ఆలోచనాత్మకం సర్కార్‌ బడి విద్యార్థుల ‘జాగో’ షార్ట్‌ ఫిల్మ్‌ | Jaago Short Film Maked Ekkapally Govt Teacher On Swachh Bharat | Sakshi
Sakshi News home page

ఆలోచనాత్మకం సర్కార్‌ బడి విద్యార్థుల ‘జాగో’ షార్ట్‌ ఫిల్మ్‌

Published Thu, Sep 2 2021 11:11 AM | Last Updated on Thu, Sep 2 2021 11:19 AM

Jaago Short Film Maked Ekkapally Govt Teacher On Swachh Bharat - Sakshi

కామారెడ్డి క్రైం: స్వచ్ఛత ఫిల్మోంకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జాతీయస్థాయిలో షార్ట్‌ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు అఖిల్‌ ఓ లఘుచిత్రాన్ని రూపొందించారు. స్వచ్ఛ భారత్‌ ప్రాధాన్యం తెలుపుతూ ‘జాగో’ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కించారని జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. చిన్నారులు నటించిన ‘జాగో’ ఈ లఘు చిత్రాన్ని పోటీలకు పంపించినట్లు చెప్పారు. పరిసరాల అపరిశుభ్రంతో తన స్నేహితుడు పాఠశాలకు రాకపోవడం అనే కథాంశంతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించారు. డైలాగ్‌లు లేకున్నా ఎంతో అర్థం వచ్చేలా ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఉంది. కేఎన్‌ఆర్‌ స్టూడియోస్‌ నిర్మించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను ఆలోచింపజేస్తోంది. గ్రామస్తుల సహకారంతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. మీరు ఈ షార్ట్‌ఫిల్మ్‌ చూసేందుకు క్లిక్‌ చేయండి

చదవండి: ఫైవ్‌స్టార్‌ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం

చదవండి: పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్‌ కేసు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement