Lingampet
-
ఆలోచనాత్మకం సర్కార్ బడి విద్యార్థుల ‘జాగో’ షార్ట్ ఫిల్మ్
కామారెడ్డి క్రైం: స్వచ్ఛత ఫిల్మోంకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయస్థాయిలో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు అఖిల్ ఓ లఘుచిత్రాన్ని రూపొందించారు. స్వచ్ఛ భారత్ ప్రాధాన్యం తెలుపుతూ ‘జాగో’ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారని జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. చిన్నారులు నటించిన ‘జాగో’ ఈ లఘు చిత్రాన్ని పోటీలకు పంపించినట్లు చెప్పారు. పరిసరాల అపరిశుభ్రంతో తన స్నేహితుడు పాఠశాలకు రాకపోవడం అనే కథాంశంతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించారు. డైలాగ్‌లు లేకున్నా ఎంతో అర్థం వచ్చేలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంది. కేఎన్ఆర్ స్టూడియోస్ నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఆలోచింపజేస్తోంది. గ్రామస్తుల సహకారంతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. మీరు ఈ షార్ట్‌ఫిల్మ్ చూసేందుకు క్లిక్ చేయండి చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం చదవండి: పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్ కేసు! -
ఆడ పిల్లలు పుట్టారని భర్త వేధింపులు.. దీంతో ఆ మహిళ
సాక్షి, లింగంపేట(నిజామాబాద్): ఆడపిల్లలు పుట్టారని భర్త నిత్యం వేధిస్తుండంటంతో ఓ వివాహిత బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన లింగంపేట మండలంలోని పొల్కంపేటలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్ల నాగవణి(27), సంజీవులు భార్యాభర్తలు. వీరికిపెళ్లయి 12 ఏళ్లు అవుతోంది. ఈదంపతులకుఇద్దరు ఆడపిల్లలు భవిత(11), లాస్య (ఏడాది)ఉన్నారు. సంజీవులు బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లి తిరిగి వచ్చాడు. గల్ఫై నుంచి వచ్చిననాటి నుంచి ఆడపిల్లలు పుట్టారని సంజీవులు నాగమణిని వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఈ విషయాన్నితన తల్లిదండ్రులకు వివరించింది. వారు వచ్చి పలుమార్లు నచ్చజేప్పారు. అయినా అతనిలోమార్పు రాలేదు. అంతేకాకుండా నాగమణి తల్లిదండ్రులను ఇంటికి రానిచ్చే వాడుకాదు. ఫోన్లో సైతం మాట్లాడవద్దని బెదిరించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నాగమణి తన తల్లితో ఫోన్ లోమాట్లాడింది. వారికి ఎందుకు ఫోన్ చేశావని సంజీవులు ఆమెతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన నాగమణి రాత్రి అందరు పడుకున్నాక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. గురువారం ఉదయం గ్రామస్తులు వెతుకుతుండగా గ్రామ సమీపంలోని వాగులోని నీటి మడుగులో విగతజీవిగా కనిపించింది. ఆడ పిల్లలు పుట్టారని అల్లుడు వేధిస్తుండటంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని నాగమణి తల్లి వడ్ల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
లింగంపేట (నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలకేంద్రంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు దగ్ధమైంది. ఇంట్లోనివారంతా ఉపాధి హామీ పనులకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికంగా ఉండే సుభద్ర నివాసంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.1.50లక్షల నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు,వీఆర్వో పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగ్యూతో యువతి మృతి
లింగంపేట (నిజామాబాద్) : గత వారం రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న యువతి చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందింది. ఈ సంఘటన నిజామాబాద్ లింగంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మంజుల(20) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. -
తాగునీటి కోసం ఆందోళన
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. వేసవి ముంచుకొస్తుండటంతో ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నాఫలితం లేకుండా పోతోంది. దీంతో ఆగ్రహించిన స్థానికులు సోమవారం ఉదయం ఖాళీ బిందెలతో ఆందోనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అధికారులు తమ సమస్యను పరిష్కరించేదాకా ఆందోళన విరమించేది లేదని స్తానికులు తెలిపారు. (లింగంపేట) -
ఇళ్లకు ఇక 24 గంటల విద్యుత్: హరీష్ రావు
లింగంపేట(నిజామాబాద్) : తెలంగాణ రాష్ట్రంలో గృహావసరాలకు ఇక రోజుకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కాకతీయ మిషన్‌లో భాగంగా హరీష్‌రావు చెరువులను పరిశీలించారు. శుక్రవారం నిజామాబాద్‌లో పర్యటించిన మంత్రి పలు మండలాల్లోని చెరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్‌రావు నిజామాబాద్ జిల్లా లింగపేట మండలంలోని మల్లారం చెరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. జిల్లాలోని లింగంపేట, తాడవాయి, గాంధారీ మండలంలోని చెరువులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో రైతులకు 12 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. -
పంట రుణాలు నకి‘లీలలు’
లింగంపేట: నకిలీ పట్టా పుస్తకాల బాగోతం బయటపడుతోంది. బోగస్ పట్టాలు చూపి పంట రుణాలు పొందిన రైతుల గుట్టురట్టు కానుంది. అక్రమాలకు పాల్పడిన వారి అంతు చూడడానికి రంగం సిద్ధమైంది. ఒక్క లింగంపేట మండలంలోనే నకిలీ పాసు పుస్తకాలతో కోటి రూపాయలకు పైగా పంట రుణాలను పొందినట్లు అధికారులు అంచ నాకు వచ్చారు. తవ్విన కొద్దీ నకిలీలు బయటపడుతున్నాయి. రికార్డుల పరిశీలన పాస్ పుస్తకాలలో నమోదు చేసిన వ్యవసాయ భూముల సర్వే నంబర్లను వన్‌బీ రికార్డులలో ఉందాలేదా అని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. కొందరు రెవెన్యూ సిబ్బంది, అధికారులు డబ్బులకు ఆశపడి తహసీల్దార్, ఆర్డీఓ స్థాయి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేశారు. ఒక్కో రైతు నుంచి రూ. ఐదు వేల నుంచి రూ. పది వేలు దండుకుని వీటిని వారికి అంటగట్టారు. నకిలీ పుస్తకాలతో కొందరు దర్జాగా బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. లింగంపేట మండలంలో సుమారు మూడు వేలకు పైగా నకిలీ పాసుపుస్తకాలు ఉన్నట్లు తేలింది. మచ్చుకు కొన్ని మెంగారం గ్రామానికి చెందిన ఓ మహిళ భూమి లేకపోయినా సర్వే నంబర్194/ఆ, 253/1/1 (పాస్ పుస్తకం నంబర్ 325364, ఖాతా నంబర్ 5033తో స్థానిక ఇండి యన్ ఓవర్సీస్ బ్యాంకులో రూ. 83 వేల పంట రుణం పొందినట్లు అధికారులు గుర్తించారు. అయ్యపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు ఒకే పట్టా నంబర్, ఒకే పాస్ పుస్తకంపై నాలుగు సార్లు పంట రుణం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రుణమాఫీ తర్వాత 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు రుణమాఫీ చేసి తిరిగి రుణాలు ఇవ్వడంతో, రుణాలు పొందడానికి రైతులు పోటీ పడ్డారు. ఆ సమయంలోనే కొ ందరు రెవెన్యూ అధికారులు,సిబ్బంది కలిసి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. లింగంపేట మండలంలోని నల్లమడుగు, శెట్పల్లిసంగారెడ్డి, లింగంపేట,సింగిల్ వి ండోలతో పాటు స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు పొందినట్లు తెలిసింది. మండలంలోని ముంబాజాపేట తండా, కొండాపూర్ తండా, ముంబాజీపేట, భవానీపేట గ్రామాలకు చెందిన కొందరు ఇలా రూ. 20 లక్షల పంట రుణాలను పొందినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు రైతులకు అసలు వ్యవసాయ భూమి లేక పోవడం, మరికొందరికి పట్టానంబర్లు లేకపోవడం,మరికొందరివి ఖాతా నం బర్లు లేకపోవడంతో అధికారులు రాత్రింబవళ్లు పరిశీలన చేపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో నకిలీల బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది. -
రైతన్న ఇంట.. సిరుల పంట
కూరగాయల సాగు రైతన్నలకు సిరులు కురిపిస్తోంది. తక్కువ పె ట్టుబడితో కచ్చితమైన లాభాలను తీసుకువస్తోంది. కావాల్సిందల్లా కష్టపడేతత్వం, మార్కెట్ చేసుకునే చాతుర్యం. మోతె గ్రామానికి చెందిన దాసరి గంగామణి, గంగారెడ్డి దంపతులు కూరగాయలు సాగు చేస్తూ వ్యవసాయం లాభసాటని నిరూపిస్తున్నారు. లింగంపేట : తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే కూరగాయలు చేతికి వస్తాయంటున్నారు యువరైతు గంగారెడ్డి. ఆయన కొన్నేళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో ఆయనకు భార్య గంగామణి చేదోడువాదోడుగా ఉంటున్నారు. కూరగాయల సాగుతో సుమారు రెండు నెలల వ్యవధిలో రూ. 50 వేల లాభం పొందానని ఆయన పేర్కొన్నారు. కూరగాయల సాగు గురించి ఆయన మాటల్లోనే.. ‘‘నేను కొన్నేళ్లుగా కూరగాయల సాగునే నమ్ముకున్నాను. నాకున్న 30 గుంటల వ్యవసాయ భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాను. ఈ ఖరీఫ్ సీజన్లో మూడు నెలల క్రితం భూమిని రెండుసార్లు బాగా లోతుగా దున్నించాను. మట్టి పొడిపొడిగా అయ్యేలా దున్నడం వల్ల మొక్కల వేర్లు భూమిలోనికి వెళతాయి. మొక్క బలంగా పెరుగుతుంది. దుక్కిలో పశువుల పేడ, కోళ్ల ఎరువు చల్లాను. రెండు నెలల క్రితం కాకర, బీర, వంకాయ హైబ్రిడ్ విత్తనాలను విత్తాను. పది వరుసలలో వంకాయ, ఆ తర్వాత రెండు వరుసలలో కాకరకాయ, మళ్లీ పది వరుసలలో వంకాయ, ఆ తర్వాత ఒక వరుసలలో బీరకాయ విత్తనాలు వేశాను. ఇలా పొలం అంతా చేశాను. బీర, కాకరకాయలు తీగజాతికి చెందినవి. అందువల్ల వీటి కోసం మధ్యమధ్యలో పొడవైన కర్రలను పాతాను. వారానికోసారి నీటి తడి అందించాను. వంకాయ మొక్కలు మీటరు ఎత్తు పెరిగాయి. బీర, కాకర కాయలు తీగలు పారాయి. నెల రోజులనుంచి పంట చేతికి వస్తోంది. కామారెడ్డి, గాంధారి, లింగంపేట మార్కెట్లతోపాటు వార సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. పెట్టుబడి వివరాలు భూమిని దున్నడానికి రూ. 2,500, విత్తనాలకు రూ. 1,500, ఎరువులకు రూ. 1,600, పురుగుల మందులకు రూ. 800, ఇతరత్రా రూ. 2 వేల వరకు ఖర్చయ్యాయి. దిగుబడులు.. కాకర కాయలను విక్రయించగా రూ. 18 వేలు, బీరకాయలను విక్రయించగా రూ. 16 వేలు, వంకాయలను విక్రయించగా రూ. 24 వేల ఆదాయం వచ్చింది. బీర, కాకర కాయలు మరో పదిహేను రోజుల వరకు కాస్తాయి. వంకాయ ఇంకా నెల వరకు కాస్తుంది’’ అని గంగారెడ్డి వివరించారు. పెట్టుబడులుపోను ఇప్పటికి రూ. 50 వేలవరకు మిగిలాయని పేర్కొన్నారు. -
పంటల్లో చీడపీడలు
లింగంపేట : ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలకు జీవం వచ్చింది. అయితే వాతావరణంలో మార్పుల వల్ల సోయా, వరి పంటలకు చీడపీడలు ఎక్కువయ్యాయి. జిల్లాలో చాలా చోట్ల సోయా, వరి పంటలను కాండం తొలుచు పురుగు, బొంతపురుగు, పాముపొడ తెగులు ఆశిస్తున్నాయని, ఇవి పంటలకు నష్టం కలిగిస్తాయని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి రమేశ్ పేర్కొన్నారు. మూడు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడం, ఆకాశం మేఘావృతమై ఉండడంతో కాండం తొలుచు పురుగు ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతులు పంటలను నిత్యం గమనించాలని, పురుగులు, తెగుళ్ల లక్షణాలు కనిపించగానే సస్య రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. నివారణ చర్యలు మండలంలో సోయా పంట ప్రస్తుతం కాత దశలో ఉంది. చాలా చోట్ల కాండం తొలుచు పురుగు ఆశించింది. దీని నివారణకు ట్రైజోపాస్ 200ల గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బొంత పురుగు నివారణకు ఎసిఫేట్ 400ల గ్రాములు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వరిలో పాముపొడ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ లేదా హెక్సాకొనజోల్ 400 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. కాండం తొలుచు పురుగు నివారణ కోసం ప్రొఫెనోపాస్ 400ల మిల్లీ లీటర్ల మందు లేదా లాంబ్డా 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. వరి చిరుపొట్ట దశలో ఎకరానికి 15 నుంచి 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే రసాయన ఎరువును తప్పనిసరిగా వాడాలి. పొటాష్ వాడకం వల్ల గింజ నాణ్యత బాగా పెరుగుతుంది. వరి పొట్ట దశలో నత్రజని తక్కువగా ఉపయోగించాలి. యూరియా ఎక్కువగా వేస్తే గింజ గట్టి పడే దశలో మెడవిరుపు తెగులు(నెక్బ్లాస్ట్) ఆశించి దిగుబడులు తగ్గుతాయి. -
పాస్ పుస్తకాలు మాయం
లింగంపేట : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సీజ్ చేసి ఉంచిన పట్టాదారు పాస్ పుస్తకాలు మాయమయ్యా యి. గతేడాది అక్టోబర్‌లో అప్పటి జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ సుమారు 2 వందలకుపైగా పాస్ పుస్తకా లు, మరికొన్ని డాక్యుమెంట్లను అప్పటి లింగంపేట వీ ఆర్వో కిష్టారెడ్డి రూంలో నుంచి స్వాధీనం చేసుకుని సీ జ్ చేశారు. అనంతరం వాటిని తహసీల్ కార్యాలయం లో భద్రపరిచారు. కాగా గురువారం పలువురి సమక్షం లో తహశీల్దార్ సీజ్ చేసిన పాస్ పుస్తకాల మూటలను విప్పగా అందులో కేవలం 24 పట్టాదారు పాసు పుస్తకాలు మాత్రమే ఉండడంతో అధికారులు, ఆయా గ్రా మాల రైతులు విస్తుపోయారు. కాగా తహశీల్ కార్యాల యం నుంచి వందల సంఖ్యలో పట్టాపాస్ పుస్తకాలు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులకు కక్కుర్తి పడి ఒకరిద్దరు రెవెన్యూ సి బ్బంది కార్యాలయం నుంచి మాయం చేశారనే విమర్శ లు వినిపిస్తున్నాయి. నకిలీ పాసు పుస్తకాల వ్యవహారం లో అప్పటి తహశీల్దార్ టీఆర్.ఉమ, వీఆర్వో కిష్టారెడ్డి ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అందుకు బాధ్యులైన మరికొందరిపై కోర్టులో కేసు నడుస్తోంది. కాగా సీజ్ చే సిన వాటిలో నుంచి నకిలీ పాస్ పుస్తకాలు లేకుండా చే సి తప్పిదానికి పాల్పడ్డ అధికారులకు ఆసరా అందించ డం కోసం పాస్ పుస్తకాలను మాయం చేశారా!లేక డ బ్బులకు ఆశపడి అమ్ముకున్నారా!అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాగా పాస్ పుస్తకాలు, టైటిల్డీడ్లు మాయం కావడంపై తహశీల్దార్ సాలన్బీ యాహ్యాను ‘సాక్షి’ ప్రశ్నించగా జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్‌కు , కామారెడ్డి ఆర్డీఓకు వివరిస్తామన్నారు. తాను కొత్తగా వచ్చానని తనకేమీ తెలియదన్నారు. ఏడు పాస్ పుస్తకాలు స్వాధీనం లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామంలో బొ ల్లి సాయికుమార్ అనే వ్యక్తి ఇంటి నుంచి గురువారం ఏడు పట్టాదారు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వీఆర్వో రవికుమార్ తెలిపారు. సాయికుమార్ ఇంట్లో పాస్ పుస్తకాలు ఉన్నట్లు సమాచారం అందడం తో వెళ్లి పరిశీలించగా లభించాయన్నారు. ఇందులో మాల కమ్మరి చిన్న కాశయ్య(ముస్తాపూర్), ముత్తిరాజ య్య(శెట్పల్లి), పూజల రుక్మాబాయి, లంబాడి లక్ష్మి, ఇసాల్గారి సాయిలు(లింగంపేట), మన్నె ఆగమయ్య, బిక్కల సాయవ్వ(ఐలాపూర్)కు చెందిన పాస్ పుస్తకా లు లభించాయి. వీటిని తహశీల్దార్‌కు అందిస్తానని వీ ఆర్వో చెప్పారు. నాలుగు గ్రామాలకు చెందిన రైతుల పాస్పుస్త కాలు దొరకడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయికుమార్ గతంలో స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో పైరవీలు చేసి పలువురు రై తులకు రుణాలు ఇప్పించేవాడని, అందుకే అతడి దగ్గ ర పాస్ బుక్కులు దొరికి ఉంటాయని స్థానికులు చెప్పారు. -
నక్సల్స్‌తో సమాజానికి కీడు
లింగంపేట(చందుర్తి), న్యూస్‌లైన్ : సమాజానికి నక్సలైట్లు ఏ విధంగానూ ఉపయోగపడరని ఎస్పీ వి.శివకుమార్ అన్నారు. పోలీసులతో నక్సలిజం పారిపోలేదని, సమాజ తిరస్కరణతోనే పొరుగు రాష్ట్రాలకే కార్యకలాపాలు పరిమితం చేశారని అన్నారు. చందుర్తి మండలం లింగంపేట శివారులో.. నక్సల్స్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, ప్రజలస్మృతికి చిహ్నంగా నిర్మించిన స్మారక స్తూపాన్ని గురువారం సాయంత్రం ఎస్పీ, ఓఎస్డీ సుబ్బారాయుడులు ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ, అమాయకులను ఇన్ఫార్మర్ల పేరుతో బలితీసుకుంటూ మావోయిస్టులు ఉనికి చాటుకుంటున్నారని విమర్శించారు. నక్సల్స్ ఘాతుకాలకు బలైన ఎందరో పోలీసుల కుటుంబాలు వీధినపడ్డాయన్నారు. వనజీవనాన్ని గడుపుతున్న నక్సలైట్లను ఆలోజింపజేసేందుకు సారంగపూర్ మండలం బీర్పూర్లో అంతర్మథనం కార్యక్రమం నిర్వహించామని, వారు జనజీవన స్రవంతిలో కలిస్తే తాము ఆదుకుంటామని చెప్పారు. నక్సల్స్ తప్పిదాల ఫలితంగానే గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శిం చారు. ప్రజల సహకారంతో పోలీసులం ఏమైనా సాధిస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాల యువతకు ఉపాధి కల్పించాలనే పోలీసుభరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామయని పేర్కొన్నారు. ఓఎస్డీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, హింసావాదులను తరిమికొట్టి, అభివృద్ధి కి చేయూతనందించే బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నా రు. మందపాతరకు బలైన ఎస్సై శ్రీనివాస్‌రావు భార్య సుజాత, నక్సల్స్ హింసాత్మక సంఘటనల్లో మృతి చెంది న వారి కుటుంబాలు, డీఎస్పీలు డి. నర్సయ్య, వేణుగోపాల్‌రావు, సీఎన్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాస్, నాగేంద్రాచారి, రంగయ్యగౌడ్, దేవారెడ్డిలు, ఎస్సైలు ప్రతాప్, మాలకొండరాయుడు, కనుకయ్య ఉన్నారు. -
వాట్ ఎన్ ఐడియా
లింగంపేట, న్యూస్‌లైన్ : అడవులు అంతరించిపోతుండడం, అటవీ భూములు ఆక్రమణలకు గురవుతుండడం, వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతుండడంతో ఆ శాఖ అధికారులపై అనేక విమర్శలు వచ్చాయి. ఎక్కువగా గిరిజనులే అటవీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు. వారు చెట్లను నరికి, భూములను చదు ను చేసి పంటలు పండిస్తున్నారు. అధికారులు కేసులు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు. అటవీ శాఖ అధికారులకు గిరిజనుల భాష రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు ఏం చెబుతున్నారో.. గిరిజనులు ఏం సమాధానం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది. దీంతో గిరిజనులు అధికారులపై దాడులు చేసిన సంఘటనలూ ఉన్నాయి. ఈ పరిస్థితిని నిరోధించడానికి అటవీ శాఖ అధికారులు కసరత్తు చేశారు. వారికి ఓ ఐడియా తట్టింది. అడవులను ఆక్రమిస్తున్న గిరిజనులకే అటవీ భూముల సంరక్షణ బాధ్యత అప్పగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని భావించారు. వెంటనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంపులో ఐదుగురు నిరుద్యోగ గిరిజనులను ఎంపిక చేసి ఉద్యోగావకాశాలు కల్పించారు. జనవరి నుంచి బేస్ క్యాంపులు పనిచేస్తున్నాయి. గతేడాది అటవీ భూముల ఆక్రమణలు ఎక్కువగా జరిగిన లింగంపేట మండలం ఎక్కపల్లి తండా(ఎల్లారెడ్డి రేంజ్‌లోని బొల్లారం సెక్షన్లో ఉంది)లో అదే తండాకు చెందిన మున్యానాయక్ అనే యువకుడిని టీంలీడర్‌గా నియమించి బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇలా జిల్లాలో ఏడు క్యాంపులు పనిచేస్తున్నాయి. అదే విధంగా అటవీ శాఖలో కొత్తగా స్ట్రైకింగ్ ఫోర్స్ పేరిట మరికొన్ని బృందాలను కూడా నియమించారు. ఈ విధానం వల్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు అడవులను, అటవీభూములను, వన్యప్రాణులను సంరక్షించవచ్చన్నది అటవీ అధికారుల ఆలోచన. -
పరిష్కారానికి పది నిమిషాలు చాలు
లింగంపేట, న్యూస్‌లైన్ : సమస్య చిన్నదే.. పట్టించుకుంటే పది ని మిషాల్లోనే తీరిపోతుంది. అధికారుల నిర్లక్ష్యంతో పరిష్కారానికి నోచుకోక తండావాసుల పాలిట పెద్ద కష్టంగా మారింది. గొంతు తడుపుకోవాలంటే పంటలకు పారించే నీటిపంపు దగ్గరికి పోవాల్సిందే. అక్కడా కరెంటు ఉంటేనే నీళ్లు దొరుకుతాయి. తాగునీటి కోసం కరెంటు వచ్చీపోయే సమయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. పొద్దునా.. రాత్రి.. అనే తేడా లేదు. ఎప్పుడు కరెంటు వస్తే అప్పుడు బిందెలు పట్టుకుని పంటచేళ్లకు పరుగెత్తాల్సిందే. తండాకు అరకిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోర్లవద్ద నుంచి నీళ్లను తెచ్చుకోవాల్సిందే. లింగంపేట మండలం మోతె గ్రామపంచాయతీ పరిధిలోని బట్టిప్పగడ్డ తండావాసులు రెండేళ్లుగా తాగునీటి కోసం తిప్పలు పడుతూనే ఉన్నారు. రెండేళ్లుగా తాగునీటి కోసం బట్టిప్పగడ్డ తండాలో వేసిన బోరుమోటార్ రెండేళ్ల కిందట కాలిపోయింది. అప్పటి నుంచి మరమ్మతులు చేయించాలని తండావాసులు అధికారులకు, పాలకులకు చెబుతూనే ఉన్నారు. కానీ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మారుమూల తండా కావడంతో ఉన్నతాధికారులు సైతం ఈ వైపు కన్నెత్తి చూడటం లేదు. బోరు మోటారు పనిచేయక పోవడంతో మంచినీటి ట్యాంకు నిరుపయోగంగా మారింది. వ్యవసాయ బావులే దిక్కు అధికారులు, పంచాయతీ పాలకులు కాలిన బోరుమోటారుకు మరమ్మతు లు చేయించక పోవడంతో గిరిజనులు వ్యవసాయ బోర్లపై ఆధారపడుతున్నారు. తండా సమీపంలోని పంటచేళ్లలో వేసిన బోరుబావుల వద్ద నుంచి నీ టిని తెచ్చుకుంటున్నారు. త్రీఫేజ్ కరెంట్ ఉంటేనే ఆ నీరు దొరుకుతుంది. క రెంట్ లేని సమయంలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. రెండేళ్లుగా తంటాలు పడుతున్నామని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని తండావాసులు కోరుతున్నారు. -
లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తాం..
లింగంపేట, న్యూస్‌లైన్ : రబీ సీజన్‌కుగాను జిల్లాలోని రైతులకు లక్ష టన్నుల యూరియాను సరఫరా చేస్తామని డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ అన్నారు. శుక్రవారం ఆయన లింగంపేటలో *30 లక్షలతో నిర్మిస్తున్న సింగి ల్విండో గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో యూరియాను అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 33 వేల టన్నుల యూ రియా నిల్వ ఉందన్నారు. వారం రోజుల్లో యూరి యాను కొనుగోలు చేస్తే, మరో 67 వేల టన్నుల యూరియా జిల్లాకు చేరుకుంటుందన్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో లక్షా 15వేల టన్నుల మొక్క జొన్నలను కొనుగోలు చేశామన్నారు. చైర్మన్‌కు సన్మానం డీసీసీబీ చైర్మన్‌ను స్థానిక సింగిల్‌విండో చైర్మన్,డీసీసీబీ డెరైక్టర్ ఎదురుగట్ల సంపత్‌గౌడ్, స్థానిక ఎన్డీసీసీ బ్యాంకు మేనేజర్గోపాల్రెడ్డి శాలువాకప్పి సన్మానించారు. రబీలో పంటరుణాలుగా *220కోట్లు నాగిరెడ్డిపేట : ఈ యేడు రబీసీజన్‌లో జిల్లాలోని సహకార సంఘాల ద్వారా రైతులకు *220కోట్లు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఈ యేడు జిల్లాలోని సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 10లక్షల క్వింటాళ్ల ధాన్యం, లక్షా15వేల క్వింటాళ్ల మక్కలను సేకరించామన్నారు. వారంరోజుల్లో సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కొనుగోలుకేంద్రాల్లో ధాన్యాన్ని తూకంవేసిన కూలీలకు రెండేళ్లుగా హమాలీడబ్బులు బకాయిపడ్డాయన్నారు. ధా న్యం సేకరణ పూర్తయిన వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మండలకేంద్రంలో సహకార బ్యాంకు భవన నిర్మాణానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. అనంతరం బ్యాంకుభవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జనార్ధన్గౌడ్తో కలిసి ఆయన పరిశీలించారు. -
లింగంపేట తహసీల్దార్ సస్పెన్షన్
లింగంపేట, న్యూస్‌లైన్: నకిలీ పహాణీ పత్రాల వ్యవహారం లింగంపేట తహసీల్దార్ టీఆర్ ఉమ మెడకు చుట్టుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆమెను సస్పెండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ పహాణీ పత్రాలు అందిస్తున్నారని లింగంపేటకు చెందిన కాముని శ్రీనివాస్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జేసీ హర్షవర్ధన్ శుక్రవా రం విచారణ జరిపారు. తహసీల్దార్ ఉమ తన డిజిటల్ సిగ్నేచర్ ను ప్రైవేట్ ఆపరేటర్ మహేశ్‌గౌడ్‌కు ఇచ్చారని, దాని ఆధారంగా అతడు నకిలీ పహాణీ పత్రాలు తయారు చేశాడని విచారణలో తే లింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ వెంటనే ఉమను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కంట తడిపెట్టిన తహసీల్దార్ సాయంత్రం సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకున్న తహసీల్దార్ టీఆర్ ఉమ కార్యాలయంలో కంటతడి పెట్టారు. చురుకుగా పనిచేస్తున్నాడని మహేశ్‌గౌడ్‌కు డిజిటల్ సిగ్నేచర్, పాస్వర్డ్ కీ అందించాననీ, నమ్మినందుకు తన కొంప ముంచాడని వాపోయారు. ఆర్డీఓ తన వివరణ అడుగకుండానే సస్పెన్షన్‌కు సిఫారసు చేసారని ఆవేదన వ్య క్తం చేశారు. తహసీల్ కార్యాలయంలో పోలీసుల సోదాలు నకిలీ పహణీ పత్రాల వ్యవహారంలో ఎస్ఐ పల్లె రాకేశ్ శనివారం తహసీల్ కార్యాలయంలో సోదాలు చేసారు. కంప్యూటర్ ఆపరేట ర్ మహేశ్‌గౌడ్ తన పేరుపై తయారు చేసుకున్న నకిలీ పహాణీల పై ఆరా తీశారు. లింగంపేట శివారులో సర్వే నంబర్ 636/11, 636/12లో 4.20 ఎకరాల భూమి ఉన్నట్టుగా ‘మీసేవ ’ద్వారా పహాణీలు పొందడంపై ఎస్ఐ డిప్యూటీ తహసీల్దార్ బైరయ్యను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులలో మహేశ్‌గౌడ్ పేరు న భూములు ఉన్నాయా లేదా అని పహాణీలను పరిశీలించగా లేవని తేలింది. మరికొన్ని రికార్డులను పరిశీలించారు.