
శ్రీవాణిలో బతుకమ్మ ఆడుతున్న విద్యార్థినులు
వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సతీమణి
సిద్దిపేట జోన్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు సిద్దిపేటలో ప్రారంభమయ్యాయి. అమావాస్యతో మొదలై సద్దుల బతుకమ్మతో వేడుకలను ముగించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి.
శ్రీవాణి విద్యాలయంలో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. వాటికి ఒక్కదగ్గరికి తెచ్చి బతుకమ్మ ఆడారు. కోలాటం, గౌరమ్మ కార్యక్రమాలు నిర్వహించారు. చక్కటి ప్రదర్శన నిర్వహించిన వారికి మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృపాకర్, డైరెక్టర్లు సత్యం, రవీందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్ పాల్గొన్నారు.
పట్టణంలోని కేరళ మోడల్ స్కూల్‌లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీసాయి విద్యాలయంలో బతుకమ్మ వేడుకలను కౌన్సిలర్ మల్యాల ప్రశాంత్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సత్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెరిడియన్ హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో విద్యాసంస్థ ప్రతినిధులు దేవేందర్‌రెడ్డి, రాజా వెంకట్‌రాంరెడ్డి, సిబ్బంది ప్రదీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.