రాజకీయ ఒత్తిడితో నిబంధనలకు పాతర
విజయవాడ సిటీ : జిల్లాలో దాదాపు 15 మంది తహశీల్దార్లను ఎక్కడి వారిని అక్కడ నియమించకుండా ఇష్టారాజ్యంగా బదిలీ చేయడంపై టీడీపీ నేతల హస్తం ఉందని పలువురు రెవెన్యూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇటీవల జరిగిన అక్రమ బదిలీలపై రెవెన్యూశాఖలో నిరసన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ అండదండలతో జిల్లా యంత్రాంగం జరిపిన అడ్డగోలు బదిలీలు ఈ విధంగా ఉన్నాయి.
జల్లాలో ఇటీవల జరిగిన అక్రమ బదిలీలపై తహశీల్దార్లలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రాజకీయ ఒత్తిడితో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారని పలువురు తహశీల్దార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విన్నవించుకోవడానికి కూడా అవకాశం లేకుండా నియంతృత్వంగా బదిలీలు జరిగాయని తహశీల్దార్లు గగ్గోలు పెడుతున్నారు. బదిలీలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోయినా ఎన్నికల విధులనుంచి తిరిగి జిల్లాలకు వచ్చిన 50 మంది తహశీల్దార్లను ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నేతలు తమతమ ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీరిలో కనీసం 15మందిని ఎమ్మెల్యేలు, మంత్రుల కోరికపై అక్రమంగా బదిలీచేశారని ఆరోపణలున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తమకు ఇష్టంలేని వారిని జిల్లా ముఖ్య అధికారికి చెప్పి అక్రమ పోస్టింగ్‌లు వేయించడం వివాదాస్పదమైంది. పలువురు తహశీల్దార్లు కూడా ఫైరవీలు చేసి పోస్టింగ్‌లు వేయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కేవలం కృష్ణాజిల్లాలోనే ఈ విధంగా అక్రమ బదిలీలు జరపడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జరిగింది ఇదీ..
దీనికి సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి. గత మార్చిలో ఎన్నికల కోడ్ ప్రకారం జిల్లా నుంచి 50మంది తహశీల్దార్లు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికల అనంతరం వారు గత నెలలో తిరిగి జిల్లాకు వచ్చారు. నిబంధనల ప్రకారం ఎక్కడి వారిని అక్కడే నియమించాల్సి ఉంది. ఇతర విభాగాల్లో పనిచేసేవారిని ఆ శాఖ ఉన్నతాధికారుల అనుమతితోనే బదిలీ చేయాల్సి ఉంటుంది. సాధారణ బదిలీల జీవో విడుదల కాకుండానే ఈ ప్రక్రియ పూర్తిచేయడంపై ఆవేదన చెందుతున్నారు.
టీడీపీ నేతల హస్తం ...
ఈ బదిలీల వెనుక టీడీపీ నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులపై పలువురు టీడీపీ నాయకులు కక్షగట్టి బదిలీలు చేయించినట్లు ఆరోపణలున్నాయి
తహశీల్దార్ల బది‘లీలలు’
Published Wed, Jul 2 2014 4:50 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement