ఇళ్లకు ఇక 24 గంటల విద్యుత్: హరీష్ రావు | haish rao assures 24 hours power supply to domestic users | Sakshi
Sakshi News home page

ఇళ్లకు ఇక 24 గంటల విద్యుత్: హరీష్ రావు

Published Fri, Mar 6 2015 5:12 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

ఇళ్లకు ఇక 24 గంటల విద్యుత్: హరీష్ రావు

ఇళ్లకు ఇక 24 గంటల విద్యుత్: హరీష్ రావు

లింగంపేట(నిజామాబాద్) : తెలంగాణ రాష్ట్రంలో గృహావసరాలకు ఇక రోజుకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కాకతీయ మిషన్‌లో భాగంగా హరీష్‌రావు చెరువులను పరిశీలించారు. శుక్రవారం నిజామాబాద్‌లో పర్యటించిన మంత్రి పలు మండలాల్లోని చెరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్‌రావు నిజామాబాద్ జిల్లా లింగపేట మండలంలోని మల్లారం చెరువును పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. జిల్లాలోని లింగంపేట, తాడవాయి, గాంధారీ మండలంలోని చెరువులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో రైతులకు 12 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement