సాక్షి, ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు సర్కార్ డొల్లతనం బయటపడింది. బెల్టు షాపులకు ఐదు లక్షల జరిమానా విధించాలంటూ సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ధర్మవరంలో మాత్రం డబ్బులు తీసుకుని బెల్ట్ షాపులకు అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం లో ఓ టీడీపీ నేత వీడియో వైరల్‌గా మారింది. డబ్బులు తీసుకుని బెల్టుషాపులకు అనుమతిస్తున్నారంటూ ధర్మవరం టీడీపీ నేత మరస హరి ఆరోపిస్తున్నారు.
పోలీసులు అరెస్ట్ చేస్తే ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ముఖ్య నేతలు, అధికారులు లంచం తీసుకుని బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల వద్ద డబ్బు తీసుకుని మద్యం బెల్ట్ షాపులు కేటాయించడం సరికాదన్నారు. బీజేపీ నేతలతో మాట్లాడితే.. టీడీపీలో ఉండొద్దంటున్నారంటూ ధర్మవరం టీడీపీ నేత మరస హరి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment