సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘రేవంత్‌రెడ్డి( Revanth Reddy) ఢిల్లీని ఉద్దరిస్తానంటున్నారు.. తెలంగాణను ఉద్దరించలేనోడు ఢిల్లీని ఉద్దరిస్తాడా?’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బీఆర్‌ఎస్ రైతు దీక్ష(BRS Rythu Diksha)లో ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చామని ఢిల్లీలో సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
‘‘ప్రతీ ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇవ్వాలి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదు. రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. రైతులను సీఎం రేవంత్ మోసం చేశారు. కొండారెడ్డి పల్లె, కొడంగల్‌లో ఒక్క ఊర్లో అయినా పూర్తి స్థాయి రైతు రుణమాఫీ అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అని సవాల్ విసిరారు.
‘‘ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ అయ్యిందని.. రైతులు చెబితే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తా. మళ్ళీ ఓట్లకు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు.. గళ్ళ పట్టుకొని రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులు ఎక్కడని అడగండి’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment