ముఖ్యమంత్రి అప్పుడలా.. ఇప్పుడిలా! | YS Jagan Mohan Reddy slams chandra babu over tongue twisting | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి అప్పుడలా.. ఇప్పుడిలా!

Published Mon, May 1 2017 12:27 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

YS Jagan Mohan Reddy slams chandra babu over tongue twisting

చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతూ రైతులను దగా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన గుంటూరు మిర్చియార్డు సమీపంలో రెండు రోజుల రైతు దీక్షను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

  • కడుపు మండుతున్నా, పండించిన పంటకు ధరలు రాక అవస్థలు పడుతున్నా, చంద్రబాబు నాయుడు పట్టించుకునే పరిస్థితి లేదని కడుపులో బాధ ఉన్నా.. మన అవస్థలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని, ఆయనకు బుద్ధి రావాలని రైతులందరం ఒక్కచోట ఏకమై దీక్ష కార్యక్రమం చేస్తున్నాం
  • చంద్రబాబు పాలన చూసి, రైతుల బాధలు, అవస్థలు చూసి రైతులకు తోడుగా ఉండేందుకే దీక్షా కార్యక్రమం చేపట్టాం
  • చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులతో పని అయిపోయిన తర్వాత, ఓట్లు వేయించుకోవడం అయిపోయాక మరో విధంగా మాట్లాడుతున్నారు
  • 2010లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ దగ్గర చంద్రబాబు ధర్నా చేశారు.. హూడా కమిటీ సిఫార్సులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని, కష్టాల్లో ఉన్న రైతులకు ఎకరాకు 10-15 వేలు ఇవ్వాలని ఆయన దీక్ష చేశారు
  • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు హూడా కమిటీ సిఫార్సులు కనిపించాయి.
  • అప్పుడు ఆ మాట మాట్లాడిన ఇదే చంద్రబాబు హూడా ఎవరు, ఆయన సిఫార్సులేంటి, తనకు తెలియదని మాట్లాడటం చూస్తుంటే.. ఈయనా మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది
  • ఇదే చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలతో, రైతులతో అవసరం ఉన్నప్పుడు.. రైతుల కోసం 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి తీసుకొస్తానని, ఏ రైతూ బాధపడకుండా చూస్తానని, ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే ఈ నిధితో ఆదుకుంటానని చెప్పారు

    [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]
     
  • ఆయనకు అప్పుడు హఠాత్తుగా 5వేల కోట్లు ఇవ్వాలని ఎందుకు అనిపించిందంటే, అప్పుడు జగన్ 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతానన్నాడు కాబట్టి జగన్‌కు ఎక్కడ ఓట్లు పడతాయోనని వెన్నులో భయం మొదలై.. 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి అన్నారు
  • ఇప్పుడు ఎన్నికలయిపోయాయి, ప్రజలు, రైతులతో పని అయిపోయింది.. ఇప్పుడు ఆ నిధి గురించి ఊసే లేదు
  • ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతులకు కనీస మద్దతుధర చాలా తక్కువగా ఉందని, అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తామని, ఖర్చు మీద 50 శాతం లాభం వేసి మరీ ధర ఇప్పిస్తానని అన్నారు
  • ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు పాలన మొదలై మూడేళ్లయిపోయింది.. కనీస మద్దతుధర పరిస్థితి ఏంటంటే వరికి 50, 50, 60 రూపాయల చొప్పున ముష్టివేసినట్లు ఇస్తున్నా ఈయన నోట్లోంచి మాట రాదు
  • పత్తికి కూడా 50, 50, 60 రూపాయల చొప్పున ఇచ్చారు. కనీసం ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువగా రేట్లు పెంచుతున్నా ఈయన మాట్లాడరు
  • కనీసం ప్రధానమంత్రికి ఒక్కటంటే ఒక్క లేఖ కూడా రాయలేదు
  • ఇప్పుడు స్వామినాథన్ ఎవరో కూడా గుర్తురావట్లేదని చంద్రబాబు నోట్లోంచి మాటలు వస్తున్నాయి
  • ఇదే చంద్రబాబు ఎన్నికల సమయంలో రైతులకు తోడుగా నిలబడగానని, కుటుంబ పెద్దగా నిలబడతానని అన్నారు
  • 2013-14లో వరుస తుఫాన్లు వచ్చాయి, ఆ తర్వాత కరువు వచ్చింది
  • అప్పుడు ఈయన రాష్ట్రంలో తిరుగుతూ.. అదిగో ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ముఖ్యమంత్రి కాగానే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటానని చెప్పారు
  • కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడేళ్లలో ఒక్క ఇన్‌పుట్ సబ్సిడీ అక్షరాలా 4394 కోట్లు బకాయిలు పడ్డారు, పూర్తిగా ఎగనామం పెట్టారు
  • వరుసగా మూడేళ్లలో 2306 కోట్లు, 326 కోట్లు, 1762 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టారు
  • రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు
  • రైతులు పొరపాటున ఆయన మాటలు వినకుండా పోతారోనని భయపడి ప్రతి గ్రామంలోను వాల్‌పోస్టర్లు, హోర్డింగులకు లైట్లు పెట్టి రాత్రిపూట కూడా కనిపించేలా పెట్టారు.
  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని రాయించారు
  • ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేస్తే చాలు.. మనకు కనిపించింది, వినిపించింది కూడా ఇదే
  • ఇప్పుడు చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి ఏంటంటే.. కోటి 4 లక్షల అకౌంట్లకు గాను 40 లక్షల రైతుల అకౌంట్లు ఓవర్ డ్యూ, ఎన్‌పీఏ అకౌంట్లుగా తయారయ్యాయి.
  • ఆయన పాలన చూసి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
  • ఇదే మిర్చియార్డుకు ఐదువారాల క్రితం నేను వచ్చాను
  • అప్పుడు రేటు క్వింటాలుకు 6000-7000 వరకు పలుకుతోంది
  • ఇది అన్యాయమని, గత సంవత్సరం 14వేల వరకు పలికిందని అన్నాను
  • అప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు
  • ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఇప్పుడు 2500-4000కు మిర్చి రేటు పడిపోయింది
  • ఎక్కడైనా ముఖ్యమంత్రి అంటే రైతులకు తోడుగా ఉండేందుకు స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకోవాలి
  • మార్కెట్లో పోటీ సృష్టించాలి.. రైతులకు తోడుగా నిలబడేందుకు ఆయన 8వేలకు కొంటానన్నారు
  • అది తక్కువే అనుకున్నా, కనీసం ఆ రేటుకైనా ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తే మార్కెట్లో పోటీ పెరుగుతుంది
  • వ్యాపారులు అంతకంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తారు
  • కానీ చంద్రబాబు రైతులకు తోడుగా నిలబడలేదు.. వ్యాపారులకు తోడుగా నిలబడ్డారు
  • వ్యాపారులు కొంటే, ఈయన ముష్టేసినట్లు 1500 ఇస్తారట. అది కూడా 8వేలకు ఎంత తక్కువైతే అంతే ఇస్తారట
  • ఒక్కో రైతు 20 క్వింటాళ్లు మాత్రమే తేవాలట..
  • పొలాలన్నీ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రైతులు ట్రాక్టర్లలో తీసుకొస్తున్నారు
  • మిర్చి కోసిన తర్వాత మార్కెట్ యార్డు వరకు ఖర్చులు చూస్తే క్వింటాలుకు 2500 దాటింది. కానీ కొనుగోలు ధర బాగోలేదు
  • ఇక్కడకు తెచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు.. కోల్డ్ స్టోరేజిలోకి తీసుకెళ్తే అక్కడ స్థలం ఇవ్వబోమని ఇప్పటికే టిక్కీ రేటు పెంచారు. ఏడాదికి 160 రూపాయలు ఉంటే అది 190కి పెరిగిపోయింది.. అయినా స్థలాలు లేవు
  • నాలుగైదు రోజుల పాటు రైతులు రోడ్డుమీద పడుకోవాల్సి వస్తోంది
  • మిర్చి మాత్రమే కాదు.. పసుపు గత ఏడాది 9వేలయితే ఈసారి 4వేలకు కూడా కొనుగోలు చేయట్లేదు
  • మామిడి, వరి, సుబాబుల్.. ఏ పంటకూ సరైన ధర రావడం లేదు
  • 2016-17 సంవత్సరంలో ఏ ఒక్క పంటకూ రేటు ఉండని పరిస్థితి కనిపిస్తోంది
  • ఈ దారుణమైన మోసానికి నిరసన తెలుపుతూ, చంద్రబాబుకు జ్ఞానం రావాలని దీక్ష చేపడుతున్నాం
  • ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నందుకు ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement