కృష్ణా జిల్లా మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబాటు
సాక్షి, మచిలీపట్నం: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కొట్లు రవీంద్ర గురువారం రాత్రి కృష్ణా జిల్లా మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి రెవెన్యూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సమయం లేకపోవడంతో తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి కూడా పనిచేస్తున్నారు. వారు పేదల ఇళ్ల పట్టాల తయారీలో నిమగ్నమై ఉండగా రాత్రి 9:30 గంటల సమయంలో కొల్లు రవీంద్ర తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. కార్యాలయంలోకి చొరబడ్డారు.
రాత్రి వేళ రెవెన్యూ కార్యాలయంలో ఏదో చేస్తున్నారంటూ తహశీల్దార్, ఇతర అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. ఏం చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. వారు చేస్తున్న పనిని ఫొటోలు, వీడియోలు తీయాలంటూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. నకిలీ పట్టాలు, కన్వేయన్స్ డీడ్‌లు తయారు చేస్తున్నారంటూ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. వారి చేతుల్లోని ఫైళ్లు లాక్కొని పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో నినాదాలు చేశారు.
కలెక్టర్ దృష్టికి కొల్లు దౌర్జన్యం
తహసీల్దార్ కార్యాలయంలోకి కొల్లు రవీంద్ర, ఆయన అనుచరుల చొరబాటు, అధికారుల విధులకు ఆటంకం కల్పించడంపై తహసీల్దార్ పి. సతీష్ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుకు ఫిర్యాదు చేశౠరు. దీనిపై ఆయన స్పందించి జాయింట్ కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారు. దీనిపై జాయిట్ కలెక్టర్ విచారించి.. విధుల నిర్వహణ సక్రమంగానే ఉందని, సమయం తక్కువ ఉండటంవల్లే అధికారులు రాత్రి వరకు విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మొత్తం వ్యవహారంపై గురువారం రాత్రి తహశీల్దార్ పి. సతీష్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కార్యాలయ సిబ్బంది కొత్తగా వచ్చిన కన్వెయన్స్ డీడ్‌లు సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తుండగా కొల్లు రవీంద్ర 30 మందితో కార్యాలయంలోకి వచ్చారని, ఫోటోలు, వీడియోలు తీసి తన వివరణ కోరారని తెలిపారు. మచిలీపట్టణం మండలంలోని అర్బన్, రూరల్‌లో 18,119 నివాస స్థలాల ఎన్‌పీఐ కన్వెయన్స్ డీడ్‌లు ప్రింట్ చేశామని, ఇంకా 2,829 డీడ్‌లను పరిశీలన చేస్తున్నట్లు వివరించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment