'కోదండరామ్ రాజకీయం చేస్తున్నారు'
కరీంనగర్ : జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ రైతుల పోరుతో రాజకీయం చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకే కోదండరామ్, బీజేపీ నేత నాగం జనార్థన్రెడ్డి రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రైతుల కోసమే దీక్ష చేపట్టినట్లైతే మల్లన్నసాగర్ వద్ద ఎందుకు దీక్ష చేశారని హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. కోదండరామ్ రైతు దీక్ష చేపట్టడం బాధాకరమన్నారు. మోతే రిజర్వాయర్ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని హరీశ్రావు చెప్పారు.