
19, 20 తేదీల్లో టీటీడీపీ రైతు దీక్ష
రైతుల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ దీక్షలను చేపడుతున్నామన్నారు. కరువు మండలాల్లో ఇన్‌పుట్ సబ్సిడీని కూడా ఇంత వరకు ఇవ్వలేదని ఆయన చెప్పారు. రైతుల రుణాలను మాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత రెండేళ్ల కాలంలో ఒక్క రైతుకూ కొత్త రుణం రాలేదన్నారు. తాము చేపడుతున్న రైతు దీక్షకు జిల్లాల నుంచి రైతులు హాజరవుతారని నర్సారెడ్డి చెప్పారు.