ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరలు లేక అష్టకష్టాలు పడుతున్న రైతులను ఏమాత్రం ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తలపెట్టిన రెండురోజుల రైతుదీక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.