
గన్నవరంలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
హైదరాబాద్: గన్నవవరం విమానాశ‍్రయం చేరుకున్న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ నేటి నుంచి రెండు రోజులపాటు గుంటూరులో ‘రైతు దీక్ష’ చేపడుతున్న విషయం తెలిసిందే.
దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వైఎస్ జగన్.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వంగవీటి రాధా, వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరావు, తోట శ్రీనివాస్ తదితరులు అధినేతకు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి గుంటూరు బయలుదేరిన వైఎస్ జగన్.. బస్టాండ్ వద్ద మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం సర్దార్ కాసు వెంగళరెడ్డి విగ్రహానికి జగన్ నివాళులర్పించనున్నారు. 11 గంటలకు వైఎస్ జగన్ దీక్షా శిబిరానికి చేరుకుంటారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించారు.