లింగంపేట, న్యూస్‌లైన్: నకిలీ పహాణీ పత్రాల వ్యవహారం లింగంపేట తహసీల్దార్ టీఆర్ ఉమ మెడకు చుట్టుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆమెను సస్పెండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ పహాణీ పత్రాలు అందిస్తున్నారని లింగంపేటకు చెందిన కాముని శ్రీనివాస్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కామారెడ్డి ఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, జేసీ హర్షవర్ధన్ శుక్రవా రం విచారణ జరిపారు. తహసీల్దార్ ఉమ తన డిజిటల్ సిగ్నేచర్ ను ప్రైవేట్ ఆపరేటర్ మహేశ్‌గౌడ్‌కు ఇచ్చారని, దాని ఆధారంగా అతడు నకిలీ పహాణీ పత్రాలు తయారు చేశాడని విచారణలో తే లింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ వెంటనే ఉమను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కంట తడిపెట్టిన తహసీల్దార్
సాయంత్రం సస్పెన్షన్ ఉత్తర్వులు అందుకున్న తహసీల్దార్ టీఆర్ ఉమ కార్యాలయంలో కంటతడి పెట్టారు. చురుకుగా పనిచేస్తున్నాడని మహేశ్‌గౌడ్‌కు డిజిటల్ సిగ్నేచర్, పాస్‌వర్డ్ కీ అందించాననీ, నమ్మినందుకు తన కొంప ముంచాడని వాపోయారు. ఆర్‌డీఓ తన వివరణ అడుగకుండానే సస్పెన్షన్‌కు సిఫారసు చేసారని ఆవేదన వ్య క్తం చేశారు.
తహసీల్ కార్యాలయంలో పోలీసుల సోదాలు
నకిలీ పహణీ పత్రాల వ్యవహారంలో ఎస్‌ఐ పల్లె రాకేశ్ శనివారం తహసీల్ కార్యాలయంలో సోదాలు చేసారు. కంప్యూటర్ ఆపరేట ర్ మహేశ్‌గౌడ్ తన పేరుపై తయారు చేసుకున్న నకిలీ పహాణీల పై ఆరా తీశారు. లింగంపేట శివారులో సర్వే నంబర్ 636/11, 636/12లో 4.20 ఎకరాల భూమి ఉన్నట్టుగా ‘మీసేవ ’ద్వారా పహాణీలు పొందడంపై ఎస్‌ఐ డిప్యూటీ తహసీల్దార్ బైరయ్యను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులలో మహేశ్‌గౌడ్ పేరు న భూములు ఉన్నాయా లేదా అని పహాణీలను పరిశీలించగా లేవని తేలింది. మరికొన్ని రికార్డులను పరిశీలించారు.
లింగంపేట తహసీల్దార్ సస్పెన్షన్
Published Sun, Oct 6 2013 5:30 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement