siddipeta
-
Ananda Nilayam: ఒకేచోట.. ఈ అష్టాదశ శక్తిపీఠాలు!
పురాణాల ప్రకారం, అమ్మవారిని ఆరాధించే దేవాలయాలలో ప్రశస్తమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. శివుడి అర్ధాంగి సతీదేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలను దర్శించుకుని, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని భక్తులు భావిçస్తుంటారు. రకరకాల కారణాల వల్ల కొంతమందికి శక్తిపీఠాల దర్శనభాగ్యం కరవవుతోంది. అలాంటివారికి అన్ని శక్తిపీఠాలను ఒకేచోట దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అష్టాదశ శ«క్తిపీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించారు.అది ఎక్కడో కాదు తెలంగాణ, సిద్దిపేట జిల్లా, కొండపాక గ్రామ శివారులోని ఆనంద నిలయంలో! గత ఏడాది నవంబరులో.. ఇక్కడి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో 18 శక్తిపీఠాలతో పాటు లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులనూ ప్రతిష్ఠించారు.గట్టు రాంరాజేశం గుప్త సంకల్పంతో..సిద్దిపేటకు చెందిన గట్టు రాంరాజేశం గుప్త అమ్మవారికి అపర భక్తుడు. అష్టాదశ శక్తి పీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఒకసారి, తన మనసులో మాటను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆనంద నిలయ వ్యూహకర్త కేవీ రమణాచారి ముందుంచారు. ఆయన ట్రస్ట్ సభ్యులతో చర్చించి, ఆనంద నిలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రాంరాజేశం రూ. 1.5 కోట్లను అందజేశారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాలను నిర్మించారు. అమ్మవార్ల రాతి విగ్రహాలను తమిళనాడులో తయారుచేయించారు. వీటిని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించారు.22 దేవాలయాలు..పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదిహేడు మనదేశంలో ఉండగా, శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. మన దేశంలో ఉన్న కామాక్షీదేవి (కంచి, తమిళనాడు), శృంఖలాదేవి (కోల్‌కతా, పశ్చిమబెంగాల్), చాముండేశ్వరీదేవి (మైసూరు, కర్ణాటక), జోగులాంబ (ఆలంపూర్, తెలంగాణ), భ్రమరాంబికాదేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), మహాలక్ష్మీదేవి (కొల్హాపూర్, మహారాష్ట్ర), ఏకవీరాదేవి (మాహుర్, మహారాష్ట్ర), మహాకాళీదేవి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), పురుహూతికాదేవి (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), గిరిజాదేవి (జాజ్‌పూర్, ఒడిశా), మాణిక్యాంబాదేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), కామాఖ్యాదేవి ( గౌహతి, అస్సాం), మాధవేశ్వరీదేవి (ప్రయాగ, ఉత్తరప్రదేశ్), వైష్ణవీదేవి (జమ్మూ, జమ్మూ– కశ్మీర్ రాష్ట్రం), మంగళగౌరీదేవి (గయ, బిహార్), విశాలాక్షీ (కాశి), సరస్వతీదేవి (శ్రీనగర్) రూపాలను కొండపాక శివారులోని ఆనంద నిలయంలో దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరకత లింగం, శివపార్వతులతో కూడిన 22 దేవాలయాలను నిర్మించడం విశేషం. ఆయా శక్తిపీఠాల్లో జరిగినట్లుగానే ఇక్కడా పూజాకార్యక్రమాలుంటాయి. ప్రతి పౌర్ణమికి హోమం, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు.సామాజిక సేవ.. ఆధ్యాత్మిక శోభ!ఆనంద నిలయంలో సామాజిక సేవతోపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సుమారు వంద ఎకరాల్లోని ఈ ట్రస్ట్‌లో ఒకవైపు వృద్ధాశ్రమం, మరోవైపు అనాథాశ్రమం, ఇంకోవైపు సత్యసాయి పిల్లల హృద్రోగ ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఉన్నాయి. భక్తులు, సామాజిక సేవకుల సందర్శనతో ఈ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. ఇది హైదరాబాద్‌కు 73 కిలోమీటర్లు, సిద్దిపేటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట, ఫొటోలు: కె సతీష్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్శక్తిపీఠాల్లో జరిగినట్టుగానే..ఇక్కడ పూజాకార్యక్రమాలన్నిటినీ శక్తిపీఠాల్లో మాదిరే జరుపుతాం. భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం పోస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు శివుడికి, మరకత లింగానికి రుద్రాభిషేకం చేస్తాం. – పురుషోత్తమ రామానుజ, అర్చకుడుఅందరికీ దర్శనభాగ్యం కలగాలని.. అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవటం కొందరికి సాధ్యపడకపోవచ్చు. అలాంటివారికి శక్తిపీఠాల దర్శనభాగ్యం అందాలనేది నాన్నగారి కోరిక. కేవీ రమణాచారి, ఇంకెంతో మంది దాతల సహకారంతో నేడు అది నెరవేరింది. – గట్టు అమర్నాథ్, రవి, శ్రీనివాస్అమ్మవారి అనుగ్రహం..కొండపాకలో అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం అమ్మవారి దయ. అమ్మవారి అనుగ్రహం, అందరి సహకారంతో దేవాలయ నిర్మాణాలు సాధ్యమయ్యాయి. – డాక్టర్ కేవీ రమణాచారి, ఆనంద నిలయ వ్యూహకర్తఇవి చదవండి: అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే.. -
Economic Survey 2023-24: ప్రతి ఊరికి కావాలి.. ఇలాంటి స్టీల్ బ్యాంక్
పెళ్లయినా శుభకార్యమైనా పార్టీ మీటింగ్ అయినా ప్రభుత్వ హెల్త్ క్యాంప్లైనా భోజనాల దగ్గర ప్లాస్టిక్ వాడకం ఉంటుంది. చెత్త పేరుకు పోతుంది. డబ్బు కూడా వృథా. అదే స్టీల్ గిన్నెలు ఉంటే? ఒకసారి కొంటే ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలోచనతో 2020లో తెలంగాణాలోని సిద్దిపేటలో ఏర్పడిన స్టీల్ బ్యాంక్ ‘ఎకానమిక్ సర్వే 2023–24 బుక్’లో తాజాగా చోటు సంపాదించుకుంది. ఇది మహిళా నిర్వహణకు వారి పర్యావరణ దృష్టికి దక్కిన విజయం.ఇది మహిళల విజయం. జాతీయంగా దక్కిన గుర్తింపు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌ను విడుదల చేస్తారు. సోమవారం విడుదల చేసిన రిపోర్ట్ 12వ చాప్టర్లో మౌలిక సదుపాయాలు, వృద్ధిలో భాగంగా సిద్దిపేట స్టీల్ బ్యాంక్ వలన జరిగిన ఉపయోగం గురించి వివరించారు. దీనితో స్టీల్ బ్యాంక్ నిర్వాకులైన మహిళలతో పాటు సిద్దిపేట ఎం.ఎల్.ఏ. హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.ప్లాస్టిక్ వద్దనుకుని2022లో సిద్దిపేట మున్సిపాలిటీలో ‘కంటి వెలుగు కార్యక్రమం’లో భాగంగా వైద్య సిబ్బందికి ఆయా గ్రామ పంచాయతీలు భోజన ఏర్పాట్లు చేశాయి. వైద్య సిబ్బంది భోజనం చేసేందుకు ప్లాస్టిక్‌ను వినియోగించాల్సి వచ్చింది. ఇది ఊళ్లో అనవసర చెత్తను పోగు చేస్తోంది. అదే సమయంలో పర్యావరణానికి హాని కూడా. ఈ పారేసిన ప్లాస్టిక్‌ని పశువులు తింటే ప్రమాదం. అందుకే డీపీఓ దేవకీదేవి ప్లాస్టిక్‌కు బదులు స్టీలు వాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సేకరించి స్టీల్ ప్లేట్లు, గ్లాస్లు, స్పూ¯Œ లు, వాటర్ బాటిల్లను కొనుగోలు చేశారు. ఇలా ఏ గ్రామానికి ఆ గ్రామం కొని జిల్లాలోని 499 గ్రామ పంచాయతీల్లో వినియోగించారు. దీంతో రోజుకు 6 కిలోల నుంచి 8 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగించకుండా నిర్మూలించారు.సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 34 స్టీల్ బ్యాంక్‌లో ఉన్న పాత్రల వివరాలు భోజనం ప్లేట్లు 25,500, అల్పహార ప్లేట్లు 8,500, వాటర్ గ్లాస్లు 25,500, టీ గ్లాస్లు 8,500, చెంచాలు 25,500, చిన్న గిన్నెలు 25,500, స్టీల్ ట్రేలు 612, బకెట్లు 272, ఇతరములు 3వేలు వస్తువులున్నాయి.– గజవెల్లి షణ్ముఖ రాజు, సిద్దిపేట, సాక్షి– ఫొటోలు: కె. సతీష్ కుమార్సంతోషంగా ఉంది...ప్లాస్టిక్‌ను నిర్మూలించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేయించాం. మనం పాటించి తర్వాత ప్రజలు పాటించాలన్న స్ఫూర్తితో బ్యాంక్‌ల ఏర్పాటు. కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. వీరికి స్టీల్ ప్లేట్, గ్లాస్లు, వాటర్ బాటిల్ల ద్వారానే అందించాం. మా కృషికి గుర్తింపు దొరకడం సంతోషంగా ఉంది– దేవకీదేవి, డీపీఓసంఘం మహిళలు‘మాది సిద్దిపేటలోని వెన్నెల సమైక్య మహిళా సంఘం. శ్రీసాయితేజ సమైక్య మహిళా సంఘంకు చెందిన గడ్డమీది నవ్య ఇద్దరం కలిసి గత నాలుగేళ్లుగా స్టీల్ బ్యాంక్‌ను కొనసాగిస్తున్నాం. మా ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 34 వార్డుల్లో స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. 29, ఫిబ్రవరి 2020న మా స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. మా వార్డు పరిధిలో వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు జరిగితే ముందుగానే సామాగ్రి కోసం సమాచారం ఇస్తారు. వారు ఎంత మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెబితే వారికి సరిపడా సామాగ్రిని అందజేస్తాం. వీటిని ప్రత్యేక సంచిలో వేసి ఇస్తాం. వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత క్లీన్ చేసి తీసుకువస్తారు. ఏదైనా వస్తువులు మిస్ అయితే వాటికి డబ్బులు తీసుకుంటాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, కప్‌లు ధర కంటే తక్కువ అద్దెకే కిరాయికి ఇస్తున్నాం. ప్లాస్టిక్ నిర్మూలిస్తున్నామనే సంతోషంతో పాటు మాకు ఆర్థికంగా సైతం దోహదపడుతుంది. మా కమిషనర్ ప్రసన్న రాణి, చైర్పర్సన్ కడవేర్గు మంజుల, కౌన్సిలర్ దీప్తిల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. పెళ్లిళ్ల సీజన్ అయితే ఎక్కువ మంది తాకిడి ఉంటుంది. మా దగ్గర అన్ని కిరాయికి పోతే మా పక్క వార్డులో ఉంటే తీసుకుని వారికి అద్దెను చెల్లిస్తాం. ప్రజల నుంచి బాగా స్పందన వస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి రేపటి తరాలకు మంచి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలనే లక్ష్యంతో వీటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం.– బాలగోని దీప్తి, వెన్నెల సమైక్య మహిళా సంఘం. -
అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే..
సాక్షి, సిద్ధిపేట/దుబ్బాక: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అస్త్రం దుబ్బాక రెవెన్యూ డివిజనే. 2020 ఉపఎన్నికల సమయంలోనే డివిజన్‌గా ఏర్పాటవుతుందని ఆశించినా ప్రజలకు నిరాశే ఎదురైంది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అన్నివర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజన సమయంలో సిద్దిపేట జిల్లాగా, దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా చేస్తారని ఈ ప్రాంతం వారు ఎదురుచూశారు. కానీ అలా జరగలేదు. పాత సమితి కేంద్రంగా, తాలుకాగా, నియోజకవర్గ కేంద్రంగా మున్సిపాలిటీగా ఉన్న దుబ్బాకకు రెవెన్యూ డివిజన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. 2016లో రెవెన్యూ డివిజన్ చేయాలంటూ దుబ్బాక పట్టణంలో 45 రోజుల పాటు ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రజల ఆకాంక్ష దుబ్బాక రెవెన్యూ డివిజన్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఉండడంతో పాటు నియోజకవర్గ కేంద్రాలైన గజ్వేల్, హుస్నాబాద్‌లను రెవెన్యూ డివిజన్లుగా చేసి నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకను డివిజన్ చేయకపోవడం శోచనీయం. ఆరు మండలాలతో దుబ్బాక డివిజన్! దుబ్బాక నియోజక వర్గంలో ప్రస్తుతం 8 మండలాలు ఉండగా చేగుంట, నార్సింగ్ మండలాలు తూప్రాన్ డివిజన్లో ఉన్నాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, దౌల్తాబాద్, రాయపోల్, భూంపల్లి–అక్భర్పేట మండలాలతో డివిజన్ చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. 26న ప్రకటిస్తారని ప్రచారం.. దుబ్బాక రెవెన్యూ డివిజన్ డిమాండ్‌ను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఇప్పటికే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తీసుకెళ్లాడని, ఈ నెల 26 న దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో డివిజన్‌గా చేస్తున్నట్లు ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. హరీశ్ సైతం కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి దుబ్బాక డివిజన్ చేస్తామని రోడ్ షోల్లో హామీలు ఇస్తున్నారు. రేవంత్ నోటా దుబ్బాక డివిజన్.. దుబ్బాకలో గురువారం జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించండి దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది దుబ్బాక డివిజన్‌ను చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీజేపీ సైతం దీనిపైనే ఫోకస్! దుబ్బాకలో మళ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపిస్తే తప్పకుండా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రఘునందన్‌రావు సైతం భూంపల్లి–అక్భర్పేట కొత్త మండలం ఏర్పాటు చేశానని, దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానంటూ ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇవి కూడా చదవండి: బడా నేతల ఆగమనం! -
సిద్దిపేటలో హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు సందడి..
-
సిద్ధిపేట: మునిగడపలో అదుపుతప్పి గుంతలో పడ్డ కారు
-
స్టేడియంలో క్రికెట్ ఆడిన తెలంగాణ మంత్రులు
-
‘కాంగ్రెస్, బీజేపీ నేతలను చెరువులో ముంచాలి’
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట జిల్లా రాజగోపాల్‌పేట చెరువులో ముంచాలని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీ, గాంధీభవన్‌లో కూర్చుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తుందంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం రాజగోపాల్‌పేట గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇవాల చేపలను వదిలాం. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులో నీళ్లు గుంజుకుపో యేవి. బోర్లు వేసి, మోటార్లు పెట్టి, ట్రాన్స్ ఫార్మర్ పెట్టి చెరువులు నింపేవారం’ అని నాటి రోజులను గుర్తు చేశారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా.. సీఎం కేసీఆర్ దయతో చెరువులు నిండుగా ఉన్నాయన్నారు. దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కేవలం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు. ‘ఒకప్పుడు యాసంగిలో నీళ్లు లేక, బోర్లు ఎండిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయి సీన్ రివర్స్ అయిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఇదంతా కనపడటం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: గోదావరి బోర్డుకు కాళేశ్వరం సవరణ డీపీఆర్! -
కలిసి బతకలేమని.. ప్రియుడి మృతి, చున్నీ తెగిపడి..
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రేమ పేరుతో ఇద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు. కులాలు వేరైనా నమ్ముకున్న ప్రేమ కోసం ఏకమవుదామనుకున్నారు. కానీ ఇరువర్గాల పెద్దలు కులాంతర వివాహానికి అడ్డు చెప్పడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చర్ల అంకిరెడ్డి పల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మోతకాని సత్తయ్యకు ఇద్దరు కుమారులు. వీరిది వ్యవసాయ కుటుంబం. సత్తయ్య చిన్నకుమారుడు నరేశ్ (26) సిద్దిపేటలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. నరేశ్‌కు 8 నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన నెలకే అతడితో గొడవ పడి వెళ్లిపోయింది. కాగా నాలుగేళ్లుగా నరేశ్ ఇంటి సమీపంలో ఉండే కొయ్యడ అశ్విని(22)తో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో మార్చి 30న ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు నరేశ్‌పై కేసు నమోదు చేశారు. కాగా శుక్రవారం సికింద్లాపూర్ శివారులో గుట్టల వద్ద చెట్టుకు ఉరేసుకుని ఉండటం చూసిన ఎల్లారెడ్డి విషయాన్ని నరేశ్ కుటుంబీకులకు సమాచారం అందించాడు. వారు నరేశ్‌గా గుర్తించారు. అశ్విని చున్నీ తెగిపోవడంతో కిందపడి అపస్మారక స్థితికి చేరుకుంది. అశ్వినిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. -
మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
-
ఆ దుర్మార్గులు కానిస్తరా అనుకున్నాం:సీఎం కేసీఆర్
-
కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేసీఆర్
-
తెలంగాణ జన హృదయ సాగరం మల్లన్న సాగర్:సీఎం కేసీఆర్
-
తెలంగాణ జన హృదయ సాగరం మల్లన్నసాగర్
-
దేశం దారితప్పి పోతోంది.. దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది: సీఎం కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: ‘దేశం దారి తప్పి పోతోంది, చాలా దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది. తప్పకుండా, ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడు నాకిచ్చిన సర్వశక్తులు, సకల మేథో సంపత్తిని ఉపయోగిస్తా. చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతా..’అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘మత కల్లోలాలను సహించకూడదు. అవి కేన్సర్‌లా విసర్తించకుండా చర్యలు చేపట్టాలి. ఈ దేశం నుంచి ఎక్కడికక్కడే తరిమికొట్టాలి. పిల్లలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వెళ్లి చదువుకోవాలంటేనే భయపడుతున్నారు..’అని చెప్పారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను సీఎం బుధవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ జల హృదయ సాగరం ‘నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన అతి భారీ జలాశయం మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మల్లన్నసాగర్ కాదు.. తెలంగాణ జల హృదయ సాగరం.. తెలంగాణ జీవనాడి.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు. ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ «శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నా. గోదావరి నదిలో 50 డిగ్రీల ఎండలో ఇంజనీర్లు పడ్డ కష్టం వృథా కాలేదు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడాం. ప్రాజెక్టు నిర్వాసితులకు ఆసియాలో ఎక్కడా లేని విధంగా పునరావాసం కల్పించాం. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే అధికారులు వెంటనే వారికి న్యాయం చేయాలి. మంత్రి హరీశ్‌రావు నిర్వాసితులకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కొందరు దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రగతి నిరోధక శక్తులుగా మారారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో ఒక రోజు 58 వేల మంది కార్మికులు 14 రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న సమయంలో దుర్మార్గులు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. అక్కడి నుంచే మన రాష్ట్ర చీఫ్ జస్టిస్‌కు ఫోన్ చేసి.. ఇది తెలంగాణ జీవనాడి.. ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరా. దాదాపు 600 పైచిలుకు కేసులు వేయగా అన్నీ కొట్టేశారు. ప్రాజెక్టు గురించి కనీస అవగాహన లేనివారు, కొన్ని రాజకీయాల పార్టీల వారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు...’అని కేసీఆర్ అన్నారు. కరువు నుంచి కాపాడే కాళేశ్వరం ‘తెలంగాణలో పంటలు పండించే, కరువు రాకుండా కాపాడే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. గోదావరి నది పారే జిల్లాల్లో కరువు ఎలా ఉంటది? అని ఉద్యమ సమయంలో నేను ప్రశ్నించా. ఉద్యమ వేడిని చల్లార్చడానికి చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రస్తుతం ఖమ్మం సీతారామ ప్రాజెక్టు ప్రాణం పోసుకుంటోంది. పాలమూరు జిల్లాలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పంజాబ్ కంటే ఎక్కువ ధాన్యాన్ని పండిస్తున్నాం. ఏప్రిల్ నెలలో కూడా చెరువులు నీటితో తొణికిసలాడుతున్నాయి. ఆషామాషీగా, తెలివి లేక ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు ఆగిపోవాలని రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలి..’అని కోరారు. కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి ‘హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేసేవారు కూడా గ్రామాలకు వస్తున్నారు. అద్భుతమైన గ్రామీణ తెలంగాణ ఆవిష్కృతమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోంది. కుక్కలు మొరుగుతున్నాయని మన పనిని ఆపొద్దు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. తెలంగాణలో ఎక్కడకు పోయినా ఎకరా భూమి రూ.20 లక్షలకు పైగానే ఉండడంతో మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రానికి అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ. బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారితే మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ నుంచి 1.50 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాలు 580 వరకు శంషాబాద్‌లో దిగుతున్నాయి..’అని ముఖ్యమంత్రి తెలిపారు. దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ ‘దేశానికే మార్గదర్శకంగా, గొప్ప రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుసుకుంది. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌లోని మారుమూల పల్లెల్లో అంటు రోగాలు మాయం అయ్యాయి. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గిపోయాయి. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశాం. కేసీఆర్ కిట్లు 10 లక్షల కుటుంబాలకు మించి పంపిణీ అయ్యాయి. ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతం అవుతోంది. అనేక రంగాల్లో బ్రహ్మాండమైన పురోగతితో ముందుకు పోతున్నాం..’అని చెప్పారు. రూ.1,500 కోట్లతో పర్యాటకాభివృద్ధి ‘అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్, ఏడుపాయల వనదుర్గామాత వద్ద టూరిజం అభివృద్ధికి రూ.1,500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నా. ఈ ఐదు ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం అభివృద్ధి చేయాలి. ఇందుకు మంత్రి హరీశ్, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రత్యేక చొరవ తీసుకుని ఏడాదిన్నరలో పూర్తి చేయాలి. హాలీవుడ్, హిందీ సినిమాల షూటింగ్‌లు ఇక్కడ జరిగేలా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు మధ్యలో దీవులు ఉన్నాయి. 7,500 ఎకరాల అటవీ సంపద ఉంది. ఔషధ మొక్కలు పెంచాలి. రిజర్వాయర్ వద్ద 100 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇరిగేషన్ కాంప్లెక్స్ నిర్మించాలి..’అని కేసీఆర్ ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు కూడా రాబోతోంది కాబట్టి రెండు నాలుగు వరసల రోడ్లు ఈ ప్రాజెక్టు వరకు వేయాలని సీఎం సూచించారు. మంత్రి హరీశ్ డైనమిక్ లీడర్ ‘రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు డైనమిక్ లీడర్. చురుకైన మంత్రి. ఆయనకు మంచి శక్తియుక్తులు ఉన్నాయి. మొదటి టర్మ్‌లో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎంతో క్రమశిక్షణతో, కడుపు మోపు కట్టుకుని, 100కు 100 శాతం పూర్తి అవినీతి రహితంగా ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్‌తో ముందుకు సాగుతూ పనిచేస్తే అది ఈవేళ సాకారం అయింది..’అంటూ కేసీఆర్ అభినందించారు. ఐదు రిజర్వాయర్ల వద్ద పర్యాటకాభివృద్ధి పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా హరీశ్‌ను అదేశించారు. మల్లన్న జలాలతో అభిషేకం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, సభ అనంతరం సీఎం మల్లన్నసాగర్ నీటిని ఐదు బిందెల్లో తీసుకుని కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయానికి వెళ్లారు. మల్లిఖార్జున స్వామికి మల్లన్న జలాలతో అభిషేకం నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. -
చేపలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాం: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన మత్స్యరంగానికి తెలంగాణ రాష్ట్రంలో ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేళ్లలో చేపలను ఉత్తర భారతదేశంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రంగనాయకసాగర్, సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాల్లో 4కోట్ల19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామన్నారు. తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా మారిందని, ఎక్కడ చూసినా ధాన్యం, మత్స్య సంపద కళ్ల ముందు కనిపిస్తోందని చెప్పారు. కుల వృత్తులకు పూర్వవైభవం: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులవృత్తులకు పూర్వవైభవం కోసం కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగు కోసం తమ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 93 కోట్ల చేప పిల్లలను, 20 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. రెండేళ్లలో ఫెడరేషన్ ద్వారా చేప పిల్లలను కొని మార్కెటింగ్ చేయాలనే కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నామన్నారు. అప్పుడు చేపలకు మంచి ధర వస్తుందన్నారు. అప్పటివరకు మత్స్యకారులు చేపలను తక్కువ ధరకు అమ్మకుండా డిమాండ్ ఉన్న హైదరాబాద్, ఇతర రాష్ట్రాలలో బహిరంగ మార్కెట్లో విక్రయించి లాభాలు పొందాలని సూచించారు. భవిష్యత్‌లో మొబైల్ ఔట్ లెట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మురిసిన మంత్రి హరీశ్‌రావు చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి ఓ చేపపిల్లను చూడగానే తె లియని ఆనందం కలిగింది. దాన్ని చేతితో పట్టుకుని చూస్తూ మురిసిపోయారు. అనంతరం ఆ చేపను నీటిలో వదిలారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువులో మంత్రి హరీశ్‌రావు చేపపిల్లలను వదులుతుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. -
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సిద్ధిపేటలోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవింతాంతం పాటుపడ్డారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. జయశంకర్ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలని పేర్కొన్నారు. యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారని చెప్పారు. జయశంకర్ జీవితం యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు ► ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ► ఢిల్లీ తెలంగాణ భవన్లో ఆచార్య జయశంకర్ సార్ 87వ జయంతి వేడుకలకు ఎంపీలు బండ ప్రకాష్, బీబీ పాటిల్, కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు. ► హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, సింగరేణి కార్మికసంఘం నేతలు ప్రొ. జయశరంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి హరీష్ రావు ► అడిషనల్ డీజీ పర్సనల్ శివధర్ రెడ్డి, వెల్ఫేర్ ఉమేష్ ష్రాఫ్, ఆర్గనైసేషన్ రాజీవ్ రతన్, ఏ.ఐ.జి. రాజేంద్ర ప్రసాద్. ఇతర అధికారులు, సిబ్బంది జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ► ఆచార్య కొత్తపల్లిలో జయశంకర్ చిత్ర పటానికి డీజీపీ కార్యాలయంలో పోలీసులు ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. -
Harish Rao Birthday: వినూత్న బహుమతి
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును ఎస్బీఐ అధికారులు వినూత్న రీతిలో సన్మానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హరీశ్‌రావుకు బ్యాంకు అధికారులు.. ఆయన పుట్టిన రోజు అంకెలైన 030672.. సీరియల్ నంబర్‌తో ఉన్న మూడు కరెన్సీ నోట్లను మెమెంటోగా అమర్చి బహూకరించారు. రూ.100, రూ.50, రూ.20 నోట్లు ఇందులో ఉన్నాయి. అలాగే మంత్రి గురువారం పుట్టిన రోజు జరుపుకున్న నేపథ్యంలో ఆయన ఫొటోతో కూడిన పోస్టల్ స్టాంపులను కూడా అందించి సత్కరించారు. చదవండి: కరోనాతో ప్రాణం పోయింది.. అప్పు మిగిలింది -
బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే..
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతల అసత్య ప్రచారాలపై ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. దుబ్బాకలో బీజేపీ పార్టీ జూటా మాటలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ జూటా మాటలు ప్రజలకు తెలియజేసేందుకే ఈ రోజు(శుక్రవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. వెనుకటికి వేయి అబద్దాలు ఆడిన ఒక పెళ్లి చేయాలని అనే వారని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వేయి అబద్దాలు ఆడైన ఒక ఎన్నిక గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలే ఆయుధంగా చేసుకుని, అబద్ధాల పునాదుల మీద దుబ్బాకలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు సత్యమేవ జయతే అనే నానుడిని మార్చి అసత్యమేవ జయతేగా మార్చివేశారని విమర్శనాస్త్రాలు సంధించారు.చదవండి: దుబ్బాక ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తును బహుమతిగా ఇస్తే, బీజేపీ వాళ్ళు 18 శాతం జీఎస్టీని కానుకగా ఇచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీడీ కార్మికులను మోసం చేస్తే, కేసీఆర్ పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ పథకంలో బీజేపీ ప్రభుత్వ వాటా ఉందని బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కిట్‌లో కేంద్రానిది నయా పైసా లేదని స్పష్టం చేశారు. గొర్రెల యూనిట్లలో 50 వేలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్న మంత్రి హరీష్‌రావు గొర్రెల యూనిట్లలో నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు. చేగుంటలో మంజూరైన ఈఎస్ఐ ఆసపత్రిని గజ్వేల్‌కు తరలించారని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే చేగుంటకు మంజూరు ఆయునట్లు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. చదవండి: దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ లేఖ ‘ఆఖరికి ప్రజలు తినే అన్నం పైన బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. రేషన్ బియ్యంపై కేంద్రం 29 రూపాయలు ఇస్తుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు. కేంద్రం కేవలం సగం కార్డులకే సబ్సిడీ ఇస్తే మిగతా సగం కార్డులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దుబ్బాకలో మంజూరైన పాలిటెక్నిక్ కాలేజ్‌ను సిద్దిపేటకు తరలించారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అసలు దుబ్బాకకు పాలిటెక్నిక్ కళాశాలనే మంజూరు కాలేదు. కేసీఆరే బోరు మోటార్లకు మీటర్ పెడుతుందని ఉల్టా ప్రచారం చేస్తున్నారు. చదవండి: దుబ్బాక ఎన్నికపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు వరి ధాన్యం మద్దతు ధర కోసం రూ. 5,500 కోట్లు కేంద్రం విడుదల చేసిందని పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. కేంద్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. డబ్బులు దొరికిన ఇల్లు మా వాళ్లది కాదంటున్న బీజేపీ అభ్యర్థి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు అని తెలియగానే ప్రచారం ఆపేసి ఎందుకు ఆగమేఘాల మీద పరుగెత్తుకు వచ్చిండు? హడావుడి ఎందుకు చేసిండు? దుబ్బాకలో రఘునందన్ రావు అసత్యాలు ప్రచారం చేసే జూటా స్టార్‌గా మారాడు. దుబ్బాక ప్రజలు బీజేపీ నేతల మాటలు విని మోసపోవద్దు’. అని మంత్రి బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్దాలపై నిప్పులు చెరిగారు. -
బీజేపీ గోబెల్స్ ప్రచారం తప్ప మరేమీ లేదు..
సాక్షి, సిద్దిపేట: నాటి నైజం పాలన నుంచి నిన్నటి సమైక్యాంధ్ర పాలన వరకు ప్రతి ఒక్కరు భూమి ఉన్నవారి వద్ద శిస్తు వసూలు చేశారు.. కానీ ఒక్క కేసీఆర్ మాత్రం చరిత్ర తిరగరాసి భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం ఘనపూర్, గుడికందుల గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్ది సోలిపేట సుజాతకు మద్దతుగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లు గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడికందుల గ్రామంలోని కాలభైరవ స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉండేదని, కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో రైతుల ఆత్మహత్యలే మిగిలాయని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితి మారిందా లేదా? ప్రజలు ఆలోచించాలన్నారు. రైతుల బతుకుల్లో మార్పు రావాలనే సీఎం కేసీఆర్, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు ఇస్తున్నారన్నారు. (చదవండి: అప్పుడే బాయి కాడ మీటర్ల జోలికి రారు: హరీశ్) బీజేపీ పాలిస్తున్న 17 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిస్తున్న అయిదు రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్, ఎకరాకు 10 వేలు ఇస్తున్నారా అనేదానికి సమాధానం ఇచ్చి , ఆ తర్వాత వాళ్ళు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. వచ్చే మూడేళ్లు అధికారంలో ఉండేది తామేనని, అభివృద్ధి తమతోనే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేతిలో నెత్తి లేదు.. కత్తి లేదు.. వాళ్లెం చేస్తరని, ఇక బీజేపీ గోబెల్స్ ప్రచారం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. వాళ్లు పైసలో.. సీసాలో ఇస్తారు.. లేదంటే హరీశ్ రావును తిడుతరని, వాళ్ల తిట్లకు భయపడను.. దీవెనలుగా తీసుకుంటా.. ఇంకా బలపడతానని అన్నారు. బీజేపీ ఫారిన్ మక్కలు తెచ్చి తెలంగాణ కోళ్లకు పోస్తే.. మన మక్కలు ఎవడు బుక్కాలి? బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందని ప్రశ్నించారు. మార్కెట్లను ప్రైవేటు పరం చేసి రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాదనుకున్న తెలంగాణను, కాదనుకున్న కాళేశ్వరం నీళ్లను తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. బిహార్‌లో మోదీ డబుల్ ఇంజన్ గ్రోత్ అంటున్నారని, ఇక్కడ కూడా అధికారంలో టీఆర్ఎస్ ఉన్నదని.. దుబ్బాకలోనూ టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: హరీశ్ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి) -
‘ఈ ఎన్నికలో ఓడిస్తే సీఎం వందమెట్లు దిగివస్తారు’
సాక్షి, దుబ్బాక(సిద్దిపేట): ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బు, పోలీసులను విచ్చలవిడిగా వాడుతుందని, కలెక్టర్ కూడా వారికే సపోర్టు కాబట్టి గెలిచినట్లుగా భావిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే అయినప్పటికీ దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే అది రాష్ట్ర ప్రజలకు శాపమన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు బలంగానే ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు మాత్రం డబ్బు, పోలీసుల బలం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌కు పెద్దకొడుకులా పనిచేస్తున్నారని, అందువల్లే ఎన్నిక జరగక ముందే గెలిచినట్లుగా హరీశ్ రావు భావించి మెజారిటీ గురించి మాట్లాడుతున్నారన్నారు. లక్ష రూపాయల రూణమాఫీ, 57 ఏళ్లకే పెన్షన్, 12 శాతం రిజర్వేషన్లు, ఎస్సీలకు 12 రిజర్వేషన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయినా మళ్లీ ఎలక్షన్లో గెలిచినందుకు సీఎం కేసీఆర్ గల్లా ఏగిరేస్తున్నాడన్నారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవేమీ ఇవ్వకపోయిన గెలుస్తామనే థీమా వాల్లకు వస్తే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. పంటలు మొత్తం మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. యూనివర్శిటీ పిల్లలంతా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా దుబ్బాకలో పని చేయాలని పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తే సీఎం వంద మెట్లు దిగివస్తారని, కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్ర ప్రజలకు లాభమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
‘ఏం జరిగినా కాంగ్రెస్ పాపమే అంటున్నారు’
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ అకాల వర్షంతో నష్టపోయిన రైతులపై లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం సర్వేకు వస్తుందన్నా రాష్ట్ర ప్రభుత్వం కదలడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఇల్లు కూలిన వారికి కేవలం రూ. 10వేలు ఇస్తే సరిపోదని, పూర్తిగా కూలిన ఇళ్లకు 2 లక్షల రూపాయలు, పాక్షికంగా కూలిన ఇళ్లకు ఒక లక్ష రూపాయలు చెల్లించాలని ఆయన డిమండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు చెల్లించాలన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ నష్టం జరిగినా అది కాంగ్రెస్ పాపమే అంటున్నారని, 6 ఏళ్ల నుంచి మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ చూపిన శ్రద్ధ.. రైతులు, ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపించారు. వర్షాలతో నష్టం ఎక్కడ జరిగిందో అక్కడికి అధికారులు వెంటనే వెళ్లి సర్వే చెయ్యాలని, వారికి న్యాయం చెయ్యాలన్నారు. పంట నష్టం కారణంగా రైతులు ఆందోళనతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని, వెంటనే మేలుకొని ఎకరాకు 20వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేందుకు వారి తరపున ఈ నెల 31న కాంగ్రెస్ పార్టీ ఆధ్యరంలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. (చదవండి: బండి సంజయ్‌కు మంత్రి హరీష్ సవాల్) -
‘బీజేపీ గోబెల్స్ ప్రచారానికి నొబెల్ బహుమతి ఇవ్వాలి’
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర బీజేపీ దళిత మోర్చ కౌన్సిల్ మెంబర్ ఎల్లం(ఎల్లయ్య)తో పాటు దాదాపు 150 మంది జిల్లాలోని మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే మిరుదొడ్డి కాంగ్రెస్‌తో పాటు, ఇతర పార్టీల నేతలు అధిక సంఖ్యలో గురువారం టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాకకు సముద్రం అంత సాయం కేసీఆర్ ప్రభుత్వం చేస్తే, బీజేపీ కాకి రెట్టంత కూడా సాయం లేదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారానికి నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ దుబ్బాక పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మైకులే ఫెయిల్ అయ్యాయని, పరాయి లీడర్లు, పరాయి కార్యకర్తలతో నుడుపుతున్న కాంగ్రెస్ సమావేశాల్లో ప్రజలు అసలే లేరని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పోటీలు రెండో స్థానం కోసమేనన్నారు. టీఆర్ఎస్ పార్టీ , కేసీఆర్ లేకపోతే ఉత్తమ్ జై తెలంగాణ అనే వారా?.. కాదనుకున్న తెలంగాణను ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి తెచ్చిన కేసీఆర్ దా మోసం? అని ప్రశ్నించారు. ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగి తెలంగాణకు మోసం చేయలేదా అని ఉత్తమ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మోసాల చరిత్ర కాంగ్రెస్ ది- త్యాగాల చరిత్ర టీఆర్ఎస్ పార్టీది అన్నారు. దుబ్బాక, సిద్దిపేట నేతలు మాత్రమే ఇక్కడ ఉన్నామని, ఉత్తమ్ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి నాయకులను తెచ్చుకుంటున్నారని మంత్రి విమర్శించారు. -
మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న: హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అభివద్ధి చూసి తాము ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు పేర్కొనడం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకు నియోజకవర్గంలో మంత్రి శుక్రవారం పర్యటించారు. జిల్లాలోని రాయపోలు మండలం దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామస్తులు తీసుకున్న ఏకగ్రీవ తీర్మాణ పత్రాన్ని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మంత్రికి అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, అప్యాయత జీవితంలో మర్చిపోను అన్నారు. వర్షంలో సైతం మహిళలు, వృద్ధులు, యువకులు అంతా కలిసి ఆదరించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నన్నారు. కేసీర్ కృషి వల్ల కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నామని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడమే సీఎం ధ్యేయమన్నారు. (చదవండి: రూ.10,095 కోట్లకేంద్ర నిధులు పెండింగ్) 4 గంటలే ఉచితంగా కరెంట్ ఇస్తూ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేద్దామని, వ్యవసాయానికి మీటరు పెట్టి బిల్లులు వసూలు చేసే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుదామని మంత్రి పిలుపునిచ్చారు. రైతులకు రైతుబందు ద్వారా ఎకరాకు 5 వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించి, రైతు భీమా ద్వారా అకాల మరణం చెందిన కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసిందన్నారు. వితంతువులకు, వృద్దులకు, బీడీ కార్మికులకు, వివిధ రకాల కుల వృత్తుల వారికి కూడా పెన్షన్లు కలిపిస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘మే 29 రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నేరవేరే రోజు’
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రజల ఆకాంక్ష 29వ తేదీతో నెరవేరబోతుందని టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ఫొన్ కాల్ మేరకు చేబర్తి చెరువుకు తుం ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్టు కోసం అటవీ అభివృద్ధి సంస్థ 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ప్రతాప్‌తో పాటు సర్పంచ్ అశోక్‌లు, మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో కొండపోచమ్మ సాగర్ ప్రారంభం కాబోతోందని చెప్పారు. (మర్కూక్ గ్రామ సర్పంచ్‌కు కేసీఆర్ ఫోన్!) తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలయిందే నీళ్ల కోసమన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్‌కు పాదాభివందనం అని ఆయన వ్యాఖానించారు. గతంలో సరైన సమయంలో వర్షాలు పడక రైతులు నష్టపోయేవారు, ఇకముందు ఆ పరిస్థితి రాష్ట్రానికి లేదన్నారు. ఎక్కడైనా వంపుకు ఉన్న ప్రాంతానికి నీళ్లు వస్తాయి కానీ కేసీఆర్ కృషి వల్ల ఎత్తుకు నీటిని తరలించుకుంటున్నామన్నారు. మనంజన్మలో సాధ్యమవుతుందా అని అనుకున్న.. అసాధ్యమైన పనిని కేసీఆర్ సుసాధ్యంతో చేశారని వ్యాఖ్యానించారు. అలాగే చేబర్తి గ్రామ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. ఫోన్ చేసి మీ చెరువు నింపుతామని సీఎం కేసీఆర్ చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా గ్రామం తరుపున కేసీఆర్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్) -
మైనర్ బాలికపై పూజారి అఘాయిత్యం
సాక్షి, సిద్ధిపేట : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది. పూజారిగా వృత్తి నిర్వహిస్తున్న మహేందర్(23) స్థానికంగా 8వ తరగతి చదువుతున్న బాలికతో ఏడాదిగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అంతేగాక ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన మిరుదొడ్డి పోలీసులు నిందితునిపై పోక్సో యాక్ట్ కింద పలు కేసులు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అది వినాశనానికి దారి తీస్తుంది:హరీశ్ రావు
సాక్షి, సిద్దిపేట: నేను అనుకోకుండా మనము అనుకున్నపుడే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెట్లను నాటి వాటి సంరక్షణకు గ్రామాల్లోని మహిళలను, కుల సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఎన్ని చెట్లను నాటినప్పటికి వాటిని సంరక్షించే వారు లేకుంటే ఆ కార్యక్రమం వృథా అవుతుందన్నారు. మనం ఎన్నిపనులు చేసిన చెట్లను సంరక్షించే పని చాలా గొప్పదన్నారు. ప్రతి ఒక్కరు పకృతి సంరక్షణకు నడుం బిగించి చెట్లను నాటి వాటి సంరక్షించాలని కోరారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే అది మన వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. -
మూడు స్థానాల్లో పోటీయే లేదు
చేగుంట (తూప్రాన్): ఉమ్మడి మెదక్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి అసలు పోటీయే లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాల్లో పార్టీ విజయం ఖాయమని పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా చేగుంటలో పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంతోపాటు నార్సింగిలో జరిగిన బైక్‌ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేగుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విపక్షాలపై ధ్వజమెత్తారు. మహాకూటమి నుంచి సిద్దిపేట, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాల్లో టీజేఎస్ పోటీ చేస్తుందని ముందునుంచీ ప్రకటించగా, ఇప్పడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎందుకు పోటీలో ఉన్నారో అర్థం కావడంలేదన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఓట్ల సమయంలో మాత్రమే నాయ కులు వచ్చి ట్రస్టుల పేరు చెప్పుకుంటారని తెలిపారు. కొందరు ట్రస్టుల పేరుతో చెల్లని చెక్కులను అందిస్తున్నారన్నారు. డబ్బులు పంచే నాయకులు గెలిచిన తర్వాత ఖర్చు చేసిన డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారని ప్రజల సంక్షేమం వారికి పట్టదని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధిని నిరంతరం కోరుకునే మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డికి మద్దతుగా పార్టీలో చేరడం గొప్ప విషయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టునుంచి దుబ్బాకకు సాగునీరు అందిస్తామన్నారు. మరో మూడు నెలల్లో కాళేశ్వరం పనులను పూర్తిచేసి మోటార్లను ప్రారంభిస్తామన్నారు. సిద్దిపేటను మించి దుబ్బాకలో రామలింగారెడ్డికి భారీ మెజార్టీ తీసుకురావడానికి కార్యకర్తలు పోటీ పడాలన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిచేరిన కార్యకర్తలకు సైతం సరైన సమయంలో సముచిత స్థానం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ సత్తాను చాటాలని కార్యకర్తలకు సూచించారు. రామలింగారెడ్డి మాట్లాడుతూ శత్రు దేశాల ముష్కరుల దాడిని తిప్పికొట్టడానికి పహారా కాస్తున్న సైనికుల్లా కార్యకర్తలు టీర్‌ఎస్‌ను కాపాడుతున్నారని.. ఇదే స్ఫూర్తితో పని చేయాలని కోరారు. చేగుంట, దౌల్తా బాద్ మండలాలకు చెందిన వందలాది మంది కాం గ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం నార్సింగి వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నేతలు వెంగళ్రావ్, అల్లి రమ పాల్గొన్నారు. -
ఆయనొక్కడే.. వారు ముగ్గురు
సిద్దిపేట : చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. 6వ తరగతిలో విద్యార్థులు ముగ్గురే ఉన్నారు. ఈ ఊళ్లోని పిల్లలంతా ప్రైవేటు స్కూలు బాట పట్టడంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు పలచబడింది. -
గుండెపోటుతో ఇద్దరు జర్నలిస్టుల మృతి
గుండెపోటుతో చానల్ రిపోర్టర్.. చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేటకు చెందిన టీవీ చానెల్ రిపోర్టర్ మేడి సిద్దిరాములు(30) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం రాత్రి వరకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో బంధువులతో గడిపిన సిద్దిరాములు నిద్రలోనే గుండెపోటుకు గురై మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది. ప్రజాశక్తి, ఆంధ్రప్రభ పత్రికల్లో పనిచేసిన సిద్దిరాములు కొంత కాలంగా మహ న్యూస్ చానెల్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు తల్లి లక్ష్మి, ముగ్గురు సోదరులున్నారు. సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన అంత్యక్రియల్లో తల్లి లక్ష్మి తలకొరివి పెట్టడం అక్కడివారిని కలచివేసింది. అంత్యక్రియల్లో చిన్నశంకరంపేట, రామాయంపేట, మెదక్ ప్రెస్‌క్లబ్ సభ్యులు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు. మెదక్ నియోజకవర్గ టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, రామాయంపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సంపత్, చిన్నశంకరంపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు యాదగిరి, ఏఎంసీ చైర్మన్ నరేందర్, సర్పంచ్ కుమార్‌గౌడ్, ఆర్ఎస్ఎస్ మండల సమన్వకర్త లక్ష్మారెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశం, ఏదుల్ పాల్గొన్నారు. ఆర్థిక సహాయం అందిస్తాం చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్ సిద్దిరాములు కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని టీయూడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. సిద్దిరాములు మృతి విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించినట్లు తెలిపారు. అలాగే ప్రెస్ ఆకాడమీ నుంచి మరో రూ.లక్ష అందించనున్నట్లు తెలిపారు. D దుబ్బాకలో సీనియర్ జర్నలిస్ట్.. దుబ్బాకటౌన్: సీనియర్ జర్నలిస్టు, మన తెలంగాణ దుబ్బాక విలేకరి పల్లె వెంకటస్వామిగౌడ్ గుండెపోటుతో ఆదివారం రాత్రి మరణించారు. ఆయనకు ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లోనే తీవ్రంగా ఛాతిలో నొప్పి వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. వెంకటస్వామిగౌడ్ మృతితో తోటి జర్నలిస్టులు, స్నేహితులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. 14 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రజలతో మంచి సంబంధాలు కల్గి ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరు పెట్టారు. సంతాప సూచకంగా దుబ్బాకలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సోమవారం స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. వెంకటస్వామి అంతిమయాత్రలో సిద్దిపేట జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షులు రంగచారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
ఆకతాయిల ఆట కట్
సిద్దిపేటటౌన్: వినోద్(పేరు మార్చాం) కాలేజీకి వెళ్లకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతని గ్రామం మీదుగా రోజు సిద్దిపేటకు బస్సులో వేళ్లే కాలేజీ అమ్మాయిని ఆటపట్టించే వాడు. రోజురోజుకు వినోద్ అల్లరి ఎక్కువ కావడంతో బాధితురాలు భరించలేక.. ఓ రోజు ఇంట్లో వాళ్లకు విషయం చెప్పంది. వెంటనే సదరు అమ్మాయి వాళ్ల నాన్న తనకు తెలిసిన వాళ్ల ద్వారా షీ టీం బృందానికి విషయం చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన షీ టీం బృందం సాధారణ ప్రయాణికుల మాదిరిగా రెండు రోజులు బస్సులో ప్రయాణం చేసి.. వినోద్ ఆటపట్టించడాన్ని పూర్తిగా వీడియో తీశారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని తల్లిదండ్రులను పిలిపించి.. వారికి అమ్మాయిని ఆట పట్టించిన వీడియో చూపించారు. అనంతరం వారి తల్లిదండ్రుల సమక్షంలో సీఐ నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మొదటి అవకాశంగా కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నామని, బుద్ధిగా ఉండాలని హెచ్చరించి వదిలేశారు. అప్పటి నుంచి వినోద్ బుద్ధిగా కాలేజీకి వెళ్లడం ప్రారంభించారు. ఈ ఒక్క సంఘటనలోనే కాదు.. అమ్మాయిలను, మహిళలను వేధించే వారిని వదిలిపెట్టకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది షీ టీం బృందం. సిద్దిపేటలో షీ టీం ఏర్పాటు తర్వాత అమ్మాయిలకు వేధింపులు చాలా వరకు తగ్గాయి. 2015లో షీ టీం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలు, అమ్మాయిల భద్రత కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం షీ టీం బృందాలను ఏర్పాటు చేసింది. మొట్టమొదటి సారిగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లో ఈ షీటీం బృందాలు విజయవంతంగా విధులు నిర్వహిస్తుండటంతో మిగతా జిల్లాల్లోనూ బృందాలను ఏర్పాటుచేశారు. అలా 2015 ఫిబ్రవరి 9న ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్పటి ఎస్సీ సుమతి ఆధ్వర్యంలో సిద్దిపేటలో షీ టీం బృందం ఏర్పాటైంది. షీ టీం బృందం విధులు షీ టీం మహిళలు, అమ్మాయిలను ఆకతాయిల బారి నుంచి రక్షించి.. ఆటపట్టించే వారిని పట్టుకుని వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పని ప్రదేశాలలో మహిళలు, కాలేజీ అమ్మాయిలు.. అబ్బాయిల నుంచి ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గిస్తారు. ఉపాధి పనులకు వెళ్లే మహిళలకు పని ప్రదేశాలలో ఎదురయ్యే వేధింపులను ఎలా ఎదుర్కొవాలి, వేధింపుల నుంచి ఎలా రక్షణ పొందాలి అనే అంశాలను వివరించనున్నారు. కాలేజీల్లో అమ్మాయిలకున్న రక్షణ చట్టాలపై అవగాహన కలిగించడం, కేసు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ఆట పట్టిస్తూ షీ టీం బృందానికి పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు మళ్లీ ఎలాంటి పొరపాటు చేయకుండా సంజాయిషీ లెటర్ తీసుకుని విడిచి పెడుతారు. అమ్మాయిలు, మహిళలపై జరిగే వేధింపుల రకాలను కళాజాత బృందాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కల్పిస్తారు. చైల్డ్ అబ్యూజింగ్ జరగకుండా చూడటం, మొబైల్ ఫోన్ ద్వారా అభ్యంతరకర మెసేజ్‌లు చేసే వారిని, రాంగ్ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టే వారి గురించి కేసు పెడితే.. వెంటనే వారిని అరెస్టు చేసి, వారిని హెచ్చరిస్తారు. లేడీస్ హాస్టల్స్, మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మహిళలకు, అమ్మాయిలకు అవగాహన కలిగిస్తారు. బస్టాండ్లలో గస్తీ షీ టీం బృందంలో ఒక కానిస్టేబుల్, ముగ్గురు లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు. ఇలా రెండు టీంలు ఉదయం, సాయంత్రం బస్టాండ్, ప్రధాన చౌరస్తాల వద్ద గస్తీ ఉండి అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించేవారిని గుర్తించడంతో పాటు వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు ఒక టీం, సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు మరో టీం విధులు నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాల ద్వారా.. షీ టీం బృందాలు ఇకపై కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రయాణ ప్రాంగణాలు, ప్రధాన చౌరస్తాలలో విద్యార్థులను, యువతులను, మహిళలను అప్రమత్తం చేసేలా విస్తృత ప్రచారం చేస్తారు. ఆకతాయిలు మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే తక్షణమే 100 నెంబర్‌కు, ఫేస్బుక్, ఈమెయిల్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మహిళలు ఉన్న చోట అవగాహన కాలేజీలు, ఇతర సంస్థలు, స్థలాలలో మహిళలు, అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో ఒకే దగ్గర ఉండే అవకాశం ఉంది. అలాంటి చోట అభ్యంతరకర చర్యలను ఎలా ఎదుర్కొవాలి? వాటిని ఎలా తిప్పికొట్టాలి? అనే అంశాలను, చట్టాల ద్వారా ఎలా రక్షణ పొందాలి అనే విషయాలను నెలలో ఒకరోజు అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు, మహిళలు, వృద్ధుల మీద హింస, అభ్యంతరకర ప్రవర్తన ఏ రూపంలో ఉన్నా చర్యలు తీసుకుంటున్నాం. – పద్మ, సీఐ, ఉమెన్ పోలీస్‌స్టేషన్, సిద్దిపేట సక్రమ మార్గంలో నడిచేలా.. అమ్మాయిలను చూసి అబ్బాయిలు, అబ్బాయిలను చూసి అమ్మాయిలు ఆకర్షితులు అవ్వడం యుక్త వయస్సులో సహజం. కానీ, దాని గురించి విడమరిచి చెప్పకపోతే అది తీవ్రరూపం దాల్చి విపరీత ధోరణికి దారితీస్తుంది. ఏది మంచి? ఏది చెడు? అనే విషయాలను వారికి తెలియజేయాలి. – ఉమాపతి, సైకాలజిస్ట్, ఉమెన్ పీఎస్, సిద్దిపేట అద్భుతంగా పని చేస్తున్నారు.. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీం బృం దాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఉదయం, సా యంత్రం ప్రధాన చౌరస్తా వద్ద ఉంటూ ఆకతాయిలను పట్టుకుని వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. – జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ -
డబ్బులిస్తేనే మృతదేహాన్నిస్తామన్న తల్లిదండ్రులు
సిద్దిపేటటౌన్: కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచిన సావిలి మీనా మృతదేహాన్ని ఎవరూ తీసుకువెళ్లాలనే విషయంలో ఆస్పత్రి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను గొంతు నులిమిన ఘటనలో గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శుక్రవారం ఉదయం మీనా మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన తర్వాత ఇరు కుటుంబాల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని తాము తీసుకువెళ్తామంటే తాము తీసుకువెళ్తామంటూ వాదనకు దిగారు. వీరిని సముదాయించేందుకు బంధువులు చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. మీనా తల్లిదండ్రులు హన్మంతరావుతో పెళ్లి అయిన నాటి నుంచి ఏ అవసరం ఉన్నా తామే చూసుకున్నామని, మధ్యలో డబ్బు కావాలంటే కూడా ఇచ్చామని, ఆ డబ్బు తిరిగి ఇస్తేనే మృతదేహాన్ని అత్తింటికి తీసుకువెళ్లనిస్తామని తేల్చిచెప్పారు. అయితే మధ్యవర్తులు నచ్చజెప్పడంతో హన్మంతరావు తరపువాళ్లు కొంత వెనక్కి తగ్గి కార్యక్రమాలు అయిన తర్వాత ఇరు వర్గాల వాళ్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని చెప్పడంతో వివాదం కొంత సద్దుమణిగింది. ఆ తర్వాత మరి కొంత సేపటికి తమ బిడ్డను చంపిన వారి ఇంటికి తీసుకువెళ్లనివ్వమని, తమ బిడ్డ చివరి కార్యక్రమాన్ని తామే నిర్వహిస్తామని చెప్పి మృతదేహాన్ని తల్లి గారి ఊరు అయిన గాడిచర్లపల్లికి తీసుకువెళ్లారు. మార్చురీలో నుంచి మీనా మృతదేహాన్ని తీసుకువస్తున్న క్రమంలో తల్లిదండ్రులు బోరున విలపించారు. దీంతో అక్కడి వాతావరణం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ధ్రువపత్రాలు లేకుంటే చర్యలే..!
గజ్వేల్ సిద్ధిపేట: గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 1న ‘సాక్షి’లో ‘గజ్వేల్...గజిబిజి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ గురువారం ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలను, రాంగ్ పార్కింగ్ పరిస్థితిని పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా, గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్ వద్ద అడ్డదిడ్డంగా పెట్టిన ద్విచక్ర వాహనదారులను, ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రాంగ్ పార్కింగ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్ వద్ద రోడ్డుపై పార్కింగ్ లేని ప్రాంతాల్లో వాహనాలను నిలపకూడదన్నారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పొల్యూషన్ పత్రాలు కలిగి ఉండాలని..వాహనానికి సంబంధించి ధ్రువపత్రాలు లేకుండా ఎవరైనా వాహనం నడిపితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటోలను రోడ్డుపై నిలపడం వల్ల ఇతర వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందన్నారు. ఆటోలను రోడ్డు కింద ఆపాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయవద్దని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రాంగ్ పార్కింగ్ చేసిన వారిపై 20కేసులు నమోదు చేసి రూ. 3750 జరిమానా విధించినట్లు తెలిపారు. గజ్వేల్ ట్రాఫిక్ ఎస్ఐ ఆనంద్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. -
మురుగు కాలువలు శుభ్రం చేసిన ఎంపీటీసీ సభ్యుడు
నంగునూరు(సిద్దిపేట) : గ్రామంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని చూసి చలించిన ఎంపీటీసీ సభ్యుడు శుక్రవారం మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటన నంగునూరులో చోటు చేసుకుంది. మండల కేంద్రం నంగునూరులోని పలు కాలనీల్లో మురికి కాలువలు అపరిశుభ్రంగా మారాయి. కొన్ని నెలలుగా శుభ్రం చేయకపోవడంతో చెత్త, చెదారం నిండిపోయి అపరిశుభ్రంగా మారడంతో దోమలు వ్యాప్తి చెందాయి. వాటిని శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్నా స్పందించలేదు. విసుగెత్తిన గ్రామస్తులు ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు సౌడిచర్ల జయపాల్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. స్పందించిన జయపాల్‌రెడ్డి శుక్రవారం గ్రామ యువకులతో కలిసి ఒకటవ వార్డులో మురికి కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఆరు నెలలుగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. శ్రమదానం చేసేందుకు యువకులు ముందుకురావడంతో వీధులను శుభ్రం చేశామని చెప్పారు. పదిరోజులపాటు శ్రమదానం చేసి అన్ని మురికి కాలువలను శుభ్రం చేస్తామన్నారు. ఎంపీటీసీ సభ్యుడు చూపిన చొరవతో కాలనీ పరిశుభ్రంగా మారిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఠాణా.. త‘లుక్’
సంగారెడ్డి క్రైం : నిత్యం సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో నిమగ్నమయ్యే పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మొదటగా అత్యాధునిక వాహనాలను ఏర్పాటు చేయగా నిత్యం పనిచేసే కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని ఆధునీకరించడంతో పాటు నూతన సాంకేతిక ఒరవడితో అన్ని హంగులతో కూడిన భవనాల నిర్మాణానికి హోంశాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కేవలం పోలీస్ స్టేషన్లే కాకుండా పోలీసు సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్లు, కొత్త జిల్లాలు ఏర్పడటంతో నూతన కార్యాలయ భవనాలు, పోలీస్స్టేషన్ల నిర్మాణాలను పెద్దఎత్తున చేపడుతుంది. ఈ విషయంపై పూర్తి కథనం. భవన నిర్మాణాలతో కొత్త కళ... నూతనంగా నిర్మించే పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్ కార్యాలయాల్లో అత్యాధునికమైన అన్ని హంగులతో భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం రిసెప్షన్ సెంటర్, సీసీ టీవీ ఫుటేజీలను చూడటానికి ఎల్ఈడీల ఏర్పాటుతో పాటు అధికారుల సమావేశాల సముదాయాలను సమకూర్చుతున్నారు. నూతన పోలీస్ భవనాన్ని చూడగానే ప్రజలను ఆకర్షించేలా నిర్మిస్తున్నారు. భవనం చుట్టు పక్కల పచ్చని మొక్కల పెంపకం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు. సిద్దిపేటలో మోడల్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోని సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను మోడల్ పోలీస్‌స్టేషన్‌గా ఏర్పాటు చేశారు. ని రంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ఆరోగ్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొర వ చూపుతోంది. రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా అన్ని హంగులతో నిర్మాణం చేపడుతున్నారు. సిబ్బందికి రెస్ట్ రూమ్‌తో పాటు యోగా చేయడానికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేస్తున్నారు. జిమ్, హెల్ప్ డెస్క్, అత్యాధునికంగా రిసెప్షనిస్ట్æతో పాటు ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పొన్నాల గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఆధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ మధ్యనే మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు.. తమ సమస్యలపై పోలీస్‌స్టేషన్ వచ్చే ప్రజలు ఏ అధికారిని కలవాలో కూడా తెలియదు. అలాం టి వారికి సహాయంగా రిసెప్షనిస్ట్లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సమస్యపై వచ్చి న బాధితులను మర్యాద పుర్వకంగా స్వాగతిం చి వారికి ఉన్న సమస్యను తెలుసుకొని సంబం«ధిత అధికారి వద్దకు తీసుకెళ్తారు. ఈ మధ్యకాలంలో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. నూతనంగా నిర్మించిన భవనాలు సంగారెడ్డి జిల్లాలో జోగిపేట పోలీస్‌స్టేషన్‌కు రూ.50 లక్షలు, జహీరాబాద్ పోలీస్‌స్టేషన్ రూ. 50 లక్షలు, సంగారెడ్డి ట్రాఫిక్‌పోలీస్ స్టేషన్ (ని ర్మాణ దశలో ఉంది) రూ.కోటి, నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్ (నిర్మాణదశలో ఉంది) రూ.కోటి సిద్దిపేట జిల్లాలో .. æ దుద్దెడ గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన కమిషనర్ కార్యాలయం రూ.15 కోట్లు æ కోహెడ నూతన పోలీస్‌స్టేషన్‌కు రూ.98 లక్షలు æ దుబ్బాక సర్కిల్ పోలీస్‌స్టేషన్ రూ.30లక్షలు æ గజ్వేల్ రూరల్ పోలీస్‌స్టేషన్ రూ.30 లక్షలు æ సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ రూ.50 లక్షలు æ అలాగే కొమురవెల్లి, మర్కూక్, అక్కన్నపేట, రాయపోల్ మండలాలలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నవి. ఘటన స్థలానికి త్వరగా చేరుకుంటున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునికమైన వాహనాలను ఇవ్వడంతో అనుకున్న సమయంలోనే ఘటనా స్థలానికి చేరుకుంటున్నాం. అదేవిధంగా నూతనంగా నిర్మించిన భవనాల్లో అత్యధునికంగా ఉండటంతో సిబ్బంది సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి మౌలిక సదుపాయాలు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం బెటర్ పోలీస్ విధానాన్ని అమలు చేయడానికి ప్రత్యేక చొరవ చూపుతుంది. - జోయల్ డేవిస్, సీపీ, సిద్దిపేట -
తెలంగాణ తల్లి విగ్రహానికి జాగ కరువు
సిద్ధిపేట : తెలంగాణ తల్లి విగ్రహానికి జాగ కరువైంది. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లోని ప్రహరీ పక్కన చెత్తలో విగ్రహం పడి ఉంది. కరీంనగర్ చౌరస్తాలో ఉన్న ఈ విగ్రహాన్ని కొన్ని కారణాలతో మార్కెట్ వద్దకు తీసుకొచ్చి.. ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అధికారులకు స్థలం కనిపించ లేదా..? అంటూ మార్కెట్‌కు వచ్చే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
శోకసంద్రంలో వల్లూర్
మనూరు(నారాయణఖేడ్): కర్ణాటకలోని గుల్బర్గా సమీపంలోని జావర్గి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగల్గిద్ద మండలం వల్లూర్‌కు చెందిన నలుగురు వ్యక్తుల మృతదేహాలు ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకున్నాయి. ప్రమాదంలో గ్రామానికి చెందిన మేత్రి లక్ష్మి(40), ఆమె మనువడు సాయి(02)తోపాటు గొల్లపద్మ(35), సునిత(06) మృతి చెందిన విషయం తెలిసిందే. పుట్టు వెంట్రుకలకోసం అని వెళ్లీ, ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు రోదనలు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించాయి. దశప్ప భార్య అయిన పద్మ దంపతులకు ముగ్గురు సంతనం ఉన్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇందులో దశప్ప భార్య పద్మ(35)చిన్న కూతరు అయిన సునిత(06) మరణించారు. -
తెలుగు పద్యాలను అలవోకగా చెప్తున్న చిన్నారి
-
ఉపాధ్యాయుడి అద్బుత ప్రతిభ
-
ఖాకీ జులుం
-
'అకారణంగా నన్ను కొట్టి కేసులు పెట్టారు'
-
సిద్దిపేటలో ఖాకీ జులుం..
-
సిద్దిపేటలో ఖాకీ జులుం..
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ఎస్ఐ సతీష్ జులుం ప్రదర్శించారు. ఓ భూవివాదం కేసులో మాట్లాడదామని వెళ్లిన ఇద్దరిపై ఎస్ఐ సతీష్ దాడి చేశారు. అకారణంగా వారిని చితకబాదారు. వికలాంగుడు అని కూడా చూడకుండా ఐలయ్య అనే వ్యక్తిపైనా అమానుషంగా దాడి చేశారు. వికలాంగుడు అన్న కనికరం కూడా చూపకుండా పోలీసులు ఆయనను వాహనం నుంచి కిందపడేసి కొట్టారు. అంతేకాకుండా ఆయనపైనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఎస్సై దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డు అయ్యాయి. సివిల్ వివాదంలో జోక్యం చేసుకొని తమను అకారణంగా పోలీసులు కొట్టడమే కాకుండా అక్రమ కేసులు నమోదు చేశారని బాధితులు వాపోతున్నారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. బాగోతం బయటపడటంతో ఎస్సై సతీష్ బాధితులపై ఎదురుదాడికి దిగారు. గ్రామస్తులే తమపై దౌర్జన్యం చేశారని, తమ విధులకు ఆంటకం కలిగించారని బుకాయించారు. వాహనంపై పోలీసు స్టేషన్లోకి రావడం వల్లే తాను వారిని కొట్టానని ఎస్సై సతీష్ చెప్పారు. వాహనంలో పోలీసు స్టేషన్‌కు ఎలా వస్తారంటూ ఆయన ప్రశ్నించారు. రెండు పార్టీలతో పంచాయతీ చేసిన మాట వాస్తవమేనని అన్నారు. దురుసుగా ప్రవర్తించడం వల్లే వారిని కొట్టినట్టు చెప్పారు. దురుసుగా ప్రవర్తించినా కొట్టకూడదా? అంటూ ఆయన ఎదురుప్రశ్నించారు. సిద్దిపేటలో రెచ్చిపోతున్న పోలీసులు సిద్దిపేట జిల్లాలో ఇటీవల ఎస్సైలు, సీఐలు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎస్సైలు, సీఐలు సివిల్ వివాదాల్లో తరచూ తలదూరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సివిల్ వివాదాల్లో ఇరుక్కొని జిల్లాలో ఇద్దరు ఎస్సైలు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఎస్సై సతీష్ బాగోతాన్ని 'సాక్షి' టీవీ వెలుగులోకి తేవడంతో పోలీసుశాఖలో కలవరం రేపుతోంది. -
తండ్రి మందలించాడని
కొండపాక(సిద్ధిపేట): ఆత్మహత్యలకు కారణాలు కనపడటం లేదు తండ్రి మందలించాడనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా కొండపాక తిప్పారం గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆంజనేయులు(35) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని కొందరికి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన ఆంజనేయులు తండ్రి అతన్ని మందలించడంతో.. మనస్తాపానికి గురై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిద్ధిపేటలో మెగా జాబ్ మేళా
సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని కొండ భూలక్ష్మి గార్డెన్లో మెగా జాబ్ మేళాను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డిలు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ఆత్మ విశ్వాసం, పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించొచ్చని నిరుద్యోగ అభ్యర్థులకు సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలన్నారు. ఈ జాబ్ మేళాలో 51 కంపెనీలు పాల్గొన్నాయి. యువతకు 4,391 ఉద్యోగాలు లభించాయి. -
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాదం
నూజివీడు(కృష్ణాజిల్లా): ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ చదువుకొంటున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ట్రిపుల్ ఐటీ హాస్టల్లో ఉంటున్న వీణ బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొంది. గురువారం ఆమె గది తలుపు తీయకపోవడంతో.. తోటి విద్యార్థినులు కిటికీ నుంచి చూసి కళాశాల యాజమాన్యానికి విషయం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తలరించారు. వీణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదుచేసుకొనిఽ దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ నీకు దండమే..
పిల్ల్లలు పెద్దోళ్లు అయ్యిండ్రు.. మెతుకుసీమ నుంచి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలుగా రూపాంతరం ఏరుబాటే కానీ ఎడబాటు కాదు సాక్షి ప్రతినిధి సిద్దిపేట: మెతుకుసీమ తల్లి గర్భాన జీవం పోసుకున్న పసిడి కూనలు ఎదిగాయి... జిల్లాలుగా అవతరించబోతున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలుగా ఏరుబడే ఘడియలు రానే వచ్చాయి. 60 ఏళ్లు సాకి సవరించిన పసి పిల్లలకు రెక్కలొచ్చిన వేళ మెతుకుసీమ తల్లి ఎవరి బాధ్యత వాళ్లకు, ఎవరి ఆస్తులు, అప్పులు వాళ్లకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. పెద్దన్న కేసీఆర్ అండతో ఎవరిళ్లలో వాళ్లు ఎదగడానికే ఈ ఏరుబాటు గాని ఎడబాటు కాదని హితవు చెప్తోంది. పోరుబిడ్డలారా మీకు.. ఉద్యమాల ఖిల్లా.. మెదక్ జిల్లా బిడ్డలారా మీ 60 ఏళ్లకల నేడు సాకారం కాబోతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చర్చి.. శత్రుదుర్భేద్యమైన ఖిల్లా.. చెంగుచెంగున దూకే లేడిపిల్లలు.. జింకల పరుగులతో.. కనువిందు చేసే పోచారం అభయారణ్యం.. నిజాం కా షికార్ ఘర్ మీకే బిడ్డా. మంజీర పరుగులు.. ఏడుపాయల వనదుర్గ దీవెనలు మీకే... పచ్చని పంటపొలాలు.. ఘనపురం జలాలు అన్నదాతలకు వరాలు. కమ్యూనిస్టుల కోట.. పచ్చని అడవుల మూట నర్సాపూర్ కూడా మీ వాటా కిందనే ఉన్నాయి. ‘పసిద్ధి చెందిన జైన క్షేత్రం, కోలాచల మల్లినాథ సూరిని గన్న కొల్చారం మీ పరిధిలోకే వస్తుంది. అన్యాయం జరిగిన చోట గళమెత్తే యుద్ధనౌక గద్దరన్న మీ తోడు ఉంటడు. రాణి రుద్రమ అంశ నా ఆడబిడ్డ పద్మమ్మ మీకు శ్రీరామ రక్ష. ఆపదొచ్చిన...ఆనందమొచ్చినా అక్క ఇంటి గడప తొక్కురి. అక్కున చేర్చుకునే మనుసు నా బిడ్డకే ఉంది. పల్లెలు పచ్చగా ఎదగాలి.. బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలి. సిద్దిపేట.. మొండిధైర్యం.. దండిగుణం ఉన్న పెద్దోడే మీ దిక్కు. గజవెల్లి బంగారు భూములు, దుబ్బాక పాల నురగలు మీ వాటా కిందనే ఉంటయి. కొమరెల్లి మల్లన్న మొక్కులు... మల్లన్న సాగర్ జలాల హక్కులు, కొండ పోచమ్మ కొలుపులు మీకే. 50 టీఎంసీల మల్లన్న సాగర్ జల ప్రాజెక్టు, ఏడు టీఎంసీల కొండపోచమ్మ ప్రాజెక్టులు మీకిందనే ఉన్నయి. నా ముద్దుబిడ్డ కేసీఆర్.. జపం చేసి పట్టుకొస్తున్న గోదారమ్మ నీళ్లను పంచుకోండ్రి. మీ అన్న సంగారెడ్డి జిల్లాకు, చెల్లి మెదకు జిల్లాకు సమానంగా పంచు. ఒక్కసారి నీళ్లు ఇడిస్తే సింగూరు, ఘనపురం, మంజీరాలు నిండి ముగ్గురి దూపదీరుతుంది. పచ్చని పైర్లు, పాడి పంటలు, సిరిసంపదలతో పల్లెలు తులతూగుతాయి. గీ కాయిష్ మీదనే నా బిడ్డ హరీశ్ అయినోనితోని, కానోనితోని పడరాని మాటలు పడుతుండు. వచ్చే ఏడాది కాకుంటే.. పై యొచ్చే యేడు మల్లన్న సాగర్ నిలబడతది. నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున మీ మూడు జిల్లాలో 10 లక్షల ఎకరాలను తడుపుతది. గీ నీళ్లతోనే చెరువులు, మడుగులు, అన్నీ నిండిపోవాలే. మన తెనుగోళ్లు చేపల వేటలో సాగిపోవాలి. మనం ఒక్కలమే బతుకుడు కాదు, పైన ఉన్న కరీంనగర్‌కు, పక్కనున్న యాదాద్రికి, అటువైపు కామారెడ్డికి అందరికి నీళ్లు పంచాలి. నలుగురిని బతికించుకుంటూ మీరు బతుకురి బిడ్డా. మీ బలం, బలగం నా కొడుకు హరిశే... కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అన్న ఇంటి గడప తొక్కుడు మీకు తెలిసిందే. అన్నిటికి అన్నమీదే భారం వేసి నిలబడురి. సంగారెడ్డి.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, పటాన్చెరు పారిశ్రామిక వాడ, బీహెచ్ఈఎల్, జహీరాబాద్ నిమ్జ్, అంరబిందో కంపెనీలు అన్ని మీ వైపుకే ఉన్నాయి. వ్యవసాయంలో ఏర్పడ్డ ప్రచ్ఛన్న నిరుద్యోగం పరిశ్రమలతో పోవాలి. ప్రతి యువకునికి పని దొరకాలి. కరువు కాలంలో కమ్మని నీళ్లతో ఎండిన గొంతులు తడిపే సింగూరు ప్రాజెక్టు ఇక మీదే. ఇన్నేళ్లు హైదరాబాద్‌కు మళ్లిన ఆ జలాలు ఇకపై మీ భూములను తడుపుతయి. కృష్ణా బేసిన్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు అందుతున్నాయి. కాబట్టి, ఇక మన నీళ్లు మన పొలాల్లనే పారాలని పెద్దోడు కేసీఆర్ పంతం పట్టిండు. హరీశ్ కూడా మీ వెనుకనే ఉండే... ఇక ఢోకా ఉండదు. సింగూరు నీళ్లొచ్చి అందోలు పెద్ద చెరువు మత్తడి దునికే.. చుట్టూ 10 మండలాలకు నీళ్లు పారుతయ్. అల్లం, పసుపు పండే ఎర్ర భూములు, ఝరాసంగం శివన్న చూపులు మీ వైపే. నా పాణం అంతా నారాయణఖేడ్ మీదనే ఉంది. ఎటు చూసిన వెనుక బడిన ఆ ప్రాంతం అభివృద్ధికి తలో చేయి కలపాలే. వద్దు వద్దూ అన్నా.. నా నారాయణఖేడ్ బిడ్డలంతా సంగారెడ్డిలోనే కలుస్తమని ఇటు వైపు ఇచ్చిళ్లు. ఇల్లు తొక్కి అచ్చిన నా అమాయకపు బిడ్డలను ఆగం చేయొద్దు. అందరికి శనార్థులు. ఆగంగాకురి బిడ్డా... హరిశన్న అండజూసుకొని అభివృద్ధి వైపు అడుగులు వేయిరి బిడ్డా..... ఇట్లు, మీ తల్లి మెతుకుసీమ -
సిద్దిపేట డీఎస్పీగా నర్సింహారెడ్డి
సిద్దిపేట రూరల్: స్థానిక డీఎస్పీగా నర్సింహారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. సిద్దిపేట ఇన్చార్జి డీఎస్పీగా ఉన్న షేక్‌లాల్ అహ్మద్ గతంలో ఉన్న బాధ్యలు నిర్వర్తించనున్నట్లు తెలిసింది. నర్సింహారెడ్డి హైదరాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శనివారం సిద్దిపేట డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సిద్దిపేట రూరల్ సీఐ సైదులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఎస్పీ, సీఐతో కలిసి మొక్కలు నాటారు. -
బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరణ
సిద్దిపేట జోన్: బుధవారం మంత్రి హరీశ్‌రావు స్వగృహంలో బుధవారం జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పాటల సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ శ్రీధర్‌రావు మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత తెలంగాణ జాగృతికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి వ్యక్తిగత సహాయకులు రాంచందర్‌రావు, ఎర్రవల్లి సర్పంచ్ బాల్‌రాజు, గుర్రాలగొంది సర్పంచ్ ఆంజనేయులు జాగృతి నాయకులు సూరి, వవన్ తదితరులు పాల్గొన్నారు. -
గల్ఫ్ బాధితులకు అండగా ఉంటాం
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడం పట్ల టీఆర్ఎస్ గల్ఫ్ ఓవర్సిస్ ప్రతినిధి ఆరిఫ్ సుల్తాన్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ , ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. సుధీర్ కమిషన్ సర్వే నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. గల్ఫ్‌లోని బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రక్షణగా నిలుస్తుందని సౌదీ నిబంధనల మేరకు కొందరు సరస్వం కోల్పోయి తిరిగి స్వదేశం వస్తున్నారని వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించడంతో పాటు పునరావస చర్యలను చేపడుతుందన్నారు. గల్ఫ్‌లో చిక్కుకోని స్వదేశం రావడానికి ఇబ్బందులు పడే వారి బంధువులు సహాయం కోసం సెల్ నం. 9849936993 , 7995905196 లో సంప్రదించాలన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో గల్ఫ్‌లోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలోని భాదితులకు పూర్తి రక్షణతో స్వగ్రామాలకు తరలించేందుకు కృషి చేస్తామన్నారు. -
విద్యాసంస్థల్లో సంబరాలు
వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సతీమణి సిద్దిపేట జోన్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు సిద్దిపేటలో ప్రారంభమయ్యాయి. అమావాస్యతో మొదలై సద్దుల బతుకమ్మతో వేడుకలను ముగించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. శ్రీవాణి విద్యాలయంలో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. వాటికి ఒక్కదగ్గరికి తెచ్చి బతుకమ్మ ఆడారు. కోలాటం, గౌరమ్మ కార్యక్రమాలు నిర్వహించారు. చక్కటి ప్రదర్శన నిర్వహించిన వారికి మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృపాకర్, డైరెక్టర్లు సత్యం, రవీందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్ పాల్గొన్నారు. పట్టణంలోని కేరళ మోడల్ స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీసాయి విద్యాలయంలో బతుకమ్మ వేడుకలను కౌన్సిలర్ మల్యాల ప్రశాంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సత్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెరిడియన్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో విద్యాసంస్థ ప్రతినిధులు దేవేందర్‌రెడ్డి, రాజా వెంకట్రాంరెడ్డి, సిబ్బంది ప్రదీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మండలం కోసం రగడ
డిమాండ్ సాధనలో గ్రామస్తుల బైక్‌ర్యాలీ సీఎంను కలిసేందుకు ప్రయత్నం నారాయణరావుపేటలోనే అడ్డుకున్న పోలీసులు సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణరావుపేటలో చేపట్టిన సామూహిక రిలే దీక్షలు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రజలంతా ఏకమై బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బుధవారం సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లి నారాయణరావుపేటను మండలం చేయాలని డిమాండ్ చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తప్పించుకొని బైక్‌లపై ఎర్రవల్లికి బయలుదేరారు. గ్రామంలోనే పలువురిని రూరల్ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకోవడంతో మహిళలు నిరసన తెలిపారు. దీంతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు నారాయణరావుపేటను మండలంగా ప్రకటించాలని నినాదాలు చేశారు. అనంతరం పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ నారాయణరావుపేట మండలం కోసం 33 రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకోకపోవడం బాధాకరమన్నారు. గ్రామస్తులందరం సీఎం కేసీఆర్ కలిసి వినతి పత్రాన్ని అందించేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని మండలం చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను అమలు చేయాలని ప్రజలు కోరితే పట్టించుకోకుండా ఉండడం దారుణమన్నారు. అంతకు ముందు గ్రామం నుంచి సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లిన పలువురిని జగదేవ్‌పూర్ మండలం గణేష్‌పల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు మునిగెల కిష్టయ్య, మాజీ సర్పంచ్ రంగాగౌడ్, మండల పోరాట సమితి నాయకులు రమేష్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, భాస్కర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
సిద్దిపేట రూరల్: సిద్దిపేట, దుబ్బాక ఆర్టీసీ డిపోల పరిధిలో ప్రజల సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డీపో మేనేజర్ సురేశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్: 99592 26271 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. -
27న సిద్దిపేటకు కేంద్ర బృందం రాక
సిద్దిపేట జోన్: స్వచ్ఛ భారత్- స్వచ్ఛ తెలంగాణ కింద బహిరంగ మలవిసర్జన రహిత మున్సిపాల్టీగా గుర్తింపు పొందిన స్వచ్ఛ సిద్దిపేట పనితీరును పరిశీలించేందుకు ఈ నెల27న కేంద్ర బృందం ప్రతినిధులు సిద్దిపేట పట్టణానికి రానున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమణాచారి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచనల మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం దేశంలోని 40 స్వచ్ఛ పట్టణాలను సందర్శించనున్నట్లు అందులో భాగంగానే ఈ నెల 27న సిద్దిపేటకు కేంద్ర బృందం రానుందన్నారు. ఉదయం 10 గంటలకు స్థానిక శివమ్స్ గార్డెన్లో బృందం సభ్యుల సమక్షంలో అభినందన సభ నిర్వహిస్తామన్నారు. -
సిద్దిపేటలోనే నంగునూరు మండలం
స్పష్టం చేసిన మంత్రి హరీశ్‌రావు నంగునూరు: నంగునూరు మండలం సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగుతుంది.. ఎవరి మాటలు నమ్మవద్దు.. అంటూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మండల పర్యటనలో భాగంగా శనివారం ఆయన నంగునూరులోని మైసమ్మచెరువును సందర్శంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ నంగునూరు మండలం సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగుతుందన్నారు. కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టస్తున్నారన్నారు. నంగునూరు మండలం సిద్దిపేట డివిజన్‌లోనే ఉంటుందని మంత్రి ప్రకటించడం పట్ల మండల నాయకులతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
జల్సాలకు పోయి.. కటకటాల పాలై...
మల్యాలలో గొలుసుదొంగల ముఠా అరెస్టు ముగ్గురి రిమాండ్.. నాలుగున్నర తులాల గొలుసులు స్వాధీనం సిద్దిపేట జోన్: జల్సాలకు అలవాటుపడ్డ కొందరు.. దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. ఈ ముఠాలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి నాలుగున్నర తులాల గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జి డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్ వెల్లడించిన వివరాలు ఇలా... సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి శివారులోని టెక్స్టైల్ పార్కు (ఇందిరా కాలనీ)కు చెందిన వేముల శాంతారాం (25) మామిడాల గణేశ్(23), కొంచెం అశోక్ (22)తోపాటు కస్తూరి ప్రశాంత్ (17)లు ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలు చేసేందుకు డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 7న బెజ్జంకి మండలం దాచారం చౌరస్తాలో ఓ మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. ఆగస్టు 30న సిరిసిల్ల మండలం జిల్లెల్ల శివారులో మరో మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారాన్ని ఈ మూఠా దొంగిలించింది. మరోవైపు చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది శివారులో జూన్ 22న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తస్కరించారు. ఈనెల 18న జక్కాపూర్ శివారులో ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి గొలుసు దొంగిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం చిన్నకోడూరు ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీస్‌లు మల్యాల చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై శాంతారాం, గణేశ్, అశోక్, ప్రశాంత్‌లు పోలీసులకు అనుమానాస్పదంగా కన్పిపించారు. వారిని అదుపులోకి తీసుకోని విచారించగా గొలుసు దొంగతనాలకు పాల్పడిన వివరాలను వెల్లడించారు. వారి వద్ద నుంచి నాలుగున్నర తులాల బంగారం, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని శాంతారాం, గణేశ్, అశోక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే సంఘటనలో మైనర్ బాలుడు ప్రశాంత్‌ను సంగారెడ్డిలోని జువైనల్ హోంకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ సైదులు, ఎస్ఐ అశోక్ పాల్గొన్నారు. -
ఏం చేద్దాం?
సిద్దిపేటకు ఇంకా దొరకని పెద్దాఫీసు ఎల్లంకి కళాశాలకు వాస్తు దోషాలు ఇందూరు కాలేజీ ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరణ ఎంపీడీఓ, అంబేద్కర్ భవన్, ఆర్డీఓ ప్రాంగణంలోనే కలెక్టరేట్ సిద్దిపేట జిల్లాలోకి మరో మండలం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: శుభ ఘడియలు దగ్గరపడుతున్నా.. సిద్దిపేటకు పెద్దాఫీసు ఇంకా దొరకలేదు. జిల్లా మంత్రి, కలెక్టర్, అధికారులు కలిసి కలెక్టరేట్ భవనం కోసం పట్టణాన్ని జల్లెడ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉన్న భవంతికి వాస్తు కుదరడం లేదు.. ఒకవేళ వాస్తు కుదిరితే బిల్డింగులు ఇచ్చేందుకు యాజమాన్యాలు అంగీకరించడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలపట్టుకున్నారు. 15 రోజులుగా కలెక్టరేట్ భవనంపై దృష్టి సారించిన అధికారులు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథి గృహం, ఆర్అండ్బీ ఈఈ కార్యాలయంతో పాటు డిప్యూటీ కార్యాలయాలను కలుపుతూ సమీపంలోని సిటిజన్స్ క్లబ్ ప్రైవేట్ భవనంతో పట్టణ నడిబోడ్డున కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థలంలో వాస్తు దోషాలు లేవని, భవన నిర్మాణాల్లో ఏమైనా దోషాలు ఉంటే పరిష్కరించుకోవచ్చని అధికారులు భావించారు. అయితే, సిటిజన్స్ క్లబ్ భవనం ఇచ్చేందుకు కార్యవర్గం నిరాకరించింది. ‘ఎల్లంకి’ డిమాండ్ రూ.6 లక్షలు పట్టణ శివారులోని ఎల్లంకి ఇంజినీరింగ్ కాలేజీని అధికారులు ఎంపిక చేశారు. ఈ భవనం ప్రభుత్వ నిబంధనల మేరకు 40 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం, భవనాలతో కూడా ఉంది. ప్రస్తుతం నిరూపయోగంగా ఉన్న ఈ విశాల భవనాన్ని కలెక్టరేట్‌గా మార్చడం వల్ల ట్రాఫిక్ సమస్యను అధిగమించడంతో పాటు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌గా అన్ని కార్యాలయాలు ఒకే భవనంలో ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం మొగ్గుచూపింది. కాగా, కళాశాల యాజన్యంతో అధికారులు సంప్రదింపులు జరపగా.. వారు నెలకు రూ.6 లక్షలు అద్దె డిమాండ్ చేశారు. అధికారులు సైతం కొంత సాగుకూలంగానే స్పందించారు. అయితే, ఎల్లంకి కాలేజీని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సలహాదారుడు సుద్దాల సుధాకర్ తేజ.. భవనంలో వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పారు. ఫలితంగా పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని హెచ్చరించడంతో అధికారులు వెనుకడుగు వేశారు. ‘ఇందూరు’కు న్యాక్ ఇబ్బందులు కలెక్టర్ మరోసారి పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు శివారులోని ఎంపీడీఓ ప్రాంగణం, అంబేద్కర్ భవన్, ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ , పట్టణ శివారులోని ఇందూరు కళాశాలను పరిశీలించారు. వీటిలో ఇందూరు కాలేజీ కలెక్టరేకు అనుకూలంగా ఉంది. యాజమాన్యాన్ని సంప్రదించగా.. కాలేజీకి ఈ ఏడాది న్యాక్ గుర్తింపు లభించే అవకాశం ఉందని చెప్పారు. ఈనేపథ్యంలో అధికారులు మళ్లీ మొదటికే వచ్చారు. ఎంపీడీఓ ప్రాంగణం, అంబేద్కర్ భవన్, ఆర్డీఓ ప్రాంగణంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే సమీపంలోని ప్రైవేటు భవనాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. సిద్దిపేటలోకి జెజ్జంకి మండలం 19 మండలాలతో ముసాయిదా విడుదల చేసిన సిద్దిపేట జిల్లాలోకి తాజాగా మరో మండలం కూడా కలుస్తున్నట్టు సమాచారం. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలాన్ని కూడా సిద్దిపేట జిల్లాలో కలిపేందుకు అధికారులు ప్రాతిపదనలు సిద్ధం చేశారు. సిద్దిపేట, చిన్నకోడూరు మండలాలకు ఆనుకొని ఉన్న దాదాపు 11 గ్రామాల ప్రజాప్రతినిధులు తమను సిద్దిపేట జిల్లాలోనే కలపాలని లేఖలు ఇచ్చారు. మరోవైపు ఇదే మండలంలోని కొన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు మాత్రం కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి అభిప్రాయాలను గౌరవిస్తూ బెజ్జంకి మండల కేంద్రంతో పాటు తోటపల్లి గ్రామం వరకు సిద్దిపేట జిల్లాలో, మిగిలిన గ్రామాలకు గన్నేరువరం మండల కేంద్రాన్ని చేసి కరీంనగర్ జిల్లాలో ఉంచడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా, గుండ్లపల్లిని మండల కేంద్రంగా చేయాలనే డిమాండ్‌కు అధికారులు ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు. -
సీఎంకు రుణపడి ఉంటాం
ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై లబ్ధిదారుల హర్షం కేసీఆర్, హరీశ్‌రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం సిద్దిపేట జోన్: ‘దశాబ్ద కాలం క్రితం అసైన్డ్ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాం.. పట్టాలు లేక ఇబ్బంది పడ్డాం.. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఉంటాయో, పోతాయో తెలియని పరిస్థితి.. మా లాంటి పేదల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు.. ఆయన చలవతో మేము సొంతింటి వాళ్లమయ్యాం.. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం’.. అని సిద్దిపేటకు చెందిన పలువురు పేర్కొన్నారు. పట్టణ శివారులోని 1,340 సర్వేనంబర్‌లో గల అసైన్డ్ భూముల్లో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా కాలంగా నివాసం ఉన్నా ఎలాంటి పత్రాలు లేవు. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందని భయాందోళన చెందారు. అయితే సీఎం కేసీఆర్ ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం పలువురి పాలిట వరంగా మారింది. సోమవారం మంత్రి హరీశ్‌రావు అసైన్డ్ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి పట్టాలు పంపిణీ చేశారు. దీంతో వారు మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు సంపత్‌రెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు శివారులోని చైతన్యపూరి తోపాటు పలు కాలనీల ప్రజల ఇళ్లను క్రమబద్ధీకరించడం సంతోషంగా ఉందన్నారు. హక్కుదారులుగా పత్రాలు తమ జీవితాల్లో ఆనందం నింపాయని, ఈ రోజు మాకు పండుగని పలువురు పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు, జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు చంద్రయ్య, కాంతారెడ్డి, బాబురావు, యాదగిరి, నర్సింహారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాగిరెడ్డి, అనిత, సుజాత, స్వరూప, శారద, అమృత, అంబవ్వ, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యమస్తు
కార్పొరేట్‌కు దీటుగా సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రులు అత్యాధునిక యంత్రాల ఏర్పాటు అందుబాటులో అత్యవసర సేవలు వైద్యుల పనితీరులో మార్పు వైద్య సేవలపై ప్రజల సంతృప్తి గవర్నర్‌తోపాటు యూనిసెఫ్ ప్రతినిధుల ప్రశంసలు సిద్దిపేట జోన్: నేను రాను బిడ్డో ఈ సర్కార్ దవాఖానకు.. ఇది ఒకప్పటి మాట. నేనొస్త బిడ్డో ఈ సర్కార్ దవాఖానకు ఇది ఇప్పటి మాట. సిద్దిపేటలోని ఆసుపత్రుల్లో గణనీయమైన మార్పు రావడంతో జనం మనసు కూడా మారింది. కార్పొరేట్‌కు దీటుగా ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దారు. అత్యాధునిక యంత్రాలు, వైద్యుల మెరుగైన పనితీరు, సిబ్బందిలో మార్పుతో ఇది సాధ్యపడింది. ఇక్కడి ఆసుపత్రుల ఖ్యాతి జాతీయ స్థాయికి చేరింది. మంత్రి హరీశ్‌రావు చొరవతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఈ ప్రాంత పేదలు అందుకుంటున్నారు. సిద్దిపేట ఏరియా ఆస్పత్రి, మాతాశిశు సంక్షేమ ఆసుపత్రి జిల్లాలోనే పెద్ద ఆస్పత్రులుగా పేరుగాంచాయి. మాతాశిశు సంక్షేమ ఆసుపత్రి 300 పడకలతో సేవలందిస్తోంది. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలతోపాటు సమీపంలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల సరిహద్దు గ్రామాల వారు ఇక్కడ వైద్య సేవలు అందుకుంటున్నారు. ఈ లెక్కన ఈ రెండు ఆస్పత్రుల్లో రికార్డుల ప్రకారం నిత్యం దాదాపు 500 ఓపీ కేసులు నమోదవుతున్నాయి. కంగారు యూనిట్, హైరిస్క్ కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచే కంగారు యూనిట్‌తోపాటు జిల్లాలో తొలి ప్రయోగంగా హైరిస్క్ కేంద్రాన్ని సిద్దిపేటలోనే ఏర్పాటు చేశారు. శిశు మరణాల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రం, కంగారు మెథడ్ యూనిట్‌తోపాటు గర్భిణులకు హైరిస్క్ కేంద్రంలో అత్యవసర వైద్య సేవలందుతున్నాయి. ఆధునిక యంత్రాలు ఇలా... ఏరియా ఆస్పత్రిలో ఇటీవలే కోటి రూపాయలతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా వెంటిలేటర్, ఈసీజీ, డిజిటల్ ఎక్స్‌రే, సెంట్రల్ ఆక్సిజన్‌తోపాటు అత్యాధునిక రక్త నిల్వల పరికరాలు, డెంగీ నిర్ధారణకు ప్లేట్లెట్ కౌంటింగ్ మిషన్ వంటివి ఏర్పాటయ్యాయి. ఐసీయూ యూనిట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పాము, తేలు కాటు బాధితులకు, పురుగుల మందు తాగిన వారికి, రోడ్డు ప్రమాదంలో పరిస్థితి విషమంగా ఉన్నవారికి రిఫరెన్స్ లేకుండానే సేవలందిస్తున్నారు. ఫలితంగా అత్యవసర వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ సంస్థలు లేక హైదరాబాద్, కరీంనగర్ వంటి పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బాధితులు, రోగులు ఇక్కడే వైద్య సేవలందుకుంటున్నారు. మూడు జిల్లాల వాసులకు సేవలు మూడు జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలకు నిత్యం వైద్యసేవలను అందించే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు కార్పొరేట్ స్థాయి వసతులను కల్పించడంలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఏరియా ఆస్పత్రి, మాతాశిశు సంక్షేమ కేంద్రాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలోఏర్పాటుచేసిన ఐసీయూ యూనిట్, ప్లేట్లెట్ సపరేటర్, సీటీ స్కాన్, ఎంసీహెచ్‌లో ఏర్పాటుచేసిన కంగారు మెథడ్ యూనిట్, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, హైరిస్క్ సెంటర్లు పేదలకు సముచిత సేవలందిస్తున్నాయి. పలువురి మన్ననలు సిద్దిపేట ఎంసీహెచ్‌ను ఇటీవల గవర్నర్ నరసింహన్ సందర్శించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన ప్రతినిధులు, యూనిసెఫ్ సభ్యులు పలు దఫాలుగా సిద్దిపేట ఆస్పత్రిలో వైద్యసేవలు, సదుపాయాలను కొనియాడారు. అయితే సిబ్బంది మరింత మెరుగ్గా సేవలందించాలని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పారదర్శకతకు పెద్దపీట జవాబుదారితనంతో పాటు సేవల్లో పారదర్శకత, ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సిద్దిపేట ఆస్పత్రుల్లో ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది సేవలపై అభ్యంతరాలు, ఫిర్యాదులు తమ పేరు లేకుండానే బాధితులు ఆ బాక్స్‌లో వేయవచ్చు. సిద్దిపేట ఆర్డీఓ పర్యవేక్షణలో 15 రోజులకోసారి ఈ బాక్సులను తెరుస్తారు. వచ్చిన ఫిర్యాదులను మంత్రి హరీశ్‌రావుకు అందజేస్తారు. మరోవైపు ఎంసీహెచ్‌లోని కంగారు మెథడ్, నవజాత శిశుసంరక్షణ, హైరిస్క్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి వాటిని మంత్రి హరీశ్‌రావు తన సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకున్నారు. తద్వారా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక ప్రతినెలా ఆకస్మిక తనిఖీల ద్వారా ఆస్పత్రుల్లో అవినీతి, సిబ్బంది నిర్లక్ష్యం, మౌలిక వసతులపై మంత్రి నేరుగా రోగులతో మాట్లాడుతున్నారు. -
కోమటిచెరువు పర్యాటక కళ
బోటింగ్‌తో సందడి చేసిన సందర్శకులు సిద్దిపేట జోన్: పట్టణ శివారులోని కోమటి చెరువును సందర్శించేందుకు ఆదివారం పర్యటకులు పోటెత్తారు. ప్రతి ఆదివారం సిద్దిపేటతో పాటు పట్టణ సమీప గ్రామాల ఉద్యోగులు, ప్రజలు కాలక్షేపం కోసం కోమటి చెరువును సందర్శిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలతో కోమటి చెరువులో నీటిమట్టం పెరగడం, కట్ట ఆధునీకరణలో భాగంగా చెరువు శివారులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చిల్ర్డన్స్ పార్కు , షికారు కోసం బోటింగ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం పెద్ద ఎత్తున ప్రజలు చెరువుకు తరలివచ్చి బోటింగ్ చేసేందుకు ఉత్సాహం చూపించారు. -
గురజాడ పురస్కారానికి లక్ష్మయ్య
సిద్దిపేట రూరల్: గురజాడ ఫౌండేషన్ (అమెరికా) ఆధ్వర్యంలో రాష్ట్ట్రస్థాయి తెలుగు పురస్కారం-2016కు చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు వరుకోలు లక్ష్మయ్య అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు సాహిత్యంలో రచయితగా, పద్యాలు రాయడంలో కవిగా తెలుగు భాషకు విషేశ కృషి గుర్తింపు లభించింది. 2016 జూన్ తెలం‘గానం’లో పద్యాలు వ్రాసి వినిపించినందుకు మామిడి హరికృష్ణ చేతుల మీదుగా సన్మానంతో పాటు శ్రీకాళహస్తిలో జాతీయ తెలుగు సమ్మెళనంలో ఆగస్టులో పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ చేతుల మీదుగా సన్మానం పొందారు. కాగా, గురజాడ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు సంటి అనిల్‌కుమార్ చేతుల మీదుగా ఈ నెల 18న హైదారాబాద్ ప్రెస్‌క్లబ్‌లో అందుకోనున్నారు. -
ఆకుపచ్చ జిల్లాగా సిద్దిపేట
సమైక్య రాష్ర్టంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం భవిష్యత్తులో గ్రీన్ డిస్ట్రిగ్గా మార్పు రాష్ర్ట మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేటను.. ఆకుపచ్చ జిల్లాగా మార్చేందుకు సర్వత్రా కృషి చేస్తున్నట్టు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా జిల్లాను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సిద్దిపేట జిల్లాలో సహజ వనరులు-అభివృద్ధి అవకాశాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా గురించి బాధాకరమైన అంశాలు ఉన్నాయన్నారు. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, ఇల్లంతకుంట తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పొట్ట చేతపట్టుకొని బతుకు కోసం వలసలు వెళ్లిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ర్ట ముఖచిత్రంతో పోలి ఉండే సిద్దిపేట జిల్లా ప్రస్తుత కరువు పరిస్థితి నుంచి భవిష్యత్తులో సస్యశ్యామల జిల్లాగా మార్పు చెందడం ఖాయమన్నారు. 60 సంవత్సరాల ఉమ్మడి రాష్ర్టంలో సిద్దిపేట ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. 1969లో తొలిదశ ఉద్యమంలో అనంతుల మదన్మోహన్ అందించిన సిద్దిపేట గడ్డ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ లాంటి చరిత్రకారుడిని అందించిందన్నారు. వామపక్ష భావాలకు సిద్దిపేట కేంద్రంగా నిలిచిన చరిత్ర కూడా ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు , చిన్న జిల్లాల ఏర్పాటు ఎంతో ముఖ్యమని హరీశ్‌రావు అన్నారు. దేశంలో 683 జిల్లాల్లో 121 కోట్ల జనసంద్రత.. సగటున ప్రతి జిల్లాకు 18 లక్షల జనసాంద్రత ఉందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ర్టంలోని 10 జిల్లాల్లో 3.60 కోట్ల జనసాంద్రత ఉండగా సగటున జిల్లాకు 36 లక్షల జనాభా ఉందన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే 27 జిల్లాల్లో సగటున 13 లక్షల 30 వేల జనాభా జనసాంద్రత ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మాత్రం 11 లక్షల జనాభా ఉందన్నారు. ఆలయాల గని సిద్దిపేట సిద్దిపేట జిల్లాలో ఆలయాలు మెండుగా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అంతగిరి పోచమ్మ, సిద్దిపేట కోటిలింగాలు, వర్గల్, అనంతసాగర్, సరస్వతి ఆలయాలు.. కొమురవెల్లి మల్లన్న, కొండ పోచమ్మలాంటి ప్రసిద్ధ ఆలయాలకు నూతన సిద్దిపేట జిల్లా కేంద్రంగా మారిందన్నారు. దేశంలోనే అతి ఎక్కువ సాగునీటి వనరులున్న జిల్లాగా సిద్దిపేట భవిష్యత్తులో మారనుందరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట మిడ్ మానేరు ద్వారా 25 టీఎంసీలు, పోచమ్మ సాగర్ 3.5 టీఎంసీలు, రంగనాయక సాగర్ 3.5 టీఎంసీలు, 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 7.5 టీఎంసీలు, గౌరిపల్లి రిజర్వాయర్ 8.5 టీఎంసీలు, గంగిరెడ్డిపల్లి ద్వారా 2 టీఎంసీల సామర్థ్యంతో కూడిన ప్రాజెక్ట్‌ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చే దిశగా సిద్దిపేట ప్రాజెక్ట్‌లు చరిత్రలో నిలుస్తాయన్నారు. రిజర్వాయర్ల ద్వారా 10 శాతం నీటిని పరిశ్రమలకు అందించేందుకు సీఎం కేసీఆర్ ముందస్తుగానే నిర్ణయం తీసుకున్నారన్నారు. భవిష్యత్తులో సిద్దిపేట పట్టణం 2 లక్షల జనాభాకు చేరుకుంటుందన్నారు. జిల్లాకు మూడో జాతీయ రహదారి ఇప్పటికే రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా మారనున్న సిద్దిపేటకు మరో సువర్ణ అవకాశం లభించనుందని మంత్రి తెలిపారు. మూడో జాతీయ రహదారిగా సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్ మార్గానికి కేంద్రం త్వరలో పచ్చజెండా ఊపనుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వీడిపోయినా ఆత్మీయులుగా ఉందాం మెదక్ జిల్లా విడిపోయినప్పటికీ ప్రజలు, నాయకులు, అధికారులు ఆత్మీయులుగా కలిసి ఉండాలని రాష్ర్ట శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా మంత్రిగా హరీశ్‌రావు నేటి వరకు అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుందన్నారు. కేసీఆర్, హరీశ్‌రావుల సహకారంతో మెదక్ జిల్లా ఏర్పడిందని.. ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతులు చెప్పారు. అంతకు ముందు ప్రముఖ పరిశోధకుడు గోపాల సుదర్శనం.. జిల్లాలోని సహజ వనరులు, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావును, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, టీఆర్ఎస్ రాష్ర్ట కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, గ్యాదరి రవి, సాకి ఆనంద్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, లెక్చరర్లు హరినాథ శర్మ, రవికుమార్, దుర్గాప్రసాద్, మామిడాల శ్రీనివాస్, భవానీ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
జట్లీ బుక్ ఆఫ్ రికార్డులో మహేశ్‌కు స్థానం
సిద్దిపేట రూరల్: ప్రపంచ జట్లీ బుక్ ఆఫ్ రికారు్డ్స సిద్దిపేటకు చెందిన సామలేటి మహేశ్‌కు స్థానం లభించింది. వివిధ దేశాల చెందిన సుమారు 500 నాణేలను, వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయం, నాయకులు, చిహ్నలు సేకరించాడు. వాటిలో వెండి, రాగి, ఇత్తడి, సత్తు రకాల నాణేలు ఉన్నాయి. ఇందుకు గాను జట్లీ బుక్ ఆఫ్ రికార్డులో స్థానంలో లభించినట్లు మహేశ్ తెలిపారు. తనకు సహకరించిన స్నేహితులకు, బంధువులను మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. -
దేశానికి ఆదర్శం సిద్దిపేట
త్వరలో మున్సిపాలిటీకి స్కాచ్ అవార్డు కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా వైద్య సౌకర్యాలు విద్యా వ్యవస్థను మరింత పటిష్టపరుస్తాం రాష్ట్ర భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణం దేశానికే ఆదర్శంగా నిలవనుందని రాష్ర్ట భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు మంత్రి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పలు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధికార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. మెట్రోపాలిటిన్ నగరాలకు ఇచ్చే గుర్తింపునకు ప్రతీకైన స్కాచ్ అవార్డును త్వరలో సిద్దిపేట మున్సిపాలిటీ అందుకోబోతుందన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సిద్దిపేట పేరు మార్మోగిపోతుందన్నారు. కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా సిద్దిపేటలో వైద్య సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో రూ.30 కోట్లతో సిద్దిపేట, చిన్నకోడూరు మండలాల్లో ఎస్సీ గురుకుల పాఠశాలలు, సిద్దిపేట పట్టణంలో మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభిస్తామన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం 270 గురుకుల పాఠశాలలను మంజూరు చేసిందన్నారు. సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలన్నింటికి సొంత భవనాలు నిర్మిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో అన్ని పాఠశాలలకు డ్యూయల్ డెస్కులు ఏర్పాటు చేయడం జరిగిందని, అదే విధంగా జెడ్పీహెచ్‌ఎస్‌లకు గ్రంథాలయాలను ఏర్పాటు చేశామన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి పరుస్తున్నామన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ జన్మదిన వేడుకల రోజు, తమ కుటుంబీకులు మరణించిన రోజున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పట్టణంలో కుమ్మరి సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఆర్యవైశ్య సంఘంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి, శరభేశ్వరాలయం వద్ద మొక్కలు నాటారు. పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పారుపల్లి పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సిటిజన్స్ క్లబ్, ఎన్జీవోస్ భవన్ నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. పట్టణంలో రూ.7 కోట్లతో స్విమ్మింగ్ పూల్‌ను నిర్మిస్తున్నామని త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. అధునాతన వసతులతో కూడిన షటిల్, ఫుట్‌బాల్, ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంతకుముందు పలు వ్యాపార సంస్థలను ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన మంత్రిని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, తెలంగాణ రాష్ర్ట బ్రాహ్మణ పరిషత్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, చిప్ప ప్రభాకర్, ప్రశాంత్, బ్రహ్మం, గ్యాదరి రవి, టీఆర్ఎస్ నాయకులు శర్మ, మారెడ్డి, రవీందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, చిన్నా, సిటిజన్స్ క్లబ్ ప్రతినిధులు కాచం బాలకిషన్, పాండు, ఎన్జీవో భవన్ ప్రతినిధులు గ్యాదరి పరమేశ్వర్, నర్సారెడ్డి, బాలయ్య, ఆంజనేయులు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘వైద్య’వాణి
ఏడు పదుల వయస్సులోనూ అదే తపన నవజాత శిశువుల ఆరోగ్యానికి భరోసా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు కృషి దేశవ్యాప్తంగా కంగారు యూనిట్ల ఏర్పాటుపై నివేదిక డాక్టర్ శివవాణి సిద్దిపేట పర్యటన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేకం సిద్దిపేట జోన్: కంగారు మెథడ్ యూనిట్ (కేఎంసీ), నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ).. ఈ పదాలు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తున్నాయి. తక్కువ నెలల బరువుతో జన్మించిన పసికందుకు ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలను పరిష్కరించే అధునాతన సంప్రదాయ వైద్య ప్రక్రియ ఇది. తల్లి వెచ్చదనాన్ని పసికందుకు అందించే సరికొత్త వైద్యమిది. అలాంటి కంగారు మెథడ్ యూనిట్, ఎస్ఎన్సీయూ రూపకల్పనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 మంది వైద్యుల్లో డాక్టర్ శివవాణి ఒకరు. 76 ఏళ్ల వయసులోనూ వైద్యరంగంపై ఆమెకు మమకారం తగ్గలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వ కన్సల్టెంట్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలం సేవలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన శివవాణి వైద్యశాస్త్రం చదివి సుమారు 25 ఏళ్ల పాటు వైద్యరంగంలో భర్తతో పాటు సేవలు అందించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ) అభివృద్ధికి 25 ఏళ్ల పాటు కృషి చేశారు. ప్రభుత్వ వైద్యురాలిగా ఉన్న సమయంలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలలు నిండని, తక్కువ బరువుతో జన్మించే పసికందులకు అత్యవసర వైద్యం అందించే ఎస్ఎన్సీయూ, కంగారు యూనిట్లను ఏర్పాటు చేయాలని అప్పట్లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో సేవలు అమలు చేయవచ్చని పవర్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు వివరించారు. ఈమె సూచనల మేరకు భారత ప్రభుత్వం 1998లో తొలిసారిగా పశ్చిమబంగలో ఎస్ఎన్సీయూను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అనంతరం దేశవ్యాప్తంగా 762 ప్రాంతాల్లో ఆమె ప్రతిపాదన మేరకు ఎస్ఎన్సీయూ యూనిట్లను ఏర్పాటు చేయగా, తెలంగాణలో 28 చోట్ల సేవలు అందుతున్నాయి. మరోవైపు కంగారు మెథడ్ యూనిట్ (కేఎమ్సీయూ) ద్వారా తెలంగాణలో నల్లగొండ, సిద్దిపేటలో మాత్రమే యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో 12 పడకల కేఎంసీ యూనిట్‌గా సిద్దిపేట దేశంలోనే అతిపెద్ద యూనిట్‌గా పేరు సాధించింది. యూనిట్లలో మరిన్ని వసుతులు అందించేందుకు డాక్టర్ శివవాణి రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. సరికొత్త పరిశీలనకు శ్రీకారం ప్రధానంగా ప్రసవం అనంతరం తక్కువ బరువు, నెలలు తక్కువతో జన్మించిన పసికందుకు పుట్టకతో వచ్చే గ్రహణంమొర్రి గుండె, మెదడు, కంటి సంబంధ వ్యాధులకు స్థానికంగానే వైద్యసేవలను అందించే ఆలోచనతో ఆమె కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేశవ్యాప్తంగా యూనిట్లలో పరిశీలనకు శ్రీకారం చుట్టారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా డీఈసీ కేంద్రాలను స్థానికంగానే ఎస్ఎన్సీయూ యూనిట్లో ఏర్పాటు చేసుకునే అవకాశంపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. అదే విధంగా దేశంలోని కంగారు, నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో డిజిటల్ వెయిట్ మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల పసికందుల బరువును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుందనే నూతన ప్రతిపాదనను ఆమె త్వరలో కేంద్రానికి అందించనున్నట్లు సమాచారం. -
ఎస్సై, గ్రూప్-2 నమూనా పరీక్ష 27న
సిద్దిపేట రూరల్: పీఆర్ రెడ్డి పబ్లిషర్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక పవిత్ర జూనియర్ కళాశాలలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఎస్ఐ, గ్రూప్2 నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెంకటేష్‌చారి, నర్సింలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అసక్తి గల అభ్యర్ధులు శనివారం సాయంత్రంలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్ నం. 9550927467, 9676202069లో సంప్రదించాలని సూచించారు. కానిస్టేబుల్ నమూనా పరీక్ష పట్టణంలోని విజేత కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఉదయం 10.30లకు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కె. దాక్షాయిణి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాల కోసం సెల్ నం. 9989862806, 7661996167లో సంప్రదించాలన్నారు. -
పండగ చేస్కో..
జిల్లా కానున్న సిద్దిపేట 30 సంవత్సరాల స్వప్నానికి నేడు మోక్షం డ్రాప్ట్ నోటిఫికేషన్ తొలి ఘట్టం చారిత్రాత్మక సంబురంగా సన్నాహాలు జిల్లా పండగకు ప్రజలు సన్నద్ధం అన్ని వర్గాలు ముందుండాలని మంత్రి పిలుపు సిద్దిపేట జోన్: 30 ఏళ్ల జిల్లా కల సాకారం కానుండటంతో సిద్దిపేట వాసుల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే పట్టణ ప్రజలు కేరింతలు కొడుతున్నారు. ఈక్రమంలో నేడు(సోమవారం) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడుతుండటంతో పండగ చేసుకోనున్నారు. 30 ఏళ్లుగా డిమాండ్ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల సరిహద్దు గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉన్న సిద్దిపేట.. జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్ 30 ఏళ్లుగా ఉంది. ప్రతి ఎన్నికల్లో పార్టీలు జిల్లా కేంద్రంపై హామీలివ్వడం, మర్చిపోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే 1983లో అప్పటి ఎన్నికల ప్రచారానికి సిద్దిపేటకు వచ్చిన ఎన్టీఆర్‌కు అప్పటి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కేసీఆర్ సభాముఖంగా జిల్లా ఏర్పాటుపై విజ్ఞప్తి చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లో జిల్లా డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన ప్రక్రియను ముందుకు తేవడంతో సిద్దిపేట జిల్లాకు అంకురార్పణ జరిగింది. దీంతో సోమవారం ప్రభుత్వం అధికారికంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీకి సిద్ధమైంది. నెలవేరిన ప్రజల ఆకాంక్ష కరీంనగర్, మెదక్, వరంగల్, జిల్లాల సరిహద్దు గ్రామాలను కలుపుతూ రెండు డివిజన్లతో, కొత్త మండలాలతో సిద్దిపేట జిల్లా ప్రాతిపాదన జరిగింది. ప్రజల అభీష్టం, అంగీకారం మేరకు జిల్లా కేంద్రం ఏర్పాటు కానుంది. ఆ దిశగా సిద్దిపేట జిల్లాలో కరీంనగర్ జిల్లాకు చెందిన ముస్తాబాద్, ఇల్లంతకుంట, హుస్నాబాద్, కోహెడతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మద్దూర్, చెర్యాల, సిద్దిపేట డివిజన్ పరిధిలోని గజ్వేల్, దౌల్తాబాద్, సిద్దిపేట నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట, తొగుట, కొండపాక, ములుగు, వర్గల్, దుబ్బాక మండలాలను కలుపనున్నట్లు ప్రాథమిక రూపకలప్పనలో తేలింది. సోమవారం జారీ చేసే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనంతరం 30 రోజుల పాటు ఆయా ప్రాంతాల ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించానున్నారు. తదుపరి ప్రక్రియ అనంతరం దసరా రోజున నూతన జిల్లా ప్రకటన అధికారికంగా వెలువడనుంది. చారిత్రాత్మక ఘట్టం సిద్దిపేట జిల్లా కేసీఆర్ కల. ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో సిద్దిపేట జిల్లా ఏర్పాటు కావడం చారిత్రాత్మక ఘట్టం. జిల్లా పునర్విభజన జాబితాలో సిద్దిపేట పేరు ఉండటం శుభపరిణామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రావడంతోనే సిద్దిపేట జిల్లా సాధ్యమైందన్నారు. దీంతో జిల్లా యూనిట్‌గా పరిగణించి కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తుందన్నారు. కేంద్రీయ విద్యాలయం, స్పోర్ట్ స్కూల్, స్టేడియం తదితర వసతులు జిల్లా యూనిట్‌గానే మంజూరు అవుతాయని చెప్పారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సోమవారం వెలువనుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఈ నెల నేడు సిద్దిపేటలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి, సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పండగలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో 1.50 లక్షల జనాభా పై చిలుకు కలిగి ప్రాంతాన్ని మండల కేంద్రంగా, గ్రామాల్లో 35 వేల జనాభా కలిగిన ప్రాంతాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని క్యాబినెట్ తీర్మానం చేసిందని గుర్తుచేశారు. విజయదశమి తీపి జ్ఞాపకం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సిద్దిపేట ప్రజలకు ఈ దసరా మరో తీపి జ్ఞాపకాన్ని అందించనుందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దసరా రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ పదవి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. జిల్లా ఏర్పాటుతో సిద్దిపేటలో ఉపాధి కల్పన, పరిశ్రమలతో పాటు సకల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. మూడింటి ఘనత కేసీఆర్‌దే.. సిద్దిపేట ప్రజలకు దశాబ్దాలుగా మిగిలిన మూడు సుదీర్ఘ సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేటకు రైల్వేలైన్, గోదావరి జలాలు, జిల్లా కేంద్రం ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వ సారధ్యంలోనే సాధ్యమవుతుందన్నారు. నేడు సిద్దిపేటలో జిల్లా పండగ ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తున్న క్రమంలో సోమవారం సిద్దిపేటలో జిల్లా పండగను ప్రజలు ఘనంగా నిర్వహించనున్నారు. నేడు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీడీఓ చౌరస్తా వద్దనున్న బాబుజగ్జీవన్‌రాం విగ్రహం నుంచి భారీ బైక్‌ర్యాలీని పట్టణ ప్రజలు, పలు పార్టీల నాయకులు, అన్ని వర్గాల ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అనంతరం బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేయనున్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శర్మ, దేవునూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
పద్ధతి మార్చుకోండి
రోగులకు మెరుగైన వైద్యం అందించండి నిజాయితీగా పనిచేయండి.. లేదంటే చర్యలు తప్పవు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం ఆధునిక పరికరాలు నిరుపయోగంగా ఉండటంపై మండిపాటు సిద్దిపేట జోన్: మెరుగైన వైద్యం కోసం కోట్లు ఖర్చు పెట్టినా వైద్యుల్లో మార్పు రాకపోవడం బాధకరంగా ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను మంత్రి పరిశీలించారు. సెమిఆటో ఎనలైజర్ పరికరం నిరుపయోగంగా ఉండడం పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు వినియోగంలోకి తీసుకురావడం లేదని బదులివ్వాలని అక్కడే ఉన్న సూపరింటెండెంట్ శివరాంను ప్రశ్నించారు. డాక్టర్ శివరాం బదులిస్తూ ఆర్డీఓ సమస్య, నోట్‌ఫైల్ సమస్య అంటూ ఎదో చెప్పబోయాడు. వెంటనే మంత్రి అందుకోని ఆర్డీఓ పట్టణంలోనే ఉన్నప్పటికీ, రెండు లైన్ల నోట్‌ఫైల్‌ను తయారు చేయక మూడు నెలలుగా విలువైన పరికరాన్ని నిరుపయోగంగా ఉంచడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కష్టపడి అధునిక వసతులు కల్పిస్తే..మీరు చేసే నిర్వాకం వల్ల వినియోగంలోకి రాకపోవడం బాధాకరమన్నారు. ఐదు నెలల్లో 6 కోట్లతో ఆధునిక పరికరాలను సమకూర్చామన్నారు. మీలో మార్పు రాకపోతే ప్రజలకు వైద్యం అందడం కష్టమన్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిధులు, పరికరాలు, వైద్యులు, సిబ్బంది, వసతులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని పర్యవేక్షించే తీరిక లేకపోవడం సమంజసం కాదన్నారు. ఒక దశలో సూపరింటెండెంట్ వేతనం గూర్చి తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వ ఉద్యోగిగా, వైద్యునిగా తీసుకున్న జీతానికి సార్థకత చేయాలన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో శాఖాపరమైన చర్యలను తీసుకుంటానని హెచ్చరిస్తూ అక్కడే ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రాం అధికారి జగన్నాథ్రెడ్డిని ఆదేశించారు. 13 మంది ఉన్నప్పటికీ బయటికా...? సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, ఎంసీహెచ్ ఆసుపత్రుల్లో 13 మంది ల్యాబ్ టెక్నిషియన్లు ఉన్నప్పటికీ వైద్య పరీక్షల కోసం రోగులను బయటకు పంపడం ఆశ్చర్యకరంగా ఉందని మంత్రి అన్నారు. బ్లడ్‌బ్యాంక్ పనితీరుపై జిల్లా రెడ్‌క్రాస్ సోసైటీ సెక్రటరీ వనజారెడ్డి, జిల్లా డీపీఓ జగన్నాథరెడ్డి, బ్లడ్‌బ్యాంక్ ఇన్చార్జి రామ్మోహన్‌తో వివరాలు సేకరించారు. పలుసార్లు పరీక్ష కోసం బయటకు చిట్టీలు రాస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే ఏరియా ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో టెక్నిషియన్లుగా పనిచేస్తున్న వారిలో కొందరిని ఏరియా ఆసుపత్రికి, ఎంసీహెచ్‌కు సేవల కోసం కేటాయించాలని వైద్యాధికారులను అదేశించారు. ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం కోట్లు ఖర్చు చేస్తే వైద్యలు, సిబ్బందిలో మార్పురాకపోవడం బాధాకరమన్నారు. త్వరలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తానని వారే ఆసుపత్రుల్లో కూర్చుని సమస్యను పరిష్కరిస్తారన్నారు. ఆయన వెంట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు, హై రిస్కు ఇన్చార్జి కాశీనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
చిత్రం.. భళారే విచిత్రం
ఎన్నెన్నో వర్ణాలు.. ఎన్నెన్నో అనుభవాలు నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సిద్దిపేట: ఒక్క చిత్రం వెయ్యి మాటల పెట్టు.. ఎన్నెన్నో వర్ణాల కనికట్టు.. కోటి భావాలను తెలిపే చక్కని చిత్రం.. ఒక మాటకంటే ఓ దృశ్యం ఎంతో కాలం గుర్తుండిపోతుంది. కరిగే కాలంలో పరుగెత్తే జీవనయానాన్ని వెనుతిరిగి చూసుకోవడానికి మిగిలే తీపిగుర్తులు. చిత్రం ఓ మధుర జ్ఞాపకం. ఓ మంచి ఫొటో ఆసక్తిని కనబరుస్తుంది.. ఆహ్లాదాన్ని పంచుతుంది. మారుతున్న రోజులకు, కరుగుతున్న కాలాలకు అనుగుణంగా పాత స్మృతులను నెమరు వేసుకోవడానికి అలాంటి ఫొటోగ్రఫీకి నేడు ఒక ప్రత్యేక స్థానంలో ఉంది. ఆధునిక కాలంలో వీడియోలు, డిజిటల్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం చూస్తుంటే ఫొటోగ్రఫీకి సమాజంలో ఉన్న గుర్తింపు తెలుస్తోంది. ఫొటోలో శక్తిసామర్థ్యాలను తెలియజేస్తూ వాటికి ఒక గౌరవ ప్రదమైన రోజును ఏర్పాటు చేశారు. అదే ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రాఫీ డే. 1830 య ఫ్రెంచి కళాకారుడు రసాయిన శాస్త్రవేత్త లూయిస్ జాక్వెస్ మాండే ఫోటోగ్రాఫీ అంశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. మధురమైన జ్ఞాపకాలను పదిల పరుచుకోవడానికి ఆ ఫొటో ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను అద్భుతంగా తన కెమెరాలో సంబంధించారు సిద్దిపేట పట్టణానికి చెందిన దండె ప్రభుదాస్. ఈయన ఇటీవల ఓడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గొండ్రుల జీవన విధానాలపై ఫోటోలుగా చిత్రీకరించారు. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆయన తీసిన ఎన్నెన్నో.. -
ఇద్దరిపై ‘రంగు’ పడింది!
జడ్చర్ల బస్సు ప్రమాదంపై ప్రభుత్వం విచారణ ఇద్దరు అధికారులపై వేటు సిద్దిపేట రవాణా శాఖలో కలకలం సిద్దిపేట జోన్: ఐదేళ్లుగా యథేచ్ఛగా జరుగుతున్న ‘తప్పు’.. ఇద్దరి అధికారులపై వేటుపడేలా చేసింది. కృష్ణ పుష్కరాలకు వెళ్లిన బస్సు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల శివారులో మంగళవారం ప్రమాదానికి గురై 32 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కొనసాగిన విచారణలో అప్పటి సిద్దిపేట ఎంవీఐ(ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఎంవీఐ) సుభాష్ చంద్రారెడ్డితో పాటు సిద్దిపేట ప్రస్తుత ఏఎంవీఐ విక్రమ్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సుల్తానీయా ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట పట్టణానికి చెందిన ఏపీ 23 యూ 8899 నంబర్ బస్సు ఆర్టీసీలో కొంత కాలంగా అద్దెకు తిరుగుతోంది. ఈక్రమంలో 2011లో నిర్ణీత గడువు ముగియడంతో బస్సును స్టేజీ క్యారియర్ నుంచి కాంట్రాక్ట్ క్యారేజీగా మారుస్తూ సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో సిద్దిపేట ఎంవీఐగా పనిచేసిన సుభాష్ చంద్రబోస్ కన్వెర్షన్ చేస్తూ ఫిట్నెస్ అదే సంవత్సరంలో మంజూరు చేశారు. అయితే, అప్పటి నుంచి నేటి వరకు ఏటా రవాణా శాఖలో ఫిట్నెస్ పొందుతున్నా బస్సు రంగును మాత్రం మార్చలేదు. ఈ క్రమంలోనే కృష్ణ పుష్కరాల కోసం సిద్దిపేటలోని ట్రావెల్స్ ద్వారా కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు అద్దెకు ఇదే బస్సులో బయలుదేరారు. కాగా, మంగళవారం బస్సు ప్రమాదానికి గురైంది. సంఘటనపై ప్రభుత్వం విచారణ జరపడంతో ‘రంగ’ విషయం బయటపడింది. ఐదేళ్లుగా రంగు మార్చకుండా అద్దె ప్రతిపాదికన తిరుగుతున్నట్లు విచారణంలో తేలింది. దీనిపై రాష్ట్ర కమిషనర్ సుల్తానీయా సుభాష్‌తో పాటు విక్రమ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జరిమానాల నుంచి గట్టెక్కేందుకే .. సిద్దిపేట ఆర్టీఏ పరిధిలో సుమారు 48 కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ ఏటా ఫిట్నెస్, ట్యాక్స్, ఇన్సు ్య రెన్స్ సంస్థ నుంచి పొందాల్సి ఉంటుంది. కాగా, కొందరు బస్సుల యజమానులు ఇవేమీ పొందకుండా బస్సులను యథేచ్ఛగా స్టేజీ క్యారియర్లగా వినియోగిస్తున్నారు. నిబంధనల మేరకు ఆర్టీసీకి చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సులకు నీలం, తెలుపు రంగులను వాడాల్సి ఉంటుంది. అయితే, అద్దె ప్రతిపాదికన తిరుగుతున్న బస్సులు సైతం ఇవే రంగులో దర్శనమివ్వడం కొనమెరుపు. ఈ క్రమంలోనే సిద్దిపేటకు చెందిన ఏపీ 23యూ 8899 నంబర్ గల బస్సు అదే రంగులో తిరుగుతూ వివాదాలకు ప్రస్తుతం కేంద్రబిందువైంది. -
సిద్ధించిన హరితం
కేసీఆర్ చేతుల మీదుగా ‘హరితమిత్ర’ అవార్డు అందుకున్న కమిషనర్ సిద్దిపేట జోన్: ‘సిద్దిపేట పనితీరు బాగుంది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతిపై మున్సిపల్ కమిషనర్‌కు కితాబిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని గోల్కోండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం కేసీఆర్ హరితమిత్ర అవార్డును సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారికి అందజేశారు. మూడేళ్లుగా మంత్రి హరీశ్, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ ప్రాంతంలో 5 లక్షల మొక్కలను నాటి హరితహారానికే ఆదర్శంగా నిలిచినందున రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డు సిద్దిపేటకు దక్కింది. ఈ మేరకు కేసీఆర్ రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. -
ఆర్మీక్యాంప్‌నకు ఎంపిక
సిద్దిపేట జోన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ యూనిట్‌కు చెందిన ఆరుగురు విద్యార్ధులు ఆర్మీ అటాచ్మెంట్ క్యాంపునకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్సీసీ అధికారి శ్రీనివాస్ వివరాలను సోమవారం వెల్లడించారు. 71వ ఇన్‌ప్రాట్రీ ఆర్మీ బ్రిగేడ్‌కు సంబందించిన క్యాంప్ ఆగష్టు 16 నుంచి 30వ తేది వరకు హైద్రాబాద్‌లో కొనసాగనుంది. ఈ క్యాంప్‌కు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ బెటాలియన్లకు చెందిన ఎన్సీసీ విద్యార్ధులు ఆర్మీ జవాన్లతో కలిసి పక్షం రోజులు శిక్షణ పొందనున్నారు. ఆర్మీ జవాన్ల జీవన విదానం అనుసరిస్తు వివిధ అంశాలపై శిక్షణ పొందనున్నారు. శిక్షణలో బాగంగా భారత సైన్యానికి సంబందించిన అంశాలను భోదించడమే కాకుండా డ్రీల్ , అయుద శిక్షణ , మిల్ర్టీపట్ల అధ్యాయనం , యుద్ద వ్యూహాలు, విపత్కర పరస్థితులను ఎదుర్కోనే విదానం దేశభక్తి, క్రమశిక్షణ, తదితర అంశాలను శిక్షణలో నేర్చుకోనున్నారు. ఈ క్యాంప్‌కు సిద్దిపేట డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్ధులు, విజేందర్, ఆరవింద్‌రెడ్డి, సుజయ్‌చంద్రా, రాజశేఖర్, సాయికిరణ్, స్వామిలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్ శ్రీనివాస్‌లు అభినందించారు. -
‘కడియం’పై ఆగ్రహం
సిద్దిపేట జోన్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మహిళ ఉపాధ్యాయులను కించపర్చేలా వ్యాఖ్యాలు చేశారంటూ బుధవారం రాత్రి సిద్దిపేటలో మహిళ టీచర్లు స్థానిక పాత బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత మహిళ ఉపాధ్యాయుల సంఘం అద్వర్యంలో వెంకటేశ్వరాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఉదయరాణి, సుకన్య, సాయిశ్రీ, సౌజన్య, సరళ, యాదమ్మ, శోభరాణి, శ్రీవాణి, అనిత, ఆరుణ, విజయ, స్వాతి, పద్మ, మాదవి, యశోద, తదితరులు పాల్గొన్నారు. -
కటకటాల్లోకి కీచక టీచర్
విద్యార్థినితో అసభ్య ప్రవర్తన పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు? సిద్దిపేట రూరల్: విద్యార్థిని అవసరాన్ని ఆసరా చేసుకున్న ఓ ఉపాధ్యాయుడు వేకిలి వేషాలు వేసి కటకటాలపాలయ్యాడు. గురువు వృత్తికే మచ్చతెచ్చిన సదరు కీచక చీటర్ గుట్టు బుధవారం రట్టు అయ్యింది. ఈ సంఘటన సిద్దిపేటలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఒన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు... పట్టణంలోని రాంనగర్‌కు చెందిన యువతి(17) ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా, ఆమె పదో తరగతి స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివింది. ఆ సమయంలో అదే స్కూల్లో పనిచేస్తున్న గణితం ఉపాధ్యాయుడు రాంచంద్రం.. విద్యార్థిని లెక్కల్లో వచ్చిన సందేహాలను ఇంటికి రప్పించుకొని నివృతి చేసేవాడు. ఈక్రమంలో బాలికను మభ్యపెట్టి పలుమార్లు లోబరుచుకున్నాడు. పదో తరగతి టీసీ విషయంలోనూ ఇంటికి వెళ్లిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న బాధిత యువతి పాఠ్యంశానికి సంబంధించిన అనుమానాలను నివృతి చేసుకోవడానికి మరోసారి సదరు ప్రబుద్ధుడి దగ్గరకు వెళ్లింది. పాత పరిచయంతో ఉపాధ్యాయుడు తిరిగి యువతితో అనుచితంగా వ్యవహరించాడు. దీంతో విసిగిపోయిన బాధిత యువతి.. తల్లిదండ్రులతో కలిసి మంగళవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు రాంచంద్రం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. -
‘స్వచ్ఛ నీరు’ భేష్
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కితాబు సిద్దిపేట జోన్: నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛ నీరును అందించే కార్యక్రమం బాగుందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదన చారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కితాబిచ్చారు. శనివారం సిద్దిపేటలో జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం అరబిందో, బాల వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూపాయికే చల్లని నీరు ప్లాంట్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు వారికి సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బాలవికాస్ ద్వారా మినరల్ వాటర్‌ను అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా సిద్దిపేట పట్టణంలోని ప్రజల కోసం రూపాయికే స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని వివరించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ప్లాంట్ పనితీరు , వ్యయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పీకర్ నీటిని సేవించారు. -
నేడు బీజేపీ జిల్లా సమావేశం
చిన్నకోడూరు: బీజేపీ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శనివారం సిద్దిపేట పట్టణంలోని వీఏఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు బీజేఎంఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబడిపల్లి శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు జంగం బాలాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డితోపాటు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రధాని మోదీ పర్యటనతోపాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరుగుతుందన్నారు. సమావేశానికి పార్టీ శ్రేణులు సకాలంలో హాజరుకావాలని కోరారు. -
పోరాడి గెలిచిన ఇంటర్ విద్యార్థిని
- పునర్మూల్యాంకనం ద్వారా న్యాయం - రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానాన్ని సొంతం చేసుకున్న శిరీష సిద్దిపేట టౌన్: ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకం ఓ పేద విద్యార్థినికి రాష్ట్ర స్థాయి స్థానాన్ని దూరం చేసింది. అయినా ఆ విద్యార్థిని పోరాడి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జవాబు పత్రాలు పునర్ మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకుని విజయం సాధించింది. రాష్ట్ర స్థాయిలో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. మెదక్ జిల్లా సిద్దిపేటలోని మాస్టర్ మైండ్స్ కళాశాలకు చెందిన శిరీష.. ఇటీవల వెలువడిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో బైపీసీలో 433 మార్కులు సాధించింది. తనకు తక్కువ మార్కులు వచ్చాయని భావించిన ఆమె రీ వెరిఫికేషన్ కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంది. స్పందించిన అధికారులు శిరీష జవాబు పత్రాన్ని రీ వెరిఫికేషన్ చేయగా అదనంగా రెండు మార్కులు వచ్చాయి. దీంతో మొత్తం 435 మార్కులు సాధించిన ఆమె రాష్ట్ర స్థాయిలో రెండోస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె కోరింది. రాష్ట్రంలో రెండోస్థానాన్ని సాధించడంతో ఆనందం వ్యక్తం చేసింది. కళాశాల కరస్పాండెంట్, అధ్యాపకులు ఆమెను అభినందించారు. -
చింతమడకలో బీడీ కార్మికుల ఆందోళన
అధికారులు, ప్రజాప్రతినిధులను అడ్డుకున్న కార్మికులు సిద్దిపేట రూరల్: అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి అందడంలేదంటూ గ్రామానికి వెళ్లిన అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్న సంఘటన సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం గ్రామంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించడానికి వెళ్లిన ఓఎస్డీ బాల్‌రాజు, ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఎంపీడీఓ సమ్మిరెడ్డిని బీడీ కార్మికులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బీడీ కార్మికులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి బీడీ కార్మికులుగా పని చేస్తున్న తమకు జీవన భృతి కల్పించకుండా ఆనర్హులకు అందిస్తున్నారన్నారు. గ్రామంలో సుమారు 500మంది బీడీ కార్మికులు ఉన్నప్పటికీ వంద మందికి మాత్రమే జీవన భృతి మంజూరు చేశారన్నారు. అర్హులైన వారందరికి జీవన భృతి కల్పించాలన్నారు. అనంతరం ఓఎస్డీ బాల్‌రాజు మాట్లాడుతూ ఇంట్లో ఒకరికి ఏదైనా పింఛన్ వస్తే జీవన భృతికి అనర్హులన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జీవన భృతి చెల్లిస్తామన్నారు. అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని బీడీ కార్మికులకు నచ్చ జెప్పి పంపించారు. బీడీ కార్మికులందరికీ జీవనభృతి చెల్లించాలి రామాయంపేట: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులందరికీ జీవన భృతి చెల్లించాలని నూతన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివంది సత్యం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన రామాయంపేట వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవన భృతి మంజూరు చేసే విషయంలో ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని, దీంతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీడీ కార్మికులకు న్యాయం జరుగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిబంధనల పేరుతో అర్హులను తొలగిస్తున్నారు చిన్నకోడూరు: బీడీ కార్మికులందరికీ జీవన భృతి చెల్లించాలని బీఎంఎస్ జిల్లా కార్యదర్శి ముద్దం రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ తెలంగాణలోని ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే నిబంధనల పేరుతో అర్హులను తొలగించడం ఎంత వరకు సమంజసమన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జీవన భృతికి ఎంపిక చేయడం వల్ల అనేక మంది అర్హులకు జీవన భృతి అందడం లేదన్నారు. సంవత్సరాల తరబడి బీడీలు చుట్టే వృతిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నవారికి ఈ పథకం వర్తింపజేయాలన్నారు. ఆసరాతో ముడిపెట్టి జీవన భృతి చెల్లించకపోవడం సరికాదన్నారు. వృద్ధులకు ఆసరా, బీడీ కార్మికులకు జీవన భృతి రెండు ఇస్తే తప్ప కార్మికులకు పొట్టనిండే పరిస్థితి లేదన్నారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి వెంటనే పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -
అధైర్యపడకండి..అండగా ఉంటాం
సిద్దిపేట రూరల్: ‘‘అధైర్యపడకండి..అండగా ఉంటాం.. సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు..ధైర్యంగా ఎదుర్కోవాలి’’ అని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతులకు ఏ సమస్యలున్నా స్థానిక నాయకులను, అధికారులను సంప్రదించాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డితో కలిసి సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో ఇటీవలకాలంలో ఆత్మహత్య చేసుకున్న పదకొండు మంది రైతుల కుటుం బాలకు రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్రావుమాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరి గిందని, ఇప్పుడు మన రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతోనే ప్రణాళికలు రుపొందిస్తున్నామన్నారు. ప్రతి రైతు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి రూ. వెయ్యి పిం ఛన్, అంత్యోదయకార్డుతో పాటు పదవ తరగతి లోపు చదువుకునే విద్యార్థులుంటే వారికి రెసిడెన్సీ పాఠశాలలో ఉచి త విద్యను అందిస్తామన్నారు. అదేవిధంగా ఇంటర్పైగా చదువుతున్న విద్యార్థులకు అదనంగా రూ. 10 వేలు అందిస్తామని చెప్పారు. ఇళ్లు నిర్మించుకోవాలని ఆసక్తి ఉంటే ఐఏవై కింద ఇళ్లు మంజూరుచేయిస్తామన్నారు. వ్యవసాయం చేసుకునే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మెదక్ జిల్లాలో రైతులకు సాగు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఇబ్బందిని తొలగించేందుకు ప్రాణహిత- చేవేళ్ల పథకం ద్వారా జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపడుతోందని, దీని ద్వారా రైతులకు సాగునీటి కష్టాలు దాదాపుగా తీరుతాయన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారె డ్డి మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యల ను నివారించేందుకు సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ పెద్దకొడుకుగా మారి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుం టున్నాడన్నారు. అంతకు ముందు కొండపాక మండలానికి చెందిన ఇద్దరు రైతు కుటుంబాలకు ఆపద్భందు కింద రూ. 50 వేల చొప్పున చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీలు ఎర్ర యాదయ్య, పద్మ, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్వై గిరి తదితరులు పాల్గొన్నారు. మిల్క్ గ్రిడ్‌తో పాడి రైతులకు మేలు సిద్దిపేట కొండమల్లయ్య గార్డెన్లో ఆదివారం మధ్యాహ్నం మంత్రి హరీష్‌రావు సిద్దిపేట, దుబ్బాక మిల్క్ గ్రిడ్ పథకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ సహకార సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మా ట్లాడుతూ, సిద్దిపేట-దుబ్బాక నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో మిల్క్ గ్రిడ్ పథకం కోసం ప్రభుత్వం రూ. 60 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో గుజరాత్, పంజాబ్‌ల నుంచి తెచ్చిన పాడి గేదెలు సరైన ఫలితాలను ఇవ్వకపోవడంతో ప్రభుత్వం పాడి గేదెలు, ఆవుల కొనుగోలులో సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీంతో రైతులు తమ అవసరాలకు అనుగుణంగా ఎక్కడి నుంచైనా పాడి పశువులను ఖరీదు చేసే అవకాశం ఉందన్నారు. సబ్సిడీలను బ్యాంక్ ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించడం కోసం వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించినట్లు చెప్పారు. రూ. 80 లక్షలతో సిద్దిపేటలో మిల్క్ ప్యాకెట్ల తయారీ యంత్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రూ. 75 లక్షలతో రైతులు పాలతో తయారు చేసే వెన్న, జున్ను, మజ్జిగ, కోవ, పెరుగు తదితర పదార్థాలను తయారు చేయడానికి వీలుగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం రూ. 2 కోట్ల సబ్సిడీని వ్యవసాయ పనిముట్ల కోసం మంజూరు చేసిందన్నారు. తోర్నాలలో రూ. 5 కోట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను, రూ. 6.30 కోట్లతో మొక్కజొన్న పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు హరీష్‌రావు వెల్లడించారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీ సాగులో యంత్రికీకరణను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆధునిక ట్రాక్టర్లను కూడా రైతులకు 50 శాతం సబ్సిడీ తో అందించనున్నట్లు హరీష్‌రావు తెలిపారు. రైతులు 50 శాతం సబ్సిడీతో ఎన్ని టార్పాలీన్లనైనా కొనుగోలు చేయవచ్చన్నారు. గొర్రెల పెంపకం కోసం రూ. 10 కోట్ల ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని చెప్పారు. నిధులు మంజూరు కాగానే 20 శాతం సొమ్ము గొర్రెల, మేకల పెంపకందారులు చెల్లిస్తే మిగిలి మొత్తం సబ్సిడీ రూపంలో వస్తుందన్నారు. చెరువుల పునరుద్ధరణకు రూ. 180 కోట్లు చెరువుల పునరుద్ధరణకు గాను సిద్దిపేట నియోజకవర్గానికి రూ. 80 కోట్లు, దుబ్బాక నియోజకవర్గానికి రూ. 100 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుందని మంత్రి హరీష్‌రావు చెప్పారు. భూగర్భ జలవనరుల రక్షణకు సద్వినియోగం చేయాలన్నారు. చెరువులు, కుంటల్లో మట్టిని తొలగించి కట్టల మరమ్మత్తుకు వినియోగించాలని, అడుగులోని నల్లమట్టిని పొలాల్లోకి తరలించాలని సూచిం చారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఏజేడీ లక్ష్మారెడ్డి, పాడి పరిశ్రమ సహకార సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ జీఎం పాపారావు, డీఎల్ ఏఏ జనార్ధన్‌రెడ్డి, నాబార్డ్ ఏజీఎం రమేష్, సిద్దిపేట పాలకేంద్రం మేనేజర్ భానుప్రసాద్, ఆర్డీఓ ము త్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్వై గిరి, పశువైద్యులు అంజయ్య, బాలసుం దరం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, నేతలు వేలేటి రాధాకృష్ణశర్మ, ఎంపీపీలు ఎర్రయాదయ్య, జాప శ్రీకాం త్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి పాల కేంద్రంలో పాల ప్యాకెట్ల తయారీ యంత్రాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. పాడి రైతుల శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అదనపు పాలధర చెక్కుల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పాలకు రూ. 4 పెంచిన క్రమంలో లబ్ధిపొందిన పాడి రైతులకు మంత్రి హరీష్‌రావు అదనంగా పొందిన డబ్బులకు సంబంధించి చెక్కులను సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలకు చెందిన పాడి రైతులకు పంపిణీ చేశారు. -
సిద్దిపేటలో జోరుగా సాగుతున్న బియ్యం అక్రమ వ్యాపారం
సిద్దిపేట అర్బన్/ టౌన్: బియ్యం జిల్లా సరిహద్దు దాటాలంటే మార్కెట్ ఫీజు, వ్యాట్, సేల్ ట్యాక్స్ చెల్లించాలి. అలాగే బియ్యాన్ని విక్రయించాలన్నా అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అందుకోసం తగిన రుసుము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ రోజుకు 3,500 క్వింటాళ్ల వ్యాపారం జరిగే సిద్దిపేటలో మాత్రం ఇవేమీ అవసరం లేదు. అధికారులను మంచి చేసుకుంటే చాలు జీరో దందా జోరుగా సాగించుకోవచ్చు. తనిఖీల భయముండదు. చలాన్ల గొడవ అసలే ఉండదు. మెరిపించి మెప్పిస్తారు జిల్లాలోని సిద్దిపేట, మెదక్ తదితర ప్రాంతాల్లో ఆధునిక రైస్‌మిల్లులు లేవు. అందువల్ల ఇక్కడ దొరికే బియ్యం చూడడానికి మామూలుగా కనిపిస్తాయి. దీంతో వ్యాపారులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ తదితర ప్రాంతాల్లో ఆధునిక రైస్ మిల్లుల్లో మర ఆడించి నాసిరకం ధాన్యాన్ని కూడా మెరిసే బియ్యంగా మార్చేస్తున్నారు. అక్కడి నుంచి బియ్యాన్ని అక్రమంగా సిద్దిపేట డివిజన్‌కు సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజు 30 లారీల బియ్యం రవాణా నల్లగొండ జిల్లా నుంచి బియ్యం మెదక్ జిల్లాలోకి ప్రవేశించాలంటే బియ్యం విలువలో ఒకశాతం మార్కెట్ ఫీజును, ఆరు శాతం వ్యాట్, సేల్స్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని సివిల్ సప్లయ్, మార్కెటింగ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ నియంత్రించాల్సి ఉంటుంది. అయితే ఈ మూడు శాఖలు అధికారులు తగిన ప్రతిఫలం అందుకుని ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నాయి. దీంతో ఇతర జిల్లాల వ్యాపారులు బియ్యం లారీలను లోడింగ్ చేసి అర్ధరాత్రి వరకు సిద్దిపేట సమీపంలోని పొన్నాల దాబా తదితర ప్రాంతాల వద్దకు పంపిస్తారు. తెల్లవారు జామున ఈ బియ్యం లారీలు సిద్దిపేటలోనే పలు బియ్యం దుకాణాల వద్దకు చేరుకోవడం, వేగంగా దిగుమతి కావడం కొన్ని గంటల్లో గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. సర్కార్ ఖజానాకు గండి సిద్దిపేట మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల కూడలి కావడంతో సుమారు 60 గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడనే బియ్యంను ఖరీదు చేస్తారు. ప్రతి రోజు 30 నుంచి 35 లారీల బియ్యం (3 వేల నుంచి 3,500 క్వింటాళ్ల) ఇక్కడ అమ్మకాలు సాగుతాయి. ఈ క్రమంలో సగటున ప్రతి రోజు 3 వేల క్వింటాళ్ల బియ్యం సిద్దిపేటకు అక్రమంగా దిగుమతి అవుతోంది. ఈ బియ్యం ఆకర్షణీయంగా ఉండడంతో మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో స్థానిక వ్యాపారులు, ఇతర జిల్లాల వ్యాపారులు ఒక పథకం ప్రకారం ఈ బియ్యం అక్రమ వ్యవహారాన్ని రహస్యంగా కొనసాగిస్తూ లక్షల రూపాయల్లో ఖజానాకు గండికొట్టేస్తున్నారు. ఈ బియ్యం ధర క్వింటాల్‌కు రూ. 3,500 నుంచి రూ. 4 వేల వరకు పలుకుతుంది. నెలకు సుమారు రూ. 32 కోట్ల విలువైన బియ్యం సిద్దిపేట ప్రాంతంలో అక్రమంగా దిగుమతి కావడంతో ఖజానాకు చేరాల్సిన సొమ్ము పక్కదారిపడుతోంది. అనుమతులు లేకుండానే విక్రయాలు మామూలుగా బియ్యం విక్రయించాలంటే దుకాణానికి అనుమతులు తప్పనిసరి. ఇందుకు చలానా రూపంలో సేల్ట్యాక్స్ను సంబంధిత శాఖకు చెల్లించాలి. ప్రతి సంవత్సరం దుకాణాల రెన్యూవల్ కోసం కొంత డబ్బు చెల్లించాలి. నెలకు 20 క్వింటాళ్ల నుంచి 50 క్వింటాళ్ల వరకు విక్రయించే రైస్ డిపోల నిర్వాహకులు తహశీల్దార్, 50 క్వింటాళ్లకు పైగా విక్రయించే దుకాణదారులు డీఎస్ఓ అధికారుల నుంచి అనుమతి పొందాలి. కానీ సిద్దిపేటలో మాత్రం ఇవేమీ అమలు కావడం లేదు. అధికారులను మంచి చేసుకుంటున్న వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ఎవరైనా , ఎప్పుడైనా తనిఖీల కొస్తే మాత్రం వ్యాపారులు 20 క్వింటాళ్లలోపే బియ్యం నిల్వలు చూపుతూ యథేచ్ఛగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో వందల సంఖ్యలో రైస్ దుకాణాలు ఉన్నప్పటికీ అధికారుల లెక్కల ప్రకారం తహశీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి పొందినవి 30. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నుంచి అనుమతి పొందినవి 4 మాత్రమే ఉండడం గమనార్హం. మిగతా దుకాణదారులంతా బియ్యాన్ని మరోచోట నిల్వ ఉంచి దుకాణాల్లో మాత్రం కేవలం 20 క్వింటాళ్ల కంటే తక్కువే చూపుతున్నారు. నాసిరకం బియ్యాన్ని సైతం రంగురంగుల బ్యాగుల్లో నింపి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
సిద్దిపేట ‘కేతువు’.. ఉంటడా.. పోతడా?
* వన్‌టౌన్ సీఐ బదిలీపై జోరుగా చర్చ * మాస్టర్‌మైండ్స్ వ్యవహారంలో ‘చేతివాటం’పై రచ్చ * బాధితులపై కేసులు పెట్టిండని పెల్లుబికిన ప్రజాగ్రహం * నిరసనలు మిన్నంటడంతో డీఎస్పీ వివరణ సిద్దిపేటల యాడ జూశినా ఒకటే ముచ్చట.. నలుగురు గలిస్తె సాలు.. ‘గింత రచ్చ జరిగినాగూడ సీఐ సురేందర్‌రెడ్డి ఇంకా ఈడనే ఉంటడా..? ఏమోరా బై.. ఆయనకు పాలకులు, ప్రతిపక్షాల అండ దండిగుందట.. మరి ఉంటడో.. పోతడో సూడాలె..! ఏంరో.. సురేందర్‌రెడ్డి అంటె ఏమనుకుంటన్నవ్.. నీకు ఆయన గురించి తెల్వద్.. పెద్దోళ్ల సపోట్ లేకుంటె సిద్దిపేట రూరల్ ఎస్ఐ, వన్ టౌన్ ఎస్ఐ, రూరల్ సీఐ, ట్రాఫిక్ సీఐ, వన్ టౌన్ సీఐగా.. ఎనమ్దేండ్ల నుంచి ఈడనే ఉండెటోడా ఆలోశించు..? పోలీస్ డిపాట్మెంట్ల గిన్నొద్దుల సంది ఒక్క దగ్గర పనిజేయనిత్తార్రా..? నువ్వొద్దెనేరా.. గందుకే ఆయిన సీన్మల గబ్బర్‌సింగ్ లెక్క జేస్తుండు.. బడి పోరగాండ్ల మీద కేసులువెట్టె.. అమాయకుల మీద లాఠీలు ఇరగ్గొట్టె.. గిదేందని అడిగితె బెదిరియ్యవట్టె.. తన్నవట్టె.. మరి మన పెద్దోళ్లకు ఇవి కనవడ్తలేవా..? ఇదీ.. పట్టణంలో ఇప్పుడు హాట్ టాపిక్. - సిద్దిపేట అర్బన్ ఏళ్ల తరబడి సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్న వన్‌టౌన్ సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డికి బదిలీ తప్పదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పట్టణంలోని మాస్టర్‌మైండ్స్ కళాశాలలో ఈ నెల 16న జరిగిన సంఘటనలో ఈయన వ్యవహార శైలి పోలీస్ బాస్‌లకు కూడా తంటాలు తెచ్చిపెట్టిందని అధికారులే చెప్పడం గమనార్హం. సీఐపై వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం వీరిలో అసహనాన్ని పెంచిందని తెలుస్తోంది. దీంతో సదరు సీఐని బదిలీ చేస్తేనే బాగుంటుందని వారు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ సీఐ తన ‘పలుకు’బడి, పరపతిని వాడుతూ ఏళ్ల తరబడి సిద్దిపేటను వీడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు వెళ్లిన ఈయన ఎలక్షన్లు ముగియగానే సంగారెడ్డిలో రిపోర్ట్ చేసి మళ్లీ వన్ టౌన్ సీఐగా విధుల్లో చేరాడు. దీంతో ‘సిద్దిపేటలో నేను మాట్లాడిందే వేదం.. నేను జెప్పిందే న్యాయం.. అనేలా వ్యవహరిస్తూ.. ఇటీవల మాస్టర్‌మైండ్స్ కళాశాలలో జరిగిన గొడవలో తన ‘చేతివాటం’ చూపిన ఆయన.. న్యాయం చేయాలంటూ వెళ్లిన బాధితురాలి భర్తతో పాటు విద్యార్థులపై ఐపీసీ 307 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదుచేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించాడ’ని ప్రజా, విద్యార్థి, దళిత సంఘాలు మండిపడ్డాయి. దీనిపై రోడ్లెక్కి నిరసనలు చేపట్టాయి. సీఐ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ఆందోళనలు తీవ్రం కావడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నెల 19న డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి సిద్దిపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ‘సీఐపై విచారణ కొనసాగుతోంది, ఈ కేసును నేనే పరిశీలిస్తున్నా’నని చెప్పడంతో ఆయా సంఘాలు శాంతించాయి. కేసులలో మార్పులు... కళాశాలలో సంస్కృతం బోధించే లెక్చరర్ పట్ల సదరు కాలేజీ డెరైక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనపై ఇరువర్గాల ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి. డెరైక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలికి అండగా పట్టణంలో వివిధ రాజకీయ, ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. దీంతో 509 కేసుతో పాటు మరో సెక్షన్ 354(డి)ని కూడా చేర్చారు. కాలేజీలో గొడవపడిన బాధితురాలి భర్తతో పాటు పది మంది ఏబీవీపీ నాయకులపై నమోదైన కేసులో సెక్షన్ 307ను తొలగించి దాని స్థానంలో సెక్షన్ 324 చేర్చారు. ఈ మేరకు గతంలో నమోదైన కేసులపై చర్లపల్లి జైలులో ఉన్న బాధితురాలి భర్త, విద్యార్థులు బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు.