
సుజల్ నీటిని తాగుతున్న స్పీకర్లు
- స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కితాబు
సిద్దిపేట జోన్: నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛ నీరును అందించే కార్యక్రమం బాగుందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదన చారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కితాబిచ్చారు. శనివారం సిద్దిపేటలో జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం అరబిందో, బాల వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూపాయికే చల్లని నీరు ప్లాంట్‌ను వారు సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు వారికి సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బాలవికాస్ ద్వారా మినరల్ వాటర్‌ను అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా సిద్దిపేట పట్టణంలోని ప్రజల కోసం రూపాయికే స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని వివరించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు ప్లాంట్ పనితీరు , వ్యయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పీకర్ నీటిని సేవించారు.