీ వరకు పంటల సాగుకు తీసుకున్న రుణాలకే రుణమాఫీ వర్తిస్తుందని, ఆ తర్వాత తీసుకున్న వారికి వర్తింపు ఉండదని పేర్కొన్నారు. ఉద్యాన పంటలకు తీసుకున్న రుణాలు మాఫీ చేసేది లేదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే...: ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో డీసీసీ బ్యాంకు చీఫ్ మేనేజరు, లీడ్‌బ్యాంకు మేనేజరు, అన్ని ప్రధాన బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయశాఖ జేడీ, ఉద్యానశాఖల ఏడీలు, మార్కెటింగ్‌శాఖ అధికారులు, ఒకరిద్దరు అభ్యుదయ రైతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏఏ పంటకు ఎంతెంత పెట్టుబడి అవుతుందనే విషయమై చర్చిస్తారు. ముందుగా ఆయా శాఖల అధికారులు రూపొందించిన రుణ ప్రణాళికలను సమావేశం ముందుంచుతారు. అన్ని ప్రణాళికలపై చర్చ నిర్వహించి, అనంతరం ఒక కటాఫ్ పెట్టుబడి రుణాన్ని నిర్ణయించి రాష్ట్రస్థాయి కమిటీకి పంపుతారు. అక్కడ అటుఇటుగా ఒక మొత్తాన్ని నిర్ణయించి జిల్లాకు పంపిస్తారు. దాని ఆధారంగా బ్యాంకర్లు రుణాలను రైతులకు అందజేస్తారు. దీని ప్రకారం బ్యాంకర్లు రైతు బ్యాంకుకు సమర్పించే పాసుపుస్తకంలో ఉన్న భూమికి జిల్లా కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాన్ని ఇస్తారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2013లో వరి పంటకు ఎకరాకు రూ. 18,000లు, జొన్నకు రూ. 8,000లు, కందికి 8,000లు, శనగకు రూ. 12,000, పొద్దుతిరుగుడుకు రూ. 10,000లు, వేరుశనగకు రూ. 11,000లు, పత్తి పంటకు నీటి ఆధారం, వర్షాధారం కింద రూ. 22 వేలు, ఆముదం పంటకు రూ. 8000లు ఇలా రుణాన్ని అన్ని పంటల సాగుకోసం రైతులకు అందజేశారు. ఉదాహరణకు రైతు ఒక ఎకరం పొలం ఉన్నప్పుడు ఆ ఎకరం పంటసాగుకు 5 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ లక్ష రుణం తీసుకుంటే ఆ పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌లో ఎంత రుణం ప్రకటించారో అంతే మొత్తం మాఫీ అవుతుందిగాని లక్ష రూపాయలు మాఫీ కాదని బ్యాంకర్లు చెబుతున్నారు. -
పాస్ పుస్తకాలు మాయం
లింగంపేట : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సీజ్ చేసి ఉంచిన పట్టాదారు పాస్ పుస్తకాలు మాయమయ్యా యి. గతేడాది అక్టోబర్‌లో అప్పటి జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ సుమారు 2 వందలకుపైగా పాస్ పుస్తకా లు, మరికొన్ని డాక్యుమెంట్లను అప్పటి లింగంపేట వీ ఆర్వో కిష్టారెడ్డి రూంలో నుంచి స్వాధీనం చేసుకుని సీ జ్ చేశారు. అనంతరం వాటిని తహసీల్ కార్యాలయం లో భద్రపరిచారు. కాగా గురువారం పలువురి సమక్షం లో తహశీల్దార్ సీజ్ చేసిన పాస్ పుస్తకాల మూటలను విప్పగా అందులో కేవలం 24 పట్టాదారు పాసు పుస్తకాలు మాత్రమే ఉండడంతో అధికారులు, ఆయా గ్రా మాల రైతులు విస్తుపోయారు. కాగా తహశీల్ కార్యాల యం నుంచి వందల సంఖ్యలో పట్టాపాస్ పుస్తకాలు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులకు కక్కుర్తి పడి ఒకరిద్దరు రెవెన్యూ సి బ్బంది కార్యాలయం నుంచి మాయం చేశారనే విమర్శ లు వినిపిస్తున్నాయి. నకిలీ పాసు పుస్తకాల వ్యవహారం లో అప్పటి తహశీల్దార్ టీఆర్.ఉమ, వీఆర్వో కిష్టారెడ్డి ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అందుకు బాధ్యులైన మరికొందరిపై కోర్టులో కేసు నడుస్తోంది. కాగా సీజ్ చే సిన వాటిలో నుంచి నకిలీ పాస్ పుస్తకాలు లేకుండా చే సి తప్పిదానికి పాల్పడ్డ అధికారులకు ఆసరా అందించ డం కోసం పాస్ పుస్తకాలను మాయం చేశారా!లేక డ బ్బులకు ఆశపడి అమ్ముకున్నారా!అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాగా పాస్ పుస్తకాలు, టైటిల్డీడ్లు మాయం కావడంపై తహశీల్దార్ సాలన్బీ యాహ్యాను ‘సాక్షి’ ప్రశ్నించగా జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్‌కు , కామారెడ్డి ఆర్డీఓకు వివరిస్తామన్నారు. తాను కొత్తగా వచ్చానని తనకేమీ తెలియదన్నారు. ఏడు పాస్ పుస్తకాలు స్వాధీనం లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామంలో బొ ల్లి సాయికుమార్ అనే వ్యక్తి ఇంటి నుంచి గురువారం ఏడు పట్టాదారు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వీఆర్వో రవికుమార్ తెలిపారు. సాయికుమార్ ఇంట్లో పాస్ పుస్తకాలు ఉన్నట్లు సమాచారం అందడం తో వెళ్లి పరిశీలించగా లభించాయన్నారు. ఇందులో మాల కమ్మరి చిన్న కాశయ్య(ముస్తాపూర్), ముత్తిరాజ య్య(శెట్పల్లి), పూజల రుక్మాబాయి, లంబాడి లక్ష్మి, ఇసాల్గారి సాయిలు(లింగంపేట), మన్నె ఆగమయ్య, బిక్కల సాయవ్వ(ఐలాపూర్)కు చెందిన పాస్ పుస్తకా లు లభించాయి. వీటిని తహశీల్దార్‌కు అందిస్తానని వీ ఆర్వో చెప్పారు. నాలుగు గ్రామాలకు చెందిన రైతుల పాస్పుస్త కాలు దొరకడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయికుమార్ గతంలో స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో పైరవీలు చేసి పలువురు రై తులకు రుణాలు ఇప్పించేవాడని, అందుకే అతడి దగ్గ ర పాస్ బుక్కులు దొరికి ఉంటాయని స్థానికులు చెప్పారు.