rythu deeksha
-
రేవంత్‌వి దొంగ మాటలు: కేటీఆర్
సాక్షి,మహబూబ్‌నగర్‌జిల్లా: సీఎం రేవంత్ ఏ ఒక్క హామీనైనా అమలు చేశారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం(ఫిబ్రవరి 18) అమన్‌గల్‌ల్‌లో జరిగిన రైతుదీక్షలో కేటీఆర్ మాట్లాడారు.‘సీఎం రేవంత్ 420 హామీలు ఇచ్చారు. రైతుబంధు, రుణమాఫీ ఎవరికైనా వచ్చాయా. తులం బంగారం వచ్చిందా. ఏదీ రాలేదు.దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ కొడంగల్‌కు, తల్లి గారి ఊరికి, అత్తగారి ఊరికి ఎవరికీ ఏమీ చేయలేదు. 42 శాతం రిజర్వేషన్లని చెప్పి బీసీలను మోసం చేసిండు. రైతులను మోసం చేసిండు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాడు. సన్యాసి రేవంత్‌కు పాలన చేతనైతలేదు ’అని కేటీఆర్ ఫైరయ్యారు. -
బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు(Telangana High Court) అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్(BRS Party) భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నల్లగొండ పట్టణంలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని, వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ధర్నాకు ఒకరోజు ముందు అనుమతి నిరాకరించడం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి.బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణకు పోలీసులు పలు కారణాలను వెల్లడించారు. నల్లగొండ డీఎస్పీ పేరుతో లేఖను అందజేశారు. గడియారం సెంటర్లో తలపెట్టిన మహా ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్న సమాచారం తమకు ఉందని అందులో పేర్కొన్నారు. అయితే గడియారం సెంటర్లో అందుకు సరిపడా స్థలం లేదని, అన్ని రోడ్లకు జంక్షన్ అయిన గడియారం సెంటర్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పైగా అటునుంచి రాకపోకలు సాగించే వాహనాలను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవని, పార్కింగ్ సమస్య ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్మరోవైపు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక, ఇతర పథకాలకు లబ్ధిదారులు గుర్తింపు కోసం ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయని, పోలీస్ యంత్రాంగం అంతా ఆ బందోబస్తులో ఉంటుందని వివరించారు. మరోవైపు సంక్రాంతికి వెళ్లిన ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిన వారంతా హైదరాబాద్ వస్తున్నందున జాతీయ రహదారిపై కూడా రద్దీగా ఉంటోందని, ఈ పరిస్థితిలో మహాధర్నాకు వచ్చే జనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున అనుమతి ఇవ్వలేకపోతున్నట్లు లేఖలో వివరించారు.ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ) మధ్యాహ్నం సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఇవాళ.. ఈ నెల 28న ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. -
రేపటి కేటీఆర్ నల్లగొండ పర్యటన రద్దు
-
తెలంగాణను ఉద్దరించలేనోడు.. ఢిల్లీని ఉద్దరిస్తాడా?: కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘రేవంత్‌రెడ్డి( Revanth Reddy) ఢిల్లీని ఉద్దరిస్తానంటున్నారు.. తెలంగాణను ఉద్దరించలేనోడు ఢిల్లీని ఉద్దరిస్తాడా?’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బీఆర్ఎస్ రైతు దీక్ష(BRS Rythu Diksha)లో ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చామని ఢిల్లీలో సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.‘‘ప్రతీ ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇవ్వాలి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదు. రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. రైతులను సీఎం రేవంత్ మోసం చేశారు. కొండారెడ్డి పల్లె, కొడంగల్‌లో ఒక్క ఊర్లో అయినా పూర్తి స్థాయి రైతు రుణమాఫీ అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అని సవాల్ విసిరారు.‘‘ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ అయ్యిందని.. రైతులు చెబితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తా. మళ్ళీ ఓట్లకు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు.. గళ్ళ పట్టుకొని రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులు ఎక్కడని అడగండి’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ? -
రేపు ‘బండి’ రైతుదీక్ష
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం మరోమారు జంగ్‌సైరన్ మోగించారు. అకా లవర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం అందించలేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో సాగునీరందక పంటలు ఎండిపోతు న్నా పట్టించుకోలేదని పంటల బీమాపథకాన్ని అమలు చేయలేదని, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్కహామీ కూడా అమలు చేయలేదని ఆరోపిస్తూ ‘రైతుదీక్ష’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. మంగళవా రం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ ఆధ్వర్యంలో ‘రైతు దీక్ష’ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు. వడ్ల కల్లాల వద్ద రైతులు పడుతున్న బాధలను, తాలు, తేమ, తరుగు పేరుతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవసరమైతే వడ్లకల్లాల వద్ద బండి సంజయ్ బస చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... రైతుల పక్షాన మంగళవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే ‘దీక్ష’కు అన్ని వర్గాలు మద్దతివ్వాలని కోరారు. కాగా, సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు ఆయన వినతిపత్రాలు అందించనున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే ’’పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలి. ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలి. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతో పాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.’’ -
వరిసాగు ,రైతుల సమస్యలపై బండి సంజయ్ దీక్ష
-
తెలంగాణ: అటు కేబినెట్ భేటీ, ఇటు దీక్షలు
సాక్షి, హైదరాబాద్ : పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రైతు సంక్షేమ దీక్ష చేపట్టనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేపడతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అన్ని జిల్లాల డీసీసీ కార్యాలయాల్లో దీక్షలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. దీక్ష సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. కాగా, కరోనా వైరస్ కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికి తీసుకెళ్లింది. నేడు టీజేఎస్ మౌన దీక్ష రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆకలి, రైతు, వలస కూలీల అవస్థల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మంగళవారం టీజేఎస్ ఆధ్వర్యంలో మౌన నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఈ దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి, రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టేలా చూడాలని అఖిలపక్ష నాయకులు సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. (కరోనా పరీక్షలు.. మరణాల లెక్కలు తేల్చండి) కేబినెట్ భేటీపై ఆసక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం కానుంది. మద్యం దుకాణాల పునరుద్ధరణ, లాక్డౌన్ సడలింపులపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. (తెలంగాణలో మద్యానికి ఓకే!) -
భూమిపై హక్కు కోసమే దీక్ష
సాక్షి, మహబూబాబాద్ : ప్రతి రైతుకు పాస్బుక్కు, పంట చెక్కు, భూమి మీద హక్కు కోసమే రైతు దీక్ష చేపట్టినట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానుకోట పట్టణంలో సోమవారం టీజేఎస్ ఆధ్వర్యంలో వివేకానంద సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేపట్టిన రైతు దీక్షలో కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో వాస్తవ సాగుదారులకు అన్యాయం జరిగిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళన చరిత్రలో ఇంతకు ముందెన్నప్పుడూ జరగని పనిగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, కానీ క్షేత్రస్థాయిలో టీజేఎస్ పరిశీలనలో భూప్రక్షాళన మరిన్ని సమస్యలు సృష్టించి, రైతులను మరింత గందరగోళంలోకి నెట్టిందన్నారు. తమకు రెవెన్యూ అధికారులతో ఎలాంటి గొడవలేదని, గొడవంతా ప్రభుత్వం మీదనేన్నారు. లక్షల కొద్ది రికార్డుల్లో తప్పులు దొర్లడం, వాటి ప్రకారమే రైతుబంధు చెక్కులివ్వటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పాస్‌పుస్తకాల పంపిణీలో మొదటి రోజే 3,07,640 పుస్తకాల్లో తప్పులు దొర్లాయని గుర్తించి వాటిని పంపిణీ చేయకుండా వెనక్కి పంపారన్నారు. ఇక పంపిణీ చేసిన వాటిలో 9,11,241 తప్పులు దొర్లినట్లు అధికారికంగా గుర్తించారని తెలిపారు. ఇవేగాక వివిధ కారణాల రీత్యా అసలు పంపిణీకి నోచుకోనివి 7,39,680 పాస్ పుస్తకాలు ఉన్నాయన్నా రు. తప్పులు పడిన రికార్డులను సరి చేయించుకోడానికి రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తుందన్నారు. తమ భూమి తమకు కాకుండా పోతుందేమోననే ఆందోళనతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి వెబ్సైట్లో సాంకేతిక లోపాలు ఉండడంతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక పక్క వర్షాలు పడుతుంటే, వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. ‘నీ చెక్కులు వద్దు.. మా భూమి మాకుంటే చాలు, రికార్డులు సరి చేసి మా పాస్ బుక్కులు మాకిస్తే చాలు’ అనే స్థితికి రైతులు వచ్చారన్నారు. భూమి వెట్టి నుంచి విముక్తి చేసి, రైతు ఆత్మగౌరవంతో జీవించేలా చేసిందన్నారు. ఇప్పుడు భూప్రక్షాళనలో పేదల భూములపై కాస్త బడా రైతుల పేర్లతో పాస్ పుస్తకాలు రావడంతో ఆందోళనకు గురవుతున్నారని కోదండరాం అన్నా రు. ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల మీద దాడులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తప్పులను సరిచేసి రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని మానుకోట టీజేఎస్ సమన్వయకర్త డోలి సత్యనారాయణ అన్నారు. పోడు రైతులకు టీజేఎస్ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం సాక్షర భారత్ దీక్షా స్థలాన్ని సందర్శించిన కోదండరాం వారికి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లాకార్యదర్శి సాదుల శ్రీనివాస్, సీపీఐ జిల్లాకార్యదర్శి విజయసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షులు రాంచంద్రునాయక్, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు సునీత, టీజేఎస్ నాయకులు పిల్లి సుధాకర్, భూక్యా సత్యనారాయణ, నారాయణసింగ్, మనోజ్, మాలోతు వెంకన్న, శశికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
జగన్ రైతుదీక్షకు వెల్లువెత్తిన మద్దతు
-
'రైతుల ఆపద్బాంధవుడు వైఎస్ జగన్'
-
రైతు దీక్షలో వైఎస్ జగన్
-
'చంద్రబాబు, లోకేశ్ లంచాలు, కమీషన్ల కోసమే'
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సర్కార్‌ను బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గుంటూరులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న రైతుదీక్షలో పాల్గొన్న ఆయన ఏపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు ఏ వనరులను వదిలిపెట్టడం లేదని.. లంచాలు, కమీషన్లు వచ్చే పనులే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేస్తున్నరని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో రైతులందరూ ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నారని, పంటలు అమ్ముకునే పరిస్థితి లేదని తెలిపారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, జిల్లాల్లో టీడీపీ నేతలు అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. 'రూ. లక్షన్నర పనికి రూ.5 వేలు కూడా ఖర్చు పెట్టడం లేదు. లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు సీఎం అయ్యారు. అవినీతిలో ఏపీ ఫస్ట్ అని బీబీసీ కూడా చెప్పడమే అందుకు నిదర్శనం. ప్రజలను బాగుపరిచే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా దోచుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర నీటి ప్రయోజనాలను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కింది. రాష్ట్రానికి నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సీఎం చంద్రబాబు నిర్వాకంతోనే రాష్ట్రానికి నీటి కష్టాలు ఎదురవుతున్నాయని' రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. -
'చంద్రబాబు, లోకేశ్ లంచాలు, కమీషన్ల కోసమే'
-
రెండో రోజూ వెల్లువెత్తిన జనం
రైతులకు మద్దతుధర కల్పించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతుదీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. గుంటూరు నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు సమీపంలో రెండో రోజు ఉదయం వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించి జగన్ తన దీక్షను కొనసాగించారు. చుట్టుపక్కల మార్కెట్ యార్డులన్నింటికీ సెలవు ప్రకటించినా కూడా రైతులు మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చి జగన్ మోహన్ రెడ్డికి తమ సమస్యలు తెలిపారు. ఇన్నాళ్లు కష్టపడినా సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ఫలితం లేకుండా పోతోందని.. గత సంవత్సరం ఉన్న స్థాయిలో కూడా ఈసారి ధరలు లేవని వాపోతున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే తమ బతుకులు బాగుపడతాయంటూ దీక్షా ప్రాంగణంలో పలువురు రైతులు మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు లేక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని వినుకొండకు చెందిన నాగిరెడ్డి అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేపట్టిన రైతు దీక్షకు ప్రజల నుంచి మద్దతు లేదంటూ టీడీపీ మంత్రులు, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలను వైఎస్ఆర్సీపీ నాయకుడు మేరుగ నాగార్జున కొట్టిపారేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా జనం వస్తూనే ఉన్నారని, దీక్షా ప్రాంగణం ఇంత కిక్కిరిసిపోయి కనిపిస్తుంటే ప్రజల మద్దతు లేదనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. -
ఎన్నికల ముందు హామీలు తర్వాత మోసాలు
-
రైతులను దగా చేసిన సీఎం
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్మోహన్రెడ్డి - ఎన్నికల ముందు హామీలు.. తర్వాత మోసాలు.. - రూ. 5వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏది? - మద్దతు ధరపై ప్రధానికి ఒక్కలేఖన్నా రాశారా? - ఎన్పీఏలుగా 40 లక్షల రైతుల ఖాతాలు - ఆయనకు జ్ఞానోదయం కల్గించడానికే ఈ నిరాహారదీక్ష (గుంటూరు దీక్ష నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) రైతుల ఓట్ల కోసం ఎన్నికలపుడు వారికి పూర్తిగా మోసపూరిత హామీలిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన తరువాత వాటిని పూర్తిగా మర్చిపోయారని, ఈ మూడేళ్ల ఆయన పాలనలో రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే... రైతులకు కనీస మద్దతు ధర లభించని సందర్భాల్లో ఆదుకునేందుకు రూ 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, రైతుల రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని, నిపుణులైన హుడా, స్వామినాథన్ కమిటీల సిఫార్సులను అమలు చేస్తానని వాగ్దానాలు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక అన్నిటినీ తుంగలో తొక్కి రైతులను దగా చేశారన్నారు. తుపానులు, కరువుతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా ఎగనామం పెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలబడేందుకు సోమవారం గుంటూరులోని నల్లపాడు రోడ్డులో రెండు రోజుల నిరాహారదీక్షకు పూనుకున్న సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు ఎన్నో అవస్థలు పడుతూ కడుపు నిండా బాధతో అలమటిస్తున్నారని, వారి బాధను ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటుగా వారి సమస్యలు పరిష్కరించే విధంగా చంద్రబాబుకు బుద్ధీ, జ్ఞానం కలగాల ని దేవుడిని ప్రార్థిస్తూ తానీ రెండు రోజుల నిరా హారదీక్షకు పూనుకుంటున్నానని జగన్ ప్రకటించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.... ప్రతిపక్షంలో ఉండగా ఏమన్నారు బాబూ? ‘‘చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాదిరిగా, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాదిరిగా మాట్లాడతారు. రైతులతో ఓట్లేయించుకోవడానికి వాగ్దానాలు చేసి ఆ తరువాత వాటి ఊసే ఎత్తరు. 2010లో చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దీక్ష చేసిన సందర్భంగా హుడా కమిటీ సిఫార్సులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ఆయనకు హుడా కమిటీ రిపోర్టు, అందులోని అంశాలు కనిపించాయి. ప్రతి రైతుకూ ఎకరాకు కనీసం రూ 10 వేల నుంచి రూ 15 వేలు ఇవ్వాలని ఆ రోజు డిమాండ్ చేస్తూ చంద్రబాబు దీక్ష చేశారు. తీరా అధికారంలోకి వచ్చా క హుడా ఎవరు? ఆ సిఫార్సులేమిటి? నాకు తెలియదే! అని మాట్లాడ్డం చూస్తూ ఉంటే ఈయనా... మన ముఖ్యమంత్రి?! అని ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్నికల సమయంలో రైతుల ఓట్లతో పని ఉన్నపుడు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే రూ 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటానన్నారు. అసలు చంద్రబాబుకు ధరల స్థిరీకరణ నిధి ఎందుకు గుర్తుకు వచ్చిందంటే ... ఎన్నికలపుడు నేను రూ 3,000 కోట్లతో రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని అప్పటికే హామీ ఇచ్చాను. దాంతో బాబుకు వెన్నులో నుంచి భయం పుట్టింది. ‘జగన్ రూ 3,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తానన్నాడా! అయితే నేను రూ 5 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తా’నని చంద్రబాబు ప్రకటించారు. ఇక, ఇవాళ ఎన్నికలైపోయాయి. ప్రజలతో, రైతులతో పని కూడా అయిపోయింది. మూడేళ్లు పూర్తయినా ధరల స్థిరీకరణ నిధి అనే ఊసే చంద్రబాబుకు గుర్తుకు రాదు. అటు ధరలు రాక రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతూ ఉన్నా కనీస మద్దతు ధర ఇంకా పెంచాలి అంటూ కనీసం ఒక్కటంటే ఒక్క లేఖ కూడా ప్రధానమంత్రికి రాసిన పాపాన పోలేదు. 40 లక్షల రైతుల ఖాతాలు నాశనం.. చంద్రబాబు పుణ్యమా అని కోటి 4 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ 40 లక్షల ఖాతాలు ఓవర్ డ్యూ ఖాతాలుగా మారిపోయాయి. అవన్నీ కూడా ‘నాన్ పెర్ఫార్మింగ్ ఎకౌంట్లు’(ఎన్పీఏ)గా మారిపోయాయి. ఎన్నికలపుడు రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని బాబు ప్రకటించిన ఫలితంగానే ఇవన్నీ ఇలా తయారయ్యాయి. రైతుల విషయంలో చంద్రబాబు పూర్తిగా చేతులెత్తేశారు. ఆయన పాలనలో కష్టాలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మిర్చి ధర గత ఏడాది క్వింటాలుకు రూ. 13 వేల నుంచి రూ. 14 వేలుంటే ఈ ఏడాది రూ.6 వేల నుంచి రూ 7 వేల వరకే ఉంది. ఇది అన్యాయమని మేం ప్రశ్నిస్తే బాబు మొసలి కన్నీరు కార్చారు. ఇపుడు రూ. 2,500 నుంచి రూ. 4,000కు పడిపోయింది. సీఎంగా ఉన్న వ్యక్తి స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. మార్కెట్లో పోటీని సృష్టించాలి. కానీ బాబు రైతులకు కాకుండా వ్యాపారులకు అండగా నిలిచారు. ఒక్క మిర్చే కాదు.. 2016–17లో రాష్ట్రంలో రైతులు 19 రకాల పంటలు వేశారు. ఒక్కదానికీ ధర లేదు. ఈ దారుణమైన మోసానికి నేను నిరసన తెలుపుతున్నాను. చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని కోరుతూ నేను ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను. -
రైతు దీక్ష
-
వైఎస్ జగన్ రైతుదీక్ష
-
ముఖ్యమంత్రి అప్పుడలా.. ఇప్పుడిలా!
-
ముఖ్యమంత్రి అప్పుడలా.. ఇప్పుడిలా!
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతూ రైతులను దగా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన గుంటూరు మిర్చియార్డు సమీపంలో రెండు రోజుల రైతు దీక్షను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కడుపు మండుతున్నా, పండించిన పంటకు ధరలు రాక అవస్థలు పడుతున్నా, చంద్రబాబు నాయుడు పట్టించుకునే పరిస్థితి లేదని కడుపులో బాధ ఉన్నా.. మన అవస్థలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని, ఆయనకు బుద్ధి రావాలని రైతులందరం ఒక్కచోట ఏకమై దీక్ష కార్యక్రమం చేస్తున్నాం చంద్రబాబు పాలన చూసి, రైతుల బాధలు, అవస్థలు చూసి రైతులకు తోడుగా ఉండేందుకే దీక్షా కార్యక్రమం చేపట్టాం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులతో పని అయిపోయిన తర్వాత, ఓట్లు వేయించుకోవడం అయిపోయాక మరో విధంగా మాట్లాడుతున్నారు 2010లో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర చంద్రబాబు ధర్నా చేశారు.. హూడా కమిటీ సిఫార్సులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని, కష్టాల్లో ఉన్న రైతులకు ఎకరాకు 10-15 వేలు ఇవ్వాలని ఆయన దీక్ష చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు హూడా కమిటీ సిఫార్సులు కనిపించాయి. అప్పుడు ఆ మాట మాట్లాడిన ఇదే చంద్రబాబు హూడా ఎవరు, ఆయన సిఫార్సులేంటి, తనకు తెలియదని మాట్లాడటం చూస్తుంటే.. ఈయనా మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది ఇదే చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలతో, రైతులతో అవసరం ఉన్నప్పుడు.. రైతుల కోసం 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి తీసుకొస్తానని, ఏ రైతూ బాధపడకుండా చూస్తానని, ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే ఈ నిధితో ఆదుకుంటానని చెప్పారు [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] ఆయనకు అప్పుడు హఠాత్తుగా 5వేల కోట్లు ఇవ్వాలని ఎందుకు అనిపించిందంటే, అప్పుడు జగన్ 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతానన్నాడు కాబట్టి జగన్‌కు ఎక్కడ ఓట్లు పడతాయోనని వెన్నులో భయం మొదలై.. 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి అన్నారు ఇప్పుడు ఎన్నికలయిపోయాయి, ప్రజలు, రైతులతో పని అయిపోయింది.. ఇప్పుడు ఆ నిధి గురించి ఊసే లేదు ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతులకు కనీస మద్దతుధర చాలా తక్కువగా ఉందని, అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తామని, ఖర్చు మీద 50 శాతం లాభం వేసి మరీ ధర ఇప్పిస్తానని అన్నారు ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు పాలన మొదలై మూడేళ్లయిపోయింది.. కనీస మద్దతుధర పరిస్థితి ఏంటంటే వరికి 50, 50, 60 రూపాయల చొప్పున ముష్టివేసినట్లు ఇస్తున్నా ఈయన నోట్లోంచి మాట రాదు పత్తికి కూడా 50, 50, 60 రూపాయల చొప్పున ఇచ్చారు. కనీసం ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువగా రేట్లు పెంచుతున్నా ఈయన మాట్లాడరు కనీసం ప్రధానమంత్రికి ఒక్కటంటే ఒక్క లేఖ కూడా రాయలేదు ఇప్పుడు స్వామినాథన్ ఎవరో కూడా గుర్తురావట్లేదని చంద్రబాబు నోట్లోంచి మాటలు వస్తున్నాయి ఇదే చంద్రబాబు ఎన్నికల సమయంలో రైతులకు తోడుగా నిలబడగానని, కుటుంబ పెద్దగా నిలబడతానని అన్నారు 2013-14లో వరుస తుఫాన్లు వచ్చాయి, ఆ తర్వాత కరువు వచ్చింది అప్పుడు ఈయన రాష్ట్రంలో తిరుగుతూ.. అదిగో ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ముఖ్యమంత్రి కాగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటానని చెప్పారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడేళ్లలో ఒక్క ఇన్పుట్ సబ్సిడీ అక్షరాలా 4394 కోట్లు బకాయిలు పడ్డారు, పూర్తిగా ఎగనామం పెట్టారు వరుసగా మూడేళ్లలో 2306 కోట్లు, 326 కోట్లు, 1762 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టారు రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు రైతులు పొరపాటున ఆయన మాటలు వినకుండా పోతారోనని భయపడి ప్రతి గ్రామంలోను వాల్‌పోస్టర్లు, హోర్డింగులకు లైట్లు పెట్టి రాత్రిపూట కూడా కనిపించేలా పెట్టారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని రాయించారు ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేస్తే చాలు.. మనకు కనిపించింది, వినిపించింది కూడా ఇదే ఇప్పుడు చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి ఏంటంటే.. కోటి 4 లక్షల అకౌంట్లకు గాను 40 లక్షల రైతుల అకౌంట్లు ఓవర్ డ్యూ, ఎన్పీఏ అకౌంట్లుగా తయారయ్యాయి. ఆయన పాలన చూసి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదే మిర్చియార్డుకు ఐదువారాల క్రితం నేను వచ్చాను అప్పుడు రేటు క్వింటాలుకు 6000-7000 వరకు పలుకుతోంది ఇది అన్యాయమని, గత సంవత్సరం 14వేల వరకు పలికిందని అన్నాను అప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఇప్పుడు 2500-4000కు మిర్చి రేటు పడిపోయింది ఎక్కడైనా ముఖ్యమంత్రి అంటే రైతులకు తోడుగా ఉండేందుకు స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకోవాలి మార్కెట్లో పోటీ సృష్టించాలి.. రైతులకు తోడుగా నిలబడేందుకు ఆయన 8వేలకు కొంటానన్నారు అది తక్కువే అనుకున్నా, కనీసం ఆ రేటుకైనా ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తే మార్కెట్లో పోటీ పెరుగుతుంది వ్యాపారులు అంతకంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తారు కానీ చంద్రబాబు రైతులకు తోడుగా నిలబడలేదు.. వ్యాపారులకు తోడుగా నిలబడ్డారు వ్యాపారులు కొంటే, ఈయన ముష్టేసినట్లు 1500 ఇస్తారట. అది కూడా 8వేలకు ఎంత తక్కువైతే అంతే ఇస్తారట ఒక్కో రైతు 20 క్వింటాళ్లు మాత్రమే తేవాలట.. పొలాలన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రైతులు ట్రాక్టర్లలో తీసుకొస్తున్నారు మిర్చి కోసిన తర్వాత మార్కెట్ యార్డు వరకు ఖర్చులు చూస్తే క్వింటాలుకు 2500 దాటింది. కానీ కొనుగోలు ధర బాగోలేదు ఇక్కడకు తెచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు.. కోల్డ్ స్టోరేజిలోకి తీసుకెళ్తే అక్కడ స్థలం ఇవ్వబోమని ఇప్పటికే టిక్కీ రేటు పెంచారు. ఏడాదికి 160 రూపాయలు ఉంటే అది 190కి పెరిగిపోయింది.. అయినా స్థలాలు లేవు నాలుగైదు రోజుల పాటు రైతులు రోడ్డుమీద పడుకోవాల్సి వస్తోంది మిర్చి మాత్రమే కాదు.. పసుపు గత ఏడాది 9వేలయితే ఈసారి 4వేలకు కూడా కొనుగోలు చేయట్లేదు మామిడి, వరి, సుబాబుల్.. ఏ పంటకూ సరైన ధర రావడం లేదు 2016-17 సంవత్సరంలో ఏ ఒక్క పంటకూ రేటు ఉండని పరిస్థితి కనిపిస్తోంది ఈ దారుణమైన మోసానికి నిరసన తెలుపుతూ, చంద్రబాబుకు జ్ఞానం రావాలని దీక్ష చేపడుతున్నాం ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నందుకు ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా -
వైఎస్ జగన్ రైతుదీక్ష ప్రారంభం
-
వైఎస్ జగన్ రైతుదీక్ష ప్రారంభం
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరలు లేక అష్టకష్టాలు పడుతున్న రైతులను ఏమాత్రం ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తలపెట్టిన రెండురోజుల రైతుదీక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలోనే ఆయన దీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ధ్యేయంతో ఈ దీక్ష చేపట్టారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో గుంటూరు బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ కార్మిక దినోత్సవంలో పాల్గొని పతాకావిష్కరణ చేసిన తర్వాత దీక్షా స్థలికి చేరుకున్నారు. రాష్ట్రం నలు మూలల నుంచి పలువురు రైతులు, రైతు నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, యువతీ యువకులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ జగన్ దీక్షకు తమ మద్దతు పలికారు. -
గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
హైదరాబాద్: గన్నవవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ నేటి నుంచి రెండు రోజులపాటు గుంటూరులో ‘రైతు దీక్ష’ చేపడుతున్న విషయం తెలిసిందే. దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వైఎస్ జగన్.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వంగవీటి రాధా, వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరావు, తోట శ్రీనివాస్ తదితరులు అధినేతకు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి గుంటూరు బయలుదేరిన వైఎస్ జగన్.. బస్టాండ్ వద్ద మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం సర్దార్ కాసు వెంగళరెడ్డి విగ్రహానికి జగన్ నివాళులర్పించనున్నారు. 11 గంటలకు వైఎస్ జగన్ దీక్షా శిబిరానికి చేరుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించారు. -
నేటి నుంచి వైఎస్ జగన్ రైతు దీక్ష
-
జగన్ బాటలో జనం
⇔ రైతుల సమస్యల పరిష్కారానికి నేడు, రేపు జగన్ దీక్ష ⇔ జగన్‌కు మద్దతుగా గుంటూరుకు తరలుతున్న నేతలు ⇔ అదే బాటలో కార్యకర్తలు, అభిమానులు, రైతులు ⇔ చంద్రబాబు సర్కారుపై ఆగ్రహ జ్వాలలు ⇔ రైతు సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వరుస కరువులు..అష్టకష్టాలు పడి పండించిన మిర్చి, పసుపు, కంది పంటలకు గిట్టుబాటు ధరల్లేవు, పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా దక్కే పరిస్థితి లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో జిల్లా రైతాంగం కుదేలైంది. ఇప్పటికే మిర్చి రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఆరుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్, నాఫెడ్ల ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి మిర్చి, కందులు, పసుపు కొని రైతులను ఆదుకునేందుకు ప్రయత్నించడం లేదు. కేవలం క్వింటాకు రూ.1,500 ముష్టి వేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా... రైతులకు మద్దతుగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 1, 2 తేదీల్లో గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పటికే ప్రజాసమస్యలపై పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్న వైఎస్ జగన్ మరోమారు నిద్రపోతున్న బాబు సర్కారు కళ్లు తెరిపించేందుకు ఈ దీక్షను పూనారు. జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు రైతాంగం జగన్ దీక్షకు మద్దతుగా నిలిచింది. ఆయనకు సంఘీభావం ప్రకటించేందుకు సోమవారం జిల్లా నుంచి పెద్ద ఎత్తున గుంటూరుకు తరలుతున్నారు. జగన్ దీక్షలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. రైతులకు న్యాయం చేయాలంటూ జగన్‌తో గొంతు కలిపి డిమాండ్ చేయనున్నారు. రైతాంగం కుదేలు కరువుతో తగ్గిన పంటల దిగుబడి, అదే సమయంలో గిట్టుబాటు ధర లభించకపోవడంతో జిల్లా రైతాంగం కుదేలైంది. దాదాపు 60 వేల హెక్టార్లలో రైతులు మిర్చి పంటను సాగు చేశారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికి వచ్చేసరికి క్వింటా మిర్చి ధర రూ.4 వేలకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో మిర్చి కోత ఖర్చు కూడా రైతులకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో జిల్లా రైతాంగం ఆత్మహత్యల బాట పట్టింది. అయినా ప్రభుత్వం ఆదుకోలేదు. మార్క్‌ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి మిర్చిని కొనుగోలు చేయమని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. క్వింటాకు రూ.1,500 ముష్టి విధించి చేతులు దులుపుకుంది. మరోవైపు 98 వేల హెక్టార్లలో సాగు చేసిన కంది పంటకు గిట్టుబాటు ధర లేక గతేడాది కందులు సైతం రైతుల ఇళ్లలోనే మగ్గుతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. జిల్లాలో దాదాపు 2 వేల హెక్టార్లలో పసుపు పంట సాగు చేశారు. ప్రస్తుతం క్వింటా పసుపు ధర రూ.4 వేలకు పడిపోయింది. కొనే నాధుడే లేకుండా పోయాడు. సుబాబుల్, జామాయిల్, పొగాకు, బొప్పాయిలదీ అదే పరిస్థితి. వాటికీ గిట్టుబాటు ధర లేదు. ఇక తీవ్ర వర్షాభావం పుణ్యమా అని భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు కూడా అందడం లేదు. దీంతో పశ్చిమ ప్రాంతంలో పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి. చెన్నై, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు పొట్టచేత పట్టుకొని రైతులు తరలిపోతున్నారు. పశువులను సైతం కొందరు రైతులు నీటి వనరులున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినా బాబు సర్కారులో చలనం లేదు. రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ల గోడు పట్టించుకోవడం లేదు. ఇటు మనుషులతో పాటు పశువులకు గుక్కెడు నీరందించే ప్రయత్నం చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి తీవ్రతను దీక్ష ద్వారా తెలియజెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరోమారు దీక్షకు పూనారు. జగన్ దీక్షకు సర్వత్రా మద్దతు లభిస్తోంది. -
నేటి నుంచి జగన్ రైతు దీక్ష
♦ అన్నదాతలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రెండురోజుల దీక్ష ♦ ఎన్నికల సమయంలో రైతన్నలకు చంద్రబాబు హామీలు ♦ వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్న బాబు ♦ పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఉద్ఘాటన ♦ బాబు అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు అన్నీ కష్టాలే ♦ మాఫీ కాని రుణాలు.. పంటకు దక్కని మద్దతు ధరలు సాక్షి, అమరావతి: పంట రుణాలు మాఫీ కాక, పండించిన పంటలకు మద్దతు ధరల్లేక కష్టాలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఏమాత్రం ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచి రెండు రోజులపాటు ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారు. రుణమాఫీ హామీకి ముఖ్యమంత్రి పాతర అన్నదాతల ఆక్రోశాన్ని ఎలుగెత్తి చాటి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్ జగన్ రైతు దీక్షకు పూనుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో నూ ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి, పసుపు, ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలకు కనీస మద్దతు ధరలు లభించక రైతన్నలు ఆర్థికంగా దిగజారిపోతున్నారు. పంటల సాగు కోసం బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను బేషర తుగా మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కాక ఆ హామీకి పాతరేశారు. మూడేళ్లుగా రుణాలను మాఫీ చేయకుండా రైతాంగాన్ని వెన్నుపోటు పొడిచారు. వర్షాభావ పరిస్థితులను ఎదిరించి, కష్టపడి పండించిన పంటలను మార్కెట్ యార్డులకు తరలిస్తే మద్దతు ధరలు దక్కడం లేదు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వమేమో చోద్యం చూస్తోంది. మద్దతు ధర కల్పించి రైతన్నల్లో భరోసా పెంచాల్సింది పోయి కుంటిసాకులతో కాలం గడుపుతోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ‘ధరల స్థిరీకరణ నిధి’కి ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లొదిలేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రైతు దీక్ష తలపెట్టారు. ఈ దీక్షతోనైనా ప్రభుత్వంలో చలనం వచ్చి, తమను ఆదుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు బస్టాండ్ సెంటర్లో మేడే పతాకావిష్కరణ వైఎస్ జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు గుంటూరు బస్టాండ్ సెంటర్‌కు చేరుకుంటారని చెప్పారు. అక్కడ నిర్వహించే కార్మిక దినోత్సవంలో పాల్గొని పతాకావిష్కరణ చేస్తారని వెల్లడించారు. అనంతరం దీక్షా స్థలికి వస్తారని వివరించారు. జగన్ సోమవారం ఉదయం 10.30 గంటలకు రైతు దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. రైతు దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలో ప్రైవేటు ప్రాంగణంలో దీక్ష జరగనుంది. ప్రధాన వేదిక, రైతన్నల కడగండ్లపై కళాకారుల ప్రదర్శనకు మరో వేదిక నిర్మాణం పూర్తయ్యాయి. పార్టీ ముఖ్యులు, రైతులు, ప్రజలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. -
'కోదండరామ్ రాజకీయం చేస్తున్నారు'
కరీంనగర్ : జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ రైతుల పోరుతో రాజకీయం చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకే కోదండరామ్, బీజేపీ నేత నాగం జనార్థన్‌రెడ్డి రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల కోసమే దీక్ష చేపట్టినట్లైతే మల్లన్నసాగర్ వద్ద ఎందుకు దీక్ష చేశారని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. కోదండరామ్ రైతు దీక్ష చేపట్టడం బాధాకరమన్నారు. మోతే రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు చెప్పారు. -
'వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ..రైతు అంటేనే అవమానకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 90 శాతం రైతులు ఐదు ఎకరాల్లోపు ఉన్నవారేనన్నారు. ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం...ఒక రైతుపై రూ.90 వేల రుణభారం ఉందని చెప్పారు. తక్షణమే వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు తెలిపాయి. -
'వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలి'
-
'కోదండరామ్ ఎవరికీ లొంగే వ్యక్తి కాదు'
-
'కోదండరామ్ ఎవరికీ లొంగే వ్యక్తి కాదు'
హైదరాబాద్ : రైతు సమస్యలను పరిష్కరించడం సీఎం కేసీఆర్‌కు పెద్ద ఇబ్బందే కాదని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. రైతు సమస్యలపై ప్రొ.కోదండరామ్ ఆదివారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సమగ్ర వ్యవసాయ విధానం రూపొందిస్తారనుకున్నాం...కానీ అలా జరగలేదన్నారు. గతంలో చాలా మంది రైతు నాయకులు ప్రభుత్వాలకు లొంగిపోయారన్నారు. కానీ కోదండరామ్ ఎవరికీ లొంగిపోయే వ్యక్తి కాదని రామచంద్రమూర్తి చెప్పారు. -
19, 20 తేదీల్లో టీటీడీపీ రైతు దీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలపై ఈ నెల 19, 20 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద రైతు దీక్షను చేపడుతున్నట్లు టీటీడీపీ నేత అరికెల నర్సారెడ్డి తెలిపారు. రైతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ దీక్షలను చేపడుతున్నామన్నారు. కరువు మండలాల్లో ఇన్పుట్ సబ్సిడీని కూడా ఇంత వరకు ఇవ్వలేదని ఆయన చెప్పారు. రైతుల రుణాలను మాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత రెండేళ్ల కాలంలో ఒక్క రైతుకూ కొత్త రుణం రాలేదన్నారు. తాము చేపడుతున్న రైతు దీక్షకు జిల్లాల నుంచి రైతులు హాజరవుతారని నర్సారెడ్డి చెప్పారు. -
అంతం కాదిది ఆరంభం
⇒ సర్కారు కళ్లు తెరిపించేందుకే రైతు దీక్ష: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి ⇒ ఈ దీక్షలు రాజకీయం, ఓట్ల కోసం కాదు ⇒ రైతుల ఆత్మహత్యలు పట్టని కేసీఆర్.. తాను రైతునని ఎలా చెప్పుకుంటారు? ⇒ మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేసేదాకా ఉద్యమం.. కలిసొచ్చే అన్ని పార్టీలతో ఐక్య పోరాటాలు ⇒ సర్కారు కళ్లు తెరిపించేందుకే రైతు దీక్ష ⇒ వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘మేం రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో రైతుదీక్షలు చేయడం లేదు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ, మా పార్టీ రైతుల పక్షాన ఉందని తెలియజేసేందుకు దీక్ష చేస్తున్నాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి వాగ్దానాన్నీ ప్రభుత్వం అమలు చేసేదాకా, సమస్యలన్నీ పరిష్కారమయ్యేదాకా తమ పోరాటాలు ఆగవన్నారు. ‘‘అంతం కాదిది ఆరంభం మాత్రమే. పార్టీ ప్రజల, రైతుల పక్షాన నిలిచి, కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకొని వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుంది’’ అని ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోఆదివారం పొంగులేటి ఒక్క రోజు రైతుదీక్ష నిర్వహించారు. సాయంత్రం రైతులు సంగెం వెంకటి, దేవానాయక్లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దపటోళ్ల సిద్ధార్థరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రైతులు, ప్రజలనుద్దేశించి పొంగులేటి మాట్లాడారు. ఏడాదిగా రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలంగాణ బిడ్డ కేసీఆర్ రైతుల ఆత్మహత్యలను, సమస్యలను పట్టించుకోవడం లేదని, పరిష్కరించడం లేదని ఆక్షేపించారు. ‘‘ఇది ైరెతు అనుకూల ప్రభుత్వం కాదు. రైతులు, బడుగు, పేద, బలహీన, దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం’’ అంటూ విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తానున్నానంటూ రైతన్న భుజం తట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించారని గుర్తు చేశారు. తాము కూడా అండగా ఉండేందుకే దీక్ష చేపట్టామన్నారు. రైతులు, బడుగు, పేద, బలహీన, దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వమిది. రైతుల ఆత్మహత్యలను, సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు తాను రైతునని ఎలా చెప్పుకుంటారు? ఎన్నికల వాగ్దానాలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వంపై పోరాడతాం. కలిసొచ్చే పార్టీలతో ఐక్య ఉద్యమాలు చేస్తాం. - కామారెడ్డి ‘రైతుదీక్ష’లో పొంగులేటి పోడుభూములూ లాక్కుంటారా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంటే కనీసం పట్టించుకోని కేసీఆర్, తాను రైతునని ఎలా చెప్పుకుంటారని పొంగులేటి ప్రశ్నించారు. ‘‘రైతుబిడ్డని, ఎకరాకు రూ.70 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పుకుంటున్నారు. రైతుల కష్టాలు, బాధలు తెలిసుండి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్న మీరు రైతునంటే ప్రజలెలా నమ్ముతారు?’’ అని ప్రశ్నించారు. వైఎస్ పోడు భూములకు పట్టాలిస్తే, నేటి ప్రభుత్వాలు ఆ పట్టాలను రద్దు చేసి రైతులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మాటతప్పారు. ఉచిత కరెం ట్ 9 గంటలి స్తామన్నా రెండు గంటలకు మించడం లేదు. దాంతో పొలాలెండి.. భార్యల పుస్తెలు తాకట్టు పెట్టి సాగు చేసిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపురించింది. రెండో పంటకు కరెంటివ్వలేమంటూ చేతులెత్తేశారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఆర్టీసీ, విద్యుత్ సంస్థను కాపాడింది వైఎస్సే కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతోంది. 2004లో వైఎస్ ఆధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి అండగా నిలిచారు. నష్టాల నుంచి లాభాల బాట పట్టించారు. విద్యుత్, ఆర్టీసీ సంస్థలు నేటికీ క్షేమంగా ఉన్నాయంటే వైఎస్ చలవే’’ అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చి సమ్మెను తక్షణం విరమింపజేయాలన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు సరిగా ఇవ్వడం లేదన్నారు. ‘‘దళితులకు మూడెకరాల హామీనీ నెరవేర్చడం లేదు. ఖమ్మం జిల్లాలో 26 వేల మంది అర్హులుంటే కేవలం 15 మందికిచ్చి చేతులు దులుపుకున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, 104, 108... ఇలా ఏ పథకాన్నీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా వైఎస్ ముద్రను చెరిపేందుకు కుట్రలు చేస్తున్నారు. జలయజ్ఞం కింద తెలంగాణలో ఆయన చేపట్టిన 37 ప్రాజెక్టుల్లో 5 పూర్తయ్యే దశలో ఉన్నా ప్రభుత్వం ఒక్కదాన్నీ పూర్తి చేయలేదు’’ అని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆత్మశాంతి కోసం దీక్షకు ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సీఎం నియోజకవర్గంలోనే ఆత్మహత్యలు: పాయం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ఇందుకు సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగిన ఆత్మహత్యలే నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రైతుదీక్షలో ఆయన మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం వారిని పరామర్శించలేదని మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రే షియా చెల్లిచాలని అసెంబ్లీలో కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. తమ దీక్షతోనైనా ప్రభుత్వం మేల్కొని తడిసిన ధాన్యానికి సైతం మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోడు రైతులను ప్రభుత్వం జైళ్లకు పంపుతోందని ఆరోపించారు. వారికి పట్టాలివ్వాలని కోరారు. రైతుదీక్షలో పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, గున్నం నాగిరెడ్డి, అధికార ప్రతినిధులు విజయచందర్, సత్యం శ్రీరంగం, ఆకుల మూర్తి, యువజన విభాగం నేత భీష్మ రవిందర్, రాష్ట్ర పార్టీ నాయకులు ఏలూరు వెంకటేశ్వర్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, కేసర వెంకటేశ్వర్‌రెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, ముందడుపు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కష్టాల ఏకరువు అన్నదాతల కష్టాలను ఏకరువు పెట్టేందుకు రైతుదీక్ష వేదికైంది. పంటలు నష్టపోయిన రైతులతో పాటు ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబసభ్యులు ఈ సందర్భంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల కష్టాలను ఓపికగా విన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. రైతుల ఆవేదన వారి మాటల్లోనే.. పొలంకాడనే పురుగుల మందు తాగి సచ్చిండు అప్పులతో నా మొగడు పొలంకాడ మందుతాగి సచ్చిపోయిండు. నాకు కొడుకు, బిడ్డ ఉన్నరు. సర్కారు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ సాయం చేయలేదు. నేనెట్ల బతకాలె. నా పిల్లల్నెట్ల బతికుంచుకోవాలె. అప్పులు అట్లనే ఉన్నయి. బతుకుదెరువు కూడా కరువైంది. పిల్లల కోసమే బతుకుతున్నా. నన్ను సర్కారే ఆదుకోవాలి. - ఆత్మహత్యకు పాల్పడిన రైతు జెల్లె సుధాకర్ భార్య మణెమ్మ, నర్సాపూర్, మెదక్ పింఛన్ రావట్లేదు నా భర్త చనిపోయి 20 ఏళ్లయింది. నాకు పింఛన్ రావట్లేదు. ఎవరి దగ్గరికి పోయినా పట్టించుకోవడం లేదు. దయసేసి పింఛన్ ఇప్పించండి. - ఎనగుర్తి పోశవ్వ, లింగాపూర్, కామారెడ్డి, నిజామాబాద్ లోన్లు మాఫీ కాలేదు గ్రూపుల లోన్లు మాఫీ అవుతాయని ఆశపడ్డం. మాఫీ కాలేదు. మిత్తీలు పెరిగి అప్పు భారంగా తయారైంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వం నమ్మించి మమ్మల్ని మోసం చేసింది. రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు మంచిగ ఉండె. గ్రూపుల లోన ్లన్నీ మాఫీ చెయ్యాలె. మహిళలను ఆదుకోవాలె. - పుష్ప, కన్నాపూర్, లింగంపేట, నిజామాబాద్ ఉరేసుకుని సచ్చిపోయిండు నా భర్త అప్పుల బాధతో ఉరేసుకుని సచ్చిపోయిండు. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంతో గోస పడ్డం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వమూ ఆదుకోలేదు. బతుకుడు కష్టంగా ఉంది. సర్కారు నుంచి సాయం ఇప్పించండి. - ఆత్మహత్యకు పాల్పడిన శంకరయ్య భార్య లక్ష్మి, పుల్లూరు, మెదక్ రైతు దీక్షలో ఏడు తీర్మానాలు పొంగులేటి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుదీక్షలో ఏడు ప్రధాన తీర్మానాలను ఆమోదిం చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి ఈ తీర్మానాలను ప్రవేశపెట్టగా సభకు హాజరైన రైతులు, నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలతో ఆమోదించారు. ఆ తీర్మానాలివే.. ⇒ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలి. ⇒ ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైనందున తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. రైతులకు కరువు సహాయం అందించాలి. ⇒ అకాలవర్షాలు, బలమైన ఈదురుగాలులు, వడగళ్లతో జరిగిన పంట నష్టానికి తగిన పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ⇒ రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి రూ.25 వేలు మాత్రమే మాఫీ చేశారు. మిగతా రూ.75 వేలను కూడా ఒకేసారి మాఫీ చేయూలి. ⇒ వచ్చే ఖరీఫ్‌లో ఉచితంగా విత్తనాలు, సగం ధరకే ఎరువులు అందించి తోడ్పడాలి. ⇒ కబేళాలకు తరలిపోకుండా పశువులకు ఉచితంగా మేత, పాడి పశువులకు దాణా అందించి పశుసంపదను కాపాడాలి. ⇒ రైతుల భూములను బలవంతంగా, వారికి ఇష్టం లేకుండా లాక్కోవద్దు. -
కామారెడ్డిలో ప్రారంభమైన పొంగులేటి రైతుదీక్ష
-
కామారెడ్డిలో ప్రారంభమైన పొంగులేటి రైతుదీక్ష
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. అందులోభాగంగా ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వరంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతు దీక్ష ప్రారంభమైంది. ఈ రైతు దీక్ష రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరుకానున్నారు. హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 2014 జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 784 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 140 కాగా, కరీంనగర్లో 115, ఆదిలాబాద్‌లో 98 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 50 మందికిపైగా రైతులు తనువు చాలించారు. కాడినే నమ్ముకున్న రైతులను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత పట్టించుకునేవారు లేకుండా పోవడంతో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. రైతులు, రైతు సంఘాల గణాంకాల ప్రకారం 784 మంది రైతులు మృతి చెందారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 96 మంది రైతులు మాత్రమే చనిపోయినట్లు ప్రకటించింది. కనీసం ఆ 96 మంది రైతు కుటుంబాలను సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలు, వారి ఆత్మహత్యలపై పోరాటం కోసం నడుంకట్టింది. -
బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలా ?
హైదరాబాద్ : తెలంగాణ వచ్చి ఏడాదవుతున్నా రైతుల ఆత్మహత్యల ఆగలేదని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం వైఎస్ఆర్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలిందన్నారు. శనివారం హైదరాబాద్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఒక్క హామీ కూడా అమలుకావడం లేదని ఆయన ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి రైతు పక్షపాతి అన్నముద్ర ఉందని పొంగులేటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ పార్టీ పేరులోనే రైతుల ప్రస్తావన ఉందన్నారు. ఇది అంతం కాదు... అరంభం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. అన్ని పార్టీలను కలుపుకుని రైతుల పక్షాన పోరాడతామన్నారు. అందుకోసం ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతుదీక్ష నిర్వహిస్తున్నట్లు పొంగులేటి వెల్లడించారు. పార్లమెంట్, అసెంబ్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలా అన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయి'
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న రైతు దీక్ష ఏర్పాట్లను గురువారం వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శనివారం ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షను ప్రారంభిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు. రైతు దీక్షకు ప్రజలు భారీగా తరలి వచ్చి మద్దతు పలకాలని ఆయన కోరారు. వెన్నుపోటు పొడవడం అనేది చంద్రబాబు నాయుడు నైజమని విజయసాయి రెడ్డి విమర్శించారు. అధికారం కోసం ఆనాడు ఎన్టీఆర్ ను, నేడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. మోసపూరిత వాగ్ధానాలపై ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసే వరకు ప్రజలకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల దీక్ష చేస్తున్నారు. -
జగన్ దీక్ష.. టీడీపీ పతనానికి నాంది
-
రైతు దీక్ష పోస్టర్ ఆవిష్కరణ