'వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలి'
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ..రైతు అంటేనే అవమానకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో 90 శాతం రైతులు ఐదు ఎకరాల్లోపు ఉన్నవారేనన్నారు. ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం...ఒక రైతుపై రూ.90 వేల రుణభారం ఉందని చెప్పారు. తక్షణమే వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు తెలిపాయి.