చిలుకూరు: ఆ పాఠశాలలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగినా ఎవరూ తమ పిల్లలను పాఠశాలకు పంపలేదు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొమ్మబండ తండా ప్రాథమిక పాఠశాల ప్రారంభంలో విద్యార్థులతో కళకళలాడింది. పదేళ్లుగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.
గత విద్యాసంవత్సరం ఈ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆ ముగ్గురు విద్యార్థులు కూడా ఈ ఏడాది ప్రైవేట్ స్కూల్ బాటపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరని, ఇంగ్లిష్ మీడియంలో చెప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. రోజూ ఉపాధ్యాయుడు రావడం.. పాఠశాల తాళాలు తీయడం.. విద్యార్థుల కోసం ఎదురుచూస్తుండటం సాధారణమైంది. గ్రామంలో మొత్తం 103 ఇళ్లు, 700 జనాభా ఉంది. ఈ గ్రామం నుంచి ఆటోలో ప్రైవేట్ పాఠశాలకు సుమారు 10మంది వరకు వెళ్తారు. మిగిలిన కొందరు విద్యార్థులు జెర్రిపోతులగూడెం ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ఐదు జిల్లాలపై సర్కార్ ఫోకస్.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు!
Comments
Please login to add a commentAdd a comment