లింగంపేట (నిజామాబాద్) : గత వారం రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న యువతి చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందింది. ఈ సంఘటన నిజామాబాద్ లింగంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మంజుల(20) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.