సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ పంటలకు ఇచ్చే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, ఈ అంశాన్ని కేంద్రప్రభుత్వం పరిశీలించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన బడ్జెట్–2023కు సంబంధించిన సంప్రదింపుల కమిటీ భేటీకి హాజరైన కోమటిరెడ్డి కేంద్రానికి పలు సూచనలు చేశారు. రైతులకు రుణాలిచ్చేందుకు ఇప్పటికే ఉన్న నిబంధనలను సవరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment