support prices
-
Fact Check: రైతుకు ‘మద్దతు’లో పోలిక ఏది?.. విషం కక్కుతున్న రామోజీ
సాక్షి, అమరావతి : అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ఇందుకు గ్రామాల్లోనే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు, క్షేత్రం వద్దే ధాన్యం కొనుగోళ్లు ఇలా అన్ని విధాలా భరోసా కల్పిస్తోంది. దళారులు, వ్యాపారుల జోక్యం లేకుండా రైతుల పంట ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించేలా చేస్తోంది. ధరలు తగ్గిన ప్రతిసారీ రైతులు నష్టపోకుండా మార్కెట్లో జోక్యం చేసుకుంటూ మంచి ధరకే రైతులు తమ ఉత్పత్తులు విక్రయించుకునేలా చర్యలు చేపడుతోంది. స్వయంగా ప్రభుత్వమే కొనుగోలుకు ముందుకు వస్తుండటంతో వ్యాపారులు సైతం పోటీకి వస్తున్నారు. దీంతో రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ధరలు పడిపోతే స్థిరీకరించడానికి రూ.3 వేల కోట్లతో నిధిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఇవేమీ చేయలేదు. అయినా అప్పుడు కళ్లు లేని కబోదిలా వ్యవహరించిన ఈనాడు రామోజీరావు ఇప్పుడు రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తున్నప్పటికీ తనదైన శైలిలో విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ‘రైతులకు ఇదేనా మద్దతు’ అంటూ ఒక విష కథనాన్ని వండివార్చారు. దీనిపై నిజనిజాలివే.. బాసటగా నిలవాలనే.. రైతులు తమ పంట ఉత్పత్తులను దారుణ పరిస్థితుల్లో తక్కువకు అమ్ముకోరాదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పంటలకు గిట్టుబాటు ధరలను ప్రకటించింది. సహజంగా పంటలకయ్యే పెట్టుబడి–రాబడి ఆధారంగా వ్యవసాయ ఖర్చులు–ధరల కమిషన్ సిఫార్సు మేరకు కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తుంది. అయితే కనీస మద్దతు ధరలను ప్రకటించని పంట ఉత్పత్తులకు మార్కెట్లో ధరలు పతనమైనప్పుడు గతంలో ఆదుకున్న దాఖలాలుండేవి కావు. అలాంటి పంటలు వేసే రైతులకూ గిట్టుబాటు ధర దక్కాలన్న ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే రాష్ట్రంలో ఎక్కువగా సాగయ్యే ఆరు ప్రధాన పంటలకు గతంలో ఎన్నడూ లేని విధంగా గిట్టుబాటు ధరలు ప్రకటించింది. అంతకన్నా ఎక్కువ ధర పలికితే రైతులు దర్జాగా మార్కెట్లోనే విక్రయించుకుంటారు.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ అనుకోని విపత్కర పరిస్థితులు తలెత్తి మార్కెట్లో ధరలు పడిపోతే వారిని ఆదుకోవడానికి ఈ ధరలు బెంచ్‌మార్క్‌గా ఉపయోగపడతాయనేది ప్రభుత్వ ఆలోచన. కాబట్టి బయట ఎవరూ ప్రభుత్వం నిర్దేశించిన ధరకంటే తక్కువకు రైతు నుంచి కొనే సాహసం చేయరు. అయితే ఇలాంటి మంచి ఉద్దేశంతో పెట్టిన ధరపైన కూడా వక్రభాష్యం చెప్పడం ‘ఈనాడు’కే చెల్లింది. ఆరోపణ: కొన్ని పంటలకే మద్దతు ధరలు వాస్తవం: కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి పంటలకు దేశంలోనే తొలిసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించింది. కొన్ని పంటలకే మద్దతు ధర ప్రకటించారని విమర్శిస్తున్న రామోజీ.. చంద్రబాబు తన హయాంలో ఒక్క పంటకు కూడా మద్దతు ధర ప్రకటించకపోయినా ఎందుకు ప్రశ్నించలేదు? దీనిపై తన పత్రిక ఈనాడులో ఏనాడూ చిన్న వార్త రాసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే రాష్ట్రంలో విస్తారంగా సాగయ్యే మిరప, పసుపు, అరటి, బత్తాయి, ఉల్లితో పాటు చిరు ధాన్యాలకు సైతం గిట్టుబాటు ధరలను ప్రకటించడమే కాదు.. మార్కెట్లో ధర దక్కని ప్రతిసారీ అండగా నిలుస్తోంది. ఆరోపణ: మొక్కుబడి కొనుగోలు వాస్తవం: ధరల స్థిరీకరణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. నిర్దేశిత పంటలకు ఒకవేళ ధర పడిపోతే.. మార్కెట్లో జోక్యం చేసుకుని ఈ నిధి సాయంతో వాటిని కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుంది. సీఎం యాప్ ద్వారా రోజూ గ్రామ స్థాయిలో మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తూ.. ధరలు పడిపోయిన వెంటనే రంగంలోకి దిగుతోంది. ఇలా పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుని మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ప్రస్తుత సీజన్లో మార్కెట్లో మద్దతు ధర దక్కని శనగలు, మొక్కజొన్న, పసుపును మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొంటోంది. 28,112 మంది రైతుల నుంచి రూ.336.83 కోట్ల విలువైన 63,135 టన్నుల శనగలు, 9,027 మంది రైతుల నుంచి రూ.148.88 కోట్ల విలువైన 72,315.85 టన్నుల మొక్కజొన్న, 312 మంది రైతుల నుంచి 413 టన్నుల పసుపు కొనుగోలు చేసింది. ఇలా ఇప్పటి వరకు రూ.7,712 కోట్ల విలువైన 21.55 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు టీడీపీ ఐదేళ్ల పాలనలో కొనుగోలు చేసింది.. అన్నీ కలిపి కేవలం రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు మాత్రమే. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉత్పత్తులు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని అర్థమవుతోంది. కనీసం ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే.. అదీ లేదు. ఐదేళ్లలో ధాన్యం కొనుగోలు కోసం చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.40,236.91 కోట్లయితే... ఈ నాలుగేళ్లలోనే జగన్ ప్రభుత్వం వెచ్చించిన మొత్తం ఏకంగా రూ.58,626.88 కోట్లు. దీన్ని మొక్కుబడి కొనుగోలు, నామమాత్రపు కొనుగోలు అంటారా.. రామోజీ? ఆరోపణ: చిరుధాన్యాలపై చిత్తశుద్ధి ఏదీ? వాస్తవం: చిరుధాన్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున రాయితీలను అందిస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా క్వింటాకు రూ.2,500 చొప్పున ప్రకటించింది. వాస్తవానికి ఈ పంటల సాగు రాష్ట్రంలో చాలా తక్కువ. అయినా వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కనీస మద్దతు ధరలతో సంబంధం లేకుండా బహుళ జాతి సంస్థలే పోటీç³డి క్వింటా రూ.4 వేలకుపైగా చెల్లించి పొలాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది 3.80 లక్షల ఎకరాల్లో సాగుచేయాలన్న లక్ష్యంతో ఆర్బీకేల స్థాయిలో ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. ఆరోపణ: ఈ ధరలకు అమ్ముకుంటే రైతులు గల్లంతే.. వాస్తవం: మిర్చి పంటకు ప్రభుత్వం క్వింటా రూ.7 వేలు కనీస మద్దతు ధర ప్రకటించింది. వాస్తవానికి రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 5 లక్షల ఎకరాలు కాగా, 2021–22లో 5.62 లక్షల ఎకరాలు, 2022–23లో 5.77 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 6 లక్షల ఎకరాలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఓ వైపు తామర ప్రభావం పూర్తిగా సమసిపోనప్పటికీ మిరప సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గుంటూరు యార్డులో క్వింటా రూ.30 వేలు, వరంగల్ యార్డులో రూ.50 వేలకు పైగా ధర పలకడమే ఇందుకు కారణం. వాస్తవం ఇలా ఉంటే రైతులేదో క్వింటా రూ.7 వేలకే అమ్ముకుని నష్టపోతున్నట్టుగా విషప్రచారం చేస్తుండడం ‘ఈనాడు’కే చెల్లింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రస్తుతం ఎమ్మెస్పీ ధరల కంటే మిన్నగా మిరప, పత్తి, వేరుశనగ, మినుము, పంటలకు మార్కెట్లో ధర పలుకుతోంది. ధరలు పడిపోయినప్పుడు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఈ రకమైన భరోసా ఇవ్వడంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. విశేషమేంటంటే ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, మార్కెట్ జోక్యంతో చేసిన కొనుగోళ్లు కానీ ఎన్నడూ రామోజీకి కనిపించలేదు. పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ అదే సమయంలో రైతుకు ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున ఇస్తోన్న పెట్టుబడి సాయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రమే కొన్ని పంటలకు ధరలు నిర్ణయించినప్పుడు దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిచేశారంటూ ‘ఈనాడు’ ప్రశంసించనూ లేదు. రైతుల్ని ఆదుకోవటానికి ఉదారంగా వ్యవహరించారంటూ ఒక్క అక్షరమూ రాయలేదు. ఇప్పుడు మాత్రం ఆ ధరలను కేంద్రం మాదిరిగా పెంచడం లేదంటూ వాపోతుండడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వానిదే ‘జీఎల్టీ’ భారం రైతుల ప్రయోజనార్థం ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా గుర్తించడమే కాదు.. రైతు పొలం నుంచే నేరుగా పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అందుకయ్యే జీఎల్టీ (గన్నీ బ్యాగ్‌లు, కూలీలు, రవాణా) ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో టన్నుకు రూ.2,523 చొప్పున (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలు రూ.468లతో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85) చెల్లిస్తుండగా, ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. ఇటీవలే మార్కెట్లో ధర పడిపోవడంతో మొక్కజొన్న క్వింటా కనీస మద్దతు ధర రూ.1,962 చొప్పున కొనుగోలు చేసింది. కానీ రైతులకు క్వింటాకు రూ.2,370 చొప్పున చెల్లించింది. పైగా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, అన్లోడింగ్, రవాణా చార్జీల కోసం ఈ అదనపు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేసింది. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రైతులను ఇలా ఆదుకున్న సందర్భమే లేదు. అయినా రామోజీకి ఒక్క అక్షరం రాస్తే ఒట్టు. -
పంటలకు మద్దతు ధర అరకొరేనా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పంటలకు మద్దతు ధరలు ఆశాజనకంగా లేవని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. వివిధ పంటల సాగు ఖ ర్చుల ప్రకారం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయా లని తాము కోరితే కేంద్రం పెడచెవిన పెట్టిందని అంటున్నాయి. కేంద్రం విదిల్చే లెక్క ప్రకారం రైతులు పండించిన పంటకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదని అంటున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ సీజన్లలో రైతు లు పండించే పంటలకు కేంద్రం బుధవారం ప్రకటించిన కొత్త మద్దతు ధరలు భరోసా ఇచ్చే పరిస్థితి లేదంటున్నాయి. సీఏసీపీకి ఇచ్చిన నివేదికల ప్రకారం..: రాష్ట్రంలో రైతులు పంటల సాగుకు పెడుతున్న పెట్టుబడి ఖర్చులపై రాష్ట్ర వ్యవ సాయశాఖ భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ)కి నివేదించింది. సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ పంపిన నివేదికల ప్రకారం తెలంగాణలో క్వింటా వరి సాధారణ (కామన్) రకం ధాన్యానికి రూ. 3,300, ఏ గ్రేడ్ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మొక్కజొ న్నకు రూ. 2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతు గతే డాది ఖర్చు చేశారు. ఈ ఖర్చులకు స్వా మినాధన్ సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా కలపాల ని రాష్ట్రం సూచించింది. ఆ ప్రకారం మద్దతు ధరలను ఖరా రు చేయాలని కోరింది. ఉదాహరణకు పత్తి క్వింటాకు రూ. 11 వేలు ఖర్చు అయి తే, స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం అందులో 50 శాతం కలపాలి. ఆ ప్రకారం మద్దతు ధరగా రూ. 16,500 ప్రకటించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. అయితే కేంద్రం పత్తికి మద్ద తు ధర కేవలం రూ. 7,020 మాత్రమే ఖరారు చేసింది. స్వామినాధన్ సిఫార్సులను పక్కన పెట్టినా వాస్తవ ఖర్చు ప్రకారమైనా మద్దతు ధర ప్రకటించలేదన్న విమర్శలు ఉన్నాయి. స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తున్నామని కేంద్రం చెప్పుకుంటోంది. కానీ క్షేత్రసాయి లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. -
వరి సాగు ఖర్చు రూ. 1,360... మద్దతు ధర రూ. 2,060
సాక్షి, హైదరాబాద్: దేశంలో సాగు ఖర్చుకు మించి మద్దతు ధరలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 23 రకాల పంటల సాగుకు అయ్యే ఖర్చు ఎంత? వాటికి అందుతున్న మద్దతు ధర ఎంత అనే దానిపై తాజాగా ఒక అధ్యయన నివేదిక విడుదల చేసింది. వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ) మేరకు సాగు ఖర్చులను దేశ వ్యాప్తంగా లెక్కలోకి తీసుకొని వీటి సరాసరిని నివేదికలో పొందుపరిచింది. 2022–23లో వరి ఉత్పత్తి ఖర్చు క్వింటాల్‌కు రూ. 1,360 ఉండగా, కనీస మద్దతు ధర రూ. 2,060గా కేంద్రం నిర్ధారించిన సంగతి తెలిసిందే. పత్తి ఉత్పత్తి ఖర్చు రూ. 4,053 ఉండగా, దాని మద్దతు ధర రూ. 6,080గా ఉంది. అలాగే మొక్కజొన్న సాగు, ఉత్పత్తి ఖర్చు రూ. 1,308 ఉండగా, దాని మద్దతు ధర రూ. 1,962గా ఉంది. కంది ఉత్పత్తి ఖర్చు రూ. 4,131 కాగా, మద్దతు ధర రూ. 6,600 ఉంది. ఇక సోయాబీన్ ఉత్పత్తి ఖర్చు ధర రూ. 2,805 కాగా, మద్దతు ధర రూ. 4,300 ఉంది. వేరుశనగ సాగు ఖర్చు రూ. 3,873 కాగా, 5,850గా ఉంది. ఉత్పత్తి వ్యయంపై కనీసం 50% లాభం కలిగించేలా కనీస మద్దతు ధరలు నిర్ధారించినట్లు కేంద్రం తన నివేదికలో స్పష్టం చేసింది. ఇలా మూడేళ్ల సాగు ఖర్చు, వాటికిచ్చిన మద్దతు ధరల వివరాలను పొందుపరిచింది. కేంద్రం వర్సెస్ రాష్ట్రం... అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాగు ఖర్చు వివరాలు, మద్దతు ధరలు శాస్త్రీయంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌కు పలుమార్లు రాష్ట్రంలోని పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరలు ఉండాలని కేంద్రాన్ని కోరింది. సాగు ఖర్చుకు మరో 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్పీ ఇవ్వాలని సీఏసీపీకి ప్రతిపాదించింది. అందులో వివిధ పంటలకు ఎంతెంత ఖర్చు అవుతుందో వివరించింది. పంటల వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంటకోత, రవాణా, కూలీ, రైతు కుటుంబ శ్రమకు ప్రతిఫలం అన్నీ కలిపి ఎంత ఖర్చు అవుతుందో సవివరంగా కేంద్రానికి నివేదించింది. ఒక వ్యాపారి తన వస్తువును అమ్ముకునేప్పుడు ధర ఎలా నిర్ణయిస్తారో, ఆ ప్రకారమే పెట్టిన పెట్టుబడి, దానికి అయ్యే వడ్డీలను లెక్కలోకి తీసుకొని సాగు ఖర్చును నిర్ధారించారు. ప్రతీ ఏడాది ఇలాగే శాస్త్రీయంగా సాగు ఖర్చు, ఎంఎస్పీ ఎలా ఉండాలో తెలంగాణ వ్యవసాయశాఖ ఇస్తూనే ఉంది. కానీ కేంద్రం తన పద్ధతిలో తాను ఎంఎస్పీని నిర్ధారిస్తూ పోతోందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. వరి సాగు ఖర్చు ఎకరానికి రూ. 40 వేలు... సాధారణ వరి రకం పండించేందుకు నారుమడి సిద్ధం చేయడం మొదలు విత్తనాలు, నాట్లు, ఎరువులు, కలుపుతీత, చివరకు పంట కోత, కూలీల ఖర్చు, కుటుంబ సభ్యుల శ్రమ మొత్తం కలుపుకుంటే ఎకరానికి రూ. 40 వేలు ఖర్చు (24 క్వింటాళ్లు) అవుతున్నట్లు లెక్కగట్టింది. ఆ ప్రకారమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేసింది. ఎకరా ఖర్చు ప్రకారం క్వింటా వరి పండించాలంటే రూ. 1,666 ఖర్చు అవుతుందని నిర్ధారణ చేసింది. స్వామినాథన్ కమిటీ సిఫా ర్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్పీ రూ. 2,499 ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వరి ఎంఎస్పీ రూ. 2,060గా ఉండగా, అధికంగా పెంచాలని కోరుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తికి కూడా ఎకరాకు రూ.40 వేలు ఖర్చుకానుంది. ఎకరాకు పత్తి ఏడు క్వింటాళ్లు పండుతాయి. కాబట్టి క్వింటాకు రూ. 5,714 ఖర్చు కానుంది. ఆ లెక్కన స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం రూ. 8,574 పెంచాలని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పత్తి మద్దతు ధర రూ. 6,080 మాత్రమే ఉండగా, మరో రూ. 2,491 వరకు పెంచాల్సి ఉంటుంది. జిల్లా.. జిల్లాకు సాగు ఖర్చులో తేడా ఉంటున్నందున దేశీయంగా ఒకే విధమైన ఉత్పత్తి ఖర్చును అంచనా వేయలేమని, కాబట్టి సరాసరిని లెక్కలోకి తీసుకోవడం తగదని పలువురు అంటున్నారు. మొక్కజొన్నకు ఎకరాకు రూ. 32 వేల వరకు ఖర్చుకానుంది. ఎకరాకు 15 క్వింటాళ్లు పండిస్తారు. క్వింటాకు రూ. 2,133 ఖర్చు కానుంది. ఆ ప్రకారం మద్దతు ధర రూ. 3,199 ఇవ్వాలని అంటున్నారు. కందికి రూ. 21 వేల వరకు ఖర్చుకానుంది. ఎకరాకు 4 క్వింటాళ్లు పండుతుంది. క్వింటాలుకు రూ. 5,250 ఖర్చు వస్తుంది. ఆ ప్రకారం మద్దతు ధర రూ. 7,875 పెంచాల్సి ఉంటుందని అధికారులు అంటున్నా రు. ప్రస్తుతం దీనికి రూ. 6,600 మద్దతు ధర ఉంది. సోయాబీన్‌కు రూ. 32 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఎకరాకు 5 క్వింటాళ్లు పండుతుంది. దీనికి క్వింటాలుకు రూ. 6,400 ఖర్చు కానుంది. ఆ ప్రకారం మద్దతు ధర రూ. 9,600 చేయాల్సి ఉంటుందని అంటున్నారు. సాగు ఖర్చు నిర్ధారణలో శాస్త్రీయత లేదు సాగు ఖర్చును అంచనా వేయడంలో కేంద్రానికి శాస్త్రీయమైన పద్ధతి లేదు. దేశంలో జిల్లాకో రకంగా సాగు ఖర్చు ఉంటుంది. దీంతో ఒకచోట ఎక్కువ ఒకచోట తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వేసిన సాగు ఖర్చు, దాని ప్రకారం మద్దతు ధర నిర్ధారణ సరిగా లేదు. దీంతో రాష్ట్రంలో ఉన్న రైతులు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఏసీపీకి పంపే నివేదికలకు విలువ ఉండటం లేదు. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
రావాల్సిన ‘చిరు’ విప్లవం
ఐక్యరాజ్యసమితి 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. కిలో బియ్యం పండించేందుకు 3–5 వేల లీటర్ల నీళ్లు అవసరం కాగా, చిరుధాన్యాలకు 200 లీటర్లు చాలు. వాటి పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ‘టీటీడీ’ ఆధ్వర్యంలో 11 ధార్మిక ప్రాంతాలకు వీటిని అందించేట్టుగా చేసుకున్న ఒప్పందం లాంటిది పంజాబ్ లాంటి రాష్ట్రాలు అనుసరించవచ్చు. చిరుధాన్యాల హల్వా, పాయసాలు ప్రసాదంగా మంచి ప్రత్యామ్నాయాలు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12 కోట్ల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజనంలో వారంలో ఒక పూటైనా చిరుధాన్యాలు అందిస్తే వీటి డిమాండ్ పెరిగి, రైతులను ఆ దిశగా మళ్లేట్టు చేస్తుంది. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. దీంతో ఈ అద్భుత సిరిధాన్యాలపై మరోసారి అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. 2023 ఏడాది ముగిసేలోపు ఈ చిరుధాన్యాలను తృణప్రాయంగా పక్కనబెట్టే మానసిక స్థితి నుంచి అందరూ బయటపడతారని నేనైతే నమ్మకంగా ఉన్నాను. ప్రతిగా... ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అదృశ్య ఆకలి ప్రమాదాన్ని భారత్ కూడా సమర్థంగా ఎదుర్కునే అవకాశం లభిస్తుంది. ఒకప్పుడు వీటిని తృణధాన్యాలని పిలిచేవారు. ఇవి ముతకగా ఉండవచ్చునేమో కానీ, ఆరోగ్యానికి హాని చేసేవి కాదు. నిజానికి పోష కాలతో నిండి ఉంటాయి. వాతావరణాన్ని తట్టుకోగల తెలివైన పంటలు కూడా. మెట్ట, వర్షాధారిత ప్రాంతాల్లో ఎంచక్కా పండించు కోవచ్చు. చిరుధాన్యాల జాబితాలోకి సజ్జలు, జొన్న, రాగులతోపాటు ఇతర చిన్న సైజు గింజలుండే ఆరు ధాన్యాలు(కొర్ర, అండుకొర్ర, అరికె, ఊద, సామ, వరిగ) వస్తాయి. చాలాకాలంగా వీటిని ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం చేశారు. యూరోపియన్ లేదా అమెరికన్ ఆహార శైలుల్లోకి ఇవి ఇమడకపోవడం ఒక కారణం. సంప్రదాయ సాగు నుంచి మళ్లించాలి... అయితే మిల్లెట్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా తదితర పౌర సమాజ వర్గాలు చిరుధాన్యాల ప్రయోజనాలపై చేసిన విస్తృత స్థాయి ప్రచారం పుణ్యమా అని ఇప్పుడు వీటికి మరోసారి ప్రాధాన్యం ఏర్పడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలోకి వీటిని చేర్చడం కారణంగా ఇప్పుడు వైవిధ్యభరిత ఆహార, పంటల వ్యవస్థలకు మార్గం సుగమమైంది. చిరుధాన్యాల లాభాల గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ ఏడాదిలో వీటి గురించి మరింత వింటాం కూడా. ప్రజల్లో అవగాహన మరింత పెంచడం, దిగుబడుల పెంపు, ఆహార శుద్ధికి అవకాశాలు కల్పించడం, సేకరణ మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ ఏడాది చర్చోపచర్చలు జరగనున్నాయి. అయితే చిరుధాన్యాల సాగును మరింతగా పెంచాలంటే, నీటి అవసరాలు ఎక్కువగా ఉండే వరి సాగు నుంచి రైతులను మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం చిరుధాన్యాల సాగు రైతులకు లాభదాయకంగా ఉండాలి. అయితే ఇది చెప్పినంత సులువైన పనేమీ కాదు. సంప్రదాయ పంటల సాగు నుంచి రైతును ఇంకో దిశకు మళ్లించడం కోసం గతంలోనూ కొన్ని విఫలయత్నాలు జరిగిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఒక కిలో బియ్యం పండించేందుకు ప్రాంతం, వాతావరణాలను బట్టి మూడు నుంచి ఐదు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ చిరుధాన్యాల విషయంలో నీటి అవసరం కేవలం 200 లీటర్లు మాత్రమే. పైగా వీటి సాగులో రసాయన ఎరువులు, క్రిమి, కీటక నాశినుల వాడకమూ పెద్దగా ఉండదు. పోషకాలూ మెండుగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ‘కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్’ (సీఏసీపీ) చిరుధాన్యాల ధరల నిర్ణయానికి కొత్త ఫార్ములాను రూపొందించాలి. పర్యావరణానికి చిరు ధాన్యాలు అందించే తోడ్పాటును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడికి అందే ధరలో రైతుకు దక్కేది కొంతే కాబట్టి ధరలు నిర్ణయించే తీరు మారడం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. పండించే పంటకు కచ్చితంగా కొంచెం పెద్ద మొత్తంలోనే ధర లభిస్తుందని తెలిస్తే రైతుకూ, సమాజానికీ లాభం. స్ఫూర్తిదాయకమైన ఏపీ మోడల్ చిరుధాన్యాలకు మద్దతుధరలు కొత్తగా నిర్ణయించడంతోపాటు వరి పంటకు పేరెన్నికగన్న పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగును పెంచాలి. 1950లో అవిభాజ్య పంజాబ్‌లో సుమారు 11 లక్షల హెక్టార్లలో సజ్జలు సాగవుతూండేవి. ఇప్పుడు ఇది వెయ్యి హెక్టార్ల కనిష్ఠానికి పడిపోయింది. గోధుమ, వరి పంటలను మార్చి మార్చి వేయడమన్న విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పరిస్థితి ఇంతకు దిగజారింది. పప్పులు, నూనెగింజలతోపాటు చిరుధాన్యాల సాగు మళ్లీ చేపట్టడం మేలైన ముందడుగు అవుతుంది. ఇలా పంటల వైవిధ్యానికి చిరుధాన్యాలు చేర్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. పర్యావరణ విధ్వంసానికి కారణమైన హరిత విప్లవ దుష్ప రిణామాలను చక్కదిద్దగలగడం ఒకటైతే... చిరుధాన్యాలకు డిమాండ్ పెంచడం రెండోది. చిరుధాన్యాల సాగు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను పంజాబ్ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని 11 ధార్మిక ప్రాంతాల్లో సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (సీఎస్ఏ), రైతు సాధికార సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్ కలిసికట్టుగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా 12 రకాల పంటలను 15,000 టన్నుల మేరా సహజసేద్య విధానంలో అందించాలి. ఇందులో భాగంగా కనీస మద్దతు ధర కంటే పది శాతం ఎక్కువ ధర రైతుకు లభించనుంది. ఒకవేళ మార్కెట్లో ఆయా పంటకు ఎక్కువ ధర ఉంటే... అదనంగా ఇంకో పదిహేను శాతం చెల్లిస్తారు. కర్ణాటకలోనూ గతంలో రాగుల సాగును ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధర కంటే 40 శాతం ఎక్కువ చెల్లించారు. పంజాబ్‌లోని వేల గురుద్వారాలను దృష్టిలో ఉంచుకుంటే చిరుధాన్యాలకు, అదికూడా సేంద్రీయ ఉత్పత్తలకు మంచి డిమాండే ఉంటుంది. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సంస్థల సాయంతో సేంద్రీయ లంగర్ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు. ఇందులో వడ్డించే ఆహార పదార్థాల్లో చిరుధాన్యాలను చేర్చవచ్చు. ఆ మాటకొస్తే చిరుధాన్యాల హల్వా, పాయసాలు ప్రసాదంగా మంచి ప్రత్యామ్నాయాలవుతాయి. చిరుధాన్యాల సక్రమ నిల్వ, సరఫరాల బాధ్యతను మార్క్‌ఫెడ్ వంటి సంస్థలకు పంజాబ్ అప్పగించవచ్చు. ఖేతీ విరాసత్ మిషన్ వంటి లాభాపేక్ష లేని సంస్థలకు సేంద్రీయ వ్యవసాయ సముదాయాల ఏర్పాటు పనులు అప్పగించవచ్చు. నాణ్యతను నిర్ధారించేందుకు అవసరమైన చర్యలూ సులువుగా చేపట్టవచ్చు. పాఠశాలల డిమాండ్ కూడా చేరితే... పంజాబ్‌లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుతున్నారు. వీరికందించే మధ్యాహ్న భోజన పథకంలో ప్రారంభంలో వారానికి ఒకసారి చిరుధాన్యాలను కూడా చేరిస్తే విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. తద్వారా స్థానికంగానే వీటి సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ నిర్ణయించినట్లే చిరుధాన్యాలను పంజాబ్‌లోనూ స్థానిక రైతుల నుంచి మాత్రమే సేకరిస్తామని చెప్పవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో సుమారు 110 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీరికి వారంలో ఒకసారి చిరుధాన్యాలను వడ్డిస్తున్నారు. అయితే ఈ డిమాండ్‌ను తట్టుకోవడం కష్టమవుతోంది. పంజాబ్ మొత్తమ్మీద చిరు ధాన్యాలను వడ్డిస్తే పరిస్థితి ఎలా ఉండనుందో ఇట్టే అర్థం చేసు కోవచ్చు. పాఠశాలలు, గురద్వారాలతో ఏర్పడే డిమాండ్‌ను తట్టు కునేందుకు పంజాబ్ ప్రభుత్వం, రైతులు ఏదో ఒక మాయ కచ్చితంగా చేయగలరు. జాతీయ స్థాయిలో చూస్తే సుమారు 12.7 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 12 కోట్ల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వీరందరికీ చిరుధాన్యాలు ఏదో ఒక స్థాయిలో అందించడం రైతులను చిరుధాన్యాల సాగుకు మళ్లించేందుకు మేలిమి మార్గం కాగలదు. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనాలయాల సాయంతో చిరుధాన్యాల సాగు, వినియోగాన్ని పెంచడం సుసాధ్య మవుతుంది. పంజాబ్ ఈ దిశగా అడుగులేసి దేశంలో చిరుధాన్యాల విప్లవాన్ని సృష్టించాలని ఆశిద్దాం! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ పంటలకు ఇచ్చే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, ఈ అంశాన్ని కేంద్రప్రభుత్వం పరిశీలించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన బడ్జెట్–2023కు సంబంధించిన సంప్రదింపుల కమిటీ భేటీకి హాజరైన కోమటిరెడ్డి కేంద్రానికి పలు సూచనలు చేశారు. రైతులకు రుణాలిచ్చేందుకు ఇప్పటికే ఉన్న నిబంధనలను సవరించాలని సూచించారు. -
11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
కరప: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజాశంకర్ చెప్పారు. ఆయన గురువారం తూర్పుగోదావరి జిల్లా కరప, పాతర్లగడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు మద్దతు ధర అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తుపాన్లు, భారీవర్షాల కారణంగా రాష్ట్రంలో 2.48 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, 7.50 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 1.30 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. రైతులను ఆదుకునేందుకు రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. మిల్లర్లు, కమీషన్ వ్యాపారులకు అమ్ముకోకుండా.. ఆర్బీకే సిబ్బంది కళ్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రబీ సీజన్లో రైతులు బొండాలు (ఎంటీయూ 3626) రకం సాగుచేయవద్దని, వాటిని కొనుగోలుచేయబోమని చెప్పారు. రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం పథకంలో 18 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, ఇతర సంస్థలకు మరో 4 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద రాష్ట్రంలో 22 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
ఆ పంటలకు ఆశాజనకంగా ధర
మోర్తాడ్(బాల్కొండ): సోయా, కందులు, పెసర్లకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో నూతన వ్యవసాయ విధానం అమలుతో రైతులకు ప్రయోజనం కలుగనుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వర్షాకాలంలో మొక్కజొన్నకు బదులు సోయా, కందులు, పెసర్లు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలకు మినిమం సపోర్టు ప్రైస్(ఎమ్మెస్పీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా సోయా, కందులు, పెసర్లకు గతంలో కంటే ఎక్కువ ధర పెరిగింది. సోయాకు గతంలో క్వింటాలుకు రూ.3,710 మద్దతు ధర ఉండగా ఈ సారి రూ.170 పెరిగింది. రాష్ట్రంలో సోయా సాగు విస్తీర్ణం పెరగడానికి వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది. మొక్కజొన్నకు ప్రత్యామ్నయంగా సోయా పంటను సాగు చేయడానికి రైతులను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. కందులకు రూ.200 మద్దతు ధర పెరిగింది. కందులకు గతంలో క్వింటాల్‌కు రూ.5,800 ఉండగా ఇప్పుడు రూ.ఆరు వేలు అయింది. అలాగే పెసర్లకు క్వింటాలుకు రూ.146 మద్దతు ధర పెంచారు. దీంతో క్వింటాలుకు రూ.7,196 ధర లభించనుంది. పెసర్లు దిగుబడి ఎక్కువగా లభించే అవకాశం లేదు. సోయాలో కందులను అంతర్ పంటగా సాగు చేయడంతో ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎల్. కిషన్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. -
ముందే 'మద్దతు'
ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత పరిస్థితి కచ్చితంగా మారాల్సిందేనని, రైతులకు భరోసా ఇచ్చామన్న నమ్మకం కలగాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి వరకు అది జరగాలని చెప్పారు. ఆరు నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు సవాలుగా తీసుకుని పని చేయాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనమే లక్ష్యంగా మార్కెటింగ్ విధానాలు ఉండాలని, గ్రామ సచివాలయాల్లోనే క్రాప్ వివరాలు, ధరలు ప్రకటించాలని.. రైతులు నేరుగా ఫోన్ చేసి సహాయం అడిగే అవకాశం ఉండాలని చెప్పారు. దీనివల్ల ప్రైవేట్ వ్యక్తులు కూడా మంచి ధరలకు రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తారని, ఇ–క్రాప్ నమోదుపై వలంటీర్ల ద్వారా రైతులకు సమాచారం ఇవ్వాలని, గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే బోర్డులు ఉంచాలని సీఎం సూచించారు. కనీస మద్దతు ధర లేని పంటలకు ధరలు ప్రకటించాలని, రైతుకు నష్టం రాకుండా ఈ ధరలు నిర్ణయించాలని స్పష్టం చేశారు. పంటల దిగుబడి ఏ స్థాయిలో ఉంటాయన్న దానిపై అంచనాలు రూపొందించాలని, గత ఏడాదితో పోల్చి ఈ వివరాలు తయారు చేయాలని ఆదేశించారు. మార్కెట్లపై నిరంతర సమాచారం మూడు మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని, ఇప్పుడున్న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు, అగ్రివాచ్ సహా మరో ఏజెన్సీ ఏర్పాటుకు గత సమీక్షలో తీసుకున్న నిర్ణయంపై ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల భవిష్యత్ ధరలు, బిజినెస్ కన్సల్టెన్సీ, ధరల స్థిరీకరణ నిధి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఈ ఏజెన్సీ విధులుగా ఉండాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఇందులోనూ నిపుణులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం ఇప్పుడున్న గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై సమగ్ర పరిశీలన చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అవసరాలు, వాటిని తీర్చేలా గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల కోసం ఎన్ని కోల్డ్ స్టోరేజీలు ఉండాలన్న దానిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకు ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆలోచించాలని సూచించారు. సహకార రంగాన్ని పునర్ వ్యవస్థీకరించాలి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను తిరిగి బలోపేతం చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఉన్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అందులో సమగ్రంగా ఉండాలని సూచించారు. అవినీతి, పక్షపాతానికి తావులేని విధానం ఉండాలని, సహకార రంగాన్ని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను బాగు చేయడానికి ఏం చేయాలో అది చేద్దామని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రతిష్టాత్మక సంస్థతో సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయించాలని సీఎం పేర్కొన్నారు. ఆప్కో పునరుద్ధరణ, బలోపేతంపై కూడా అధ్యయనం చేయించాలని, ఆరు నెలల్లో సిఫార్సుల అమలు ప్రారంభంకావాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ జోక్యంతో మార్కెట్లో ధరల స్థిరీకరణ రాష్ట్రంలో 85 రైతు బజార్లలో కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు విక్రయిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 660 మెట్రిక్ టన్నులు వినియోగదారులకు ఇచ్చామని, కిలో ఉల్లి ధరను రూ.32కు అదుపు చేయగలిగామని వివరించారు. మళ్లీ ధరలు పెరిగిన క్రమంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇప్పుడు సరిపడా నిల్వలు ఉన్నాయా? లేదా? అని ఆరా తీయగా సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. టమాటా రైతులను కూడా ఆదుకున్నామని, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మార్కెటింగ్ అవకాశాలు చూసి ఆ మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పప్పు ధాన్యాల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రైతులు ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని ఆరు తడి పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పారు. చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు రాయలసీమ ప్రాంతాన్ని చిరు ధాన్యాల హబ్‌గా రూపొందించాలని, ఈ నెలాఖరులోగా చిరు ధాన్యాల బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే 9 నెలల పాటు గ్రీన్ కవర్ ఉండేలా చూడాలని సూచించారు. చిరుధాన్యాల బోర్డులో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులకు పెద్దపీట వేయాలన్నారు. వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ తదితరాలను బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్నారు. బోర్డు విధి విధానాలపై కూడా చర్చించారు. ►రైతుల ప్రయోజనమే లక్ష్యంగా మార్కెటింగ్ విధానాలు ఉండాలి. దళారులకు పంటలను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు రాకూడదు. దళారులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరగాలి. అరటి, చీని, మామిడి, కమల, బొప్పాయి సహా ఏ పంట విషయంలోనైనా దళారులు లేకుండా చూడాలి. సీఎం వైఎస్ జగన్ -
వరికి మద్దతు ధర రూ. 3,650
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుల సాగు ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని, వ్యయానికి తగ్గట్టు వాటిని పెంచాలని భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ)ని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది. రబీ పంటలకు రైతులు పెట్టే ఖర్చుల వివరాలు నివేదిస్తూ వాటికి ఇవ్వాల్సిన మద్దతు ధరలను కమిషన్‌కు సిఫారసు చేసింది. పంటల వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంటకోత, రవాణా, కూలీ, రైతు కుటుంబ శ్రమకు ఫ్రతిఫలం తదితరాలన్నీ మదింపు చేసిన ఈ నివేదికను హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సీఏసీపీ సమావేశంలో సమర్పించారు. ఈ సమావేశంలో సీఏసీపీ చైర్మన్ విజయ పాల్ శర్మ, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి కమిషనర్ రాహుల్ బొజ్జ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్వింటా సాధారణ వరి పండించాలంటే రైతుకు అయ్యే ఖర్చు రూ. 2,433గా రాష్ట్ర వ్యవసాయాధికారులు నిర్ధారించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50% అదనంగా కలిపి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇవ్వాలని సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. ఆ సూత్రం ప్రకారం 2019–20 రబీ వరికి క్వింటాకు రూ.3,650 ఇవ్వాలని కోరింది. మొక్కజొన్న, శెనగ, వేరుశెనగ పంటలకు కూడా ఖర్చు, ఎంఎస్పీని పేర్కొంటూ సమగ్ర నివేదికను తయారు చేసింది. అలాగే మొక్కజొన్నకు క్వింటా పండించేందుకు రూ.3,104 ఖర్చు అవుతుందని నిర్ధారించారు. ఎంఎస్పీ రూ.5 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం క్వింటా మొక్కజొన్నకు రూ.1,700 ఎంఎస్పీ ఉంది. వేరుశెనగ క్వింటా పండించేందుకు రూ.5,148 ఖర్చు అవుతుండగా, క్వింటాకు ఎంఎస్పీ రూ.7,700 ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కోరింది. ఇక క్వింటా శెనగ పండించేందుకు రూ. 5,222 వ్యయం అవుతుండగా, మద్ధతు ధర రూ.7,800 ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ క్వింటా శెనగకు రూ.4,620 ఉంది. సాగు సహా ఇతర ఖర్చులు పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్రం విఫలమవుతోందని అధికారులు చెబుతున్నారు. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ, ఏపీ రైతు ప్రతినిధులు వరికి గోధుమ పంటతో సమానంగా మద్దతు ధర కల్పించాలని కోరారు. కర్ణాటక రాష్ట్ర రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల హెక్టార్లు పైగా విస్తీర్ణంలో మక్కలు పండిస్తున్నందున వాటికి మద్దతు ధర గతంలో లాగానే ప్రకటించాలని కోరారు. తమిళనాడు రైతు ప్రతినిధులు మాట్లాడుతూ శెనగలకు ఇప్పుడున్న క్వింటాలుకు రూ. 4,620 నుంచి రూ.6,000 పైగా ప్రకటించాలని కోరారు. -
సు‘బాబు’ల్ ‘మోసం’
సాక్షి, చీమకుర్తి: ‘‘ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమలు చేయాలని కలెక్టర్‌ను కలిశాం. మంత్రి దృష్టికి తీసుకుపోయాం. చివరకు జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి, రాజధానికే పోయి మరోసారి సీఎంకు కర్ర కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయంపై మొరపెట్టుకున్నాం. పోరాటంతో ఐదేళ్లు గడిచిపోయాయి గానీ కర్రసాగు చేసే మా బాధలు మాత్రం పరిష్కారం కాలేదని’’ రైతులు వాపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, రైతు సంఘం నాయకులు వివిధ దశల్లో పోరాటాలు చేశారు తప్ప రైతుల కష్టానికి ఫలితం లేదు. జామాయిల్ కర్ర టన్నుకు రూ.4400, సుబాబుల్ కర్రకు రూ.4200 వంతున కొనుగోలు చేయాలని ప్రభుత్వమే జీఓ నంబరు 31 విడుదల చేసింది. ఆ జీవో ప్రకారమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే పేపర్ మిల్లుల యజమానులు మార్కెట్ కమిటీలను తుంగలో తొక్కి ప్రత్యేకంగా దళారులను అడ్డం పెట్టుకొని జామాయిల్ టన్నును రూ.2500, సుబాబుల్ టన్నును రూ.2 వేలు వంతున కొంటూ రైతుల కష్టాన్ని దళారులు, పేపర్ మిల్లుల యాజమాన్యాలు దోచుకుంటున్నాయని రైతులు ఆరోపించారు. దళారులు అక్రమ మార్గంలో కొనుగోలు చేస్తున్న కర్ర లారీలను ఆపి రైతులందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోగా దానిపై మంత్రివర్గ ఉపసంఘం కనీసం కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలు రైతుల్లో వ్యక్తమవుతోంది. పేపర్ మిల్లుల యజమానులు కొనుగోలు చేయకపోగా నిలదీశారనే నెపంతో సంతనూతలపాడు, చీమకుర్తి మండలాలకు చెందిన రైతుల కర్రను కక్ష పూరితంగా కొనుగోలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 42 శాతం వాటా ప్రకాశం జిల్లాదే: రాష్ట్రంలో సాగయ్యే జామాయిల్, సుబాబుల్లో 42 శాతం వాటా ఒక్క ప్రకాశం జిల్లా నుంచే సాగవుతుందని రైతుసంఘం నాయకుల గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. జిల్లాలో జామాయిల్ 1.07 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. సుబాబుల్ 60 వేల ఎకరాల్లో, సరుగుడు 8 వేల ఎకరాల్లో సాగవుతుందని రైతులు చెబుతున్నారు. గతంలో వర్షాలు పుష్కలంగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలకే పొలంలో కర్ర కోతకు వచ్చేది. నాలుగైదేళ్ల నుంచి సకాలంలో వర్షాలు లేక ఐదేళ్లయినా కర్ర కోతకు రాకపోగా ఒక్కో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అనేక వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కర్రను కొనుగోలు చేసేవారు లేక కోతకు వచ్చిన కర్ర కూడా పొలాల్లోనే ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మార్కెట్లో పేపర్ ఖరీదు టన్నుకు రూ.15 వేలు పెరిగిందని, గతంతో పోల్చుకుంటే 50 శాతం పేపర్ ధర పెరగగా, దానికి ముడి సరుకుగా ఉన్న సుబాబుల్, జామాయిల్ కర్రకు మాత్రం ఐదేళ్ల క్రితం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకపోగా దానిలో సగానికి సగం కోతపెట్టి సగం ధర మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. -
‘రైతులను ఆదుకోవాలి’
హైదరాబాద్: పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేసిన ఆర్మూరు రైతులను నిర్బంధించడం సరికాదని అఖిల భారత కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. పసుపు, ఎర్రజొన్న పంటకు ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు, ఎర్రజొన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రజొన్నలకు రూ.3,500, పసుపు క్వింటాల్‌కు రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. పత్తి, మిర్చి, కంది పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 23న రాష్ట్రవాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులతో సమావేశం జరిపి వారు కోరిన న్యాయమైన ధరలకే పంట కొనుగొలు చేయాలని డిమాండ్ చేశారు. -
గిట్టుబాటు ధరకోసం ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. పసుపునకు క్వింటాలుకు రూ.15 వేలు, ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3500 మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. టీజేఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని రైతుల డిమాండ్ మేరకు పసుపు, ఎర్రజొన్న పంటలకు ధరలు పెంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న రైతులు తలపెట్టిన ఆందోళనకు తాము మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు కారణంగా పత్తి, మిర్చి, కందులు, జొన్న రైతులు దెబ్బతిన్నారన్నారు. రాష్ట్రంలో మంత్రివర్గం లేకపోవడంతో సమస్యలు నివేదించే పరిస్థితి లేదని చెప్పారు. పంటకు గిట్టుబాటు ధర కోరితే ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. టీజేఎస్ రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ రైతుల సమస్యలపై గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేస్తామన్నారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. -
రైతుల కోసం చంద్రబాబు ఎందుకు పోరాడలేదు?
-
సంక్షోభంలో కూరుకుపోయిన ఆయిల్ ఫామ్ సాగు
-
ఉత్సవ విగ్రహాల్లా రైతు సమితులు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో కష్టపడి పండించిన వరి, మినుములు, వేరుశనగ పంటలను మార్కెట్ యార్డులకు తరలించి రైతులు పడిగాపులు కాస్తున్నారని, వాటిని కొనే నాథుడే లేడని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా రైతు సమన్వయ సమితులు పనిచేస్తాయని సీఎం కేసీఆర్ సదస్సులు పెట్టి గొప్పగా చెప్పారని, కానీ సమితులకు నిధులు కేటాయించకుండా, వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన వరి పంటను మార్కెట్ యార్డులకు తరలించారని.. ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనకపోవడంతో కురిసిన వర్షాల కారణంగా తడిసి ముద్దయి రైతులు నష్టపోయారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
ధాన్యానికి ధరాఘాతం
నెల్లూరు(సెంట్రల్): రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ప్రకటనలు నీటిమూటలు గానే మిగిలిపోతున్నాయి. పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించకపోగా ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయిని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు కల్లాల్లో ఉన్న ధాన్యం ఎప్పుడు విక్రయించకుంటామోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పతనం జిల్లాలో ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం పుట్టి ధాన్యం ఏగ్రేడ్ రూ.13,515 వేలు, సాధారణ రకం రూ.13,175 కాగా దళారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. అలాగే తేమశాతం పేరుతో బస్తాకు(75 కిలోలు) రెండు నుంచి మూడు కిలోలు అదనంగా తీసుకుంటూ పుట్టి ధాన్యం రూ.12 వేల నుంచి రూ.11 వేల లోపు కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత తగ్గే అవకాశాలు ఉంటాయని, పుకార్లు సృష్టిస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. రైతులు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉంటున్నారు. 1.70 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా జిల్లాలో ఈ ఏడాది 2 లక్షల హెక్టార్లలో వరిసాగు చేశారు. మొత్తం 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొంతవరకు కోతలు పూర్తయి దాదాపుగా 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు అంచనా. ఇప్పటివరకు కేవలం 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే విక్రయాలు చేసినట్లు తెలుస్తోంది. రైతులు మిగిలిన ధాన్యాన్ని విక్రయించకుండా చాలా వరకు కల్లాల్లో, ఇళ్లలో నిల్వ ఉంచి మద్దతు ధర రాకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. తెలంగాణను బూచిగా చూపుతూ.. మిల్లర్లు, దళారులు వారి ఆదాయాన్ని చూసుకుంటున్నారే తప్ప రైతుల కష్టాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా పురుగుమందులు, ఎరువులు, ఇతరత్రా సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కానీ గిట్టుబాటు ధర మాత్రం రైతులకు అందడం లేదు. పలువురు మిల్లర్లు, దళారులు మాత్రం పక్క రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది ఎక్కువగా ధాన్యం పండిందని, అందువల్ల గిట్టుబాటు కావడం లేదనే పుకారును సృష్టిస్తున్నారు. దీంతో ధాన్యానికి మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. కొందరు మాత్రం దళారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నా విధిలేని పరిస్థితుల్లో విక్రయించి నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యానికి మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
పడిపోతున్న పత్తి ధర
జమ్మికుంట(హుజూరాబాద్): కొత్త సంవత్సరం తెల్లబంగారం ధర పడిపోతోంది. డిసెంబర్ చివరి వారం పలికిన ధరలకు భిన్నంగా ధరలు పడిపోతున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ.5 వేల ధర పలుకగా రైతుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. పత్తి మార్కెట్లో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి లూజ్ పత్తి 1073 క్వింటాళ్లు అమ్మకానికి రాగా వ్యాపారులు ఉదయం వేలం పాట నిర్వహించి క్వింటాల్ పత్తికి రూ.5వేల ధర గరిష్టంగా చెల్లించారు. కనిష్ట ధర రూ.4300, మోడల్ ధర రూ.4900 నిర్ణయించారు. దీంతో గత వారం పలి కిన క్వింటాల్‌కు రూ.5230కి సోమవారం పలికిన ధరలో రూ.203 తగ్గడంతో రైతులు ఆందోళన చెందారు. పతనానికి కారణం ఇదే దేశవ్యాప్తంగా పత్తి దిగుబడి ఎక్కువగానే ఉందని వారంక్రితం ముంబాయిలో కాటన్ అడ్వజర్ బోర్డులో వెల్లడికావడంతో దేశంలో పత్తి కొనుగోళ్లపై భారంపడింది. కేవలం దేశంలో తెలంగాణ, మహారాష్ట్రల్లో తప్పా అన్నిరాష్ట్రాల్లో పత్తి అధికంగా పండిందని సీఏబీలో చర్చించడంతో పత్తి కొనుగోళ్లపై ప్రభావం పడినట్లు వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వారంక్రితం క్యాండి ధర రూ.43 వేల 500 వరకు పలుకగా శుక్రవారం అదే క్యాండి రూ.41 వేల 500 పడిపోయింది. రూ.2 వేలు డిమాండ్ పడిపోవడంతో క్వింటాల్ పత్తి రూ.5230 నుంచి రూ.5వేలకు పతనమైంది. అదే విధంగా పత్తి గింజల ధర సైతం క్వింటాల్‌కు రూ.2200 వరకు పలుకగా ప్రస్తుతం 2 వేలకు పడిపోయినట్లు వ్యాపారవర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగానే మార్కెట్లో పత్తికి డిమాండ్ తగ్గిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతిదారులు బేళ్ల ధరలు తగ్గిస్తున్నారనే వివరిస్తున్నారు. కమర్షియల్‌కు స్టెబుల్ మెలిక సీసీఐ రంగ సంస్థ ఈ సీజన్లో రైతుల నుంచి పత్తిని కమర్షియల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. జమ్మికుంట పత్తి మార్కెట్లో ఈ విధానంతో కొనుగోలు చేసేందుకు సీసీఐ ఆసక్తి చూపే పరిస్థితి లేదు. వ్యాపారులతో వేలం పాటకు సీసీఐ పాట పాడే అవకాశం ఉన్నా స్టెబుల్, మైక్ నిబంధనలతో కొనుగోలుకు దూరంగా ఉంటుంది. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు వచ్చే పత్తిలో స్టెబుల్ 30 ఎంఎం ఉంటేనే సీసీఐ కమర్షియల్ పర్చేస్ చేస్తుంది. అయితే జమ్మికుంటకు వచ్చే పత్తిలో స్టెబుల్ 28 ఎంఎం నుంచి 29, 29.5 మాత్రమే ఉంటుంది. 30 ఎంఎం ఉంటేనే సీసీఐ కొనుగోలు చేయాలని సంస్థ నిబంధనలు విధించడంతో జమ్మికుంట పత్తి మార్కెట్లో ఈసారి సీసీఐ కమర్షియల్ కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం పత్తి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్న క్రమంలో సీసీఐ వ్యాపారులతో పోటీపడి ధరలు నిర్ణయిస్తే రైతులకు లబ్ధి జరిగే అవకాశాలు ఉండగా స్టెబుల్ నిబంధనలు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. -
ప్రభుత్వానిది డ్రామా... కాంగ్రెస్‌ది అసహనం
సాక్షి, హైదరాబాద్: పంట రుణాల మాఫీ, పంటలకు మద్దతు ధర అంశాలపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చ అధికార, విపక్షాల మధ్య కాసేపు మాటల యుద్ధానికి దారి తీసింది. సభలో ప్రభుత్వం డ్రామా చేస్తోందని విపక్ష నేత జానారెడ్డి మండిపడగా కాంగ్రెస్‌లో అసహనం పెరుగుతోందని శాసనసభ వ్యవహా రాల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రుణ మాఫీ, మద్దతు ధరపై మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన చర్చలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆయన ప్రసంగంపై అభ్యంతరం తెలిపారు. రుణమాఫీలో వడ్డీ భారంపై చెప్పకుండా మంత్రి ఏవేవో చెబుతున్నారన్నారు. అన్ని అంశాల గురించి చెబుతామని మంత్రి చెప్పగా తాము ప్రస్తావించిన అంశాలపై నివృత్తికి అవ కాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. మంత్రి మాట్లాడడం పూర్తయ్యాక అవకాశం ఇస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకు అంగీకరించని కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై మండిపడ్డ మంత్రి హరీశ్‌రావు... వారిలో అసహనం పెరుగు తోందని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులు సీట్లలో కూర్చుంటే అవకాశం ఇస్తామన్నారు. ఈ సమయంలో జానారెడ్డి నిల్చుని... ‘ఆయన (స్పీకర్) ఎందుకు వెళ్లారో... మీరెందుకు (డిప్యూటీ స్పీకర్) వచ్చారో మాకు తెల్సు. ఇదొక డ్రామా. ఏం జేస్తరో చూస్త. అధికార పక్షానికి ఓపిక ఉండాలె. నేను ఎవరినీ ఎప్పు డూ తిట్టను. నాకు ఆ అవసరంలేదు. రైతుల పక్షాన ప్రణమిల్లుతున్నాను’ అని వ్యాఖ్యానిం చారు. ఆపై ‘నిరసనల బహిష్కారం’ శీర్షికతో సాక్షి పత్రిక బుధవారం సంచికలో వచ్చిన ఎడిటోరియల్‌ను చదవడం మొదలుపెట్టారు. జానా తీరుపై మంత్రి హరీశ్ మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని గౌరవించాలనే విషయాన్ని పట్టించుకోకుండా జానారెడ్డి మాట్లాడారని విమర్శించారు. స్పీకర్ స్థానంలో ఉన్న మహిళా డిప్యూటీ స్పీకర్‌ను కించపరిచారని, వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. జానా మాట్లాడుతూ తాను ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి మాట్లాడలేదని, అలాంటి దేమైనా ఉంటే తన వ్యాఖ్యలను ఉపసం హరించుకుంటున్నానన్నారు. -
మద్దతు ధరల విధానంలో మార్పులు
నీతి ఆయోగ్ సిఫారసులపై కేంద్రం సానుకూలత! - ఎమ్మెస్పీ విధానానికి సమాంతరంగా ‘ధర కొరత చెల్లింపు’ - వరి, గోధుమ, చెరకు కారణంగా తగ్గుతున్న భూసారం, నీటి వనరులు సాక్షి, న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరలు అమలు చేసే విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల కార్యాచరణ ముసాయిదాలో భాగంగా నీతిఆయోగ్ ఈమేరకు నూతన విధానాన్ని ప్రతిపాదించింది. ఏప్రిల్ 23న జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ ముసాయిదాను చర్చకు పెట్టింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ సంస్కరణలు తేవాలని సిఫారసు చేసింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యానవన పంటలు, పాడి, పౌల్ట్రీ, చేపలు, పందుల పెంపకం తదితర అంశాలపై దృష్టి పెట్టడంతో పాటు సాగునీటిని అందించే కార్యక్రమాలను విస్తృతంగా అమలుచేయాలని పేర్కొంది. వీటన్నింటితో పాటు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం (ఏఎంసీ)లో మార్పులు తేవాలని పేర్కొంది. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు అమ్ముకునేలా తగిన హక్కులు కల్పించడం, కొనుగోలుదారులు రైతుల ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసేలా వీలుకల్పించటం, ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు అందుబాటులోకి తీసుకురావటం, కాంట్రాక్టు సేద్యాన్ని విస్తృతపరిచేందుకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించడం వంటి నూతన విధానాలు అవలంబించాలని నీతి ఆయోగ్ పేర్కొంది. ఎమ్మెస్పీతోపాటుగా పీడీపీ ఎమ్మెస్పీ విధానంలో పంటల సాగు నమూనా దెబ్బతినకుండా ఉండేందుకు ధరల కొరత చెల్లింపు విధానం (ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్–పీడీపీ) అమలు చేయాలని నీతి ఆయోగ్ పేర్కొంది. అవసరాల ఆధారంగా ధాన్య సేకరణకు ఎమ్మెస్పీ విధానం అమలు చేస్తూనే కొత్త విధానం అమలులో భాగంగా నిర్దిష్ట పంటలపై రైతులకు సరైన ధర రానప్పుడు ఆ మేరకు నష్టాన్ని భర్తీ చేయాలని, దీనిని నేరుగా రైతుకు అందజేయాలని.. లేదంటే గిట్టుబాటు ధర రానప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ విధానంలో ఆయా పంటలను సేకరించాలని నీతి ఆయోగ్ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న కౌలు చట్టాల వల్ల రైతులు తమ భూములను కౌలుకు ఇవ్వకుండా అలాగే వదిలేస్తున్నారని, కొత్త కౌలు చట్టాలు తేవడం ద్వారా కౌలుదారులు, భూయజమానుల హక్కులను పరిరక్షిస్తూ ఆయా భూములను సాగులోకి తేవచ్చని పేర్కొంది. ఈ ముసాయిదా విధానాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుని రానున్న మూడేళ్లలో అమలు చేసే అవకాశం ఉంది. అసలు సమస్య ఎమ్మెస్పీతోనే.. పంటలకు కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానం పంటల సాగు నమూనాను దెబ్బతీసిందని నీతి ఆయోగ్ విశ్లేషించింది. కొన్ని ప్రాంతాల్లోనే కొన్ని పంటలు పండటం కారణంగా సాగు నమూనా గాడితప్పిందని నీతి ఆయోగ్ పేర్కొంది. గోధుమ, వరి, చెరకు ఉత్పత్తులపై అధికంగా దృష్టి పెట్టి ఆయా పంటలను సేకరించడం వల్ల ఇతర పంటలైన పప్పు ధాన్యాలు, నూనెగింజలు, తృణ ధాన్యాల పంటలపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ఇలా ఎమ్మెస్పీ ధరలు వివిధ పంటలపై ప్రభావం చూపడం, సాగు నమూనా దెబ్బతిన్న కారణంగా (పంటమార్పిడి లేకపోవడం) ఆయా పంటల వల్ల నీటి వనరులు క్షీణించడం, భూసారం తగ్గిపోవటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని నీతి ఆయోగ్ పేర్కొంది. -
జగన్ రైతుదీక్షకు వెల్లువెత్తిన మద్దతు
-
రెండో రోజూ వెల్లువెత్తిన జనం
రైతులకు మద్దతుధర కల్పించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతుదీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. గుంటూరు నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు సమీపంలో రెండో రోజు ఉదయం వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించి జగన్ తన దీక్షను కొనసాగించారు. చుట్టుపక్కల మార్కెట్ యార్డులన్నింటికీ సెలవు ప్రకటించినా కూడా రైతులు మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చి జగన్ మోహన్ రెడ్డికి తమ సమస్యలు తెలిపారు. ఇన్నాళ్లు కష్టపడినా సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ఫలితం లేకుండా పోతోందని.. గత సంవత్సరం ఉన్న స్థాయిలో కూడా ఈసారి ధరలు లేవని వాపోతున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే తమ బతుకులు బాగుపడతాయంటూ దీక్షా ప్రాంగణంలో పలువురు రైతులు మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు లేక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని వినుకొండకు చెందిన నాగిరెడ్డి అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేపట్టిన రైతు దీక్షకు ప్రజల నుంచి మద్దతు లేదంటూ టీడీపీ మంత్రులు, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలను వైఎస్ఆర్సీపీ నాయకుడు మేరుగ నాగార్జున కొట్టిపారేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా జనం వస్తూనే ఉన్నారని, దీక్షా ప్రాంగణం ఇంత కిక్కిరిసిపోయి కనిపిస్తుంటే ప్రజల మద్దతు లేదనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. -
ఎన్నికల ముందు హామీలు తర్వాత మోసాలు
-
రైతులను దగా చేసిన సీఎం
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్మోహన్రెడ్డి - ఎన్నికల ముందు హామీలు.. తర్వాత మోసాలు.. - రూ. 5వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏది? - మద్దతు ధరపై ప్రధానికి ఒక్కలేఖన్నా రాశారా? - ఎన్పీఏలుగా 40 లక్షల రైతుల ఖాతాలు - ఆయనకు జ్ఞానోదయం కల్గించడానికే ఈ నిరాహారదీక్ష (గుంటూరు దీక్ష నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) రైతుల ఓట్ల కోసం ఎన్నికలపుడు వారికి పూర్తిగా మోసపూరిత హామీలిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన తరువాత వాటిని పూర్తిగా మర్చిపోయారని, ఈ మూడేళ్ల ఆయన పాలనలో రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే... రైతులకు కనీస మద్దతు ధర లభించని సందర్భాల్లో ఆదుకునేందుకు రూ 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, రైతుల రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని, నిపుణులైన హుడా, స్వామినాథన్ కమిటీల సిఫార్సులను అమలు చేస్తానని వాగ్దానాలు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక అన్నిటినీ తుంగలో తొక్కి రైతులను దగా చేశారన్నారు. తుపానులు, కరువుతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా ఎగనామం పెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలబడేందుకు సోమవారం గుంటూరులోని నల్లపాడు రోడ్డులో రెండు రోజుల నిరాహారదీక్షకు పూనుకున్న సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు ఎన్నో అవస్థలు పడుతూ కడుపు నిండా బాధతో అలమటిస్తున్నారని, వారి బాధను ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటుగా వారి సమస్యలు పరిష్కరించే విధంగా చంద్రబాబుకు బుద్ధీ, జ్ఞానం కలగాల ని దేవుడిని ప్రార్థిస్తూ తానీ రెండు రోజుల నిరా హారదీక్షకు పూనుకుంటున్నానని జగన్ ప్రకటించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.... ప్రతిపక్షంలో ఉండగా ఏమన్నారు బాబూ? ‘‘చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాదిరిగా, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాదిరిగా మాట్లాడతారు. రైతులతో ఓట్లేయించుకోవడానికి వాగ్దానాలు చేసి ఆ తరువాత వాటి ఊసే ఎత్తరు. 2010లో చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దీక్ష చేసిన సందర్భంగా హుడా కమిటీ సిఫార్సులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక ఆయనకు హుడా కమిటీ రిపోర్టు, అందులోని అంశాలు కనిపించాయి. ప్రతి రైతుకూ ఎకరాకు కనీసం రూ 10 వేల నుంచి రూ 15 వేలు ఇవ్వాలని ఆ రోజు డిమాండ్ చేస్తూ చంద్రబాబు దీక్ష చేశారు. తీరా అధికారంలోకి వచ్చా క హుడా ఎవరు? ఆ సిఫార్సులేమిటి? నాకు తెలియదే! అని మాట్లాడ్డం చూస్తూ ఉంటే ఈయనా... మన ముఖ్యమంత్రి?! అని ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్నికల సమయంలో రైతుల ఓట్లతో పని ఉన్నపుడు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే రూ 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటానన్నారు. అసలు చంద్రబాబుకు ధరల స్థిరీకరణ నిధి ఎందుకు గుర్తుకు వచ్చిందంటే ... ఎన్నికలపుడు నేను రూ 3,000 కోట్లతో రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని అప్పటికే హామీ ఇచ్చాను. దాంతో బాబుకు వెన్నులో నుంచి భయం పుట్టింది. ‘జగన్ రూ 3,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తానన్నాడా! అయితే నేను రూ 5 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తా’నని చంద్రబాబు ప్రకటించారు. ఇక, ఇవాళ ఎన్నికలైపోయాయి. ప్రజలతో, రైతులతో పని కూడా అయిపోయింది. మూడేళ్లు పూర్తయినా ధరల స్థిరీకరణ నిధి అనే ఊసే చంద్రబాబుకు గుర్తుకు రాదు. అటు ధరలు రాక రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతూ ఉన్నా కనీస మద్దతు ధర ఇంకా పెంచాలి అంటూ కనీసం ఒక్కటంటే ఒక్క లేఖ కూడా ప్రధానమంత్రికి రాసిన పాపాన పోలేదు. 40 లక్షల రైతుల ఖాతాలు నాశనం.. చంద్రబాబు పుణ్యమా అని కోటి 4 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ 40 లక్షల ఖాతాలు ఓవర్ డ్యూ ఖాతాలుగా మారిపోయాయి. అవన్నీ కూడా ‘నాన్ పెర్ఫార్మింగ్ ఎకౌంట్లు’(ఎన్పీఏ)గా మారిపోయాయి. ఎన్నికలపుడు రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని బాబు ప్రకటించిన ఫలితంగానే ఇవన్నీ ఇలా తయారయ్యాయి. రైతుల విషయంలో చంద్రబాబు పూర్తిగా చేతులెత్తేశారు. ఆయన పాలనలో కష్టాలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మిర్చి ధర గత ఏడాది క్వింటాలుకు రూ. 13 వేల నుంచి రూ. 14 వేలుంటే ఈ ఏడాది రూ.6 వేల నుంచి రూ 7 వేల వరకే ఉంది. ఇది అన్యాయమని మేం ప్రశ్నిస్తే బాబు మొసలి కన్నీరు కార్చారు. ఇపుడు రూ. 2,500 నుంచి రూ. 4,000కు పడిపోయింది. సీఎంగా ఉన్న వ్యక్తి స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. మార్కెట్లో పోటీని సృష్టించాలి. కానీ బాబు రైతులకు కాకుండా వ్యాపారులకు అండగా నిలిచారు. ఒక్క మిర్చే కాదు.. 2016–17లో రాష్ట్రంలో రైతులు 19 రకాల పంటలు వేశారు. ఒక్కదానికీ ధర లేదు. ఈ దారుణమైన మోసానికి నేను నిరసన తెలుపుతున్నాను. చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని కోరుతూ నేను ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను. -
వైఎస్ జగన్ రైతుదీక్ష
-
ముఖ్యమంత్రి అప్పుడలా.. ఇప్పుడిలా!
-
ముఖ్యమంత్రి అప్పుడలా.. ఇప్పుడిలా!
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతూ రైతులను దగా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన గుంటూరు మిర్చియార్డు సమీపంలో రెండు రోజుల రైతు దీక్షను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కడుపు మండుతున్నా, పండించిన పంటకు ధరలు రాక అవస్థలు పడుతున్నా, చంద్రబాబు నాయుడు పట్టించుకునే పరిస్థితి లేదని కడుపులో బాధ ఉన్నా.. మన అవస్థలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని, ఆయనకు బుద్ధి రావాలని రైతులందరం ఒక్కచోట ఏకమై దీక్ష కార్యక్రమం చేస్తున్నాం చంద్రబాబు పాలన చూసి, రైతుల బాధలు, అవస్థలు చూసి రైతులకు తోడుగా ఉండేందుకే దీక్షా కార్యక్రమం చేపట్టాం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులతో పని అయిపోయిన తర్వాత, ఓట్లు వేయించుకోవడం అయిపోయాక మరో విధంగా మాట్లాడుతున్నారు 2010లో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర చంద్రబాబు ధర్నా చేశారు.. హూడా కమిటీ సిఫార్సులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని, కష్టాల్లో ఉన్న రైతులకు ఎకరాకు 10-15 వేలు ఇవ్వాలని ఆయన దీక్ష చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు హూడా కమిటీ సిఫార్సులు కనిపించాయి. అప్పుడు ఆ మాట మాట్లాడిన ఇదే చంద్రబాబు హూడా ఎవరు, ఆయన సిఫార్సులేంటి, తనకు తెలియదని మాట్లాడటం చూస్తుంటే.. ఈయనా మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది ఇదే చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలతో, రైతులతో అవసరం ఉన్నప్పుడు.. రైతుల కోసం 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి తీసుకొస్తానని, ఏ రైతూ బాధపడకుండా చూస్తానని, ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే ఈ నిధితో ఆదుకుంటానని చెప్పారు [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] ఆయనకు అప్పుడు హఠాత్తుగా 5వేల కోట్లు ఇవ్వాలని ఎందుకు అనిపించిందంటే, అప్పుడు జగన్ 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతానన్నాడు కాబట్టి జగన్‌కు ఎక్కడ ఓట్లు పడతాయోనని వెన్నులో భయం మొదలై.. 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి అన్నారు ఇప్పుడు ఎన్నికలయిపోయాయి, ప్రజలు, రైతులతో పని అయిపోయింది.. ఇప్పుడు ఆ నిధి గురించి ఊసే లేదు ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతులకు కనీస మద్దతుధర చాలా తక్కువగా ఉందని, అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తామని, ఖర్చు మీద 50 శాతం లాభం వేసి మరీ ధర ఇప్పిస్తానని అన్నారు ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు పాలన మొదలై మూడేళ్లయిపోయింది.. కనీస మద్దతుధర పరిస్థితి ఏంటంటే వరికి 50, 50, 60 రూపాయల చొప్పున ముష్టివేసినట్లు ఇస్తున్నా ఈయన నోట్లోంచి మాట రాదు పత్తికి కూడా 50, 50, 60 రూపాయల చొప్పున ఇచ్చారు. కనీసం ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువగా రేట్లు పెంచుతున్నా ఈయన మాట్లాడరు కనీసం ప్రధానమంత్రికి ఒక్కటంటే ఒక్క లేఖ కూడా రాయలేదు ఇప్పుడు స్వామినాథన్ ఎవరో కూడా గుర్తురావట్లేదని చంద్రబాబు నోట్లోంచి మాటలు వస్తున్నాయి ఇదే చంద్రబాబు ఎన్నికల సమయంలో రైతులకు తోడుగా నిలబడగానని, కుటుంబ పెద్దగా నిలబడతానని అన్నారు 2013-14లో వరుస తుఫాన్లు వచ్చాయి, ఆ తర్వాత కరువు వచ్చింది అప్పుడు ఈయన రాష్ట్రంలో తిరుగుతూ.. అదిగో ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ముఖ్యమంత్రి కాగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటానని చెప్పారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడేళ్లలో ఒక్క ఇన్పుట్ సబ్సిడీ అక్షరాలా 4394 కోట్లు బకాయిలు పడ్డారు, పూర్తిగా ఎగనామం పెట్టారు వరుసగా మూడేళ్లలో 2306 కోట్లు, 326 కోట్లు, 1762 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టారు రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు రైతులు పొరపాటున ఆయన మాటలు వినకుండా పోతారోనని భయపడి ప్రతి గ్రామంలోను వాల్‌పోస్టర్లు, హోర్డింగులకు లైట్లు పెట్టి రాత్రిపూట కూడా కనిపించేలా పెట్టారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని రాయించారు ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేస్తే చాలు.. మనకు కనిపించింది, వినిపించింది కూడా ఇదే ఇప్పుడు చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి ఏంటంటే.. కోటి 4 లక్షల అకౌంట్లకు గాను 40 లక్షల రైతుల అకౌంట్లు ఓవర్ డ్యూ, ఎన్పీఏ అకౌంట్లుగా తయారయ్యాయి. ఆయన పాలన చూసి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదే మిర్చియార్డుకు ఐదువారాల క్రితం నేను వచ్చాను అప్పుడు రేటు క్వింటాలుకు 6000-7000 వరకు పలుకుతోంది ఇది అన్యాయమని, గత సంవత్సరం 14వేల వరకు పలికిందని అన్నాను అప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఇప్పుడు 2500-4000కు మిర్చి రేటు పడిపోయింది ఎక్కడైనా ముఖ్యమంత్రి అంటే రైతులకు తోడుగా ఉండేందుకు స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకోవాలి మార్కెట్లో పోటీ సృష్టించాలి.. రైతులకు తోడుగా నిలబడేందుకు ఆయన 8వేలకు కొంటానన్నారు అది తక్కువే అనుకున్నా, కనీసం ఆ రేటుకైనా ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తే మార్కెట్లో పోటీ పెరుగుతుంది వ్యాపారులు అంతకంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తారు కానీ చంద్రబాబు రైతులకు తోడుగా నిలబడలేదు.. వ్యాపారులకు తోడుగా నిలబడ్డారు వ్యాపారులు కొంటే, ఈయన ముష్టేసినట్లు 1500 ఇస్తారట. అది కూడా 8వేలకు ఎంత తక్కువైతే అంతే ఇస్తారట ఒక్కో రైతు 20 క్వింటాళ్లు మాత్రమే తేవాలట.. పొలాలన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రైతులు ట్రాక్టర్లలో తీసుకొస్తున్నారు మిర్చి కోసిన తర్వాత మార్కెట్ యార్డు వరకు ఖర్చులు చూస్తే క్వింటాలుకు 2500 దాటింది. కానీ కొనుగోలు ధర బాగోలేదు ఇక్కడకు తెచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు.. కోల్డ్ స్టోరేజిలోకి తీసుకెళ్తే అక్కడ స్థలం ఇవ్వబోమని ఇప్పటికే టిక్కీ రేటు పెంచారు. ఏడాదికి 160 రూపాయలు ఉంటే అది 190కి పెరిగిపోయింది.. అయినా స్థలాలు లేవు నాలుగైదు రోజుల పాటు రైతులు రోడ్డుమీద పడుకోవాల్సి వస్తోంది మిర్చి మాత్రమే కాదు.. పసుపు గత ఏడాది 9వేలయితే ఈసారి 4వేలకు కూడా కొనుగోలు చేయట్లేదు మామిడి, వరి, సుబాబుల్.. ఏ పంటకూ సరైన ధర రావడం లేదు 2016-17 సంవత్సరంలో ఏ ఒక్క పంటకూ రేటు ఉండని పరిస్థితి కనిపిస్తోంది ఈ దారుణమైన మోసానికి నిరసన తెలుపుతూ, చంద్రబాబుకు జ్ఞానం రావాలని దీక్ష చేపడుతున్నాం ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నందుకు ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా -
వైఎస్ జగన్ రైతుదీక్ష ప్రారంభం
-
వైఎస్ జగన్ రైతుదీక్ష ప్రారంభం
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరలు లేక అష్టకష్టాలు పడుతున్న రైతులను ఏమాత్రం ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తలపెట్టిన రెండురోజుల రైతుదీక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలోనే ఆయన దీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ధ్యేయంతో ఈ దీక్ష చేపట్టారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడినుంచి రోడ్డు మార్గంలో గుంటూరు బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ కార్మిక దినోత్సవంలో పాల్గొని పతాకావిష్కరణ చేసిన తర్వాత దీక్షా స్థలికి చేరుకున్నారు. రాష్ట్రం నలు మూలల నుంచి పలువురు రైతులు, రైతు నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, యువతీ యువకులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ జగన్ దీక్షకు తమ మద్దతు పలికారు. -
వరిగేదేమిటి?
షాబాద్: వ్యవసాయం రోజురోజుకూ భారమవుతున్నా... ఇవ్వాళ కాకపోతే రేపైనా తమకు మంచి రోజులు రాకపోతాయా అనే ఆశతో రైతులు ముందుకు ‘సాగు’తున్నారు. ఈసారైనా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచకపోతుందా...అన్న ఆశతో ఎదురుచూస్తున్న వారికి చేదు అనుభవమే ఎదురైంది. మళ్లీ అదే పరిస్థితి ఉత్పన్నం కావడంతో తమకు దిక్కెవరంటూ అన్నదాతలు వాపోతున్నారు. వరితో సహా ఇతర ప్రధాన పంటలకు మద్దతు ధర లేక... అల్లాడుతున్నారు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఏటా ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవేళ అన్నీ అనుకూలించి... పంటలు పండినా దళారులు, వ్యాపారుల దగాతో మద్దతు ధర పొందలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు చూసి అవాక్కవుతున్నారు. పేరుకే సిఫారసులు ధాన్యానికి కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రానికి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా పంట ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసి.. కనీస మద్దతు ధరను నిర్ణయించి... కేంద్రానికి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులు యధావిధిగా ఆమోదిస్తే కొంతవరకు మేలు కలుగుతుంది. కానీ ఇవి అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా అన్నదాతకు కష్టం తప్పడం లేదు. కంటితుడుపుగా ధరలు... జిల్లాలోని 26 మండలాల్లో లక్ష హెక్టార్లకు పైగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలు సాగు చేస్తారు. ఈసారి వాతావరణం అనుకూలించకపోవడంతో గత ఎడాది కంటే సాగు వీస్తీర్ణం కొంత తగ్గిందనే చెప్పాలి. దాదాపుగా 25వేల హెక్టార్లలో పత్తి, 30 వేల హెక్టార్లలో కంది, 25 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 15 వేల హెక్టార్లలో వరి సాగు చేస్తారు. తాజాగా ఏ గ్రేడ్ ధాన్యం ధర రూ.1450 నుంచి రూ.1510కి పెరిగింది. సాధారణ రకం రూ.1410 నుంచి రూ.1470కి పెరిగింది. పత్తి రూ.4100 నుంచి రూ.4160కి... మొక్క జొన్న రూ.1375 నుంచి రూ.1410కి పెరిగింది. నామ మాత్రపు పెరుగుదల వల్ల తమకు ఒరిగేది ఏమీ ఉండదని రైతులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు వ్యాపారులు, దళారులు సిండికేటుగా మారి రైతులను దోచుకుంటున్నారు. ఈ దోపిడీని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. -
వర్రి
అనంతపురం సెంట్రల్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా రైతులు దళారులను ఆశ్రయించి నిలువునా మోసపోతున్నారు. ముఖ్యంగా వరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం ప్రభుత్వం వరికి మద్దతు ధర ప్రకటించింది. ఏ గ్రేడ్ వరి క్వింటా ధర రూ. 1400, సాధారణ రకం 1360గా నిర్ణయించింది. అరుుతే ఇక్కడి అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతుకు ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. సివిల్సప్లై, వెలుగు ప్రాజెక్టు అధికారుల నిర్వాకం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది. అరుుతే అక్కడక్కడ నీటి వసతి ఉన్న రైతులు, తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) కింద మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వరి సాగైంది. హెచ్చెల్సీ కింద 95,196 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో 40,709 ఎకరాల్లో వరి, 54,487 ఎకరాల్లో ఇతర ఆరుతడి పంటలు సాగు చేశారు. బోరు బావుల కింద 15 వేల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. పూర్తి కరువు పరిస్థితులు నెలకొన్నా హెచ్చెల్సీ పుణ్యమా అని రైతులకు ధాన్యం గింజలు పండించుకుంటున్నారు. ఈ ఏడాది హెచ్చెల్సీకి ఆలస్యంగా నీరు రావడంతో దిగుబడులు బాగా తగ్గాయి. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో నెల ఆలస్యంగా తుంగభద్ర జలాశయంలోకి నీరు వచ్చి చేరింది. దీంతో పంటలు సాగు కూడా ఆలస్యమైంది. ప్రతి ఏటా ఈ సమయానికి వరి కోతలు ఎప్పుడో పూర్తరుు్య ఉండేవి. ఈ ఏడాది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముందస్తుగా నీరు విడుదలైన తుంగభద్ర హైలెవల్ మెయిన్ కెనాల్(హెచ్‌ఎల్‌ఎంసీ) కింద కణేకల్లు, బొమ్మనహాల్ తదితర ప్రాంతాల్లో, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, సౌత్‌కెనాల్ కింద వరి అత్యధికంగా సాగైంది. ఇక్కడ వరికోతలు దాదాపు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే పండించిన పంట చేతికందుతోందన్న సంబరం రైతుల్లో కనిపించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా అది ఆచరణలో రైతులకు దక్కడం లేదు. జిల్లాలో ప్రతి ఏటా కణేకల్లు, కళ్యాణదుర్గం, కల్లూరు, బొమ్మనహాళ్, ధర్మవరం, కుండిమద్ది, కేసాపురం తదితర ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. ఈ ఏడాది ఒక్క కణేకల్లులో తప్ప ఎక్కడా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఫలితంగా మిగిలిన ప్రాంతాల్లో రైతులు పంటను దళారులు, ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు అడిగిన ధరకు బేరం ఆడకుండా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా బహిరంగ మార్కెట్లో రేట్లు నిలకడగా ఉంటారుు. తద్వారా రైతుకు కూడా నష్టం కలగదు. -
అన్నదాతకు ఆదాయ భద్రత అక్కర్లేదా?
ద్రవ్యోల్బణాన్ని బట్టి ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నా.. మద్దతు ధరలు పెరగటం లేదు. ప్రభుత్వం ప్రకటించిన అరకొర మద్దతు ధర కూడా దక్కక 93% రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఆత్మహత్యల పాలవుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు చట్టబద్ధమైన ఆదాయ భద్రత అక్కర్లేదా? అంటూ పాలకులు, మేధావులను సూటిగా ప్రశ్నిస్తున్నారు ఎం వీ ఎస్ నాగిరెడ్డి. వ్యవసాయమే ప్రధానమైన మన దేశానికి ఆహార భద్రతనందిస్తున్న రైతు కుటుంబాలు అంతకంతకూ అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయన్నది ఎంతో ఆవేదన కలిగించే వాస్తవం. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఈ మధ్యనే విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 52% మంది రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 93%, తెలంగాణలో 89% మంది రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. జూలై 2012- జూన్ 2013 మధ్యలో దేశవ్యాప్తంగా 35 వేల కుటుంబాలపై ఎన్ఎస్ఓఓ సర్వే చేసి ఈ నివేదికను వెలువరించింది. పది మందికీ పనికల్పించే రైతుల్లో 40% మంది ఉపాధి పనికి వెళ్లి పొట్టపోసుకుంటున్నారని కూడా ఈ నివేదిక చెబుతోంది. రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎంతటి దుర్భరంగా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. అప్పుల ఊబికి విధానాలే మూలం ఈ నివేదిక ప్రకారం.. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో 40% రైతు కుటుంబాలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి. 11% రైతులకు మాత్రమే ప్రభుత్వ విస్తరణ సేవలందుతున్నాయి. దళారీలకు, ప్రైవేటు వ్యాపారులకే ఉత్పత్తులను రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులున్నాయి. వాస్తవంగా క్షేత్రస్థాయిలో రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఈ నివేదిక చెబుతున్న దానికంటే చాలా ఎక్కువ ప్రమాద భరితంగా ఉంది. వ్యవసాయ సంక్షోభానికి కారణం రైతు పంట పండించలేక కాదు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో రైతు సంతోషంగా ఉన్నాడు. ఎక్కడా రైతుల ఆత్మహత్యల్లేవు. 1950 నుంచి 2012 నాటికి దేశ జనాభా 3.5 రెట్లు పెరిగితే ఆహార ధాన్యాల ఉత్పత్తి 7 రెట్లు, పాల ఉత్పత్తి పది రెట్లు, ఆక్వా ఉత్పత్తులు 13 రెట్లు పెరిగాయి. అయినా, ప్రభుత్వ విధానాల మూలంగానే రైతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి.. ఆత్మాభిమానం చంపుకోలేక కుటుంబ సభ్యులను అనాథలను చేస్తూ ఆత్మహత్యలపాలవుతున్నారు. ఎవరు దీనికి బాధ్యులు? పాలకవర్గాలు, శాస్త్రవేత్తలు కేవలం దిగుబడి పెంపుదల మీదే దృష్టిపెట్టారు. రైతు లాభదాయకత గురించి ఏమాత్రం ఆలోచించలేదు. పెరుగుతున్న పెట్టుబడులకనుగుణంగా మద్దతు ధరలు పెంచకపోవడం ఒక సమస్య. గిట్టుబాటే కాని ఆ మద్దతు ధరలకన్నా తక్కువకే రైతు తెగనమ్ముకుంటుంటే చోద్యం చూస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు రెండూ రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుండడమే ఈ సంక్షోభానికి కారణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరి, పత్తి ప్రధాన పంటలు. ఉత్పత్తి వ్యయం దేశంలోనే ఎక్కువయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కనీస మద్దతు ధరలు నిర్ణయించేటప్పుడు అన్ని రాష్ట్రాల ఉత్పత్తి ఖర్చును కలిపి సరాసరి ధరను నిర్ణయిస్తున్నారు. దీని వల్ల మన వరి రైతులే ఎక్కువగా నష్టపోతున్నారు. రాష్ట్రం క్వింటాలు ధాన్యం ఉత్పత్తి వ్యయం రూ. 1,708 అని చెబుతుంటే.. కేంద్రం రూ. 1,360 మద్దతు ధరగా ప్రకటించింది! రాష్ట్రంలో ధాన్యం ధర కేంద్ర ప్రభుత్వ బియ్యం సేకరణ మీదే ఆధారపడి ఉండడటం, సేకరణ విధానంలో లోపం మూలంగానే పెట్టుబడిని కూడా రాబట్టుకోలేక రైతు నష్టపోతున్నాడు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. క్వింటా పత్తి ఉత్పత్తి ఖర్చు రూ. 5 వేలు. కేంద్రం మద్దతు ధర రూ. 4,050 అయితే రూ.3,700కే రైతులు అమ్ముకోవాల్సి వస్తున్నది. పత్తి మార్కెట్‌కు రాకముందే ఎగుమతి అనుమతులు ఇస్తే రైతుకు ధర వస్తుంది. కానీ, అమ్మకాలు పూర్తయ్యాక ఇవ్వడం వల్ల వ్యాపారులకే లబ్ధి కలుగుతోంది. వేరుశనగ, శనగ, మినుము, ఫంగస్ చేపల రైతుల పరిస్థితీ ఇంతే. ఎగుమతులు, దిగుమతులు రైతులకు నష్టం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఏ మాత్రం వత్తిడి పెట్టని మన రాష్ట్ర పాలకులే నేడు 90%పైగా రైతాంగం అప్పుల ఊబిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండటానికి కారణం. ద్రవ్యోల్బణం నుంచి రైతును రక్షించనక్కర్లేదా? గత కొంతకాలంగా వస్తువుల ధరలు 100-200% పెరిగితే వ్యవసాయోత్పత్తుల ధరలు 20-30% మాత్రమే పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ.. వ్యవసాయోత్పత్తులకు ఈ సూత్రాన్ని వర్తింపచేయకపోవటమే రైతును అప్పుల ఊబిలోకి దింపుతున్నది. ఉద్యోగుల వేతన సంఘ నివేదికలనైతే వచ్చీ రాగానే అమలు చేస్తున్నాం. రైతులకు ఆదాయ భద్రత కల్పించాలంటూ స్వామినాథన్ కమిషన్ నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. రైతు ముఖంలో చిరునవ్వు చూడాలంటే దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్లుగా వ్యవసాయ వృద్ధి రేటును ఉత్పత్తిని బట్టి కాకుండా.. రైతు ఇంటికి తీసుకెళ్లే నికర లాభాన్ని బట్టి మాత్రమే పరిగణించాలి. నిరుపేదల కోసం ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రతా చట్టం తెచ్చాం. కానీ, 120 కోట్ల జనాభాకు తిండిపెడుతున్న రైతు కుటుంబాలకు కనీస ఆదాయ భద్రతనిచ్చే చట్టం చేయాల్సిన అవసరం లేదా? పాలకులారా, మేధావులారా ఆలోచించండి. (వ్యాసకర్త వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు మొబైల్: 98480 43377) -
రైతు కష్టం బుగ్గిపాలు
కారంచేడు : గిట్టుబాటు ధరలు రాకపోతాయా..ధాన్యం బస్తాలు అమ్ముకుని మళ్లీ పెట్టుబడులు పెట్టి పంటలు సాగుచేయలేకపోతామా... అని ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే మిగిలింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన ధాన్యం బస్తాలను గిట్టుబాటు ధరలు వచ్చేదాకా గోడౌన్లో దాచుకుంటే.. అనుకోకుండా అక్కడ జరిగిన అగ్నిప్రమాదం వారిని తీవ్ర నష్టానికి గురిచేసింది. ఆ వివరాల ప్రకారం... కారంచేడు పెద్దబజారు సమీపంలో వాసవీకన్యకాపరమేశ్వరీ ఆలయం ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ గోడౌన్లో పలువురు రైతులు పండించిన 1,313 వరిధాన్యం బస్తాలను నిల్వచేశారు. గిట్టుబాటు ధర వచ్చినప్పుడు వాటిని అమ్ముకుని మళ్లీ పంటలు సాగుచేసుకునేందుకు పెట్టుబడితో పాటు ఇతర అవసరాలు తీర్చుకుందామనుకున్నారు. కానీ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రూపంలో సంభవించిన అగ్నిప్రమాదం ఆ రైతుల నోట్లో మట్టికొట్టింది. మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో గోడౌన్‌తో పాటు దానిలోని ధాన్యం బస్తాలు కూడా పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం క్వింటా ధాన్యం ధర 1,200 రూపాయలుంది. దాని ప్రకారం 15.75 లక్షల రూపాయల విలువైన ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి. అదే విధంగా ఆ గోడౌన్లోనే కారంచేడు గ్రామానికి చెందిన అప్పలాచారి, మస్తాన్‌వలి నిర్వహిస్తున్న ఉడ్‌వర్క్‌షాప్ కూడా దగ్ధమైంది. షాపులోని 10.11 లక్షల రూపాయల విలువైన కలప, 5 లక్షల రూపాయల విలువైన ఉడ్‌వర్క్ మిషన్లు కాలిపోయాయి. గోడౌన్ పెద్దది కావడంతో షార్ట్‌సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు లోపలంతా వ్యాపించిన తర్వాతే బయటకు తెలిసింది. దీంతో భారీ నష్టం జరిగింది. వేకువజామున గమనించిన స్థానికులు.. వెంటనే చీరాల అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్‌తో హుటాహుటిన చేరుకున్న సిబ్బంది ఉదయం 8 గంటల వరకూ శ్రమించి మంటలను అదుపుచేశారు. అప్పటి వరకూ కళ్లముందే తమ కష్టం బుగ్గిపాలవుతుంటే రైతులంతా నిస్సహాయస్థితిలో చూస్తూ ఉండిపోయి కంటతడిపెట్టారు. ప్రైవేట్ గోడౌన్ కావడంతో ఇన్సూరెన్స్ కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. స్థానిక తహశీల్దార్ పీవీ సుబ్బారావు, ఆర్ఐ సుశీలాదేవి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 36 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. గోడౌన్‌ను పరిశీలించిన స్థానిక ఎస్సై శింగంశెట్టి మల్లికార్జునరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సాగుకు ధరాఘాతం!
నవాబ్‌పేట్ , న్యూస్‌లైన్: రైతే దేశానికి వెన్నెముక అంటూ ఎన్నికల సమయంలో వేదికలపై నేతలు ఉపన్యాసాలు దంచేస్తుంటారు. అన్ని రంగాలకంటే వ్యవసాయానికి పెద్దపీట వేస్తామంటూ రైతన్నలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు. అధికారంలోకి రాగానే పాలకులు అన్నదాతలను విస్మరిస్తున్నారు. వారి వెతలను పట్టించుకోవడంలేదు. వ్యవసాయ పెట్టుబడి ఏటికేడు రెట్టింపు అవుతుండడంతో రైతు కుదేలవుతున్నాడు. ఎరువులు, విత్తనాల ధరలను అదుపులో ఉంచాలనే స్పహ ప్రభుత్వాలకు రావ డం లేదు. ఇష్టానుసారం ధరలు పెంచుతూ పోతు న్న ప్రైవేటు ఎరువుల సంస్థలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నించడం లేదు. దీంతో ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు దుకాణాల ఎదుట రాత్రీ పగలూ అనే తేడా లేకుండా క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఏటా ఇదే తంతు జరుగుతున్నా పాలకులు మాత్రం సకాలంలో ఎరువులను సరఫరా చేయడంలో చిత్తశుద్ధి కనబర్చని దుస్థితి దాపురించింది. గిట్టుబాటు ధరలు లేక, ప్రక తి వైపరీత్యాలతో పం టలు నష్టపోయి అప్పుల బాధతో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం సానుభూతి చూపని వారూ ఉన్నారు. పంటలకు నష్టపరిహారం, వృుతుల కుటుంబాలకు నయాపైస ఇప్పించరు. ఇదీ అన్నదాతపై పాలకులు చూపిస్తున్న అవ్యాజప్రేమ. ఎరువులు, విత్తనాల ధరలు పైపైకి... ఎరువులు, విత్తనాల ధరలు అదుపు చేయడంలో పాలకులు నిర్లక్షం వహించడంతో రైతన్నలపై ఆర్థిక భారం పెరిగింది. ఓవైపు గిట్టుబాటు ధరలు లేక విలవిలలాడుతున్న రైతులకు పంటల ఉత్పత్తికి ప్రాణదాత లైన ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడం అదనపు భారంగా భరిస్తున్నారు. నాలుగేళు ్లగా నిత్యం పెరుగుతున్న ఎరువుల ధరలు రైతులకు కంటతడిపెట్టిస్తున్నాయి. ఎరువులపై ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ తగ్గింపులో భాగంగా ఎరువుల కంపెనీలపై నియంత్రణ ఎత్తివేసింది. పరిస్థితులను బట్టి ధరలను పెంచుకునే వెసులుబాటును కంపెనీలకు కల్పించింది. దీంతో కంపెనీలు అడ్డు, అదుపు లేకుండా వ్యవహరిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను సాకుగా చూపుతూ ప్రతిసారి భారీగా ఎరువుల ధరలను పెంచుతూ పోతున్నాయి. ఇక విత్తన కంపెనీలదీ ఇదే బాట.