- బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి
- 22న అమిత్‌షాతో ముఖాముఖి
సిద్దిపేట టౌన్: తెలంగాణ ఎవరి సొత్తు కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వీఏఆర్ గార్డెన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పల్లెల వికాసం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఉప ఎన్నికలో మెదక్ ఎంపీ సీటును తమ పార్టీ గెలుచుకుంటుందన్నారు. ఈ నెల 22న పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌లో బీజేపీ నేతలతో ముఖాముఖి మాట్లాడతారన్నారు. సమావేశంలో కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగరాంచంద్రారెడ్డి, చొప్పదండి విద్యాసాగర్, పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ గురువారెడ్డి, పార్టీ నేతలు గుండ్ల జనార్దన్, జిల్లెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతుసమస్యల పరిష్కారంలోనిర్లక్ష్యం తగదు
గజ్వేల్: రైతు సమస్యల పరిష్కారంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని కాసాల బుచ్చిరెడ్డి ఆరోపించారు. మంగళవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నిర్వహించిన బీజేపీ అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశం సంస్థ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రైతులకు రుణ మాఫీ చేస్తామని, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రకటించి, రెండు నెలలు గడుస్తున్నా రుణమాఫీ అమలుచేయలేదన్నారు.
మెదక్ ఎంపీ సీటును గెలుచుకుంటాం
Published Wed, Aug 13 2014 12:34 AM | Last Updated on Mon, Oct 8 2018 7:43 PM
Advertisement
Advertisement