'కోదండరామ్ ఎవరికీ లొంగే వ్యక్తి కాదు'
హైదరాబాద్ : రైతు సమస్యలను పరిష్కరించడం సీఎం కేసీఆర్కు పెద్ద ఇబ్బందే కాదని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. రైతు సమస్యలపై ప్రొ.కోదండరామ్ ఆదివారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సమగ్ర వ్యవసాయ విధానం రూపొందిస్తారనుకున్నాం...కానీ అలా జరగలేదన్నారు.
గతంలో చాలా మంది రైతు నాయకులు ప్రభుత్వాలకు లొంగిపోయారన్నారు. కానీ కోదండరామ్ ఎవరికీ లొంగిపోయే వ్యక్తి కాదని రామచంద్రమూర్తి చెప్పారు.