Go Release
-
జీఓల విడుదలపై టీచర్ల హర్షం
అనంతపురం ఎడ్యుకేషన్: 25 ఏళ్లకు పైగా ఎదురు చూస్తున్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు కొలిక్కిరావడంతో ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన తర్వాత తాజాగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం 72, 73, 74 జీఓలను విడుదల చేసింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ 1998 నుంచి అమలు చేస్తూ 72 జీఓ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల నుంచి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు పదోన్నతులు కల్పించేందుకు 73 జీఓ, ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించేందుకు 74 జీఓను విడుదల చేసింది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అన్ని కేడర్ల పోస్టులకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న డైట్ అధ్యాపకులు, జూనియర్ అధ్యాపకులు, డెప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైందని నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆప్టా జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రజనీకాంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఏపీటీఎఫ్(1938) జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కులశేఖర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందు, రామన్న, బీఈడీ ఉపాధ్యాయ సంఘం నారాయణస్వామి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
మంత్రి గారడీ..కన్సల్టెన్సీ కంపెనీ దోపిడీ
♦ గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల్లో అవకతవకలు ♦ యూజీడీ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టులపై డీపీఆర్ సిద్ధం చేసిన కన్సల్టెన్సీపై పురపాలక శాఖ మంత్రి అతి ప్రేమ ♦ గుంటూరు ప్రాజెక్టులో నిబంధనలు మీరి మరీ కన్సల్టెన్సీ ఫీజు చెల్లింపులు ♦ జీవో విడుదల చేసి మరీ ప్రజాధనం చెల్లింపు ♦ గుంటూరు వాసి లోకాయుక్తను ఆశ్రయించడంతో వెలుగు చూసిన వైనం గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థల్లో చేపట్టిన యూజీడీ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు డీపీఆర్ రూపొందించిన కన్సల్టెన్సీ సంస్థకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఓ మంత్రి నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారు. నిబంధనల ప్రకారం అంచనా వ్యయంపై ఫీజు నిర్ణయించాల్సి ఉండగా నిర్మాణ సంస్థలు వేసిన టెండర్ల ప్రకారం ఫీజు నిర్ణయించి నిధులు ముట్టజెప్పారు. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. సాక్షి, గుంటూరు : రాజధాని నగరాలుగా ఉన్న గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థల పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పథకాలకు డీపీఆర్ తయారు చేసి ఇచ్చిన కన్సల్టెన్సీలపై పురపాలక శాఖ అతి ప్రేమ కనబరిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేస్తే అంచనా వ్యయంపై కాకుండా నిర్మాణ సంస్థలు టెండర్ వేసిన ధరపై పర్సంటేజీ చొప్పున కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జేఎన్ఎన్యూ ఆర్ఎం (జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్) నిధులతో జరిగే ఏ ప్రాజెక్టు పనులకైనా డీపీఆర్ తయారు చేస్తే గరిష్ఠంగా రూ. 2 కోట్లు మాత్రమే కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాలనే నిబంధన ఉందని అధికారులు చెబుతున్నారు. గుంటూరు నగరంలో చేపట్టే యూజీడీ పథకానికి మాత్రం అంచనా వ్యయంపై ఫీజులు చెల్లించి డీపీఆర్ తయారు చేసిన కన్సల్టెన్సీపై అతి ప్రేమ కనబరిచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కన్సల్టెన్సీకి అనుకూలంగా జీవో.. గుంటూరు నగరంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులపై 2014లో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసే బాధ్యతను అధికారులు ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. దీనిపై సదరు సంస్థ డీపీఆర్ తయారు చేసి ఇవ్వడం, నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించడమూ అన్నీ చకచకా జరిగిపోయాయి. 2016 సెప్టెంబర్ 27వ తేదీన కన్సల్టెన్సీ కంపెనీకి గుంటూరు, విజయవాడ నగరాల్లో కలిపి రూ.12.91 కోట్లు ఫీజు చెల్లించాలంటూ ఏపీ యూఎఫ్ఐడీసీ ఎండీకి ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 233 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు నగరపాలక సంస్థలు ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్సల్టెన్సీకి ఫీజులు చెల్లించాయి. గుంటూరు నగరపాలక సంస్థ రూ.7.69 కోట్లు, విజయవాడ నగరపాలక సంస్థ రూ.5.21 కోట్లు చొప్పున ఫీజులు చెల్లించాయి. ఎంపీ, మంత్రుల అండదండలతో... ఫీజు చెల్లించే సమయంలో అప్పటి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఎంత చెల్లింపులు చేయాలనే విషయంపై ప్రభుత్వం నివేదిక కోరింది. యూజీడీ పథకంలో అంచనా వ్యయం రూ.903 కోట్లు ఉండగా నిర్మాణ సంస్థ వేసిన టెండరు, పన్నులు మినహాయించి సుమారు రూ.600 కోట్లు మాత్రమే అని తేలింది. దీంతో ఆ మొత్తానికే డీపీఆర్ తయారు చేసిన కన్సల్టెన్సీకి ఫీజు చెల్లించాలంటూ అప్పటి కమిషనర్ లేఖ కూడా రాసినట్లు సమాచారం. తర్వాత అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ కన్సల్టెన్సీకి నష్టం కలుగుతుందని అంచనా వ్యయంపై వారికి ఫీజులు చెల్లించాలంటూ లేఖ రాసినట్లు తెలిసింది. ఎంపీ లేఖపై చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ పురపాలక శాఖ మంత్రి ఆదేశించినట్లు సమాచారం. దీంతో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే యూజీడీ పథకానికి అంచనా వ్యయంపైనే కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు ఏపీ యూఎఫ్ఐడీసీ ద్వారా జీఎంసీ, వీఎంసీలు కన్సల్టెన్సీ ఫీజులు చెల్లించాలంటూ జీవో విడుదల చేసింది. దీంతో గుంటూరు నగరపాలక సంస్థ కన్సల్టెన్సీ ఫీజులు చెల్లించేసింది. అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జేఎన్ఎన్యూ ఆర్ఎం ద్వారా జరిగే ఏ ప్రాజెక్టుకైనా డీపీఆర్ తయారు చేసే కన్సల్టెన్సీకి గరిష్ఠంగా రూ.2 కోట్లు మాత్రమే ఫీజు చెల్లించాలని నిబంధన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బిగుస్తున్న ఉచ్చు.. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కన్సల్టెన్సీకి అధిక ఫీజులు చెల్లించారంటూ గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీనిపై పూర్తి వివరాలు పంపాలంటూ లోకాయుక్త నుంచి ఉత్తర్వులు రావడంతో అధికారులు సమాచారం పంపినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలతో పాటు ఉన్నతాధికారుల ప్రమేయం ఉండటంతో ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయంతో అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు. -
పేరిణీకి పూర్వ వైభవం
♦ కోర్సుల్లో అధికారికంగా చేర్పు ♦ జీఓ విడుదలపై కళాకారుల హర్షం సిద్దిపేట జోన్: తెలంగాణకు చెందిన కాకతీయ కాలం నాటి పేరిణీ నృత్యానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్వవైభవం సంతరింపజేసేందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పేరిణీ నృత్యాన్ని కోర్సు రూపంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకతీయ కాలంలో పేరిణీ నృత్యం విస్తృత ఆదరణ పొంది కొన్ని దశాబ్దాలుగా నిరాదరణకు గురైంది. దీంతో పేరిణీ కళకు రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు అందించేందుకు సంకల్పించింది. ఆ దిశగా పేరిణీ నృత్య కోర్సులను ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ముగ్గురు నిపుణులతో కూడిన నృత్య కోర్సును పాఠ్యాంశాలుగా రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు ఆదేశాలు జారీ చేయడంపై పేరిణీ కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేరిణీ నృత్యానికి గుర్తింపు తీసుకొచ్చే ప్రక్రియలను చేపట్టడం అభినందనీయమని సిద్దిపేటకు చెందిన ప్రముఖ పేరిణీ కళాకారులు పేరిణీ రమేష్‌లాల్, పేరిణీ సంతోష్, పేరిణీ మల్లేశం, పేరిణీ వాసు, పేరిణీ జయప్రద సంతోషం వ్యక్తం చేశారు. -
తహశీల్దార్ల బది‘లీలలు’
రాజకీయ ఒత్తిడితో నిబంధనలకు పాతర విజయవాడ సిటీ : జిల్లాలో దాదాపు 15 మంది తహశీల్దార్లను ఎక్కడి వారిని అక్కడ నియమించకుండా ఇష్టారాజ్యంగా బదిలీ చేయడంపై టీడీపీ నేతల హస్తం ఉందని పలువురు రెవెన్యూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇటీవల జరిగిన అక్రమ బదిలీలపై రెవెన్యూశాఖలో నిరసన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ అండదండలతో జిల్లా యంత్రాంగం జరిపిన అడ్డగోలు బదిలీలు ఈ విధంగా ఉన్నాయి. జల్లాలో ఇటీవల జరిగిన అక్రమ బదిలీలపై తహశీల్దార్లలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రాజకీయ ఒత్తిడితో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారని పలువురు తహశీల్దార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విన్నవించుకోవడానికి కూడా అవకాశం లేకుండా నియంతృత్వంగా బదిలీలు జరిగాయని తహశీల్దార్లు గగ్గోలు పెడుతున్నారు. బదిలీలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోయినా ఎన్నికల విధులనుంచి తిరిగి జిల్లాలకు వచ్చిన 50 మంది తహశీల్దార్లను ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నేతలు తమతమ ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో కనీసం 15మందిని ఎమ్మెల్యేలు, మంత్రుల కోరికపై అక్రమంగా బదిలీచేశారని ఆరోపణలున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తమకు ఇష్టంలేని వారిని జిల్లా ముఖ్య అధికారికి చెప్పి అక్రమ పోస్టింగ్‌లు వేయించడం వివాదాస్పదమైంది. పలువురు తహశీల్దార్లు కూడా ఫైరవీలు చేసి పోస్టింగ్‌లు వేయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కేవలం కృష్ణాజిల్లాలోనే ఈ విధంగా అక్రమ బదిలీలు జరపడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగింది ఇదీ.. దీనికి సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి. గత మార్చిలో ఎన్నికల కోడ్ ప్రకారం జిల్లా నుంచి 50మంది తహశీల్దార్లు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికల అనంతరం వారు గత నెలలో తిరిగి జిల్లాకు వచ్చారు. నిబంధనల ప్రకారం ఎక్కడి వారిని అక్కడే నియమించాల్సి ఉంది. ఇతర విభాగాల్లో పనిచేసేవారిని ఆ శాఖ ఉన్నతాధికారుల అనుమతితోనే బదిలీ చేయాల్సి ఉంటుంది. సాధారణ బదిలీల జీవో విడుదల కాకుండానే ఈ ప్రక్రియ పూర్తిచేయడంపై ఆవేదన చెందుతున్నారు. టీడీపీ నేతల హస్తం ... ఈ బదిలీల వెనుక టీడీపీ నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులపై పలువురు టీడీపీ నాయకులు కక్షగట్టి బదిలీలు చేయించినట్లు ఆరోపణలున్నాయి