సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట జిల్లా రాజగోపాల్‌పేట చెరువులో ముంచాలని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీ, గాంధీభవన్‌లో కూర్చుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తుందంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం రాజగోపాల్‌పేట గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇవాల చేపలను వదిలాం. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులో నీళ్లు గుంజుకుపో యేవి. బోర్లు వేసి, మోటార్లు పెట్టి, ట్రాన్స్ ఫార్మర్ పెట్టి చెరువులు నింపేవారం’ అని నాటి రోజులను గుర్తు చేశారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా.. సీఎం కేసీఆర్ దయతో చెరువులు నిండుగా ఉన్నాయన్నారు. దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కేవలం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు. ‘ఒకప్పుడు యాసంగిలో నీళ్లు లేక, బోర్లు ఎండిపోయి, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవని, కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయి సీన్ రివర్స్ అయిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఇదంతా కనపడటం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: గోదావరి బోర్డుకు కాళేశ్వరం సవరణ డీపీఆర్!
Comments
Please login to add a commentAdd a comment