Govt school teacher
-
ఏక్ నిరంజన్.. ఓ ఉపాధ్యాయుడి నిరీక్షణ
చిలుకూరు: ఆ పాఠశాలలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగినా ఎవరూ తమ పిల్లలను పాఠశాలకు పంపలేదు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొమ్మబండ తండా ప్రాథమిక పాఠశాల ప్రారంభంలో విద్యార్థులతో కళకళలాడింది. పదేళ్లుగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత విద్యాసంవత్సరం ఈ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆ ముగ్గురు విద్యార్థులు కూడా ఈ ఏడాది ప్రైవేట్ స్కూల్ బాటపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరని, ఇంగ్లిష్ మీడియంలో చెప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. రోజూ ఉపాధ్యాయుడు రావడం.. పాఠశాల తాళాలు తీయడం.. విద్యార్థుల కోసం ఎదురుచూస్తుండటం సాధారణమైంది. గ్రామంలో మొత్తం 103 ఇళ్లు, 700 జనాభా ఉంది. ఈ గ్రామం నుంచి ఆటోలో ప్రైవేట్ పాఠశాలకు సుమారు 10మంది వరకు వెళ్తారు. మిగిలిన కొందరు విద్యార్థులు జెర్రిపోతులగూడెం ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఐదు జిల్లాలపై సర్కార్ ఫోకస్.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు! -
ప్రభుత్వ పాఠశాల టీచర్ కు అరుదైన గౌరవం
-
ఆలోచనాత్మకం సర్కార్ బడి విద్యార్థుల ‘జాగో’ షార్ట్ ఫిల్మ్
కామారెడ్డి క్రైం: స్వచ్ఛత ఫిల్మోంకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయస్థాయిలో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు అఖిల్ ఓ లఘుచిత్రాన్ని రూపొందించారు. స్వచ్ఛ భారత్ ప్రాధాన్యం తెలుపుతూ ‘జాగో’ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారని జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. చిన్నారులు నటించిన ‘జాగో’ ఈ లఘు చిత్రాన్ని పోటీలకు పంపించినట్లు చెప్పారు. పరిసరాల అపరిశుభ్రంతో తన స్నేహితుడు పాఠశాలకు రాకపోవడం అనే కథాంశంతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించారు. డైలాగ్‌లు లేకున్నా ఎంతో అర్థం వచ్చేలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంది. కేఎన్ఆర్ స్టూడియోస్ నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఆలోచింపజేస్తోంది. గ్రామస్తుల సహకారంతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. మీరు ఈ షార్ట్‌ఫిల్మ్ చూసేందుకు క్లిక్ చేయండి చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం చదవండి: పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్ కేసు! -
విద్యార్థులతో టీచర్ మసాజ్...
రాయపూర్ః విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం విస్మయం కలిగించింది. ఛత్తీస్ గఢ్ జాష్ పూర్ జిల్లా లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థులతో బాడీ మసాజ్ చేయించుకోవడం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా వ్యాపించింది. స్థానిక తుమ్లా హై స్కూల్ లో పనిచేస్తున్న అనుప్ మింజ్.. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులను మసాజ్ చేయమనడం వీడియోలో వినియోగదారులను విస్మయపరుస్తోంది. తుమ్లా హైస్కూల్లో ఇంగ్లీష్ బోధించే మింజ్ తీరుపై చిత్రించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. వీడియో చూసిన తల్లిదండ్రులు మాస్టారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి, వారిలో జ్ఞానాన్ని పెంచాల్సిన ఉపాధ్యాయుడే.. వారు చదువుకునే సమయాన్ని చాకిరీ చేయించుకోడానికి వినియోగించడంపై మండి పడుతున్నారు. అంతేకాదు విషయంపై జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. వీడియోను ప్రత్యక్షంగా చూసిన అధికారులు సైతం మాస్టారి తీరును చూసి విస్తు పోయారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అయితే ఉపాధ్యాయుడు మాత్రం తాను జ్వరం, ఒళ్ళునొప్పులతో బాధపడటం చూడలేక.. విద్యార్థులే స్వయంగా తనకు మసాజ్ చేశారని, తనంతట తాను విద్యార్థులను మసాజ్ చేయమని కోరలేదని చెప్తున్నాడు. -
ఔటర్‌పై డీసీఎం ఢీకొని మహిళ మృతి
ఔటర్ రింగు రోడ్డుపై పెద్ద అంబర్‌పేటవద్ద ఆగి ఉన్న బైక్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మహిళ ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.