అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం | Fire accident in Lingampet | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం

Published Sat, Feb 6 2016 5:14 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire accident in Lingampet

లింగంపేట (నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలకేంద్రంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ  ఇల్లు దగ్ధమైంది. ఇంట్లోనివారంతా ఉపాధి హామీ పనులకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికంగా ఉండే సుభద్ర నివాసంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.1.50లక్షల నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు,వీఆర్‌వో పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement