
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో అధికారుల నిర్వాకం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫోటోలు వెలిశాయి. ధర్మవరం నియోజకవర్గానికి బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ధర్మవరం టీడీపీ ఇంఛార్జి గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు.
ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఫోటోలతో పాటు పరిటాల శ్రీరామ్ ఫోటోలను అధికారులు ఉంచారు. ఏ పదవి లేని పరిటాల శ్రీరామ్ ఫోటో ఉంచటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
